13, అక్టోబర్ 2016, గురువారం

సమస్య - 2170 (రంధ్రాన్వేషణఁ జేయకున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్"
('తెలుగు కవిత్వము - సమస్యాపూరణము' సమూహం నుండి)
లేదా...
"రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే"
(నిజానికి ఇందులో ఉన్న సమస్య ప్రాసయే)

68 కామెంట్‌లు:

  1. ఆంధ్రుల కావ్యము లెంచగ
    సంధ్రమ్మును దొలిచి నట్లు సాగర ఘోషన్
    మంధ్రమ్మగు చందస్సుల
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రంధ్రముల కొరకు వెదకుట
      ఆంధ్రుల కిలను సహజ గుణ మైనప్పటికిన్
      జంద్రా !కనగన్ దుదకా
      రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని.. సముద్రాలు తొలచడం..?
      *****
      గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. నమస్కారములు
      మహాసముద్రము వంటి ఛందస్సును దొలిచి అనేక రకముల పద్యములను వ్రాసెదరని నాభావము

      తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములతో

    మూడురోజులుగా విపరీతమైన జ్వరముండడంవలన ఏరోజు కారోజు పూరణలు చేయలేక పోయాను క్షమిస్తూ నాపూరణలని పరిశీలింప ప్రార్థన

    జాలేమాత్రము లేనివాడొకడు సంసారమ్ము వద్దంచునే
    తాలిన్ గట్టిన భార్యనే విడిచియే తాజేరె వేశ్యాదరిన్
    శ్రీలన్ దోచెనటాస్తులే కరగగన్ చింతించి యోచించియే
    పాలిమ్మంచును భర్తపాలికి సుతున్ బంపెన్ సతీ రత్నమే

    ఆలిని వీడుచు తా వెల
    యాలిని జేరిన పెనిమిటి యాగడములకే
    తాలిమి వహింప జాలక
    పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్

    దసరా రోజు సమస్యలు

    పరుల దేశమునకు వలస వెళ్ళినవారు
    సెలవు పెట్టి నాదు చెల్లెలైన
    విదియ నేడు వచ్చె, విజయదశమి యను
    పర్వదినము కొరకు పతిని గూడి

    వదలి వెడలె నంట భాద్రపదమనెఱగి వచ్చెదా
    కదలి యాశ్వయుజము, తల్లి కనకదుర్గ విశ్వ మం
    దు దరి సెనము నిచ్చు దక్ష దుహిత రూపమందునన్
    విదియ నేడు వచ్చె గనుడు విజయ దశమి పర్వమే

    నవవిధ యవతారములతో నవని యందు
    కనక దుర్గయె నిలిచేను కరుణ జూప
    ధరణి యందున కనిపించు దక్షగౌరి
    విదియ నేడు వచ్చె గనుడు విజయ దశమి
    పర్వమే ఘన సంస్కృతి వసుధ యందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది కదా! సంతోషం!
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జాలేమాత్రము...' పూరణలో 'జాలి+ఏమాత్రము' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'వేశ్యాదరిన్' దుష్టసమాసం. 'దోచెనట+ఆస్తులే' అన్నపుడు యడాగమం వస్తుంది.
      'నవవిధ...' పూరణలో 'నిలిచేను' అనడం గ్రామ్యం. 'నిలిచెను' సాధురూపం.

      తొలగించండి
    2. జాలిన్ వీడుచు మూఢుడొక్కడిల సంసారమ్ము వద్దంచునే
      తాలిన్ గట్టిన భార్యనే విడిచియే తాజేరె వేశ్యాగృహమ్
      శ్రీలన్ దోచగ నాస్తులే కరగగన్ చింతించి యోచించియే
      పాలిమ్మంచును భర్తపాలికి సుతున్ బంపెన్ సతీ రత్నమే


      నవవిధ యవతారములతో నవని యందు
      కనక దుర్గయె నిలిచెను కరుణ జూప
      ధరణి యందున కనిపించు దక్షగౌరి
      విదియ నేడు వచ్చె గనుడు విజయ దశమి
      పర్వమే ఘన సంస్కృతి వసుధ యందు

      తొలగించండి


  3. చంద్రముఖీ గనుమోయీ
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే!
    నాంధ్ర కవిత్వపటుత్వపు
    కేంద్రమదియెనయ్యె కళల కేదారంబై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాణించుటకే। యాంధ్ర...' అనండి.

      తొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భింధ్రా! యోమిత్రా! నీ
    వాంధ్రము లోనన్ పలుకు కవనముల ఛందో
    రంధ్రము లెంచెడిదౌ నా
    రంధ్రా న్వేషణము కవిత రాణించుటకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. బాలుని గడు పసిపాపని
    నీలిమ వర్ణుని బొడగని నెనరు విడిచియున్
    లోలాక్షి యశోదా చను
    బాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్

    గురువు గారు
    ఇమ్ము ( యుక్తము/సుఖము) + అని = ఇమ్మని అవుతుందా, ఇమ్ము యని శుద్ధమా?

    సాంద్రమగు ప్రౌఢి యుండక
    చంద్రుని గూర్చియు వటువులు ఛందము లల్లన్
    మంద్రముగా నొజ్జ పలికె
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాజేటి సుమలత గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఇమ్ము+అని=ఇమ్మని' అనడమే సాధువు.

      తొలగించండి
  6. ఆంధ్రకవి సాగరమున శి
    లీంధ్ర సముడ గాన నామ లింగవ చనముల్
    ఆంధ్రమున దెలియ పదనీ
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే"
    నీరంధ్రము: ఆకాశము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచనముల్ ఆంధ్రమున' అని విసంధిగా వ్రాయరాదు కదా!

      తొలగించండి
    2. ఆంధ్రకవి సాగరమున శి
      లీంధ్ర సముడ గాన నామ లింగవి ధముల
      న్నాంధ్రమున దెలియ పదనీ
      రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే"
      నీరంధ్రము: ఆకాశము.
      శిలీంధ్రము : నాచు
      గురువుగారు, శక్తి మేర ప్రయత్నించాను.మీసమీక్షకై సమర్పించినాను

      తొలగించండి
    3. ఆంధ్రకవి సాగరమున శి
      లీంధ్ర సముడ గాన నామ లింగవి ధముల
      న్నాంధ్రమున దెలియ పదనీ
      రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే"
      నీరంధ్రము: ఆకాశము.
      శిలీంధ్రము : నాచు
      గురువుగారు, శక్తి మేర ప్రయత్నించాను.మీసమీక్షకై సమర్పించినాను

      తొలగించండి


  7. ఆంధ్రీ ! తెలుంగు వారల
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే!
    "చంద్రుని" లో ప్రా సగొను! పు
    రంధ్రీ సరిచేయి పదము రమ్యంబుగనన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఆంధ్రీయుండు కవీంద్రుడున్నిరతపద్యాభ్యాస సంరక్తుడున్
    ముంధ్రా ప్రాసనుజూడగా వెరచునే మోదంబుగా దేవత
    న్నాంధ్రంగొల్చి రచించు, పద్యములఁ సద్యఃస్ఫూర్తిఁ ముమ్మారులున్
    రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్ ||

    ఆంధ్రీయులు దోషఙ్ఞులు
    నాంధ్రీయులె స్వాగతింతురవనిన్ స్పర్ధ
    ల్లాంధ్రా విబుధుల కార్యము
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ద్రుతమునకు తర్వాత అచ్చు వచ్చినపుడు మాత్రమే ద్విత్వానికి అవకాశం ఉంది కదా ? ఆ అవకాశం లకారానికి లేదు. 'స్పర్థన్+ఆంధ్రా.. = స్పర్థ న్నాంధ్రా..' అంటే సరిపోతుంది కదా!

      తొలగించండి

    2. ఆర్య! అనేక నమస్కారములు. ఈ విషయమున సందేహం వచ్చినది. మీరు తెలియజేసిన తదుపరి తీసినది. సవరించిన పద్యమును పంపుచున్నాను. ధన్యవాదములు.

      ఆంధ్రీయులు దోషఙ్ఞులు
      నాంధ్రీయులె స్వాగతింతురవనిన్ స్పర్ధ
      న్నాంధ్రా విబుధుల కార్యము
      రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే ||

      తొలగించండి
  9. ఆంధ్రుడ! వినరా సత్యం
    బాంధ్రంబున సంస్కృతాన నలుపెరుగక యీ
    యాంధ్రులు నిరతము చేసెడి
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఆంధ్రుడ శతకమ్మిట సై
    రంధ్రీ! యని వ్రాసినావురా పద్యములన్
    ఆంధ్ర నిఘంటువు వెదికెద
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. గోలి వారు ! అద్భుతః !

