10, సెప్టెంబర్ 2016, శనివారం

సమస్య - 2139 (మల్లియ తీఁగకున్ గలిగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్"
లేదా...
"మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్"

నా పూరణలు.....

తొల్లి విదూషకుం డొకఁడు త్రుళ్ళుచు చెప్పె సభాంతరమ్మునన్
"తెల్లని కాకు లెన్నొ మన దేశములోఁ గనిపించు నంతటన్,
మొల్ల రచించె భారతము, బుద్ధుఁ డనన్ మన యాంధ్రుఁడే సుమా!
మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మే లనన్ జనుల్"

మల్లయ్య పెరటిలో నొక
మల్లియ చుట్టుకొనె నంటుమామిడిచెట్టున్
గొల్ల యొకఁడు చూచి యనెను
"మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్"

97 కామెంట్‌లు:

  1. చల్లని వెన్నెల పూవులు
    మల్లియ తీగియకు; గలిగె మామిడి కాయల్
    మల్లెల తోడుత నెండల
    నెల్లెడలన్ మధురమయి రుచించెడి ఫలముల్!





    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మెల్లగ మామిడి చెట్టును
    యల్లుకు పెరిగిన కుటజము నచటి కసురులన్
    మల్లడిగొన పిల్లలనిరి
    మల్లియ తీగియకు గలిగె మామిడికాయల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెట్టును+అల్లుకు=చెట్టు నల్లుకు' అవుతుంది, యడాగమం రాదు. 'మామిడి వృక్షము। నల్లుకు..' అందామా?

      తొలగించండి
  3. ఉల్లము రంజిలు రీతిగ
    మల్లియ తీగియకుఁ గలిగె మామిడి కాయల్
    కల్లలు మెండగు యుగమిది
    యెల్లెడలకు వింత వార్త యెరిగింప దగున్

    రిప్లయితొలగించండి


  4. జల్లను నాఘ్రా ణంబులు
    మల్లియ తీఁగియకుఁ గలిగె, మామిడికాయల్
    కొల్లలుగ విరగ కాచెను
    చల్లని ప్రకృతిని జిలేబి చక్కగ గాంచెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆఘ్రాణము' అక్కడ అతకడం లేనట్టుంది. 'జల్లను సుమ సౌగంధ్యము' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  5. పెళ్ళిభవనమును కృతకపు
    మల్లెలు మామిళ్ళతోడ మలచెడి వేళన్
    పిల్లడు తెలియక సేయగ
    మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్"

    రిప్లయితొలగించండి
  6. చెల్లును ఊహ స్వర్ణమున శీలముగా నొక గంధ ముండుటన్
    ఉల్లము పల్లవించగ మరొక్కటి జూపుడటంచు శిష్యులన్
    తల్లడమంద జేసె నట తార్కిక బాలుడు జెప్పె నో గురూ
    మల్లియ తీగెకున్ గలిగె మామిడి కాయలు మేలనన్ జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ తార్కిక పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెల్లును+ఊహ, ఉండుటన్+ఉల్లము' అని విసంధిగా వ్రాశారు. 'చెల్లుర యూహ... ఉండుట। న్నుల్లము...' అనండి.

      తొలగించండి
  7. కల్ల యొకింత గాదు విను కర్షకు డొక్కరు డద్భుతంబుగా
    వల్లులు కొన్ని పెంచె నొక వైపు పొలాన విదేశజంబులన్
    పల్లెకు దెచ్చియౌర! తన భాగ్యమటంచును వాటిలోపలన్
    మల్లియ! తీగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. చెల్లియ వల్లియ మొల్లియ
    చల్లని తల్లీ యటంచు సాగు బ్రియంబుల్
    కల్లలు గావవి యూహల
    మల్లియ తీగియకు గలిగె మామిడి కాయల్

    రిప్లయితొలగించండి
  9. నిన్నటి సమస్యకు పూరణ
    క్రోలగ నేరని పిల్లియె
    పాల కడవ తన్ని నేల పాలను జేయన్
    నీలిమ కేకలతో శా
    పాలను జూడంగ పిల్లి భయపడి ఫారెన్

    రిప్లయితొలగించండి
  10. మల్లికి మావికి బెండ్లవ
    నల్లుకొనెను.ప్రేమ ఫలముగా నిక కాసెన్
    సల్లాపమాడె జనములు
    మల్లియ తీగియకు గలిగె మామిడి కాయల్

    రిప్లయితొలగించండి
  11. మాస్టరు గారూ! చక్కని పూరణలతో మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు.

