23, జులై 2016, శనివారం

సమస్య - 2095 (నా పతి యేగుదెంచఁ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

“నా పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్”
లేదా...
“నా పతి చనుదేరఁ జూచి నా పతి నక్కెన్”

99 కామెంట్‌లు:

  1. ఒక దొంగ యొక్క భార్య మనోగతము:-

    కాపురమెట్లు? చోరపతి కంటికి కానగరాడు రాత్రికిన్
    దీపము పెట్టినంతటనె దేశము పైబడు దొంగిలింపగన్
    శాపము కాదె యిట్టి పతి జాణకునెప్పుడు, నొక్కనాడు సే
    నా పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్!!

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. రాజేశ్వరి గారు,
      ఒకటవ మరియు రెండవ పాదాలలో గణ భంగము
      "గౌతముడడుగిడ" "వణికెను" అంటే ఛందస్సు ప్రకారము సరిపోతుంది.

      తొలగించండి
  3. తాపసి గౌతము డడుగిడ
    పాపము నింద్రుడు వణికెను భయ కంపితుడై
    శాపము నీయ నహల్యకు
    నాపతి చనుదేరఁ జూచి నా[ఆ] పతినక్కెన్
    ---------------------------------
    ధన్య వాదములు సత్యనారాయణ గారు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      ‘పాపము+ఇంద్రుడు’ అన్నపుడు నుగాగమం రాదు. ‘..జూచి నా(ఆ) పతి’ అన్న విరుపు సమంజసంగా లేదు.

      తొలగించండి
  4. ఏపతి నైనగాని సతు లెన్నడు భీరుని గాతలం పరే ?
    నా పతి యేగుదెంచఁ గని నాపతి భీతిని నక్కెనొక్కెడన్
    శ్రీపతి వింతగా కమరి శేముషి యైనవి భుండుశం కరుం
    డీపగి దిన్ శనీ శుగని లీలగ దాగెన దేమిఖర్మ మో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మంచి ఘట్టాన్ని తీసుకున్నారు. పద్యం బాగుంది.
      కాని సమస్యలో ద్విరుక్తమైన ‘నాపతి’కి పరిష్కారం లేదు.

      తొలగించండి
  5. చూపుచు ఖడ్గరాజమును, చోరుడ! రమ్ముర! యెక్కడుంటివో
    పాపము చేసినా విపుడ వార్యము దండన, నీదుజీవమన్
    దీపము నార్పుకొందువని తిట్టుచు, నిప్పులు గక్కుచున్న సే
    నాపతి యేగుదెంచ గని నాపతి భీతిని నక్కె నొక్కెడన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  6. భూపతి జైత్రయాత్రలను పూర్ణమనస్కత చాటిచెప్పగా
    శ్రీపతి యుద్ధరంగమున చేరియు భీతిలి యింటికేగగా
    దాపుననున్న ప్రాంతముల దా గని లేకయుంట-సే
    నాపతి యేగుదెంచ గని నా పతి భీతిలి నక్కె నొక్కెడన్.

    భూపతి పిలుపున వచ్చిన
    శ్రీపతి సైన్యంబుజేరి చిన్నగ పాఱన్
    దాపున వెదకుచు నా సే
    నాపతి చనుదేరజూచి నాపతి నక్కెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవపాదంలో గణదోషం. ‘..దా గని యాతఁడు లేకయుంట సే...’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి


  7. ఓపరి జేయుచు ఆ మా
    నాపతి, చనుదేరఁ జూచి, నా పతి, నక్కెన్,
    దాపుల కొచ్చెను గదవే
    మాపటి వేళన జిలేబి మాధురి గాంచన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.

      ‘ఓపరికము = ఓర్పు, శ్రద్ధ’ ఉంది కాని ‘ఓపరి’ లేదు. ‘మానాపతి’ అర్థం కాలేదు.

      తొలగించండి

    2. ఓపిన మేరకు అని అనవచ్చాండి‌ ?

