14, జులై 2016, గురువారం

సమస్య - 2086 (నవనీతమ్మఁట రావణాసురు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“నవనీతమ్మఁట రావణాసురు సుకన్యాసక్తచిత్తం బిలన్” 
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు. 
లేదా...
“నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్”

51 వ్యాఖ్యలు:

 1. అవనిని వనితల మనమట
  నవనీ తము,రావణుని మనము స్త్రీల యెడన్
  పవనము వీచిన జాలును
  సవనము జేయుచును వెంట సరస మటంచున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ పూరణలో విరుపు బాగుంది. కాని ఉత్తరార్థం కొంత గందరగోళంగా ఉంది.

   తొలగించు
  2. అవనిజ రాముని పత్నిగ
   నవనీతము,రావణుని మనము స్త్రీల యెడన్
   పవనము వీచిన జాలును
   సవనము జేయుచును వెంట సరస మటంచున్
   ------------------------------------
   అవనీ జాతయె పావనం బనుచు లోకంబం తశ్లా ఘించినన్
   స్తవనీ యంబగు రామచం ద్రుమది లోసంతోష ముప్పొంగ గా
   నవనీ తమ్మఁట,రావణాసురు సుకన్యా సక్త చిత్తంబిలన్
   కవనం బల్లుచు కావ్య కన్నియల భోగాలం దునన్ దేలెడిన్

   తొలగించు
  3. అక్కయ్యా,
   మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు


 2. సీతమ్మ తో రాక్షస స్త్రీల మాటలు

  అవనిజ! విను మా మాటలు
  నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్
  కువలయము వోలె జూచున్
  అవుననుమా! నతను నిన్ను అక్కున జేర్చున్

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సుమా యతడు నిన్ను నక్కున జేర్చున్’ అనండి.

   తొలగించు
 3. అవును నిజము నిజమిది, వే
  దవతీ శాపము! నెరుగును; దశమ స్తకముల్
  యవనిన వెయ్యిగ తెగిపడు,
  నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వెంకటప్పయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మస్తకముల్+అవనిని’ అన్నపుడు యడాగమం రాదు. ‘అవనిన’ సాధువు కాదు. ‘దశశిరములు తా| మవనిని వెయ్యిగ దెగిపడు...’ అనండి.

   తొలగించు
  2. అవలోకన్ మొనరింపగ
   నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్
   ద్రవమై ఘృతముగ కామ
   శ్రువమందున నాహుతగుచు సోలుట నిజమౌ

   తొలగించు
  3. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘ఆహుతి+అగుచు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘శ్రువమున నాహుతి యగుచును సోలుట నిజమౌ’ అందామా?

   తొలగించు
  4. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
   అవలోకన్ మొనరింపగ
   నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్
   ద్రవమై ఘృతముగ కామ
   శ్రువమున నాహుతి యగుచును సోలుట నిజమౌ

   తొలగించు
 4. అవనీనాధుడు రామచంద్రు హృది మున్యాసక్త భాస్వంతమౌ
  నవనీతమ్మట--రావణాసురు సుకన్యాసక్త చిత్తంబిలన్
  అవమానాత్మకమౌచు స్త్రీహరణ పర్యాప్తమై గర్వోద్ధతిన్
  స్తవనీయంబను మాట లేక మను విస్వవ్యాప్త విద్రోహమై .

  అవనిజపతిహృది నిరతము
  నవనీతము --రావణుని మనము స్త్రేల యెడన్
  అవమానకరము ఘోరము
  కవనంబును జేయలేము కాముకుడగుటన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సూర్యనారాయణ గారూ,
   ఈనాటి వృత్తపూరణలో మొట్టమొదటిది మీదే. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మూడవపాదంలో గణదోషం. ‘స్త్రీహరణ పర్యాప్తాత్త గర్వోద్ధతిన్’ అందామా?

   తొలగించు
  2. మాన్యులు శంంకరయ్య గారికి నమస్సులు. మీ సూచన గమనింంచాను.చాల మనోహరముగానున్నది. కృృతజ్ఞతలు.

   తొలగించు
 5. అవనీ తలమును చుట్టుచు
  యువిదల చెఱ పట్టుటందె యూరట గొనె! మా
  నవతకు చోటెఱుగని దా
  నవ నీతము రావణుని మనము స్త్రీల యెడన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘చుట్టుచు| నువిదల...’ అనండి.“దానవ నీతము” అన్న విరుపు ప్రశంసనీయం.

   తొలగించు
 6. పొరబాటుగ విశ్వ కు బదులుగా విస్వ పడినది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అవనిజ యెడలను మినహా
  నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్
  పవనా !యియ్యది సత్యము
  శివ భక్తుడు నగుట వలన జేతును నతులన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మినహా’ అన్యదేశ్యం.

   తొలగించు
 8. చవులూరెనన్న, సరియన
  వివరమ్ముగ సకల సిరుల విందొనరించున్
  సవరించును ముంగురులన్
  నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. ఛవిమత్కంకణ కాంచనాభరణ వస్త్రశ్రేణి భాసింపగన్
  స్తవనీయంబుగ నాదు రాణుల ననున్ శాసింపు శాతోదరీ
  యవనీజాతను జూచి తాఁ బలికె మోహావేశ మగ్నుండహో
  నవనీతమ్మఁట రావణాసురు సుకన్యాసక్తచిత్తం బిలన్


  అవమానము సేయక గౌ
  రవమును జూపవలయు నికరమ్ముగ, వేగం
  బ విడిచి మన లోపలి దా
  నవ నీతము రావణుని, మనము స్త్రీల యెడన్

  [దానవ నీతము = రాక్షసుల(దుష్టుల) చే తేబడిన (ప్రేరేపింప బడిన); రావణుని = తెలిసిన మూఢుని లేక హింసకుని]

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించు
  3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
 10. నవనవ లాడెడు వనితల
  జవరాండ్రుగ సేయుకొరకుజగడము లేకన్
  " నవ"రీతులెన్నొ వేసెడి
  నవనీతము రావణునిమనము స్రీల యెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీనివాస చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. గౌౌరవనీయులు కామేశ్వరరావుగారికి. మీ పద్యము కడు హృృద్యముగా నున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సూర్యనారాయణ గారు నమస్సులు. నా పద్యము మీకు నచ్చినందులకు మిక్కిలి ధన్యవాదములు. చక్కటి విరుపుతో మీ పూరణ విరాజిల్లుతోంది.

