7, జులై 2016, గురువారం

సమస్య - 2081 (సీతా రాముని కోగుఁ జేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“సీతా రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై” 
(ఈ సమస్య ప్రసిద్ధము, పెక్కు అవధానాలలో ఇవ్వబడినది)
లేదా... 
“సీతా రామునికిఁ గీడుఁ జేయం దగునే”

87 వ్యాఖ్యలు:

 1. మాతా పితరుడు జగతికి
  సీతా రామునకుఁ గీడుఁ జేయం దగునే ?
  నేతగ రాముని రాజ్యము
  ప్రీతిగ పాలించె నంట ప్రేమా మృతమున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ పద్యాన్ని ఇలా చెపితే బాగుంటుందేమో....

   మా తండ్రియు దైవమ్మగు
   సీతారామునకుఁ గీడుఁ జేయం దగునే
   నేతగ రాముఁడు రాజ్యముఁ
   బ్రీతిగఁ బాలించి పంచెఁ బ్రేమామృతమున్.

   తొలగించు
 2. క్షమించాలి మూడవ పాదము
  " నేతగ " రాముడు " రాజ్యము "
  అంటే బాగుంటుం దేమొ అని

  ప్రత్యుత్తరంతొలగించు

 3. పెండ్లి కుదిరే సమయము లో పాత కాలపు తగువుల హవా తీసుకొచ్చి వలదీ వివాహ మన్న జిలేబి కథ :)  జాతకములు బాగు కుదిరె
  సీతా, రామునకుఁ గీడుఁ జేయం దగునే
  తాతల కాలపు తగువుల
  వాతము తెరిచి వలదీ వివాహమనియనన్

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   ద్వంద్వంగా తీసుకుంటే 'సీతారాములకు' అనవలసి ఉంటుంది.

   తొలగించు
 4. మిత్రులందఱకు నమస్సులు!

  శీతాంశున్ దరిఁ జేర్చి, మైథునమునన్ శీఘ్రమ్ముగాఁ దేలఁ, ద్వ
  చ్చేతమ్మే ముదమొందఁ, గూడితివి! దుశ్శీలమ్ముతో రేఁగి, స
  త్ఖ్యాతిం బోవఁగఁ ద్రోలి, దేవగురునిన్ గస్తిన్ బడంద్రోచి, యో

  సీ, తారా! ముని కోగుఁ జేయఁ దగునే, చింతింప నిల్లాలివై?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. భళీ భళీ !

   చీర్సు సహిత
   జిలేబి

   తొలగించు

  2. భళీ భళీ !

   చీర్సు సహిత
   జిలేబి

   తొలగించు
  3. సముచిత పాదభంగము తో నద్భుతమైన పూరణ! మీ సమయస్ఫూర్తి కిది నిదర్శనము కవిపుంగవులు మధుసూదన్ గారు. హృదయాభినందనలు.

   తొలగించు
  4. సుకవి మిత్రులు...
   తాడిగడప శ్యామలరావుగారికి
   సహదేవుడు గారికి
   శిష్ట్లా వారికి
   గోలి వారికి
   జిలేబి గారికి
   బొడ్డు వారికి
   పోచిరాజు వారికి
   అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు...ధన్యవాదములు!

   తొలగించు
  5. మధుసూదన్ గారూ,
   ఇందరి ప్రశంసలకు పాత్రమైన మీ పూరణ అద్భుతంగా ఉంది అనడం కంటె ఏమని సమీక్షించగలను?

   తొలగించు
 5. నేనూ మధుసూదన్ గారి బాటలోనే.....

  నీతియె కాదిక వెడలకు
  ప్రీతిగ రేరాజు నిన్ను పిలువగ "కలువన్"
  నీతప్పునిక తెలియుమో
  సీ!తారా! మునికిఁ గీడుఁ జేయం దగునే!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శాస్త్రి గారూ,
   బాట ఒకటే అయినా ఎవరి నడక తీరు వారిదే. మీ పూరణ బాగున్నది.

