10, జులై 2016, ఆదివారం

దత్తపది - 93 (వంద-వేయి-లక్ష-కోటి)

కవిమిత్రులారా,
వంద - వేయి - లక్ష - కోటి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
(నిన్నటి వరంగల్ అవధానంలో నేనిచ్చిన దత్తపది ఇది)
అవధాని శ్రీ గౌరీభట్ల మెట్రామశర్మ గారి పూరణ....
వందన చందనమ్ము లివె బంధువు వంచు సమర్పణమ్ముగా
నైందవకీర్తి మాధవ మహాకరుణోద్యత వే యిడంగ నేన్
ముందర వాలవేమి రసమోహనరూప సలక్షణమ్ముగా
నందకిశోర ద్రౌపదిని నన్ను సుదర్శనకోటి కావవే.

44 కామెంట్‌లు:

  1. చిచ్చునఁ బడ్డ చీమలగు చిందఱవందఱ కారె కౌరవుల్
    హెచ్చిన తాత యైన గురువే యిక వచ్చిన నిల్వజాలునే
    వచ్చెడి వాడు ఫల్గునుఁడు బాణములక్షయమై చెలంగవే
    చొచ్చెద శత్రువాహినిని, చూడుము నాపలుకోటికాదికన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      దత్తపదాలను సమర్థంగా, వైవిధ్యంగా అన్యార్థంలో చక్కగా ప్రయోగించి చక్కని పూరణ చెప్పారు. మీకు నా ప్రశంసలు.

      తొలగించండి


  2. ద్రౌపది భిక్షమై వచ్చిన వేళ కుంతిని గని కొమరుల పలుకులు


    వందనము తల్లి లక్షణ
    గంధపు భిక్షను కిరీటి గాంచెను శరకో
    టిందన విద్యా గరిమన్,
    అందము గనవే యినకుల మందలి చందం !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘చందం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అయినా వారిది ఇనకులం కాదు, చంద్రవంశం. (ద్రుపదునిది సూర్యవంశమా? నాకు తెలియదు).

      తొలగించండి
  3. వందన గౌరవంబులను స్వాగత మిచ్చినకౌరవేశ్వరా
    దందడి కోరి నీ సుతులు దండును మిక్కిలి వేయివెట్టియున్
    సందడి చేయుచుండ నిల సాధు సులక్షణ బంధుకోటితో
    నందరు సంగరాన మృతి నందుట తథ్యము! సంధి సేయుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘వేయి’ స్వార్థంలో ప్రయోగించినట్టున్నారు?

      తొలగించండి
    2. గురువుగారూ, వేయివెట్టు అంటే ప్రోగుచేయు అనే అర్థంలో వావాడియున్నాను.

      తొలగించండి
    3. మీరు చెప్పిన అర్థం కేవలం శ్రీహరి నిఘంటువు మాత్రమే ఇచ్చింది. మరే నిఘంటువు ఇవ్వలేదు. సందేహమే! ఇంకా నిశితంగా పరిశీలించవలసిన అంశం.

      తొలగించండి
    4. వందన గౌరవంబులిడి స్వాగత మిచ్చినకౌరవేశ్వరా
      బంధుల కావవే యిలను పాండుకుమారుల తోడ పోరుకై
      సందడి చేయునీ సుతులు సాధు సులక్షణ బంధుకోటితో
      నందరు సంగరాన మృతి నందుట తథ్యము! సంధి సేయుమా

      గురువుగారూ సవరించాను.

      తొలగించండి
  4. పలికె నూర్వశి పార్ధుని వలచె ననుచు
    వంద నములిడ తల్లివే యిందు వదన
    లక్ష ణమ్మగు నాతండ్రి లాస్య మీవు
    కోర వలదంటి సురకో టిరుని చెలియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      బాగుంది మీ పూరణ.
      చివరిపాదంలో గణ,యతి దోషాలు.
      ‘కోరవలదంటి నీ సురకోటి మెచ్చ’ అందామా?

      తొలగించండి
  5. ఐతగోని వేంకటేశ్వర్లు గారి పూరణ....

