12, సెప్టెంబర్ 2016, సోమవారం

సమస్య - 2141 (జనకునిఁ దిట్టె నాత్మజుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

జనకునిఁ దిట్టె నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్"
లేదా...
"జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై"

51 కామెంట్‌లు:

  1. తల్లిని చంపివేయమన్న జమదగ్నితో అతని పుత్రుడు (పరశురామౌని అన్న) అంటున్న మాటలు
    "వినవయ్య న్యాయమాయిది?
    కనిపెంచినతల్లినిటుల కాఠిన్యముతో
    డ నరకమనుట?" యనుచునా
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై ॥

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనయము జూదము నాడుచు
    జననిని నడపక కలంచు సంగతి వినగన్
    కనలుచు రయమున కాలిడి
    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై.

    రిప్లయితొలగించండి
  3. అనువుగ సేవలు జేయుచు
    తనక్షేమము జూచు కొనక తనరెడు తల్లిన్
    కనికరము జూప నోచని
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై.

    రిప్లయితొలగించండి
  4. ఘనతర మాంగ్లభాషయగు గావున నేర్వు మటంచు బంప నా
    దినమున కక్ష్యలో సఖులు దెల్పిన “ఫూల”ను మాట బల్కుచున్
    జనకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోదబాష్పముల్
    తనయుని మెచ్చె తండ్రి విని తాను నిరక్షరకుక్షి కావునన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  5. మనమున మోదమో యువతి మన్నన గొన్న బ్రియంపు గెల్పు తా
    మనయము గూర్చు పెళ్ళిలును యయ్యల పూర్ణ తిరస్కరోద్ధతుల్
    గనుగొని యింటనుండకని గట్టిగ శాసన మివ్వబల్కు నా
    జనకుని దిట్టె నాత్మజుడు చయ్యన గార్చుచు మోద బాష్పముల్

    రిప్లయితొలగించండి
  6. ఆ అజ్ఞాత p.Satyanarayana..విధి లేక ఇలా తెల్పుకోవలసి వచ్చింది.నా పేరుళ తొలగించ లేదు కదా

    రిప్లయితొలగించండి
  7. తనతండ్రిని నపహర్తలు
    కొనిపోవగ వారిజేరి కోరిన యట్టుల్
    ధనమిడి తిట్టుమటన్నను
    జనకుని దూషించె సుతుడు సజలనయనుడై.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  8. తనకొక్క గొప్ప కొల్వుకు
    గనె నొక యుత్తర్వు కొడుకు గాంభీర్యమునన్
    తిని త్రాగి ఖర్చులొసగని
    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై

    రిప్లయితొలగించండి
  9. మనమున ప్రేమ జూపకను మానిని చేతను సేవలందుచున్
    ఘనముగ జూద మాడుచును కానని మైకము నందురేపవల్
    మునుగుచు నాలుబిడ్డలకు మోమును జూపక దాట వేయునా
    జనకునిఁ దిట్టె నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోద భాష్పముల్

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    రాజమండ్రి ప్రయాణంలో ఉన్నాను. నిన్నటి వలెనే పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
    రాజమండ్రిలో బ్లాగు మిత్రులు ఎవరైనా కలిసే అవకాశం ఉందా?

    రిప్లయితొలగించండి
  11. తన వ్యసనము విడలేదని
    జనకునిదూషించెసుతుడు;సజలనయనుడై!
    తన తల్లి కడను చింతిలె
    వినయమ్మున బాధ‌ దెలిపి విహ్వలమందెన్!

    రిప్లయితొలగించండి
  12. తన నాథుఁడు నొరుగఁ జెలఁగి
    గొనసాగుచు సత్య రణిని గూల్చఁగ నరకున్
    తన జనని చేతఁ బడుచున్
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుడై!

    రిప్లయితొలగించండి

  13. కనెను భరతుడు మృతుండై
    జనకుని; దూషించె సుతుడు ‌జలనయనుండై
    తనతల్లి కైకను; వెడలె
    తనయన్ననుగాన; వెంట తరలె పురజనుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. జనకుని గాంచిన ముదమును,
    తనజననిఁ విటపి కినంప, తాపము లొదవన్
    మనసు వికలమైన తరిన్
    జనకుని దూషించె సుతుడు(లవుడు/కుశుడు)సజలనయనుడై

    రిప్లయితొలగించండి
  15. జనకుని గాంచిన ముదమును,
    తనజననిఁ విటపి కినంప, తాపము లొదవన్
    మనసు వికలమైన తరిన్
    జనకుని దూషించె సుతుడు(లవుడు/కుశుడు)సజలనయనుడై

    రిప్లయితొలగించండి
  16. అనవరతంబు నాటల మహాద్భుత నైపుణ మున్న యట్టి నీ
    తనయుని కోర్కి తీర్చుమని దానట నుండగ మేనమామయే
    జనకునిఁ దిట్టె, నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్
    మనమున సంతసించుచును మన్నన సేసెను తండ్రి నింపుగన్