   తొలగించు
 6. మాతాపితరుల సములగు
  సీతారామునికి గీడు జేయందగునే
  మాతా !నీవే చెప్పుము
  సీతారామునికి గీడు జేయ న్వశమే ?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మొదటి పాదానికి అన్వయం కుదరాలంటే సీతారాములకు అని ద్వంద్వాన్ని వేయవలసి ఉంటుంది. కాని సమస్య అలా లేదు కదా!

   తొలగించు
 7. ఏతెంచున్ దొర రామచంద్రుడు వెసన్ యీ మారుతిన్ నమ్ముమా
  దైతేయుండగు రావణున్ సమరమ౦ దంతమ్ము గావించు నో
  మాతా మీరిటు లాత్మహత్య కడరన్ మాతండ్రి జీవించునా
  సీతా! రాముని కోగు జెయ దగునే!చింతింప నిల్లాలివై?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిమ్మాజీ రావు గారు నమస్సులు.చాలా బాగుంది మీ పూరణ. నా పూరణ కూడా యిదే భావము తో నున్నది.

   తొలగించు
  2. ధన్యవాదములు కామేశ్వరరావు గారూ భావము ఒకటైనా మీపద్యము మనోహరముగానున్నది

   తొలగించు
  3. చక్కని పూరణ తిమ్మాజీరావు గారూ! అభినందనలు!

   తొలగించు
  4. తిమ్మాజీ రావు గారూ,
   చక్కని భావంతో పూరణ చెప్పారు.
   'వెసన్+ఈ' అన్నప్పుడు యడాగమం రాదు.

   తొలగించు
 8. నీతిని విడి కలుషమతిన్
  సీతకరుని మోజులోనఁజిక్కి సతతమున్
  పాతకివై యిట్టులనో
  సీ! తారా!మునికిఁగీడుఁజేయందగునే!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   బాగున్నది. 'శీతకరుని' అనండి.

   తొలగించు
 9. ఘాతక రావణుతోననె
  సీతారామునికిఁగీడుఁ జేయందగునే?
  భూతల శూరుండనుచున్!
  భీతిలని జటాయువచట విడుమనె మాతన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అశోక వనములో సీతాదేవి ప్రాణ త్యాగానికి పాల్పడుతున్న సమయములో హనుమంతుడు రాముని వృత్తాంతము దెలిపి యూరడించు సందర్భము:

  సీతారాముడు చంపు రావణుని నిశ్శేషమ్ము నీయందు దా
  రోతన్వర్తిలు కారణమ్మున వెసన్ లోకైక శూరుం జగ
  త్త్రాతం భర్తగఁ బొంది తీవు మరి యీప్రాణక్షయం బేలనో
  సీతా! రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై

  మారీచుడు రావణునికి చెప్పిన హితవు:

  భ్రాతలు పుత్రులు మిత్ర
  వ్రాతము దారలు బలగము రాజ్యము తోడం
  బ్రీతిఁ జిరము మన నెంచిన
  సీతా రామునికిఁ గీడుఁ జేయం దగునే

  జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభమ్.
  యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామవిప్రియమ్৷৷3.37.22৷৷

  కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ.
  యదీచ్ఛసి చిరం భోక్తం మా కృథా రామవిప్రియమ్৷৷3.38.32৷৷

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రెండవ శ్లోకము లో "భోక్తుం" గా చదువగలరు

   తొలగించు
  2. కామేశ్వరరావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
   మొదటి పూరణలో 'శూరున్ జగత్త్రాతన్ భర్తగ...' అనవలసింది మీరు ద్రుతస్థానంలో అనుస్వారం వేశారు.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి. అన్న సూత్రమాధారముగా “శూరుం జగ త్త్రాతం భర్తగఁ” యని వ్రాసితిని. తప్పయినచో సవరించ గలను. సందేహ నివృత్తి చేయ గోర్తాను.

   తొలగించు
 11. శ్రీరామచంద్రుడు వనవాసమునకు తానొకడే వెళ్లదలచి, నీవు నా మాతాపితలను సేవించుచు,అయోధ్యలోనే ఉండుమని, అరణ్యముభీకరమని పలుకు సందర్భము.