    అల్లన జవ్వని పైటను
    మెల్లగ తా సర్దుకొనుచు మీదకురాగా
    అల్లరిగా మగడిట్లనె
    'మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్.'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు!
      మనోరంజకమైన పూరణతో అలరింపజేశారు. అభినందనలు.

      తొలగించండి
    2. వంశీకృష్ణ గారూ,
      ధన్యవాదాలు! ఇటువంటి ప్రశంసలు కవిమిత్రులకు ప్రోత్సాహాన్నిస్తాయి.

      తొలగించండి
    3. మాస్టరుగారూ! వంశీకృష్ణ గారూ! ధన్యవాదములు

      తొలగించండి
  12. చెల్లీ !పూవులుబూచెను
    మల్లియ తీగియకుఁ, గలిగె మామిడికాయల్
    పెల్లిదముగ మన పెరటినె
    యల్లవిగో జూడుమచట నవనీరుహమున్!!!

    రిప్లయితొలగించండి
  13. మల్లెలువిరబూసెనుగద
    మల్లియతీగియకు,గలిగెమామిడికాయ
    ల్లల్లదెచూడుముకొమ్మల
    నుల్లములేసంతసిలచునోహోయనగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కేవలం నకారానికే తరువాతి అచ్చుతో కలిసి ద్విత్వంగా మారే అవకాశం ఉంది. ఇతర హల్లులకు లేదు. "మామిడికాయల్। పిల్లా చూడుము...' అనండి.

      తొలగించండి
  14. ఎల్లరి మనములు దోచగ
    పిల్లది ధరియించె మావి పిందెల బేరు
    న్నల్లరి పిల్లండిట్లనె
    మల్లియ తీగియకుఁ గలిగె మామిడి కాయల్!!!

    రిప్లయితొలగించండి
  15. అల్లదెజూడుమాభరణి!హర్షముగల్గెనుజూడపూవులన్
    మల్లియతీగకున్ గలిగెమామిడికాయలుమేలనన్ జనుల్
    కల్లలుగాదునాపలుకుకాయలుజూడుడుచెట్టుపైనమీ
    రెల్లరుకూడమీరిపుడునెంతగబాగుగనున్నవోకదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'మీ రెల్లరు కూడ మీ రిపుడు' అని మీరు ద్విరుక్తమయింది.

      తొలగించండి
  16. యిల్లాలి యలుకఁ దీర్చన్
    తెల్లటి తీరైన చీరఁ దెచ్చిన, దానన్
    మెల్లన సతియనె యంచుకు
    మల్లియ తీగియకు గలిగె మామిడి కాయల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించరాదు. 'ఇల్లాలు' అని ప్రారంభించవచ్చు కదా!

      తొలగించండి
    2. Sir !
      ఏదైనా ఒక క్రొత్త సమస్య లభిస్తే లేదా రూపొందిస్తే ఎక్కడ పోస్ట్ చేయవలెనో తెలుప గలరు.
      సమస్య ; "మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్"
      నా పూరణ:
      శా. చిత్తైకాగ్రత నిల్పి చూడ నవనిన్ చిత్రమ్ము లేలేవుగా
      క్రొత్తల్ గా కనిపించు వాస్తవములే కోల్పోవ ధీ శక్తియే
      ఉత్తుంగమ్మగు దంతి కూలు మశకోపాత్తమ్మదై వ్యాధిచే
      మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్
      మండ్రాడు = సంతాపించు ;ఉపాత్తము = అపహరింపబడు ; ఆవరింపబడు

      తొలగించండి
    3. కం. అల్లితి మామిడి చెట్టుకు
      మల్లియ తీగియను నేను మరి గతి లేకన్
      పిల్లలు గని యందరనిరి
      మల్లియ తీగియకు గలిగె మామిడి కాయల్

