1, సెప్టెంబర్ 2016, గురువారం

సమస్య - 2132 (మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్"
(ఖమ్మం అవధానంలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు పూరించిన సమస్య)
లేదా...
"మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్"
(ప్రాచీనమైన అజ్ఞాతకవి పూరణము...)
కీర్తింపం దగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా
వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె "న
ట్లార్తిన్ జెంద మిముం జయించెఁ గద ము న్నత్యుగ్రుఁడై దైత్యరా
ణ్మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్".

82 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు :

    స్ఫూర్తిగల కృష్ణ మాయకు
    మార్తా0డుడు గ్రు0కె నదిగొ మధ్యాహ్నమునన్
    కర్తారిపోయె ననియెడి
    వార్తకొలయు సై0ధవుఁ దరి పార్థు0డురికెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కర్త+ఆరిపోయె' అన్నపుడు యడాగమం వస్తుంది. 'వార్త కొలయు'...? "కర్తయె తొలగి చనె ననెడి। వార్తను విని ...' అందామా?

      తొలగించండి
    2. గురువుగారు! నమస్కారములు. మీసూచన ననుసరించి పద్యాన్ని మార్చాను. చూడండి. మీరిచ్ఛే ప్రోత్సాహం ఉత్తేజితుణ్ణి చేస్తోంది. తెలుగు పండితుడుని కాకపోయినప్పటికీ పద్యాలు వ్రాయాలన్న దీక్షతో వ్రాస్తున్నాను. మీరు తెలియజేసే వ్యాకరణ విషయాలు, దోషాల సవరింపు అమూల్యంగా ఉండి ముందుకు పరుగెత్తిస్తున్నాయి. హృదయపూర్వక కృతజ్ఞతలు.
      పద్యం:

      స్ఫూర్తిగల కృష్ణ మాయకు
      మార్తా0డుడు గృ0కె నదిగొ మధ్యాహ్నమునన్
      కర్తయె తొలగి చనె ననెడి
      వార్తను విని సై0ధవుఁ దరి పార్ధు0డురికెన్.

      తొలగించండి
    3. రాజారావు గారూ,
      ముందుగా 'కర్తారి' అర్థం వెదకి చూశాను. ఆంధ్రభారతిలో 'కత్తెరవంగ చెట్టు' అన్న అర్థం ఒకటే ఉంది. సూర్యుడు అన్న అర్థం లేదు. అందువల్లనే అది కర్త ఆరిపోయె అనే అర్థంలో వ్రాశారనుకొని సవరణ సూచించాను.

      తొలగించండి
  2. కర్తవ్యము నెరవేర్చగ
    మార్తాండుఁడు , గ్రుంకె నదిగొ మధ్యాహ్న మున
    న్నార్తిగ పరుగిడె పశ్చిమ
    భర్తీ జేయగ తనవిధి భర్తగ తానై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. కాని క్రుంకె నన్నదానికి అన్వయం?

      తొలగించండి
    2. కర్తవ్యము నెరవేర్చగ
      మార్తాండుఁడు గ్రుంకె , నదిగొ మధ్యాహ్న మున
      న్నార్తిగ పరుగిడె పశ్చిమ
      భర్తీ జేయగ తనవిధి భర్తగ తానై

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      'పశ్చిమ' అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. 'పరుగిడె నపరకు' అనండి (అపర=పశ్చిమము)

      తొలగించండి


  3. వార్తా పత్రిక చదివెను
    మార్తాండుఁడు, గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
    ధూర్తుల నాగడముల తా
    పూర్తిగ చదువ మతి బోయి పురమును వీడెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (ఉదయం మీ పూరణ నా దృష్టినుండి ఎందుకో తప్పిపోయింది. మన్నించండి)

      తొలగించండి
  4. వార్తం జూడగ రండు మిత్రు లిచటన్ భారీ ప్రయత్నంబుతో
    కీర్తిం బొంద విహాయసంబున సదా క్షేమంకరం బౌచు మా
    యార్తిం దీర్చు నటంచు బంపి రకటా! యాకృత్రి మాకారమౌ
    మార్తాండుం డుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      కృత్రిమ సూర్యుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారూ! చిన్నవిన్నపము. కర్తారి అంటే సూర్యుడు అని అర్ధం కదా! నేను సూర్యుడు పోయే అంటే., అస్తమించాడన్న వార్త విని అన్న భావనతో వ్రాసాను. మీరు కర్తారిపోయె విడదీశారుక్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారూ! చిన్నవిన్నపము. కర్తారి అంటే సూర్యుడు అని అర్ధం కదా! నేను సూర్యుడు పోయే అంటే., అస్తమించాడన్న వార్త విని అన్న భావనతో వ్రాసాను. మీరు కర్తారిపోయె విడదీశారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      ముందుగా 'కర్తారి' అర్థం వెదకి చూశాను. ఆంధ్రభారతిలో 'కత్తెరవంగ చెట్టు' అన్న అర్థం ఒకటే ఉంది. సూర్యుడు అన్న అర్థం లేదు. అందువల్లనే అది కర్త ఆరిపోయె అనే అర్థంలో వ్రాశారనుకొని సవరణ సూచించాను.