  చేతంబెంతయు మోదమంద, ఘన సంసేవాళి సల్పంగ నా
  మాతం గైకను గారవింప, నిచటన్ భద్రంబుగా నుండుమా
  భీతింజెందెదవీవు క్రూర మృగముల్ వీక్షింప గాంతారమున్
  సీతా! రామునికోగుజేయదగునే ? చింతింప నిల్లాలివై.

  మాతాపితలకు సేవల
  రాతన్నేనేనోచకుంటి రాకుమ,వనికిన్.
  పూతాత్మనిచట నుండుమ
  సీతా!రామునికి గీడు జేయందగునే?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది.
   రెండవ పూరణలో పూతాత్మ యిచట నుండుము.. అని ఉండాలనుకుంటాను.

   తొలగించు
 12. ఆతడు నీ పెనిమిటి గద
  సీతారామునికి గీడు జేయందగునే
  పాతకమబ్బును నిజముగ
  నాతని కిం గీడు జేయ నరయుము మదిలోన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ పూరణలో మీరు ప్రస్తావించింది లౌకిక దంపతులనా లేక పురాణ పాత్రలనా? సందిగ్ధస్థితి ఉంది.

   తొలగించు
 13. దశరథుని ఇల్లాలుగా సుమంగళిగా కైకేయి ఉన్నచో.. యని గ్రహించాలి.భరతుడు కైకను ప్రశ్నిస్తున్న సందర్భమిది.

  మాతా! యేవిధి నింత పాపపు నధర్మా కాంక్ష? యే
  మాత్రమ్మున్ దయలేక పోయె? వనసీమన్ రాము, స్వర్గానికిన్
  మాతండ్రిన్ దయజేయ జూసితివి? యే మర్యాద పాలింతు నే?
  సీతా రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై” 

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. 'రాకుమార' గారూ,
   మొదటి పాదంలో గణదోషం. రెండవ పాదంలో ప్రాస తప్పింది.

   తొలగించు
  2. శంకరయ్యగారు ధన్యవాదాలు.
   మొదటి పాదంలో టైపు పొరపాటున "యోనీకు" మింగేశా.
   ప్రాస పొరపడ్డాను.మళ్లీ తిరగ రాశాను.దయచేసి చూసి తప్పులుంటే తెలపండి.

   తొలగించు
  3. మాతా!యేవిధి నింత పాపపు నధర్మాకాంక్ష పుట్టెన్ మదిన్?
   కొంతైనన్ దయలేక రాము వనికిన్,ఘోరమ్ము స్వర్గానికిన్
   మాతండ్రిన్ దయజేయ జూసితివి? యే మర్యాద పాలింతు నే?
   సీతా రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై

   తొలగించు
  4. మాతా!యేవిధి నింత పాపపు నధర్మాకాంక్ష పుట్టెన్ మదిన్?
   కొంతైనన్ దయలేక రాము వనికిన్,ఘోరమ్ము స్వర్గానికిన్
   మాతండ్రిన్ దయజేయ జూసితివి? యే మర్యాద పాలింతు నే?
   సీతా రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై

   తొలగించు
  5. శంకరయ్యగారు ధన్యవాదాలు.
   మొదటి పాదంలో టైపు పొరపాటున "యోనీకు" మింగేశా.
   ప్రాస పొరపడ్డాను.మళ్లీ తిరగ రాశాను.దయచేసి చూసి తప్పులుంటే తెలపండి.

   తొలగించు
 14. Tangiraala tirupataiah gaari poorana

  సీతా దేవిని దెస్తివి
  ప్రీతిగ రావణయనుచు విభీషణు డనియెన్
  ఆతల్లినియటు జేర్చుము
  సీతారామునికి కీడుజేయందగునే

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వెంకటప్పయ్య గారూ,
   తెస్తివి... అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. 'తల్లిని+అటు' అన్నప్పుడు యడాగమం రాదు.

   తొలగించు
 15. రమచంద్రుణ్ణి అడవులకు పంపమన్న కైకేయితో దశరథుఁడు ........

