25, అక్టోబర్ 2016, మంగళవారం

సమస్య - 2180 (మునికిన్ గోపమె భూషణం బగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్"
లేదా...
"మునికిఁ గోపమె కద భూషణంబు"

91 కామెంట్‌లు:

  1. ఆ.వె. బాహు బలము గలిగి బవర మందున వేగ
    శూరుల నతి సులువు బార ద్రోలు
    వైరి వర్గ యముడు వాయు సుతుడగు భీ
    మునికి గోపమె కద భూషణంబు.

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మూర్తి యందు ప్రాణ ముండిన వేళలో
    తోడి వారి నంత తూరుపెత్తి
    చని తన జగ మొచ్చు చెనటులనంగ య
    మునికి గోపమె కద భూషణంబు.

    (మూర్తి = శరీరము ; తూరుపెత్తు = బాధించు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వచ్చును ఒచ్చు అనడం దోషం. 'చని తన కడ జేరు' అనండి.

      తొలగించండి


  3. శాంత మెల్ల వేళ సౌఖ్యము నిచ్చును
    మునికిఁ ,గోపమె కద భూషణంబు
    రాజు కు ఋజు మార్గ రాజ్యము నెలకొల్ప!
    జనహితమ్మగునది చక్క గాను

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. తపము జేసు కొనెడి తాపసుల కెపుడు
    శాప మిడగ వరము జంకు లేక
    యతివ జేర నింద్ర యహల్య పైగౌత
    మునికిఁ గోపమె కద భూష ణంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      కొంత అన్వయలోపం ఉన్నా పూరణ బాగుంది.
      'యహల్య' అన్నచోట గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. తపము జేసు కొనెడి తాపసుల కెపుడు
      శాప మిడగ వరము జంకు లేక
      సతిని జేర నింద్ర మతిబోవ ఋషిగౌత
      మునికిఁ గోపమె కద భూష ణంబు






      తొలగించండి
  5. మల్లె పూలు జుట్టి విల్లున సంధించి
    మారు మూలనున్న మరుని గాంచి
    మండి పడుచు జూసి దండించు శంకర
    మునికిఁ గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దనుజుల్ మాదిరి నీచపోకడలతో దౌష్ట్యమ్ములే జేయుచున్
    ననువున్ గూడిన దోడి వారలకు నానందమ్ము నేనాడు జూ
    పని వారల్ చని నంతకాలయము బోవంగా నటన్ దండయా
    మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.

    (అంతకాలయము = నరకము/యమలోకము;దండయాముడు = యముడు)

    రిప్లయితొలగించండి
  7. తనుహీనుండట పంచబాణుడతడుందాకంగ చాలున్ మునుల్
    తనువెల్లంబులకించిపోవ తరుణీ ధ్యానమ్మునన్ మగ్నులై
    చనసంసారముఁజేయ పామరజనుల్ సాధింప శక్యమ్మె? కా
    మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లఁగన్ ||


    ఎంతటిమునులైన చింతలనింతిపై
    చనగఁజేయు పంచసాయకుండు
    పామరులెదిరింప తామెంతఁదలచ, కా
    మునికిఁ గోపమె కద భూషణంబు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. తనలోనర్ధముగా వసించు సతి సీతాదేవి పైకామమున్
      దననే దైవముగాదలంచు నిజభక్తానీక
      మున్బ్రేమయున్
      అనిశంబున్ పరపీడకుల్దనుజ లోకానీకమున్గూల్చ రా
      మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్"

      తొలగించండి
    2. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. గండ్రగొడ్డలిఁ గొని క్షాత్రసంహారమ్ముఁ
    జేయువేళ, పూత శివధనువును
    విఱుచు రాముఁ దెగడువేళను పరశురా
    మునికిఁ గోపమె కద భూషణంబు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Respected Sir:

      I was thinking of a suitable English phrase for: "Samasya Puranam".