      తొలగించండి
    4. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీరు సూచించవలసిన సమస్యలను నా మెయిల్‍కు పంపండి. 'క్రొత్త సమస్యలు' అని ఒక ఫైలులో సేవ్ చేసికొని బ్లాగులో ప్రకటిస్తాను.
      కొంతకాలంగా ఒకే సమస్యను వృత్తంలోను, జాత్యుపజాతుల్లోను ఇస్తున్నాను కదా! మీ పై సమస్యను కందంలో "మత్తకరిని దోమ కూల్చె మండ్రాడంగన్" లేదా ఆటవెలదిలో "మత్తకరినిఁ గూల్చె మశక మొకటి" అని కూడ ఇవ్వవచ్చు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. ధన్య వాదాలు కంది శంకరయ్య గారు ! దానికే ఒక ఆటవెలది సమస్యని కూడా కూర్ర్చాను, ఇంకా పూరణ చేయ లేదు.అందుకని పోస్ట్ చేయలేదు.
      అది: "సామజమును గూల్చె దోమ యొకటి."

      తొలగించండి
  17. చల్లగఁ జూచె దేవుఁడిటఁ జక్కని పాప నొసంగె మాకు నా
    పిల్లను మల్లి పేరునను బిల్చెద మంచును, బల్కె దానితో
    తల్లిరొ తెస్తి నీకు మొల త్రాడు సువర్ణమ సుమ్ము సూడుమా
    మల్లియ! తీఁగకుం గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్

    [తీఁగ=మొలనూలు; మామిడిపిందెల మొలత్రాడు]


    అల్లన మామిడి చెట్టునఁ
    బెల్లున నొక మల్లె పాదు పెరుగగఁ గనుడా
    పల్లవము లందు కాయలు
    మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. గురుదేవుల పూరణలు బహు ప్రశంసనీయము.

    ఇల్లాలు సీత వనమున
    నుల్లమ్మున రాముఁ దలఁచు నుదరిణి నెలలై
    తల్లట పడి కవలలఁ గన
    మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడి కాయల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నా పూరణలు నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  19. అల్లన నొండు సాహితి సభాంతరమందున గైతలల్లుచు
    నుల్లము రంజిలన్నవరసోజ్జ్వల భావవిశేషతంగవుల్
    సల్లలితాంగివర్ణనను జక్కగజేసిరి దివ్యద్రష్టలై
    "మల్లియతీగకుంగలిగె మామిడికాయలు" మేలనన్జనుల్.

    ఉల్లము రంజిల్ల కవులు
    సల్లలితాంగిన్ సుమధుర సారసనేత్రన్
    చల్లగ వర్ణించిరిటుల
    "మల్లియ తీగియకు గలిగె మామిడికాయల్".

    రిప్లయితొలగించండి
  20. ఎల్లరు వేచియుండగనదే ఋతురాజు ధరిత్రి చేరెగా
    చల్లని సందెవేళ సఖు సన్నిధిఁ గోరగ పూలగుత్తులున్
    మల్లియ తీఁగకున్ గలిగె, మామిడికాయలు మేలనన్ జనుల్
    పుల్లనివావకాయకని ముప్పిరినిచ్చె రసాలవృక్షముల్ II

    రిప్లయితొలగించండి
  21. తొల్లి ఋతువుఁ పూగుత్తులు
    మల్లియ తీఁగియకుఁ గలిగె, మామిడికాయల్
    పుల్లనివి యూరగాయకు
    నెల్లజనుల్ సంతసిల్లనేపుగ కాచెన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      బహుదినాలకు మాపై కరుణించి దర్శనమిచ్చారు. సంతోషం.
      ఒకే భావంతో ఉన్న మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్య! నమస్కారములు. సమయాభావం వలన కనబడుట లేదు. నాపై మీరు చూపే అభిమానానికి ధన్యవాదములు.

      తొలగించండి
    3. ఆర్య! నమస్కారములు. సమయాభావం వలన కనబడుట లేదు. నాపై మీరు చూపే అభిమానానికి ధన్యవాదములు.

      తొలగించండి
  22. మల్లెలు పూచెను విరివిగ

    మల్లియ తీగియకు ; గలిగె మామిడికాయల్

    కొల్లలుగ పెరటి యందున

    పిల్లలు జూచి ముదమొంది వెడలిరి కోయన్.