  చేతుల్ మ్రోడ్చెద దుష్టభావనలు నీ చిత్తంబునున్ దొల్చెనే
  చేతోభవ్యనిభుండు రాముఁడు మహాక్షీణప్రకాశుండు సం
  ప్రీతిన్ బ్రోవకఁ కానలన్ బఱపఁ భావింపంగ నెట్లోపెనో
  సీతారాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై

  ప్రత్యుత్తరంతొలగించు
 16. గురువుగారికి ప్రణామములు

  భరతుడు తల్లితో నిష్టురముగా పలికినపలుకులుగా నూహించి

  నా తండ్రిన్ గడు వృద్ధుడౌ నృపుని ప్రాణంబుల్ హరింపంగ నీ
  చేతల్ గాంచుచు కృంగితిన్ గనుమా సిగ్గిల్లితిన్ గాంతరో
  మాతా యంచును ప్రేమతో నిను సమ్మానించు పుణ్యాత్ముడౌ
  సీతా రామున కోగు జేయ దగునే చింతింపనిల్లాలివై


  ఓ తరుణీ! సతతము నిను
  మాతా యనుచును పిలిచెడు మాన్యుండు గదా
  యా తడినకుల తిలకుడౌ
  సీతా రామున కుకీడు జేయందగునే


  తారకు నీతి చెబుతున్నట్టుగా నూహించి

  నీతిన్ వీడి చరింపనేల? యతి ప్రాణేశున్ని వంచింపుచున్
  పాతివ్రత్యము దప్పినావు లలనా పాపమ్ము సంప్రాప్తమౌ
  చేతల్ మాను, శశాంకుతో సరసమా, సిగ్గైన లేదేమె యో
  సీ తారా మునికోగు జేయదగునే చింతింప నిల్లాలివై

  ఓ తరుణీ తగదంటిని
  పాతివ్రత్యము వీడ పాపమ్ము యగున్
  నీతిన్ విడబో కుడి యో
  సీ తారా మునికి కీడు జేయం దగునే

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో రెండు, మూడు పాదాలలో గణదోషం. 'క్రుంగినాఁడ గనుమా... ప్రేమతోడ నిను...' అనండి.
   నాల్గవ పూరణలో 'విడబోకుమ' అనండి.

   తొలగించు
 17. నాతిన్నూతగ గొన్చు నోరజకుడన్నన్ , రాజుగా బాధ్యతన్
  నీతిన్ జూపగ నెంచి బంపెను గదా , నిన్కానలన్ సాధ్వి ! నీ
  పాతివ్రత్యమె నిన్ను గాచెను కదా ! భావ్యంబె జేరన్ భువిన్ ?
  సీతా ! రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై !

  నీతో మండోదరి సతి
  పాతి వ్రత్యమున బరఁగ ,పరసతి యటులే
  తా తలచె పతిని రావణ !
  సీతా రామునికిఁ గీడుఁ జేయం దగునే ?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,
   మొదటి పూరణ బాగున్నది.
   రెండవ పూరణలో భావం తికమక పెడుతున్నది.

   తొలగించు
 18. ఖ్యాతిన్ రాజ్యము నేల గోరుచును సీతా! రమ్మటంచున్ వనిన్
  ప్రీతిన్ బిల్వగ బోవకుంటి వకటా! ప్రేమంబునే వీడుచున్
  నీ తల్లిన్ యొడి జేర గోరితివి కానీ
  ధర్మమౌ నట్టులన్
  సీతా! రాముని కోగు జేయ దగునే? చింతింప నిల్లాలివై!

  ప్రత్యుత్తరంతొలగించు
 19. దశరథుడు కైకతో

  ​నా తప్పే వరమిచ్చి కోరమను టైనా యింత నీచమ్ముగా
  ఖ్యాతిం జెందగ కన్నబిడ్డ కభిషేకమ్మంచు కాంక్షించుచున్
  నాతీ కోరితి వీవు కైక! పలు పన్నాగమ్ములన్ బన్నుచున్
  సీతా రామున కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నీ తారుణ్యము కాలిపోను : గురు పత్నిన్
  ్ . గూడగా న్యాయ మౌ

  నే తా రా ధి ప ! || చ౦ద్రు c బుత్ర సము c
  . గామి౦చ౦గ , భోగి౦చగా

  నో తా రా ! హిత మౌనె ? గీర్పతి మన౦
  . బుధ్బిన్నమున్ జె౦దె ; ని

  స్సీ ! తా రా ! ముని కోగు జేయ దగునే
  . చి౦తి౦ప నిల్లాలి వై


  { తారుణ్యము = యౌవనము , అ౦దము ;