    కురుక్షేత్రమున సమరమధ్యస్థలిన తన బందువర్గ,గురువర్గమును సంవీక్షించి
    మోహావిష్టుడైన పార్థు వాక్యములును శ్రీకృష్ణుని యుక్తంపుబలుకుల క్రమంబెట్టిదనిన

    బావా బ్రాతల వందనీయగురులన్ బ్రాప్తింపు రాజ్యమ్ముకై
    ఏవేళన్ పరిమార్చలేను పదవే యిచ్చోటనుండంచనన్
    లేవోపార్థవిసలక్షణంబగునొకో శ్రీమాన్య !మోహంబునన్
    నీవాగ్ధానముకోటి సేయదగునే నీశౌర్య మేమాయెనో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేంకటేశ్వర్లు గారూ,
      బాగుంది మీ పూరణ.
      ‘రాజ్యమ్ముకై, వాగ్దానము కోటి’ అనరాదు. ‘రాజ్యమ్మునకై, వాగ్దానమున కోటిసేయ..’ అనడం సాధువు. ‘నుండి+అంచనన్=నుండి యంచనన్’ అని యడాగమం వస్తుంది. గమనించండి.

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    [సహాయ మర్థించి వచ్చిన దుర్యోధనునితోఁ గృష్ణుఁడు వల్కిన సందర్భము]

    వందన మో సుయోధన? వివాద మదేలయ? కోరవే యిటన్?
    ముందుగఁ గ్రీడి కోరునయ! మోదముతోడుత నీవ వెన్క! నే
    నందు స
    లక్షణాయుధకరాంచితసద్భటకోటి యొక్క వై;
    పుందును నేను వేఱొకట; నొందఁ గరమ్మున నాయుధమ్ములన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      ‘ఒందఁ గరమ్మున నాయుధమ్ములన్’ అన్నదానిని ‘ఒప్పగుదానిని స్వీకరింపుమా’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. ధన్యవాదాలు శంకరయ్య గారూ!

      సాయుధులైన సద్భటకోటి యొకవైపు, నిరాయుధుఁడనైన నేనొక వైపు...అంటూ మఱొక పాదంలో మీరన్నట్లుగా "ఒప్పగుదానిని స్వీకరింపుమా" అని ముగించవలసియున్నది. మీరు సూచించినది సమంజసమే శంకరయ్యగారూ! కృతజ్ఞుఁడను!

      తొలగించండి
  7. వందన మాచరింతు తవ పాదయుగంబున కీయవే యికన్
    చందన చర్చితాంగ ఘన సన్నిభ నీల సులక్షణాంగ గో
    వింద పరాత్పరా పరమ భీషణ మార్గణకోటి ఘాతి నే
    చందము నైన నాకు నుపశాంతిని వేగమ యేను భీష్ముడన్
    [మార్గణకోటి=బాణాగ్రము]

    త్రోవం దప్పి చరించినఁ
    బ్రోవగ రావే యిభహర పురుషశ్రేష్టా
    దేవారాధ్య సులక్షణ
    తావక శరకోటిఘాత దనుజానీకా
    [శరకోటి= బాణాగ్రము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో స్తుతించింది విష్ణువునా? అయితే ‘ఇభహర’ అన్నది వర్తించదేమో? ‘ఇభనుత’ అంటే సరిపోతుందనుకుంటాను. లేక శివుని పరంగా ఈ పద్యాన్ని అన్వయించవచ్చు. (ఇభహర=గజాసుర సంహారా!)

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కువలయాపీడమనే యేనుగును కృష్ణుడు సంహరించాడు గదా! అందుకని విష్ణు పరము గానే వ్రాసాను.

      తొలగించండి


  8. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    రోచి , శతకోటివహుని పుత్రు డిటు లనియె ;-

    వ౦దనము కృష్ణ మరలి౦చు స్య౦దనమును ,

    లక్షణమ్ముగ | వలదు భ౦డనము | కావ

    వే ! యి కొనరి౦ప జాలను హి౦స నిపుడు


    { 3 వ పాదములో = యతి : ల = డ }
    .........................................................

    ( రోచి = రోతపడి వెనుకాడి : శతకోటివహుడు =
    వజ్రాయుధ ధారి ,ఇ౦ద్రుడు : మరలి౦చు =
    వెనుకకు త్రిప్పు : స్య౦దనము = రథము : లక్షణముగ = శ్రేష్టముగా మేలుగా : భ౦డనము = యుధ్దము : )

    రిప్లయితొలగించండి
  9. వందనమాచరింతు యదునందన!దౌష్ట్యపు దుస్ససేనుడే
    ఇందఱిముందరన్ సభకు నీడ్చుకు వచ్చెను కావవేయికన్
    పొందిన లక్షణంబయిన పూరుషశ్రేష్ఠులు పాండవేయులే
    కొందలమందుచుండె రిపుకోటినెదుర్కొన ధర్మబద్ధులై.