      Maybe it could be:

      "Paradox Resolution"

      తొలగించండి
  10. నేటి సమస్య
    మునికి గోపమె కద భూషణంబు

    పూరణ:
    పాలి వారి పైన పగ బట్టి వంచించి
    ద్రౌపది చెరబట్టె దైత్యు డతడు
    కాని పనులు జేయు కౌరవ సార్వభౌ
    మునికి గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
  11. అనుమానం బొకయింత లేదు భువిలో నత్యంత దౌష్ట్యంబుతో
    ననిశం బత్యవినీతులై మనుచు దేశాభ్యున్నతిం గూల్చుచున్
    ధనదాహంబున సంచరించు ఘనులన్ దండించగా బూను న
    మ్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.

    ధర్మయుక్త మైన కర్మంబులం గూల్చి
    సాధుజనుల నెపుడు బాధపెట్టి
    సంచరించు జనుల శపియించగా బూను
    మునికి గోపమె కద భూషణంబు.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. మంగళములఁ గూర్చు లింగని మోమున
    సిగను శశిని మించు నగయె నగవు
    శిష్ట జనులఁ గాచి దుష్టుల దునుము సో
    మునికిఁ గోపమె కద భూషణంబు.

    రిప్లయితొలగించండి
  13. అల్లరెరుగనట్టి యందాల రామయ్య
    అమ్మను మురిపించ యలుక జూపి
    చందమామ గోరు చల్లని వేళరా
    మునికి గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీవల్లీ రాధిక గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అల్లరి+ఎరుగ' అన్నపుడు సంధి లేదు. 'అల్లరే యురుగని యందాల...' అనండి. అలాగే 'మురిపించ నలుక జూపి' అనండి.

      తొలగించండి
  14. వనజాతాక్షిని యేకవస్త్రను దయాభావప్రయుక్తంబుగా
    గొని వస్త్రాహరణంబు జేయగ,మహత్క్రోధాగ్ని నేత్రుండుగా
    ఘనదుర్వార బలప్రవర్ధనమునన్ గర్హించుచున్ లేచు భీ
    మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    క్షత్రియ నరపాలక వదన ఖ౦డనా

    వ్రతుడు , మరియు , చ౦డ పరుశు ధరుడు ,

    నాగ్ర హారు ణాక్షు డౌ భార్గవా౦శ రా

    మునికి గోపమె గద భూషణ౦బు

    రిప్లయితొలగించండి
  16. మనసే మార్దవమై ముదంబునిడు ప్రేమంబందు సౌహార్దమున్
    గనుచున్నెప్పుడు వ్యష్టిజీవనము సంఘంబందు రంజిల్లంగన్
    గనువాడై పరమార్థ మెంచుచును లోకంబంతటన్ దిర్గు స
    న్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్!

    రిప్లయితొలగించండి
  17. నిన్నటి సమస్యకు నా పూరణము:

    ప్రాకటముగ నని నిలచుచు
    వేకువలో నశువుబాయ విస్మయ మందన్
    శోకముతో చిందిలునీ
    రై, కనువిప్పి, కలిసినది రణ నిహతు బతిన్!

    రిప్లయితొలగించండి
  18. వినయ మెరుగనట్తి విద్వాంసమణికి,జా
    ఘనిని త్రొక్క భుజగమునకు,సి0హ
    బలుడు ద్రుపదపుత్రి పడకకు బిల్వ భీ
    మునికి,కోపమె కద భూషణమ్ము.

    రిప్లయితొలగించండి
  19. ఘనులే చూడగ మౌనమున్ విడరుగా క్రౌర్యంబు వీక్షించుచున్
    వినబోరెవ్వరు ద్రౌపదీవ్యధను రావే దాసి రారమ్మనన్
    అనిలో దున్మెద కౌరవాధముల నాకడ్డంబు నెవ్వాడు, భీ
    మునికిన్ గోపమె భూషణంబగు ప్రజా మోదంబు సంధిల్లగన్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయలోపం ఉంది.