  తారాధిప ! = చ౦ద్ర ! ;

  గీర్పతి = గీష్పతి = బృహస్పతి : }

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు పూర్ణానుస్వారానికి వేరే glyphను ఎందుకు వాడుతున్నారు. అది నప్పటం‌లేదు! చంద్ర అన్నది కంటికి బాగుంటుంది కాని చ0ద్ర అనో చoద్ర అనో చ౦ద్ర అనో వ్రాయటం వింతగా ఉంది. మీ ఇబ్బంది ఏమిటో తెలియటం‌ లేదు.

   తొలగించు
  2. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ******
   శ్యామలరావు గారూ,
   వారికి అనుస్వారం టైప్ చేయడం తెలియనట్లుంది. దానికి బదులుగా అంకెలలో సున్నానో, ఇంగ్లీషు క్యాపిటల్ ఓ, స్మాల్ ఓ లను వేస్తున్నారు.

   తొలగించు
 21. శీతాంశున్ రహితోడచూచుచున్ సౌహార్ద మేపారగా
  చేతమ్మందున వానిరూపుకదలన్ జీవించు చున్నావుగా
  నాతీ ధర్మము దిక్కరించుచును మీనాక్షీ! లతాతన్వి! యో
  సీ! తారా! మునికోగుఁజేయఁదగునే చింతింపనిల్లాలివై

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మొదటి పాదంలో గణదోషం, యతిదోషం.

   తొలగించు
  2. టైపుచేసే సమయంలో పొరపాటు జరిగింది. సవరించాను. గమనించండి.
   శీతాంశున్ రహితోడచూచుచు సదా సౌహార్ద మేపారగా
   చేతమ్మందున వానిరూపుకదలన్ జీవించు చున్నావుగా
   నాతీ ధర్మము దిక్కరించుచును మీనాక్షీ! లతాతన్వి! యో
   సీ! తారా! మునికోగుఁజేయఁదగునే చింతింపనిల్లాలివై

   తొలగించు
 22. సీతా|రామునికోగుజేయదగు”నేచింతింప?నిల్లాలివై
  దూతల్ మెచ్చెడిదివ్యధామమున నిత్యోత్సాహమేబంచగా
  వ్రాతల్ మార్తును లంకరాజ్యమునసంరక్షింతు జీవించగా
  నీతిన్ నమ్మిన లాభముండ దనుచున్ నేనెంతులంకేశుడై.
  2.ప్రీతిగ దంపతు లవ్వగ?
  సీతా రామునికి గీడు జేయందగునే
  తాతకు యిష్టము లేదని
  జాతకములు నమ్మి జెరచ సంబరమగునా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   విలక్షణమైన విరుపుతో మొదటి పూరణ బాగున్నది. 'లంకేశునై' అంటే బాగుంటుందేమో?
   రెండవ పూరణలో అవ్వగ అనడం గ్రామ్యం. 'తాతకు నిష్టము...' అనండి.

   తొలగించు
 23. రామాంజనేయ యుద్ధం సందర్భం

  వాతాత్మజా! జనపతి య
  యాతిని కావగ జననికి యానయొనర్చన్
  నీ తనువు మనసు నొసగిన
  సీతారామునికి గీడు జేయందగునే?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉంది.
   'జననికి యాన యొనర్చున్' అర్థంకాలేదు.

   తొలగించు
  2. యయాతిని కాపాడుతానని తల్లి అంజనాదేవికి మాట ఇస్తాడు కదా హనుమ! ఆ విషయం ప్రస్తావించాను.

   తొలగించు
 24. పాతివ్రత్యము మఱచియు
  శీతాంశునిగూడి మోము శృంగము నీవై
  రోతను గూర్చితివిగ యో
  సీ! తారా! మునికిఁ గీడుఁ జేయందగునే?