   తొలగించు
 12. కవనంబందున గన్పడు
  నవనీతము రావణునిమనము|”స్త్రీలయెడన్
  అవమానపు నానందము
  వివరణ లేబంచి పెంచె విజ్ఞానుండై.
  2.భవితవ్యంబున బాధ్యతాయుతపు భావంబందు జీవించకన్
  తవరాజై శివనామ దీక్షగొని నాంతర్యాన విజ్ఞానియై
  నవనీతమ్మటరావణాసురు|”సుకన్యాసక్త చిత్తంబిలన్
  అవమానంబని నెంచబోక?ఫలితంబంతంతెలంకేశ్వరా.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు అన్వయలోపంతో ఉన్నట్టున్నవి.లేక నా అవగాహనా లోపమో?
   మొదటి పూరణలో ‘అవమానపు టానందము’ అనవలసి ఉంటుంది.

   తొలగించు
 13. అశోకవనంలో దానవ స్త్రీలు సీతతో పలుకుతున్నమాటలుగా

  నవలామణీ! విను నా
  దు వచనముల దనమనసునుదోచిన సుకుమా
  రివనుచుపేక్షించె గదా
  నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   మొదటిపాదంలో గణదోషం. ‘వినుము’ అంటే సరి!

   తొలగించు
 14. శివుడిచ్చినవరములకత
  నవిరళమును తిరుగుచుండు హంకారముతో
  నవనవలాడుచు చేరిన
  నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   పూరణ బాగుంది.
   రెండవపాదంలో యతి తప్పింది. న-హ లకు మైత్రి లేదుకదా! ‘శివు డిచ్చిన వరము కతన| నవిరళముగ తిరుగుచుండు హంకారముతో’ అనండి.

   తొలగించు
 15. శివ సాన్నిధ్యపు కారణమ్ము వరముల్ సిద్ధించ గాగర్వియై
  బవరమ్మందునఁద్రుళ్ళుచున్ సతము గీర్వానాదులన్ గెల్చుతా
  సువరారోహలు కానుపించి మనమున్ సొక్కించ కీలాలమౌ
  నవనీతమ్మట రావణాసురు సుకన్యాసక్త చిత్తంబిలన్
  (వరారోహః ఉత్తమ స్త్రీ, పెద్ద పిరుదులు గల స్త్రీ, కీలాలముః నీరు)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రెడ్డి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 16. అశోకవనంలో దానవ స్త్రీలు సీతతో పలుకుతున్నమాటలుగా

  అవలీలన్నరి వీరులన్ దునుము వీరాగ్రేసరుండైన దా
  నవ శ్రేష్ఠుండ దిరస్కరింపదగునే నారీశిరో భూషణీ
  యవమానించిన నిన్ను ప్రాణముల దీయన్ లేడు ముమ్మాటికిన్
  నవనీతమ్మఁట రావణాసురు సుకన్యాసక్తచిత్తం బిలన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. రవివంశోత్తముని మనసు
  నవనీతము, రావణుని మనము స్త్రీల యెడ
  న్నవగుణమై యది యేదా
  నవకుల నాశమ్ముబొంద నాందియె యయ్యెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ యీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవగతము రామచరితము
   నవనీతము; రావణుని మనము స్త్రీలయెడ
   న్నవనాయము, కాముకుడై
   యవనీజ న్నపహరించ నవిధిని బొందెన్!

   అవనాయము=న్యాయములేకుండుట
   అవిధి=దుఃఖము

   తొలగించు
  2. శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. చివురించన్ లతలట్లు కామమది , తా చిత్తంబు నుప్పొంగగా
  చవులూరంగ పతివ్రతల్నె గనుచున్ సంకల్ప మాత్రాన దా
  నవుడా తుమ్మెద వోలె వాలి బలిమిన్ నానారుచుల్ జూడఁడే !
  నవనీతమ్మఁట రావణాసురు సుకన్యాసక్తచిత్తం బిలన్

  శివ భక్తుండయి సతతము
  జవసత్వము లుడుగు దనుక జపియించుచునున్
  యువతుల చెఱ బట్టును గద !
  నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘పతివ్రతలను’ అన్నదానిని ‘పతివ్రతల్నె’ అనడం దోషమే.

   తొలగించు
 20. అంజయ్య గౌడ్
  శివునికి భక్తుడు నిఙముగ
  జవసత్వముచే రిపులను శాసించెనుగా
  అవివేకముతో యెపుడును
  నవ,నీతము రావణుని మనము స్త్రీలయెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అంజయ్య గౌడ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘జవసత్త్వములన్ రిపులను...’ అనండి.

   తొలగించు
 21. ఒక రాక్షస స్త్రీసీతతొ
  అవనిజతో పలికెన్ విను
  'నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్
  భువిలో నీవంటి వనిత
  నవలోకించుచు సతతము నభినందించున్.

  ప్రత్యుత్తరంతొలగించు