      జిలేబి

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. గయుని భార్య విలాపము:

      శ్రీపతి యార్ఘ్యమున్ జెడుప శీఘ్రమె గూల్చు ప్రతిజ్ఞ జేయగ
      న్నాపద తీర్చువాడు నరుడంచును నారద మౌని బన్పున
      న్నూపిరి చిక్కబట్టుకొన నూగుచు నర్జును వేడబోవగ
      న్నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

      తొలగించండి
    2. గయుని భార్య విలాపము:

      శ్రీపతి యార్ఘ్యమున్ జెడుప శీఘ్రమె గూల్చు ప్రతిజ్ఞ జేయగ
      న్నాపద తీర్చువాడు నరుడంచును నారద మౌని బన్పున
      న్నూపిరి చిక్కబట్టుకొన నూగుచు నర్జును వేడబోవగ
      న్నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

      తొలగించండి
    3. సహదేవుడు గారు చక్కటి పూరణ. శ్రీపతి+అర్ఘ్యము = శ్రీపత్యర్ఘ్యము. రెండు సంస్కృత పదములు కాబట్టి యణాదేశ సంధి వర్తిస్తుంది. యడాగమము రాదండి. ఆర్ఘ్యము = అర్ఘ్యమునకు సంబంధించిన యని. ఇక్కడ "అర్ఘ్యము" సరిపోతుంది. తదనుగుణముగా సవరణ సేయగలరని భావిస్తాను.

      తొలగించండి
    4. సహదేవుడు గారూ,
      పూరణ బాగున్నది. అభినందనలు.
      కామేశ్వర రావు గారి సూచనలను గమనించండి.

      తొలగించండి
    5. గురుదేవులకు మరియు కామేశ్వరరావు గారలకు ధన్యవాదములు.సవరించిన పద్యం:

      గయుని భార్య విలాపము:

      శ్రీపతి దోసిటన్నుమియ శీఘ్రమె గూల్చు ప్రతిజ్ఞ జేయగ
      న్నాపద తీర్చువాడు నరుడంచును నారద మౌని బన్పున
      న్నూపిరి చిక్కబట్టుకొన నూగుచు నర్జును వేడబోవగ
      న్నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

      తొలగించండి
    6. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    7. సహదేవుడు గారు మీ సవరణ యద్భుతముగా నున్నది.

      తొలగించండి
    8. గురుదేవులకు మరియు కామేశ్వరరావు గారలకు ధన్యవాదములు.

      తొలగించండి
  9. కవి మిత్రులు సహదేవుడు గారికి..నమస్సులు.ప్రాసను గమనించి మార్చుకోవలసినదిగా కోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నేకంటి వారికి నమస్సులు. ధన్యవాదములండి. గయుని తడబాటును వ్రాయబోయి నేనే తడబడ్డాను. సవరించాను గమనించ మనవి.

      తొలగించండి
  10. తాపము చెలరేగంగను
    పైపై కరుదెంచు నెండ పౌరుష భారం
    బోపని కతనము నా నలి
    నాపతి చనుదేర జూచి నాపతి నక్కెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కాని నలినము అకారాంత నపుసంకలింగ శబ్దం. సమాసంలో ‘నలినా’ అని దీర్ఘాంతం కాదు. ‘నలినపతి’ అవుతుంది. గమనించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారూ...మరేదయినా పదమును సూచించగలరా....నా జ్ఞానానికి అందటంలేదు .... సూర్యుని అర్థానికి....

      తొలగించండి
    3. శర్మ గారు మీ పూరణ కీ సవరణ యెట్లుండును?

      బోపని కతన నభమ్మున
      నా పతి చనుదేర జూచి నాపతి నక్కెన్!
      ఇక్కడ "నభమ్మున నా పతి" యంటే ఆకాశములో ప్రభువు సూర్యుడన్న మాట.ఆఖరి పాదములో "అఖండ" యతి.
      "కతన" ద్రుతాంతావ్యయము. "కతనము" సరిగాదనుకుంటాను.

      తొలగించండి
    4. గురువుగారు కామేశ్వర రావు గారికి నమస్సులు. మీ సూచన బాగున్నది.... ధన్యవాదములు

      తొలగించండి
  11. ద్రౌపది బాధల వగయగ
    నోపక జెప్పెను వలలుడు, "నూకలు జెల్లెన్
    పాపికి నిపుడే" యనగన్
    నా పతి చనుదేరఁ జూచి నాపతి నక్కెన్
    (మొదటి పతి భూపతి, రెండొ పతి భర్త అన్న అర్ధంతో)

    రిప్లయితొలగించండి
  12. పాాపముబాాలుడువణకెను
    నాాపతిచనుదేరజూచి,నాాపతినక్కెన్
    దాాపునపాామునుజూడగ
    బాాపురెవేరంండనుచుపరుపునచుట్టన్

    రిప్లయితొలగించండి
  13. ఓ దొంగ భార్య మాటలు...