  ప్రత్యుత్తరంతొలగించు
 25. "ఏ తీరగునిది యన్నా
  సీతా రామునకు గీడు జేయందగునే?
  సీత చెర విడి మనుడ"నుచు
  నీతులు వచియింప తమ్ముని వెడల బనిచెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 26. కూతల మానుము! యగ్ని పు
  నీతను నిందించఁ దగునె నీకు! మడేలన్నా!
  మూతిని మూయక వాగుచు
  సీతారామునికిఁ గీడుఁ జేయఁదగునే?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహదేవుడు గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది.
   'మానుము+అగ్ని' అన్నప్పుడు యడాగమం రాదు. 'మానుమ ఈ.' అనండి. 'మడేలన్నా' అన్న చోట గణదోషం. 'మడేలా' అంటే సరి!

   తొలగించు
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   కూతలఁగూయకు మగ్నిపు
   నీతను నిందించఁ దగునె నీకు! మడేలా!
   మూతిని మూయక వాగుచు
   సీతారామునికిఁ గీడుఁ జేయఁదగునే?

   తొలగించు
 27. నాతంబున్ గొని నీదు సేవ నిడెడిన్నాదాసి యుద్బోధలన్
  సీతా రామున కోగుఁ జేయఁ దగునే, చింతింప నిల్లాలివై
  పాతివ్రత్యము వీడు భర్తృ హననాత్పర్యావసానంబునన్
  పాతాళంబున నీదు నాదు యశమున్ భ్రంశంబు తథ్యంబిదే

  భరతుడు కైకతో అన్న సందర్భములో రాశాను. అన్వయం సరిపోలేదేమో నని సందేహము.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫణి కుమార్ గారూ,
   బాగున్నది మీ పూరణ.
   పర్యావసానము... ప్రయోగం సాధువు కానట్టుంది.

   తొలగించు

 28. ఛందస్సు:- కందము
  =======================
  రీతిగను లేని కైకయి!
  చేతలు కానలకుపంప, మారీచుడనే!!
  నీతి విడచి, "రావణుడా" !
  సీతారామునికి గీడు జేయం దగునే!!
  =======================
  శ్రీరామ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ప్రభా శ్రీవాత్సవ్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది.
   మొదటి పాదాన్ని 'నీతిని విడి కేకయసుత' అనండి.
   'మారీచు డనెన్'అనండి.

   తొలగించు
 29. రీతిగను లేని కైకయి!
  మాతా కానలకుపంప, మారీచుడనే!!
  నీతి విడచి, "రావణుడా" !
  సీతారామునికి గీడు జేయం దగునే!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మద్దులూరి శ్రీనివాసరావు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   పైన 'ప్రభ' గారి పేర ఉన్న నా వ్యాఖ్యను గమనించండి.

   తొలగించు
 30. శూర్ఫణకనుద్దేశించి
  ప్రీతిగ వనమున తిరిగెడు
  సీతారామునికి కీడు జేయందగునే
  నీతిని వదిలిన పనులను
  భీతియు లేక యొనరింప బిడియము లేదే?

  2నీతీరును మార్చుకొనుమో
  సీ తారా మునికిగీడు జేయందగునే
  నీతినివిడనాడినచో
  ఘాతకురాలవనినిన్నుకామగయందుర్
  కామగ=కులట

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉమాదేవి గారూ, మీ పూరణలు బాగున్నవి.
   రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. 'నీ తీరు మార్చుకొనుమో' అనండి. 'అందుర్' అనడం దోషం. 'నిన్నుఁ గడు దూరుదురే' అందామా?

   తొలగించు
 31. శంకరయ్యగారికి నమస్సులు. సవరణ పద్యం.

  చేతంబెంతయు మోదమంద ఘనసంసేవాళి సల్పంగ నా
  మాతన్ కైకనుగారవింప స్థిరమౌ మర్యాద దీపించుగా
  భీతింజెందెదవీవు క్రూరమృగముల్ వీక్షింప కాంతారమున్
  సీతా! రామునికోగు జేయదగునే చింతింపనిల్లాలివై.


  ప్రత్యుత్తరంతొలగించు
 32. పూతాత్మన్+ఇచట.పూతాత్మనిచట. ద్రుతాంతమని నాభావము.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. పూతాత్మన్+ఇచట.పూతాత్మనిచట. ద్రుతాంతమని నాభావము.

  ప్రత్యుత్తరంతొలగించు