      ఆంధ్రుడ ! హనుమచ్చాస్త్రి! క
      వీంద్రా ! సెహభేషు మీ కవిత్వప్రతిభల్ !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఆంధ్రంబున వ్యాకరణ పు
    రంధ్రీ వైభవము గనగ లాస్యంబౌ నా
    యాంధ్రీ రచనల సముచిత
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శర్మ గారు "వ్యాకరణ పురంధ్రీ వైభవము గనగ లాస్యంబౌను" మహోదాత్తమైన యుపమానము. చాలా సంతోషము కల్గినది చదువుతుంటే. అభినందనలు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు‌గారూ నమస్సులు....‌‌మీ
      ఆశీస్సులు కావాలి....

      తొలగించండి
  12. ఆంధ్రము నందున గవితలు
    సాంధ్ర ముగా వ్రాయగోర సరసపు మార్పు
    న్నాo ధ్రా బాలక !తప్పదు
    రంధ్రా న్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
  13. "రంధ్రమ్మ"ంచు సమస్యఁజూడుమటనారంభించితో పద్యమున్
    "సాంధ్రమ్మ"నుచు దొషమేయగును ప్రాసస్థానమున్; ఒప్పుగా
    యాంధ్రమ్మందునఁజేయఁబద్యరచనల్ అవ్వాటిలో ముందుగా
    రంధ్రాన్వేషణఁజేయకున్న కవితల్ రాణించునేయిద్దరన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గూడ రఘురామ్ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది.
      'సాంధ్రమ్మనుచు' అన్నచోట గణదోషం. 'సాంద్రమ్మంచును' అనండి. 'స్థానమున్ ఒప్పుగా, రచనల్ అవ్వాటిలో' అని సంధి పాటించకుండా వ్రాశారు. 'ఒప్పుగా నాంధ్రమ్మందున' అనవలసి ఉంటుంది.

      తొలగించండి
  14. స్వతంత్ర రచన కాదని ఆంధ్రమహా భారతమునకు, ఆకాశములో నల్లటి మబ్బులలో నీరని, పట్టపురాణియైన ద్రౌపది దాసీపని చేసిందన్న విమర్శలు మహత్తును పెంచినవే కానీ భంగము కలిగించ లేవని భావము:

    ఆంధ్రంబందున వ్రాయ భారత కథాప్రాశస్త్య మల్పంబె నీ
    రంధ్రం బందున నున్న నీరము పవిత్రంబే కదా ధాత్రి సై
    రంధ్రీత్వంబున కృష్ణకుం బరమ సంత్రాసమ్ము వాటిల్లదే
    రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్


    ఆంధ్ర పదమ్మును నెమ్మెయి
    నంధ్ర మనిన బ్రహ్మరంధ్ర మౌదల యన నీ
    రంధ్రము నాకస మనినన్
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు సమర్థంగా, సర్వోత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  15. ఆంధ్రమ్మున సాహిత్య పు
    రంధ్రీ మణి భూషలన్ని రమణీయము,నీ
    రంధ్రము,తెలియ నవసరము
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

    రిప్లయితొలగించండి
  16. ఆంధ్రపు చిఱుకవులను కవి
    చంద్రులుగా తీర్చిదిద్ది శైలిఁ బెనుచ మౌ
    నీంద్రుల సమ బుధులు సలుపు
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. రంధ్రాన్వేషణ చేయుదు

    రాంధ్రేతర కవిత లైన నభ్యాసమున

    న్నాంధ్రులు సుమతిన్ సలిపెడు

    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే.

    రిప్లయితొలగించండి
  18. సంద్రపు లోతుల గనిన క
    వీంద్రుని కైనను ధరణిని వెలుగొందగ రా
    జేంద్రుని కని వంటిదె యీ
    రంద్రాన్వేషణము! కవిత రాణించుటకే!
    (రాజు రాణించడానికి యుద్ధమెలా తోడ్పడుతుందో అలాగే రంధ్రాన్వేషణము కవి రాణించడానికి ఉపయోగ పడుతుందన్నది నా భావన.)

    రిప్లయితొలగించండి
  19. ఆంధ్రాహార మదెట్టులౌను కనమే నాయావకాయన్ సదా
    యాంధ్రత్వం బది యెట్టులబ్బు మదిలో హర్షంబు లేకుండగా
    నాంధ్రంబౌనె సమస్త బంధు సఖులం దాప్యాయతల్ లేనిచో
    రంధ్రాన్వేషణ చేయకున్న కవితల్ రాణించునే యిద్దరన్

    రిప్లయితొలగించండి
  20. రంధ్రాన్వేషణ యనగా
    రంధ్రంబులు వెదుకు పనియె రసికులు తామీ
    యాంధ్రులు సతతము చేసెడి
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. సంద్రమ్మే గద సాహితీవనము కాసారమ్ము కాదంటినే
    సాంద్రమ్మౌ పద సంపదే మనకిలన్ సంప్రాప్తమయ్యెన్ గదా
    యింద్రాణీ! వినుమంటి కావ్యమనగా యింపై జనామోదమౌ
    రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్