      తొలగించండి
    2. రాజారావు గారు కర్తారుడు పదము సూర్యునకు వర్తించ వచ్చును

      తొలగించండి
    3. ఆంధ్రభారతి నిఘంటుశోధన పేజీలో కర్తారుడు అంటే సూర్యుడు అన్న అర్థాన్ని జి.యన్.రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువు నుండి పేర్కొనటం‌ కనిపిస్తోంది. కాని కవిప్రయోగాలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలియదు. లేకపోయేందుకే అవకాశం హెచ్చు.

      నిఘంటువు సహయంతో పద్యాలను వ్రాయటం అభ్యాసం చేయటం‌ అంత సముచితం‌ కాదని నా అభిప్రాయం. గణాలకు పదాలను వెదకటంలో‌ భాగంగా ఇలా చేస్తూ పోతూ ఉంటే‌ పద్యాలు కృతకంగా వస్తాయి తరచుగా. కొంచెం గమనికగా ఉండవలసినదని విన్నపం.

      తొలగించండి
    4. శ్యామలరావు గారు మీరన్నది నిజమే అది చూచే కర్తారుడు కు బదులు కర్తారి వాడారేమోనని నేను సూచించితిని.
      నేను భారతము చదువుతున్నప్పుడు కొన్ని పదముల కర్థము ఒక్క జి ఎన్ రెడ్డి గారి నిఘంటువు లోనే గమనించాను కూడ.
      నేను మాత్రము దాని మీదే యాధారపడను.

      తొలగించండి
  6. నిన్నటి నా పూరణను కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.

    కరమగు స్తిమితము కూడగ
    న్నరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
    స్తిరమగు చిత్తము సడలిన
    హరియించును శాంతి సుఖము లను ప్రియ సఖులన్!
    (సుఖములు + అను)

    రిప్లయితొలగించండి
  7. పూర్తికలన కాలంబున
    హర్తను కబళించ నోట నానందముగన్
    స్ఫూర్తిగ నేతెంచ నగువు
    మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్!!!

    రిప్లయితొలగించండి
  8. ధూర్తుడు రాహువు మ్రి౦గగ
    నార్తిని జెందితిని రావణాసురు డేసెన్
    కర్తా సైచగ లేనని
    మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్




    రిప్లయితొలగించండి
  9. కార్తీక్ తో వెడలితినే
    మూర్తిని, నక్షత్రశాల - మూసిన గదిలో
    పూర్తిగ పైనను జూడగ
    మార్తాండుఁడు గ్రుంకె నదిగొ 'మధ్యాహ్నమునన్'.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. స్ఫూర్తిన్నింప శతావధానములలోఁబూరీలు నిడ్లీలు స..
      త్కీర్తిన్ దత్తపదమ్ములయ్యెనకటా! క్లిష్టార్థసంక్లిష్టమౌ
      మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగో
      మధ్యాహ్నకాలంబునన్
      పూర్తింజేయ సమస్య యంచునిడిరీ పుణ్యాత్ములెవ్వారలో !!?


      మూర్తింగ్రమ్ముచు మేఘమాల విడువన్ పూర్వాపరాహ్ణమ్ములన్
      వార్తల్ వ్రాసెను పత్రికావళులిటుల్ స్పర్థాతిరేకమ్ముతో
      మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగోమధ్యాహ్నకాలంబునన్
      కీర్తింగోరి , పఠించి పాఠకులు సందేహాత్ములై కుందగన్ !!