    దాపుల సవ్వడి వినగనె
    దీపమ్మును జేతబట్టి దిరుగుచు దిడుచున్
    కోపావేశముతో సే
    నాపతి చనుదేరఁ జూచి నాపతి నక్కెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తిడుచున్’ అనడం సాధువు కాదు.

      తొలగించండి
  14. పాపము కూడదయ్య పొరబాటున దాటెను హద్దు సిగ్గగున్
    చూపకు నీ ప్రతాపమును సోదరుడే కద యంటి క్రుద్ధుడై
    నాపయి లేచినా డపుడు న్యాయము కోరిన తమ్మునంటి స్థా
    నాపతి యేగుదెంచ గని నాపతి భీతిని నక్కె నొక్కెడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

      తొలగించండి
    2. మిస్సన్న గారు మీ పూరణ బాగుంది కాని చిన్న దోషముంది. "స్థానపతి" సాధువు "స్థానభ్రంశము" వలె. ఇక్కడ స్థానాపతి యని దీర్ఘము రాదు.

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారూ,
      నిఘంటువులలో స్థానపతి శబ్దం లేదు... కేవలం స్థానాపతి ఉంది.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "స్థానాపతి" పదమునిప్పుడు నిఘంటువు లో చూచాను. సాధువే యని తెలుసుకున్నాను. ధన్యవాదములు.
      మిస్సన్న గారు మన్నించండి మీకు శ్రమ కల్పించాను.

      స్థానము అ కారాంత నపుంసక లింగపదము గదా యని స్థానపతి సాధువనుకున్నాను. అయినా అన్ని సమాసభూయిష్ట పదములను నిఘంటువులలో చూపరుగద. స్థానపతి కూడా సాధువై యుండాలి.

      తొలగించండి
    5. స్థానాపతి లో‌ స్థానము ఉంటే అది అకారాంతనపుంసకలింగ శబ్దమే. కాని మనం స్థానాఃపతి అన్నట్లుగా తీసుకొన వచ్చును కద అన్నది ఒక ఆలోచన. విఙ్ఞులు నిర్ణయించాలి.

      తొలగించండి
    6. నాదొక చిన్న సందేహము. "వరకట్నము" దుష్ట సమాస మైనప్పటికీ వాడుకలో సాగుతున్నందున నిఘంటువు లో కూడా చోటు చేసుకున్నట్లే "స్థానాపతి" కూడా చోటు చేసుకుందేమో నని నా యనుమానము.

      తొలగించండి
    7. మిత్రులకు నమస్సులు! "రాయవాచక" కర్త విశ్వనాథ స్థానాపతి. స్థానాపతి అంటే సామంత రాజులూ అమర నాయకులూ తమ ప్రతినిధిగా తమ రాజధానీ నగరంలో నియమించుకున్న రాజోద్యోగి. ఈ పదవి ’స్థానాపతి’ గానే ప్రసిద్ధమైనది.

      తొలగించండి
    8. ధన్యవాదములు మధుసూదన్ గారు ఈ పదమెలా వాడుకలోకి వచ్చిందా యని తికమక పడుతున్నాను. అల్లా రాబట్టే నిఘంటువు లోకి యెక్కిందనుకుంటాను. లేకపోతే స్థానభ్రంశము లో లా కాకుండా దీర్ఘముతో యెలా సమాసమవుతుంది?

      తొలగించండి
    9. స్థాన చలనము, ఆస్థాన విద్వాంసుడు మున్నగు సమాసములు విదితమే గదా

      తొలగించండి
  15. నాపతి గద్దెను గోరుచు
    భూపతిపై కుట్రపన్ని పోరును చేయ న్
    రూపడచెదనని వె స సే
    నాపతి చనుదేర జూసి నాపతి నెక్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఒకే వాక్యంలో ‘నాపతి’ పునరుక్తమయింది. ‘కోపించి గద్దెఁ గోరుచు...’ అందామా?

      తొలగించండి
  16. ఒక రాజు గారి మహారాణి గారి వచనములు:

    పాపము ఘోర యుద్ధమున భగ్నచమూ విమనో రథాత్త సం
    తాపము తాళ జాలక సదార సుతాకలితుండు పాఱగం
    గోపము వూని శాత్రవ నిగూఢ విచార దళౌఘ భీమ సే
    నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్


    ఏ పగిది తీర్తు రుణమని
    చూపడు ముఖము తనకు, పతి సుదతి సృజనకున్,
    పాపము భవనమ్మున సృజ
    నాపతి చనుదేరఁ జూచి నా పతి నక్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      “సృజనకుం, / బాపము” అని చిన్న సవరణ చేశాను.