    వనచర సైన్యము తోడుగ
    వననిధి చెంతకుఁ జని రఘు వంశజు డంతం
    దను వేడగఁ బలుకని శశి
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై

    [సుతుడు = రాజు]

    రిప్లయితొలగించండి
  17. మనుజుల లోన రాక్షసుడు మంచితనమ్ముయు మానవత్వమున్
    వినయము లేని వాడొకడు
    విజ్ఞత వీడుచు కొట్టబోవగా
    జనకుని , దిట్టె నాత్మజుడు, చయ్యన కార్చుచు మోదబాష్పముల్
    తనయుని కౌగిలించుకునె తండ్రి విచారము వీడి ప్రేమతో

    రిప్లయితొలగించండి
  18. కనికరము లేక తాతను
    ననాథగా విడిచి పెట్టి నన్నము వె
    ట్టని నిర్దయ దౌర్భాగ్యపు
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై

    రిప్లయితొలగించండి
  19. ధనపంపకమున జ్ఞాతియె
    జనకుని దూషించె, సుతుడు సజల నయనుడై
    వినయము వీడక పలికెను
    కనికరమును మానుటేల కయ్యమ్మేలన్

    రిప్లయితొలగించండి
  20. అనయము ద్రాగుట వలనన
    జనకుని దూషించె సుతుడు ,సజలన యనుడై
    తన దండ్రికి వినిపించెను
    దన బాధను బూర్తి గాను దపనత తోడన్

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మణుడు దశరథుని దూషించాడని తెలుపుతూ

    వనవాసమె తప్పదనుచు
    జననికి వివరమ్ము దెలుపు జానకి రామున్
    గనుచును బాధపడుచు తమ
    జనకుని దూషించె సుతుడు సజలనయనుడై

    రిప్లయితొలగించండి
  22. కనికరము చూపకుండగ
    ననుచితములు పలుకునట్టి యబలను సతిగా
    తన కంటగట్టి యుండిన
    జసకుని దూషించె సుతుడు సజలనయనుడై
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " అనుదిన మిటు ద్రాగి , యి౦టి
    …………… కరుదె౦చి , అమ్మను తిట్టి

    యనుచిత౦బుగ , కొట్ట నేల

    …………… నయ్య నీ " వని నిష్ఠురముగ

    జనకుని దూషి౦చె సుతుడు ||

    ………………… సజలనయను డైన త౦డ్రి

    మునిగి - పశ్చాత్తాప స౦ద్ర

    ……….. మున " మారెద " నని హామి నిడె



    ి

    రిప్లయితొలగించండి
  24. కం.కనగా లేని వికర్ణుడు
    తన వారలు మదము తోడ ద్రౌపది నట్లున్
    వెనుకాడక వేధించుట
    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై.

    రిప్లయితొలగించండి
  25. అనయము మద్యము త్రాగుచు
    ధనమును వ్యర్థమును చేసి ధరలో తిరుగన్
    జననియు నేడ్వగ గనియా
    జనకుని దూషించె సుతుడు సజలనయనుడై.

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు. రాజమండ్రిలో అవధానం జరిగే మహిళా సంస్కృత కళాశాల చేరుకున్నాను. అవధానం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారూ మీ సాహాిత్యాభిలాష సాహితీ సేవలు మహాద్భుతం

      తొలగించండి
    2. అవధాన కార్యక్రమము దిగ్విజయంగా జరగాలని అభినందనలతో దీవించి అక్క

      తొలగించండి
    3. గురువుగారికి వందనములు....
      అవధానము దిగ్విజయముగా జరగాలని అభిలషిస్తున్నాను
      అవధాన విశేషాలను తెలియపరచాల్సిందిగా ప్రార్థన.

      తొలగించండి
  27. దినమును రాత్రి శ్రమించుచు
    తనయుని కనురతిని బంచు దనుజుడె యనుచున్
    మనమున కూరిమి తోడుత
    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై!

    తనయుడు వలచిన యువతిని
    మనమున నొల్లక మఱియొక మానిని తోడన్
    మనువు తలబెట్ట జననిని,
    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై!
    (రెండవ పద్యంలోని మూడవ పాదంలో 'జననిని ' సరిపోయిందా కాదంటే 'వగచుచు ' అంటాను. దయచేసి సందేహ నివృత్తి చేయ గోరుతాను. ధన్యవాదములు.)


    రిప్లయితొలగించండి
  28. వినక బుధుల మాటలు చను
    జనకుని దూషించె సుతుడు, సుజల నయనుడై
    ఘనుడగు తన పెదనాన్నను
    మనసార స్తుతించె నతడు మాన్యుండంచున్

    రిప్లయితొలగించండి
  29. జనకుడు మద్యపు మక్కువ

    జననిని హింసించ నామె జడియుచు నేడ్వన్

    జననిని యోదార్చుచు తన

    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై.