      తొలగించండి
    2. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. హర్తృత్వమ్ము వహించి రాత్రియెడ నాహా వెల్గులన్ జిమ్మె నా
    మార్తాండుడుదయాద్రి, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలమ్మునన్
    స్ఫూర్తిన్ నింపియు జీవకొటికి నికన్ సోముండు రాజూడగన్
    కర్తవ్యమ్మును దీర్చి సృష్టి విధులన్ కాపాడు మార్తాండుడున్

    రిప్లయితొలగించండి
  12. హర్తయగుచు రాత్రికి , నిక
    మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
    స్ఫూర్తి నిడి జీవకోటికి
    కర్తవ్యము చంద్రునకిడి కాల వశమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      పెక్కు దినాలకు బ్లాగులో మీ పూరణలను చూస్తున్నాను. సంతోషం!
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. కీర్తిన్ గాంచె పరాక్రమోద్ధతిఁ నిజాంఘ్రిన్ వ్రాలగా జేసె నా
    ధూర్తారాతి విశేష సంఘముల, సంతోషంబునన్ వేట దా
    హార్తిన్ బాపఁగఁ బోయి సింగమున తాఁ హంతుండయెన్ వీర స
    న్మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హంతుం డయెన్'...? 'తా నంతం బయెన్' అనవచ్చు కదా!

      తొలగించండి
  14. మూర్తీ ! చూడుము గగనము
    మార్తాండుడు గ్రుంకె, నదిగొ మధ్యా హ్న మున
    న్నా ర్తిని విలవిల లాడగ
    మార్తాండుడు రెచ్చి పోయి మాడ్చె ను శిరముల్

    రిప్లయితొలగించండి
  15. ధూర్తుండై యటు సైధవుండు రణమున్ దుర్మార్గపుంజేష్టలన్
    వర్తించన్నభిమన్యుడీల్గె నరుడే భాసించె గ్రోధాత్ముడై
    కర్తవ్యంబుగ గృష్ణుచక్రమటులా ఖద్యోతమున్నింపగా
    మార్తాండుండుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.

    కర్తవ్యంబును దలచుచు
    భర్తకు విజయంబుగూర్ప భానుని పగిదిన్
    వర్తించె ద్యాగశీలత
    మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. పుర్తైన పిదప భొజ్యము
    వార్తగ వినుచున్ సమస్య వావ్ యని జూపన్
    మూర్తి చరవాణి తెరపై
    మార్తాండుఁడుఁ గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వావ్+అని' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిమ పూరణ:
      పుర్తైన పిదప భొజ్యము
      వార్తగ వినుచున్ సమస్య వావని జూపన్
      మూర్తి చరవాణి తెరపై
      మార్తాండుఁడుఁ గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

      తొలగించండి
  17. ఆర్తత్రాణ పరాయణుండు కమలాత్మాధీశు డత్యున్నతిన్
    ధూర్తేంద్రారులు రాహుకేతువుల వే త్రుంచంగ దుష్టాత్మసం
    హర్తృద్రోహ పరాయణుండు దిన రాహ్వాఖ్యుండు గన్పించి యా
    మార్తాండుం డుదయాద్రిఁ, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్


    కర్తవ్యంబును దా ని
    ర్వర్తింపఁ జరించుచుండ రాహుక్షుద్భా
    ధార్తిం గుంది వివశుడై
    మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాహుక్షుద్భాధార్తిం గుంది : రాహువు యొక్క క్షుద్బాధ చేత (మింగుట వలన) దుఃఖమును పొంది శోకించి

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. కర్తవ్యంబును తెలుపుడు
    మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్”
    వార్తనిడ దళము, వెలివడి
    ధూర్తుడు సైంధవుడు తాను దురమున చచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కర్తవ్యము పూర్తవగను
    మార్తాండుడు గ్రుంకె నదిగొ , మధ్యాహ్నమునన్
    కార్తీకదీప మనుచును
    మూర్తియె సిద్ధమ్ము జేసె ముట్టించెదమా!?

    కర్తవ్యోణ్ముఖుడై ధరీత్రిజననీ గర్భమ్మునన్ బుట్టెనా
    మార్తాండుండుదయాద్రి, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్
    బూర్తిన్ బండిన పంటభూములవి సంపూర్ణమ్ముగా నష్టమై
    ఆర్తిందెచ్చెను సేద్యగాండ్రకు ప్రవాహమ్మైన వర్షమ్ముయే

    ధూర్తుండౌ ఖలు సైంధవుండనిన తా దుర్నీతి పాటించుచున్
    వర్తింపన్నభిమన్యుడొడ్డ నరుడే భాసించె గ్రోధాత్ముడై
    కర్తవ్వోణ్ముఖుడైన మాధవుడు చక్రంబంత సంధింపగన్
    మార్తాండుండు దయాద్రి గ్రుంకెనదిగో మధ్యాహ్న కాలంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వర్షమ్ము+ఏ=వర్షమ్మే' అవుతుంది, యడాగమం రాదు. 'ప్రవాహమ్మైన దుర్వర్షమే' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురువు గారికి ధన్యవాదములు మీరు సూచించాక తిరుగుంటుందా గురువుగారు.