      తొలగించండి
  17. శంకరయ్య గారికి నమస్సులు. నిజమే "యాతడు"పదం టైపుచేశాననుకొన్నాను.సూచించిన మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి సుజనకు నాథుడె,
    ఆపై మాటల జిగురని యందరు హడలన్!
    ఆపద పసి కట్టుచు సుజ
    నా పతి చనుదేర జూచి నా పతి నక్కెన్!
    (ఆపద = శ్రీపతి తన మాటలతో మెదడు తింటాడన్న భయం ద్వారా కలిగిన ఆపద)

    రిప్లయితొలగించండి
  19. ఆపద శత్రు రాజ్యపు దురాక్రమణంబున మూడెనంచు తా
    వేదన జెంది సైన్యమును బెంచగ భూవరు డాజ్ఞ జేయ నే
    వాదన లేక జేరుడని పట్టణ యోద్ధల కెల్ల చెప్పు సే
    నా పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

    రిప్లయితొలగించండి
  20. రూపము చక్కదిద్దుకొనిరూఢిగ మోమున నవ్వురాజిలన్
    కోపమొకింతలేకతనకోర్కె" నిశాసతి" దెల్పుచుండగా
    పాపము చందమామతనభామనుజేరగ సూర్యదేవుడే
    నాపతి, యేగుదెంచగనినాపతిభీతినినక్కెనొక్కడన్ౌౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసాచార్య గారూ,
      పద్యం బాగున్నది. కాని పూరణలోని భావం అవగతం కావడం లేదు. దయచేసి వివరించండి.

      తొలగించండి
    2. సముద్రాల వారూ,
      ఆపద అనే అర్థంలో ‘ఆపతి’ సాధువే. కాని నా + ఆపతి = నా యాపతి అవుతుంది. నాపతి కాదు. ప్రస్తుతం నేనైతే ఏ సవరణను సూచించలేను.

      తొలగించండి
  21. 🌹ప్రయుత కవితాయజ్ఞం🌹

    sk 2019 క.సం.385

    సందిత గారి పూరణ....

    భూపతికోపమునందెను

    నీపతిచెల్లింపలేదునీతిగపన్నున్

    చూపుము పట్టుదునని సే

    నాపతి చనుదేర జూచి నాపతి నక్కెన్

    రిప్లయితొలగించండి
  22. మాపున రూపసి యగు మీ
    నాపతి చనుదేరఁ జూచి నాపతి నక్కెన్
    దీపము లారగ నంతట
    యే పురుషు౦ డెవని గొట్టె నే నెరుగ నయా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      ఆహా! చక్కని పూరణ. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  23. అంజయ్య గౌడ్ గారి పూరణ....

    పాపల పెండ్లినిమిత్తము
    కాపామెను బ్రతిమిలాడి కనకము దెచ్చెన్
    రూపాయలునడుగగ మీఓ
    నా...పతి చనుదేర జూచి నా పతినక్కెన్
    మీనా. కాపువనిత పేరు.

    రిప్లయితొలగించండి
  24. రూపమునందున నొక్కటె|
    పాపము నాకవల లిపుడు పరిణయ మాడన్
    దాపున కోర్కెల తికమక
    నాపతి చనుదేర జూచి నాపతి నక్కెన్ {పతికవలలలో నొకడు ఇద్దరొకటై నందుననవవధువుకుతికమక}
    2.రూపసియన్నదౌ నహము రోదన నింప?విడాకులందియున్
    భూపతి భార్యగా తగని పోషణలందున తల్లడిల్లు చున్
    యేపతియైన నొక్కటని యెంచెడిమానసమందునన్
    నాపతి యేగుదెంచగని నాపతిభీతిని నక్కె నొక్కడున్ {నాపతి=ఆపతి=పూర్వభర్త}

    రిప్లయితొలగించండి
  25. పాపము బెంగళూరు యిది! బాడుగ యిల్లు లభింప సాయమై
    యా పని మధ్యవర్తి సలహానిడి యాతని సేవగైకొనెన్
    ఆపెను రేపుమాపులని యాతని వేతన మేల? రామ! స్థా
    నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బెంగుళూరు+ఇది’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘బెంగుళూ రిదియె’ అనండి.