    రిప్లయితొలగించండి
  30. అనయము తల్లి దూఱుచును హద్దులు మీరి వసించ, క్రుద్ధుడై
    జనకునిఁ దిట్టె నాత్మజుడు, చయ్యనగార్చుచు మోద భాష్పముల్
    తనకు సహాయ మిచ్చిన ప్రదాత స్తుతించె, కరమ్ము తుష్టితో
    ఘనుడగువాని యాదరణ కమ్మని జీతముసంతరించగన్
    జీతముః జీవితము

    రిప్లయితొలగించండి
  31. హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని ఎదుట విష్ణుమూర్తిని పరిహసించడము ..........

    కనఁబడనట్టి వానినిఁ జగంబునఁ గొల్వఁగ నేమి సత్ఫలం
    బనిమిష నాథుఁడెట్టి పరమాత్ముఁడు భీరుఁడటంచునా జగ
    ద్జనకునిఁ దిట్టె, నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్
    గొనకొని నామకీర్తనల గొల్చిన గన్పడునంచు దెల్పెనే.

    రిప్లయితొలగించండి
  32. వినయ విహీనుడై యిల వివేకము లేక ను దూరు చుండెడు
    న్జ నకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోద బా ష్పము
    ల్ననయము దేవదేవుడు ,మహాత్ముడు శంకరుగొల్చు నెప్పుడు
    న్ననుదిన మారవీంద్రుడు మమైక పు దృష్టి ని రాజితంబుగన్

    రిప్లయితొలగించండి
  33. రామచంద్రుని వనవాస వార్త విన్న భరతుఁడు ఆవేశముతో పల్కినట్లుగా........ ( వాల్మీకి రామాయణములో ఉందో లేదో తెలియదు )........

    తనయన్న రామచంద్రుని
    వనములపాల్జేయ ధర్మవర్తనమగునే
    కనికరము సుంతలేదని
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారు భరతునికి రామచంద్రుని వనవాసము గురించి తెలిసినప్పుడు దశరథు డిహ లోకములో లేడు కద.

      తొలగించండి
    2. శ్రీకామేశ్వరరావుగారికి వందనములు. ఎక్కడో విన్నట్లుగా ఉంటే ఆవిధంగా వ్రాసినాను. మీ సూచనమేరకు నా పద్యపూరణను ఉపసంహరిస్తున్నాను

      తొలగించండి
    3. శ్రీకామేశ్వరరావుగారికి వందనములు. ఎక్కడో విన్నట్లుగా ఉంటే ఆవిధంగా వ్రాసినాను. మీ సూచనమేరకు నా పద్యపూరణను ఉపసంహరిస్తున్నాను

      తొలగించండి
    4. సంపత్ కుమార్ శాస్త్రి గారు నమస్సులు. పరవాలేదు. మరియొక పూరణ చేయండి. మీ పూరణలు మనోహరముగా ఉంటాయి.

      తొలగించండి
  34. కనుగొన లేకఁ దండ్రియని గాథయు నాతని దంచు పిన్నలై,
    యనలము నందు సీత జను యంశము జెప్పుచు గాన గంగలో
    మునిగి, కనిష్ఠుడా లవుడు,ముఖ్యుడు కావ్యకథా గ్రగణ్యుడౌ
    జనకునిఁ దిట్టె నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్

    రిప్లయితొలగించండి
  35. తనయావదాస్తి సానికె
    యొనగూర్చిన విటుని ఋజకు నున్మత్తతకున్
    జనని మనోవేదన గని
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై

    రిప్లయితొలగించండి
  36. అనవరతము మద్యంబే
    మనుగడగా నెంచినట్టి మౌన వ్రతునిన్
    క్షణమాలోచించుమనియు
    జనకుని దూషించె సుతుడు సజల నయనుడై|
    2.ధనమె ప్రధాన మైనదని దానవతత్వము నమ్మియున్నచో
    మనుగడ మానవత్వమును మంటను జేర్చుటె|”మంచిబెంచు టౌ
    దినసరి జీవితాశయమె|దివ్యమటంచును దెల్ప బూనియే
    జనకుని దిట్టె “నాత్మజుడు చయ్యన గార్చుచు మోద భాష్పముల్.



    రిప్లయితొలగించండి
  37. సవరణ:- మొదటి పాదంలో....
    జనకుడు మద్యపు మత్తున...అని
    చదువ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  38. తనమేనమామ యెత్తుక
    వినునట్టుగ తండ్రినేమొ వేడ్కను వెధవా
    యనమన ముద్దుగ నట్టులె
    జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై.

    రిప్లయితొలగించండి
  39. వనరెను భరతుడు దలచుచు
    జనకుని, దూషించె సుతుడు సజలనయనుడై
    జననిని, యన్నగు రాముని
    వనముల పాల్జేసినట్టి పాతకి యనుచున్!!!

    రిప్లయితొలగించండి
  40. తినగను తిండి లేదిటను త్రిప్పలు బెట్టుచు క్షుత్తు మండెనే
    కనగను జాబు లేదిటను గంటలు గంటలు రోయ పేపరున్
    పనియును పాట లేకనె గభాలున నెందుకు నన్ను కంటివన్
    జనకునిఁ దిట్టె నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్

    "Amitabh Bachan to his father"

    https://m.youtube.com/watch?v=NJU4nPI2u50

    రిప్లయితొలగించండి