      తొలగించండి
    3. గురువు గారికి ధన్యవాదములు మీరు సూచించాక తిరుగుంటుందా గురువుగారు.

      తొలగించండి
  20. ఆర్తిగ పశ్చిమ దిక్కున

    మార్తాండుడు గ్రుంకెనదిగొ; మధ్యాహ్నమునన్

    పూర్తిగ వెలుగు నిడి జగతి

    స్ఫూర్తిగ తిరుగుచు నలసట పొందగ తానున్.
    ఆర్తిగ...............

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కర్తృత్వ౦బున సజ్జను౦ డొకడు సత్కార్య౦బు
    ……………… చేబూనగా ,

    స్ఫూర్తిన్ భగ్నము సేయ నె౦చు గద
    ……… దుష్టు౦ డెప్డు | శోభి౦చె - నా

    మార్తా౦డు౦ డుదయాద్రి | గ్రు౦కె నదిగో
    ………… మధ్యాహ్న కాల౦బునన్ ,

    ధూర్తు౦డౌ " తలగాము " మ్రి౦గ |
    ……… కనమే దుశ్చి౦తు దుశ్చర్యలన్ ? ?


    { త ల గా ము = రా హు వు }

    రిప్లయితొలగించండి
  22. ఆర్తిన్ జెంద పృథా సుతుండు, తలచెన్ హంసుండు దైత్యారి తా
    కర్తవ్యంబు కనంగ దుస్సల పతిన్, కావించ పెన్మాయ, “నా
    మార్తాండుండుదయాద్రిఁగ్రుంగె నదిగో మధ్యాహ్నకాలంబునన్”
    వార్తల్ చేరగ, సైంధవుండు ముదమున్ ప్రత్యక్ష మై రూపఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఆర్తి వలదు!పశ్చిమమున
    మార్తాండుడు గ్రుంకె నదిగొ! మధ్యాహ్నమునన్
    వార్తల గాంచగ పొందిన
    స్ఫూర్తిన్ మంజుల కవనము పూరింప నగున్!

    రిప్లయితొలగించండి
  24. చిన్న మార్పుతో మరొక పద్యం.

    ఆర్తి వలదు! తాపమిడెడు
    మార్తాండుడు గ్రుంకె నదిగొ! మధ్యాహ్నమునన్
    వార్తల గాంచగ పొందిన
    స్ఫూర్తిన్ మంజుల కవనము పూరింప నగున్!

    రిప్లయితొలగించండి
  25. మూర్తింగ్రమ్ముచు మేఘమాల విడువన్పూర్వాపరాహ్ణమ్ములన్
    వార్తల్ వ్రాసెను పత్రికావళులిటుల్ స్పర్థాతిరేకమ్ముతో
    మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగోమధ్యాహ్నకాలంబునన్
    కీర్తింగోరి ,పఠించి పాఠకులు సందేహాత్ములై కుందగన్ !!


    స్ఫూర్తిన్నింప శతావధానములలోఁబూరీలు నిడ్లీలు స..
    త్కీర్తిన్ దత్తపదమ్ములయ్యెనకటా ! క్లిష్టార్థసంక్లిష్టమౌ
    మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగోమధ్యాహ్నకాలంబునన్
    పూర్తింజేయ సమస్యయంచునిడిరీ పుణ్యాత్ములెవ్వారలో!!?

    రిప్లయితొలగించండి
  26. కర్తవ్యంబును కాలరాయకను సంకల్పించి విచ్చేయుగా
    మార్తాండుండుదయాద్రి|” గ్రుంకె నదిగోమధ్యాహ్న కాలంబునన్
    పూర్తి స్థాయిగ భూమిఛాయబడ?సంభూతమ్మటంచెంచుచున్?
    ఆర్తిన్ జెందుచు పక్షిజాతి వెడలెన్ |నర్ధాంత రంగమ్మునన్|
    ౨ కర్తగ తూర్పున బుట్టెను
    మార్తాండుడు” గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
    వర్తుల మౌ మేఘాలలొ”|
    వర్తిష్ణువు సూర్యు డిలకు పరమాత్ముండే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అర్ధాంతరంమ్ము'...? 'అర్ధాంతరమ్మౌ గతిన్' అందామా?
      'మేఘాలలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'వర్తులమౌ మబ్బులలో' అందామా?