    2 వ పూరణము :-

    అల్లుకొన పెరటి యందున

    మల్లియ తీవలు గుబురుగ మామిడి చెట్టున్

    ఉల్లమునన్ భ్రమ కలిగెను

    మల్లియ తీగియకు గలిగె మామిడికాయల్.

    రిప్లయితొలగించండి
  23. చెల్లును నేడు నన్నియును చెప్పనసాధ్యము శూన్యమిప్పుడున్!
    కల్లగు టన్నదేదియును కానము కాదు సమస్య యేదియున్!
    ఉల్లము పొంగ మర్రులవి యుండగ జూతుము కుండుల లోన నట్టులే
    మల్లియ! తీఁగకుం గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్!
    ...
    అల్లము బెల్లము మాదిరి
    బెల్లము వెల్లుల్లి వోలె వెగటై పోయెన్!
    కల్లలు సత్యము లయ్యెను
    మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడి కాయల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రోలగ వేగిర పడుచున్
      కాలగ నోరంత నపుడు గంతుల్ వేయన్!
      మూల శునకము తన కలా
      పాలను జూడంగ పిల్లి భయపడి పారెన్!!
      ....
      క్రోలన్ గన్నుల మూసి లోన మురిసెన్ కోరంగ నెన్నాళ్ళకో
      లీలన్ పొందితినంచు నోరునిడఁ గాలెన్ దానితో పిల్లి యా
      పాలన్ ముట్టక మొత్తుకున్న పరికింపన్ కుక్క గంతుల్ కలా
      పాలన్, జూచిన పిల్లి పారె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్!

      తొలగించండి
    2. మడిపల్లి రాజ్‍కుమార్ గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. తల్లియుఁ దండ్రియుఁ గోల్పొయి
    పల్లవ యేడేళ్ళ లేత వయసున పాపం
    చెల్లని భారము లెత్తెన్
    మల్లియ తీగియకుఁ గలిగె మామిడి కాయల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నితీశ్ చంద్ర గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది.
      'కోల్పోయి' అనవలసింది ల్పొ అని హ్రస్వంగా వ్రాశారు. అక్కడ 'తల్లినిఁ దండ్రినిఁ గోల్పడి' అనండి. 'పాపం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'వయసున నయ్యో' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు. 'వయసున నయ్యో' బాగా సరిపోయింది. 'కోల్పొయి' ని సరిదిద్దుతాను.

      తొలగించండి
  25. వెల్లి విరిసిన సుగంధము
    మల్లియ తీగియకు గలిగె! మామిడి కాయల్
    పుల్లటి ఘుమ ఘుమ రుచులన్
    పల్లెలు పట్టణములనక ప్రజ నూరించెన్!

    రిప్లయితొలగించండి
  26. తెల్లని మల్లెల గంధము
    మల్లియ తీగియకు గలిగె! మామిడి కాయల్
    పుల్లటి ఘుమ ఘుమ రుచులన్
    పల్లెలు పట్టణములనక ప్రజ నూరించెన్!

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { గు రు వు గా రు మ న్ని౦ చా లి !

    ని న్న టి నా ప ద్య ము లో వి వ ర ణ :-

    చ వు తి = చౌ తి : శబ్దార్థచ౦ద్రిక }

    ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

    " మల్లిక " తాల్చె తా రవిక మల్లియ తీగ

    ………………… జగేలు మ౦చనన్ |

    తెల్లని యో ణి వేసినది తేజిలు మామిడి

    ………... కాయ ల౦చు తో |

    నెల్లరు నామె దుస్తు గమని౦చుచు , నచ్చెరు

    …….... వ౦ది | రా హ హా !

    మల్లియ తీగకున్ గలిగె - మామిడి కాయలు

    ……… మేలనన్ జనుల్ ! ! !