      తొలగించండి
  26. ఆపవనాత్మజుండలిగి యంతము జేయ సుయోధను న్నిటన్
    చూపగలేక తాబలము , చూపక మోము , పలాయనమ్మున
    న్నీ పురివీడె నంచనియె నిట్టుల భానుమతీ సతి , ''వీర సే
    నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్''

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భానుమతీ సతి’ అన్నచోట గణదోషం.

      తొలగించండి

  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఈ పగిదిన్ వివాద మొనరి౦చగ సాగెను
    ఛాయ తారతో :--

    " నీ పతి యైన చ౦దురుడు నిల్వగ జాలడు ,
    ని౦గి సీమకున్

    నాపతి యేగుదె౦చగని " | " నాపతి
    భీతిని దాగు నొక్కెడన్

    పాప మత౦డు చల్లనగు స్వామి గదా "
    యనె తార ఛాయతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. లోపము లేదని కవితల
    జూపుచు నా పతి తనవని క్షోణికి దెలుపన్
    కోపముతో నిజకవి మీ
    నా పతి చనుదేరఁ జూచి నా పతి నక్కెన్

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    [కుమారస్వామి నెదిరించలేక యుద్ధమందు పారిపోయి, తన భర్త యొకచోట దాగె నని తారకాసురుని భార్య తన దాసీలతోఁ జెప్పు సందర్భము]

    "ఆ పరమేశు పుత్రుఁ డట నాగ్రహ మందియు యుద్ధభూమిలో
    నేఁపున బాణముల్ విడువ, నెంతయుఁ దాళఁగ లేక వేగమే
    దాపునఁ దాఁగఁగాఁ జనఁగ, దబ్బున వెన్కొని వల్లిదేవసే

    నాపతి యేగుదెంచఁ, గని, నా పతి భీతిని నక్కె నొక్కెడన్!"

    రిప్లయితొలగించండి
  30. మొదటి పద్యములో ప్రాస తప్పినది
    ఆపద శత్రు రాజ్యపు దురాక్రమణంబున మూడెనంచు సం
    తాపము జెంది రాజు రిపు దర్పమడంచగ దల్చి సైన్యమున్
    భూపతి పెంచగోర నిది భూ ప్రజ కెల్లను విన్నవించ సే
    నా పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. ​కాపల కాయు బంటొకడు కాపురముండెను క్రొత్తక్రొత్తగా​
    రూపసియైన స్వామిని స్వరూపము పొందగ వ్యాధివంకతో
    ​కాపల చేయనంచు నధికారిని కోరె ననుజ్ఞ కాన సే
    నా​పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్​!

    రిప్లయితొలగించండి
  32. దోపిడి దొంగగ మారిన

    నా పతికిన్ పట్టు కొనగ నల్గురితో మా

    దాపునకున్ వడిగా సే

    నాపతి చనుదేర జూచి నాపతి నక్కెన్.

    రిప్లయితొలగించండి
  33. దోపిడి దొంగగ మారిన

    నా పతికిన్ పట్టు కొనగ నల్గురితో మా

    దాపునకున్ వడిగా సే

    నాపతి చనుదేర జూచి నాపతి నక్కెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నా పతినే పట్టుకొనగ.... అనండి.

      తొలగించండి
  34. నా పతి తెల్లవారెనని స్నానము చేయగ నేగినంతనే
    పాపపు బుద్ధిచేత నిజ భర్తయు రూపము దాల్చివచ్చినా
    కా పతి నాయెడన్ మిగుల కామపు భోగము బొందునంతలో
    నా పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

    రిప్లయితొలగించండి
  35. సుగ్రీవుని భార్యను వాలి చెరపట్టి సుగ్రీవుడికోసం వెతుకుతున్న తరుణంలో ఆ ఇల్లాలి అంతరంగం


    ఆపదలకునాపదయై
    చూపగ యమపురి తనగుహ జొచ్చెడి భ్రాతన్
    కోపపు సింగము రూపున
    నా పతి చనుదేరఁ జూచి నా పతి నక్కెన్

    రిప్లయితొలగించండి
  36. చీపురు కట్టనున్ దులిపి చేతిని బట్టుచు పూటకూళ్ళమా
    దాపున జేరగా నొకడు దబ్బున దూరగ శయ్యక్రిందనున్
    చూపులు కల్పగానరయ చుట్టను కాల్చు గిరీశమున్నహా...
    నా పతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్

    పతి = స్వామి

    రిప్లయితొలగించండి