      తొలగించండి
  20. తండ్రి యాన తోడ తల్లిని పరిమార్చి
    యర్థ పతులపైన నాగ్రహించి
    కువలయమును చుట్టి గూల్చిన పరశురా
    మునికిఁ గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
  21. జన కల్యాణ సమావలంబన మిలన్ సౌశీల్య శ్రీరామ సం
    జననం బెంతయుఁ బ్రీతి పాత్రమును సఛ్చారిత్ర్యమున్ వార్ధి ర
    త్న నిధిన్ దాటగ దారిఁ జూపుమనఁ దాత్సారంబు సేయంగ రా
    మునికిం గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్


    శాంతి దయ దమములు సుంతయు నేర్వక
    భోగ లాల సుండు భూతి రతుడు
    జప తప నెపములఁ బ్రజలఁ గలచు కపట
    మునికిఁ గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు విశిష్టంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  22. నిన్నటి సమస్యకు నా పూరణము:

    వేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా
    భీకరమైన శస్త్రములు భీతిని గొల్ప జవానులన్ను రీ *
    పాకన జంపగా తనువు బాసిన ధీరుని జూడ గుండె నీ
    రై, కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!!

    * జమ్మూకాశ్మీరు ఉరీ గుడారము(సైనిక స్థావరం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. మునికి గోప మెకద భూషణంబనగను
    న్యాయ మగునె నార్య !నరునకు వలె
    గోప ముండ రాదు కొంచె మైన మునికి
    మౌనమే యతనికి నాభరణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగునె యార్య' అనండి.

      తొలగించండి
  24. కాళ్ళు చేతులడచి గంగను బడదోసి
    యింట నుంచి చంప మంట బెట్టి
    కాంతను చెఱబట్ట, గండూపదమ్మె ? భీ
    మునికిఁ గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
  25. అనిశమ్మున్ నరలోకమందు మనుజుల్ హ్లాదమ్ము తోవర్తిలన్,
    తనకర్తవ్యము మానసమ్మునసదా ధ్యానించుచున్ శుద్ధిగా,
    కను దుర్మార్గులు భీతిలన్ సతతమున్ కాంతారమున్ నిల్చుఆ
    మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సత్యనారాయణ రెడ్డి గారు "రామునికిన్" అనా లేక ఆ ముని కనియా మీ యుద్ధేశ్యము? మునికయితే నిల్చునా మునికిన్ అనండి.

      తొలగించండి
  26. మునికి న్గో పమె భూషణంబగు బ్రజా మోదంబు సంధిల్లగ
    న్ననగాన్యాయమె యార్య మీకదియయా హా యెంతగా బల్కిరో
    మునికిన్ శాంతమె భూషణంబగును నే ప్రొద్దున్గదా నేర్వుమా
    యనిశంబాతడు మానసంబు నిల నాదైవంబు నేగొల్చుగా

    రిప్లయితొలగించండి
  27. వనవాసమ్మును జేయువేళ నట సంప్రాప్తించు ముప్పున్ గన
    న్ననునిత్యమ్మును జాగరూకుడయి తా నాత్మీయులన్ బ్రోవుచు
    న్ననిలో సింగము వోలె శత్రువుల సంహారమ్ము నే జేయు భీ
    మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్

    దొరల మంచు తాము ధరణినేలెడు వార
    మనుచు మదము తోడ మసలు నృపుల
    కావరమును ద్రుంచె కల్పాన పరశు రా
    మునికిఁ గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. విరించి గారు చక్కటి పూరణలు. “కను అన్నను” లో స్వరము పరమైనది కాబట్టి మధ్యమ పురుష ము వర్ణకమునకు లోపముండదు. “కనుమన్నను” సాధువు.
      “ముప్పున్ గనం
      గనునిత్యమ్మును జాగరూకుడయి తాఁ గావంగ నాత్మీయుల” అన్న బాగుండును.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      నేను అర్థం చేసుకున్నంత వరకు అది 'కనన్+అనునిత్యమ్ము = కన న్ననునిత్యము'. ఇలాంటి ప్రయోగాలు భాగవతంలో విస్తారం.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాదే పొరపాటు. నేనా యనునిత్యమన్న దిశలో నాలోచించ లేదు. ధన్యవాదములు.