    ఇంద్రాణీ! విను మంటిని
    సాంద్రమ్మైన పదజాల సంపద గలయా
    సంద్రమ్మే సాహిత్యము
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
  22. ఆంద్రుల అంతర్యంబై
    సాంద్రమ్మున ముత్యములన?సాహిత్యపు న
    వ్యాంద్రుల భావన జీవన
    రంద్రాన్వేషణము కవిత రాణించుటకే|
    2. సాంద్రమ్మందున సంపదల్ వలెను విజ్ఞానంబు జేకూర్చెడిన్
    అంద్రమ్మందు ప్రసిద్ద కావ్యములె| సర్వాభీష్ట సంధానమై
    రంద్రాన్వేషణ జేయకున్న? కవితల్ రాణించునే యిద్దరన్?
    ఆంద్రుల్ హక్కు విమర్శ నాత్మకమె|సంధ్యాకాలసౌవర్ణమౌ|

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ద్రుతమున కచ్చు పరమైనపుడు “న” కారమునకు ద్విత్వము అల్లసాని పెద్దన యే గాక సంస్కృతమున వాల్మీకి మహర్షి కూడా ప్రయోగించిరి.

    శ్వాసిత దుఃఖితే మనసి సర్వ మసహ్య" మనన్నెఱుంగవే? స్వా. మను. 3.99

    వివృత్యోగ్రం ననా దోచ్చై స్త్రాసయన్నివ రాక్షసాన్ వా.రా. 6. 74. 46.

    రిప్లయితొలగించండి
  24. సాంద్రమ్మైనను చక్కనైనను మహా సౌందర్య మొప్పారినన్
    మంద్రమ్మైనను మంచివైనను బలే మాధుర్య మేపారిన
    న్నాంధ్రమ్మైనను నాంగ్లమైనను గురుండా వ్రాతలన్ జూచి తా
    రంధ్రాన్వేషణ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (ఇది మీరిచ్చిన సమస్యే కదా!)

      తొలగించండి
    2. మిస్సన్న గారూ మీపూరణ చాలా బాగుంది💐

      తొలగించండి
    3. అవును గురువుగారూ. మీరు చెప్పేవరకూ గుర్తు లేదు. ధన్యవాదములు

      తొలగించండి
    4. పీతాంబరధరా ధన్యవాదములు. మీ పూరణ చాలా సింపుల్ గా చేసేశారు. బాగుంది.

      తొలగించండి
  25. చంద్రుడు వెన్నల కొఱకే
    ఇంద్రుడు సురలోకమెల్ల యేలుట కొఱకే
    ఆంధ్రులు త్యాగము కొఱకే
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే!!!

    రిప్లయితొలగించండి
  26. చంద్రునిలో మచ్చేల? క
    వీంద్రాయనిన గురు పత్ని వెంట బడెడు నా
    యింద్రియ లోలత్వ మనెడు
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే

    రిప్లయితొలగించండి
  27. Dr.P.Satyanarayana
    ఆంధ్రమ్మందు బ్రవేశ మివ్వక గురుం డార్యోక్తమౌ ద్రావిడం
    "భ్రింధ్రా"! బ్రల్కుము బ్రాల!చంధపు గతిన్ రేఫంపు పాదా"న్ననన్
    "గ్రంధ్రాల్ బ్రుద్ధ్రులు బ్రెంచు గ్రాదె" యనె బో,గంభీరమౌ శబ్దపుం
    రంధ్రాన్వేషణ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరిన్?.....
    సంధ్రం బును ద్రచ్చుటకై
    క్రంధ్రరమగు క్రావడొడ్డ కవ్వముగా నా
    మ్రంధ్రర పద శబలత గను
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే!
    Dr.P.Satyanzrayana

    రిప్లయితొలగించండి
  28. ఆంధ్రుండా! వడి మేలుకొమ్ముమిట హైద్రాబాదు నగ్రమ్ములో
    చంద్రుండాతడు తెచ్చె తెల్గు సభలన్ చండాడి యాంగ్లమ్మునే
    సంద్రమ్మాయెడి నూత్న నూత్న పదముల్ సంధించు కావ్యాలనున్
    రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్!

    హైద్రాబాదు = హైదర్ + ఆబాదు = హైదరాబాదు (వివర్ణ దీర్ఘ సంధి :)

    రిప్లయితొలగించండి