      తొలగించండి
  27. ఆర్తిన్ సర్వప్రపంచ మీయెడనొకే యంతర్ప్రసార క్రియన్
    వార్తల్ లెక్కల వ్యాపకత్వము గ‌నన్ వచ్చెన్ హఠాత్వైరసుల్
    కీర్తిన్ యర్థమునందు చీకటులవే క్రీడించ వ్యాపారపుం
    మార్తాండుండుదయాద్రి క్రుంగె నదిగో మధ్యాహ్న కాలంబునన్

    రిప్లయితొలగించండి
  28. కీర్తిన్ గానక బద్మ వ్యూహము నిలన్ గైకొన్న వీరుండు వే
    లార్తిన్ జెంద విజృంభణాతిశయపుం లాస్యంబనిన్ జేసినన్
    ధూర్తుల్ యా యభిమన్యు మోసముననే దున్మంగ నీ పోలికన్
    మార్తాండుండుదయాద్రిగ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్

    రిప్లయితొలగించండి
  29. ఆర్తిన్ యా దినమున సుము
    హూర్తము తద్దినమహో యది గడిచెన్
    పూర్తిగ వడి ఘటికోన్ముఖ
    మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తద్దినమననహో యది గడిచెన్ ..గా చదువ ప్రార్థన
      ఆర్తిని యాదినమున సుము
      హూర్తము తద్దినమనమహో యది గడిచెన్
      పూర్తిగ వడి ఘటికోన్ముఖ
      మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

      తొలగించండి
  30. మళ్ళీ మరో తప్పు దొర్లింది
    హూర్తము తద్దినమననహో యది గడచెన్ గా చదవండి

    రిప్లయితొలగించండి
  31. కర్తవ్యంబును వీడకుండ నెపుడున్ గాపాడ తోతెంచుచున్
    మార్తాండుం డుదయాద్రిఁ, గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్
    వ్యర్థంబున్నొనరించకుండ వెలుగున్ పంచంతటన్ పృథ్విపై
    కర్తవ్యాలకు సాక్షి గ్రుంకె నదిగో కన్పించు నాయబ్ధిలో.

    రిప్లయితొలగించండి
  32. దూర్తుడు సైంధవుని దునుమ
    మార్తాండుడు గ్రుంకునట్లు మాధవుఁడె సగన్
    కర్తగు నర్జునుడు బలికె
    మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

    దూర్తుని సైంధవుని యనిన్
    గుర్తించగజేసి చక్రి "గ్రుంకెరవియనన్"
    వర్తించి బలికె కుటిలుడు
    మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్

    శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
    నిన్నటి నా పూరణ పైన మీ స్పందన తెలియజేయ లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. ఆర్తిం బాపగ దలచుచు
    మార్తాండుడు గ్రుంకె మధ్యాహ్న వేళన్
    పార్థుని కాచుట కై సిరి
    భర్తయు మాయనొనరింప ప్రతినయు దీరెన్.

    రిప్లయితొలగించండి
  34. కార్తీకపుఉషనవెలిగె
    మార్తాండుడు ,గ్రుంకెనదిగొ మధ్యాహ్నమునన్
    పూర్తిగ తారలు నింగిన
    స్ఫూర్తిని పొందెను సుధాత్రి సూర్యుని కాంతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కార్తీకపు టుషను వెలిగెను' అనండి.

      తొలగించండి
  35. ఆర్తిన్ బాసెను పద్మమెవ్వడిలలో నాత్మీయుడై వచ్చుచో?
    పూర్తై పోయె దినమ్ముఁ గొంత తడవై పోయెన్ సుమా!సూర్యుడో?
    గుర్తై సూర్యుడు నిల్చు నిప్పుకొలిమై ఘోషింతురే వేళలో?
    మార్తాండుం డుదయాద్రిఁ; గ్రుంకెనదిగో; మధ్యాహ్నకాలంబునన్"

    రిప్లయితొలగించండి
  36. ధూర్తుండౌచు ప్రభాకరుండు పగలో దుర్మార్గ చిత్తమ్మునన్
    కర్తృత్వమ్మును ధానుబాంబు కిడగా గగ్గోలు కాండమ్మునన్
    కీర్తిన్వొందుచు చెన్నపట్నమున
    రాకేందుండు రాజీవుడౌ
    మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్.

    రిప్లయితొలగించండి
  37. ఆర్తుండౌచును భూమిపైన చనుచున్ హ్లాదమ్ము కోల్పోవుచున్
    కార్తీకమ్మున యానమున్ సలుపుచున్ కంగారునున్ జెందుచున్
    వార్తన్ బొందగ రాహులయ్య మనువున్ బంగాలునన్ దీదితోన్
    మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్

    రిప్లయితొలగించండి