      తొలగించండి
  28. సత్యధర్మములకు సంకటస్థితిగల్గి
    దీనజనుల కిలను హానిజరుగ
    దుష్టులమదమడచి దుర్నీతినణచ రా
    మునికి గోపమె కద భూషణంబు !!!

    రిప్లయితొలగించండి
  29. తపము నడ్డుకొనగ తలబోయు వారలు
    శాపములకు మదిని జడియు చుంద్రు!
    ధ్యానము సమకూరి తాపము తొలుగగ
    మునికి గోపమె కద భూషణంబు!

    రిప్లయితొలగించండి
  30. మునులు ధర్మ రతులు మోక్ష మార్గచరులు
    పరహితార్థ మతులు బ్రహ్మ విదులు
    ధర్మయుతులకూత దుర్మతులయెడల
    మునికిఁ గోపమె కద భూషణంబు"

    రిప్లయితొలగించండి
  31. శాంత గుణము రామచంద్రమూర్తికి భూష

    ణమ్ము, ధర్మరాజునకును ధర్మ

    గుణము మరియు సౌమ్య గుణమండ్రు ; దూర్వాస

    మునికి గోపమె గద భూషణంబు.

    రిప్లయితొలగించండి
  32. మ. ధనసంపాదనె లక్ష్యమై చెలగుచున్ ధర్మమ్ము నొక్కింంతయున్
    మనమందెన్నడు చింత లేని పలు దుర్మార్గంపు విద్రోహులన్
    దునుమాడన్ వెనుదీయ బోని బుధుడున్ దోషమ్ము లేలేని స
    న్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్

    రిప్లయితొలగించండి
  33. జ్వరం ఎక్కువయింది. తలనొప్పి, మెడనొప్పి భరించలేక పోతున్నాను. ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాను. ప్రస్తుతం బ్లాగును పరిశీలించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దయచేసి పూర్తి విశ్రాంతి తీసుకోండి

      తొలగించండి
  34. డా.పిట్టా
    మనికిన్ దుష్టపు నీతి గోప్యమె సుమీ మావారనన్ గొందరిన్
    యునికిన్ నిల్పి దళంబు బెంచుకొనునీ యుర్విన్ జయోత్సాహ కా
    మునికిన్ వోటుల సంఖ్యకై భయమునే ముమ్మారు బోషించు ధ
    ర్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్

    కరుడుగట్టిన కోపికి హరుడునైన
    వెరచు విష్ణువు దుర్వాసు వెతనబడియు
    గరచిపాదాల సేవల గరుపనెంచె
    మునికి గోపమె కద మంచి భూషణంబు

    రిప్లయితొలగించండి
  35. వలచిన చెలినచట పరిణయమాడంగ
    కోరి వచ్చి నట్టి గోప సుతుకు
    మునిజన ప్రియునకును మురహరి యైన శ్యా
    మునికి గోపమె గద భూషణమ్ము.

    అతివను సభలోన నవమాన పరచిన
    దుస్స సేను నచట దురమునందు
    చంప బోయెడి బలశాలి యైనట్టి భీ
    మునికి గోపమె గద భూషణమ్ము.

    గాది సుతుడు చేయు క్రతువున కాటంక
    ము,కలిగించునట్టి ముష్కరులగు
    మారిచాదుల పరి మార్చగ నెంచు రా
    మునికి గోపము గద భూషణమ్ము.

    వనము నందు తాను వాసిగా నొంటిగా
    తపము చేయుచుండ తరుణి యొకతె
    భంగమొనర చేయ భరమున నాసంయ
    మునికి గోపమె గద భూషణమ్ము.
    (చివరిపద్యం మనుచరిత్ర ఆధారంగా మనోరమ కథతో పూరించాను.)

    రిప్లయితొలగించండి
  36. వలచిన చెలినచట పరిణయమాడంగ
    కోరి వచ్చి నట్టి గోప సుతుకు
    మునిజన ప్రియునకును మురహరి యైన శ్యా
    మునికి గోపమె గద భూషణమ్ము.