    …………………

    రిప్లయితొలగించండి
  28. అల్లనమేదినీ వలయమంతయు వర్షసమాశ్రయంబు గాన్
    నల్లని సాంద్ర మేఘములు నవ్యరసాలఫలంబులై గనన్
    తెల్లని వెల్గులన్ మెరుపు తీగెలు మల్లెల మాలలే యనన్
    మల్లియతీగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్

    రిప్లయితొలగించండి
  29. ఉల్లముసంతసిల్లగను యూహల శిల్పము నిల్పె కల్పనల్
    కల్లయుగాక సత్యమిది కాంచును కంటికి చూపు మార్పునన్
    మల్లియ తీగకున్ గలిగె మామిడి కాయలు మేలనన్ జనుల్
    చెల్లెడి రీతి కుడ్యమున చెక్కెను శిల్పియెజక్కణార్యుడై.
    2.కళ్ళాపి జల్లి ముంగిట
    ఇల్లాలిడు ముగ్గులందు నేర్పున్ గనగా?
    ఎల్లరు మెచ్చెడి రీతిగ
    మల్లియ తీగియకుగలిగె మామిడికాయల్|


    రిప్లయితొలగించండి
  30. తెల్లని హంసలెల్ల నలు దిక్కులనుండిల జేరినట్లుగా
    పల్లియలోని తోటన సువాసన లీనెడు స్వచ్ఛమల్లియల్
    మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్
    యెల్లలలోన నాటిరి మహీశులు మామిడి మొక్కలన్ భువిన్

    తెల్లని మల్లియ లెన్నియొ
    మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్
    వెల్లువలై ఫలియింపన్
    ఉల్లము లను దోచె దోట నూహింపుమురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      జనుల్+ఉల్లము అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  31. ఉల్లము సంతసిల్లగ గడుత్తమ జాతికి చెందు చెట్టులన్
    మెల్లగ నాటి పెంచితిని మిక్కిలి సౌరభ మిచ్చుపూవులున్
    మల్లియ తీఁగకున్ గలిగె, మామిడికాయలు మేలనన్ జనుల్

    చల్లిరి శంస పుష్పములు సౌష్టవ కాయలు గాంచి చెట్టుకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కడు+ఉత్తమ=కడు నుత్తమ... అవుతుంది. 'ఉల్లము పొంగి సంతసిల నుత్తమ...' అందామా?

      తొలగించండి
  32. పల్లియ లోనను మావికి
    యల్లుకొనెను మల్లెతీగ లత్యధికముగా
    పిల్లడు కాయలఁగని యనె
    మల్లియ తీగియకుఁగలిగె మామిడి కాయల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మావికి। నల్లుకొనెను...' అనండి.

      తొలగించండి
  33. కల్లలు గావుగా కలియుగంబున ! నెద్దియు గాదనంగ , నో
    తల్లి యవంగ వచ్చు గద తానుగ గర్భము దాల్చబోక; తా
    నల్లిన మామిడిన్ గలియ నచ్చెరు వొందగ నీ శతాబ్దిలో
    మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్

    రిప్లయితొలగించండి
  34. అస్త్రవిద్యా ప్రదర్శన నాఁడు..............

    సల్లలితాంగి బొందెనిదె చారు పరాక్రమ ధైర్యశాలి, రా
    జిల్లుచుఁ యుద్ధవిద్యలఁ సుశిక్షితుఁడాయెను రామ సేవలో
    నల్లదె గాంచు, కర్ణుని యటంచు బ్రజల్ వచియించు రీతియే
    మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్

    రామ = పరశురాముఁడు

    రిప్లయితొలగించండి
  35. అల్లన పూదోటలనా
    మల్లియె పెనవేసియల్ల మాయురె మరి మా
    మిళ్ళకు దోచెను మదికిన్
    మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'రామ సేవలో'...?

      తొలగించండి

  36. తెల్లని పూవులు పూచెను
    మల్లియతీగియకు;గలిగె మామిడికాయల్
    పుల్లని రుచితోతరువున
    నుల్లము రంజిల్లసాగె నొకచో కనగా.

    రిప్లయితొలగించండి
  37. పెళ్ళము ప్రీతినిన్ పెనుచ పెల్లుగ పూవులు తెల్లతెల్లవౌ
    మల్లియ తీఁగకున్ గలిగె;...మామిడికాయలు మేలనన్ జనుల్
    కొల్లలు కొల్లలై కొనుచు కోరిక తీరగ నావకాయగా
    తెల్లని బువ్వతో తినగ త్రేనుపు లొచ్చెను వాడవాడనున్

    రిప్లయితొలగించండి