    రిప్లయితొలగించండి
  10. వంద నమ్ములు సేతును నంద తనయ !
    లలిత మైనట్టి మాపాలు లక్షణ ముగ
    వే యిడఁగ నడుగుము లేని విధము బంధు
    కోటిని రణమున దప్పక కూల్చెద మను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. ‘కోటి ననిలోన దప్పక కూల్చెద మను’ అనండి.

      తొలగించండి
  11. వందనము లివేయిడి నీకు , బలుకు చుంటి
    రాజ్యమందున నైదూళ్లె రాల్చి మాకు
    లక్షణంబుగ నేలు వివక్ష లేక
    కోటి జూపుట తగదయ్య కురునృపాల !

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్కారములు

    * బృహన్నల లక్ష్మణకుమారునకు హితవు చెబుతున్న పద్యము

    1.
    వెరువందగదో లక్ష్మణ
    పరువే యిలలో నశించు , బాఱన్ దగునే
    యరికోటిని దును మాడగ
    కరమందున లక్షణమగు కార్ముఖ ముండన్

    * సైరంద్రితో కీచకుడాడిన మాటలు గా

    2.
    సుందరీ విలక్షణ మైన యందమె యెద
    దోచె, వెరువందగదు, నన్నుదూర నేమి
    ఫలము? రావే యిటకు నను పరవ శింప
    జేయ నెందుకోటిలు చుంటివో చిన్న దాన.

    రిప్లయితొలగించండి
  13. వందనము కృష్ణ! విడిపింపు బంధనముల!
    కావవే, యివ్విధి రణ రంగంబు జూడ
    మది విలక్షణమ్మగు దెస మరలుచుండె!
    నీదు భక్త కోటి ప్రియుడ నే నరుంద!

    రిప్లయితొలగించండి
  14. యుద్ధ రంగ మందు స్వజనమును చంప నిచ్చగించక తనను యుద్ధము నుండి విముక్తి చేయమని వికల మనస్కుడగు అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్ధించుట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నరుండ’... ‘నరుంద’ అని టైపయింది.

      తొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గీతోపదేశము తదుపరి అర్జునుడు శ్రీ కృష్ణుని తో.....

      వందనమయ జగదీశ్వర
      యందించితివే యిరవు సమంచిత మవగన్
      వందిత చరణ సులక్షణ
      భండన మొనరింతు కోటి భాతిని గొనుచున్!

      ఇరవు=స్థిరత్వము
      కోటి=అతిశయము

      తొలగించండి
    2. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. పరువం దక్కినఁ గనవే?
    యిరువుకొనుమిల క్షణమైన నింపుగ హేలిన్!
    నరవర! మగటిమికోటియొ?
    యురమునఁ దలనుంచనీర యూర్వశి కోరన్!

    రిప్లయితొలగించండి
  17. అందముకో టిప్పన మీ
    వం దనరును సర్వలక్షణానూఢవు నీ
    చందమునకు ప్రణతులివే
    యిందువదనటంచు రాజు లెంచిరి కృష్ణన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. మొదటి పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
  18. వందనముల నొనర్తునోవాసుదేవ
    కావవేయిందు మానమున్ కరుణ తోడ
    లలనయనుచు నెంచక తా విలక్షణముగ
    బాధ లిడవచ్చెకృపజూపు భక్తకోటి.

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులు మన్నించాలి..
    ఈరోజంతా నా మనసెందుకో వికలమై ఉంది. ఇంట్లోనే ఉన్నా బ్లాగును, మీ పూరణలను చూడాలనిపించలేదు. ఈ ఏడేళ్ళలో ఇటువంటి అనుభవం నాకు మొదటిసారి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ నిన్న రాత్రి మీరు రాసిన సందేశం ఈ రోజు ఉదయం చదివినప్పటి నుంచి నాకు కూడా అలాగే ఉంది. అంతటి బాధలోనూ మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించినతీరు ఆశ్చర్యం కలిగించింది. మీ మనసుకు ప్రశాంతత చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

      తొలగించండి