    అతివను సభలోన నవమాన పరచిన
    దుస్స సేను నచట దురమునందు
    చంప బోయెడి బలశాలి యైనట్టి భీ
    మునికి గోపమె గద భూషణమ్ము.

    గాది సుతుడు చేయు క్రతువున కాటంక
    ము,కలిగించునట్టి ముష్కరులగు
    మారిచాదుల పరి మార్చగ నెంచు రా
    మునికి గోపము గద భూషణమ్ము.

    వనము నందు తాను వాసిగా నొంటిగా
    తపము చేయుచుండ తరుణి యొకతె
    భంగమొనర చేయ భరమున నాసంయ
    మునికి గోపమె గద భూషణమ్ము.
    (చివరిపద్యం మనుచరిత్ర ఆధారంగా మనోరమ కథతో పూరించాను.)

    రిప్లయితొలగించండి
  37. కార్తవీర్యు డొచ్చి కాల్దువ్వ రణముకై
    శాంతి నుడుగులెల్ల చాలనపుడు
    పరశురాము డణచ బహురోసముప్పొంగ
    మునికి గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
  38. 1. దారి నిడగ వేడ దయజూపి లంకకున్
    నీటి వామి రామ మాట వినదె,
    అలుక బూని శరము నంకించ పూను ,రా
    మునికి గోపమె కద భూషణంబు.....


    2. సానుకూలమవక సైరంధ్రి హితవాక్కు
    కీడు చేయ దలచ కీచకుండు
    పత్ని కష్టమెరిగి పతితుని జంపు ,భీ
    మునికి గోపమె కద భూషణంబు.....

    రిప్లయితొలగించండి
  39. పూల కారునందు పూజల పేర్జెప్పి
    భర్త నేడిపించు భార్య నెంచి
    వలపురేపు పంచ బాణ సంధాన కా
    మునికి గోపమె కద భూషణంబు.

    రిప్లయితొలగించండి
  40. నాగజ్యోతి గారూ,
    అస్వస్థత వల్ల ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
    వరుసగా మీరు పంపిన పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    'కార్తవీర్యు డొచ్చి...' పూరణలో 'వచ్చి'ని 'ఒచ్చి' అన్నారు. అక్కడ 'కార్తవీర్యు డలిగి...' అనండి. అలాగే 'బహు రోష ముప్పొంగ' అనండి.
    'పూలకారులందు...' పూరణ మనోహరం!
    'అత్తరంబుతోడ...' పూరణలోను ఒచ్చి అన్నాడు. 'అత్తరంబుతోడ నంతకారియె వచ్చి...' అనండి.

    రిప్లయితొలగించండి
  41. dhanyavaadalandee maarustaanu.... mee arogyam tondaragaa kuduta padaalani korukuntunnaanu

    రిప్లయితొలగించండి
  42. అత్తరంబుతోడ నంతకారియె వచ్చి
    పత్ని చేరువేళ పాపడొకడు
    అడ్డగించ చూడ నతిశయమ్మవగ, సో
    మునికి గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
  43. కార్తవీర్యుడలిగి కాల్దువ్వ రణముకై
    శాంతి నుడుగులెల్ల చాలనపుడు
    పరశురాము డణచ బహురోసముప్పొంగ
    మునికి గోపమె కద భూషణంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కార్తవీర్యుడలిగి కాల్దువ్వ రణముకై
      శాంతి నుడుగులెల్ల చాలనపుడు
      పరశురాము డణచ బహురోషముప్పొంగ
      మునికి గోపమె కద భూషణంబు

      తొలగించండి
  44. కనుడీ హైదరబాదునన్ మురికివౌ కాల్వల్ న దుర్గంధమున్
    వినుడీ కుక్కల మూకలన్ మొరుగు గంభీరంపు పోట్లాటలున్
    చనగా నిచ్చటకున్ రమారమణుడౌ చంద్రున్ కుమారుండు...రా
    మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్

    (in praise of Sri Kalvakuntla Taraka Rama Rao, Minister for Municipal Administration and Urban Development and Brand Hyderabad)

    రిప్లయితొలగించండి