27, అక్టోబర్ 2016, గురువారం

సమస్య - 2182 (ప్రమాదముల్ ప్రమోద మిచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరన్"
లేదా...
"పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము"

53 కామెంట్‌లు:



  1. కంది వారు ఆరోగ్యము జాగ్రత్త గా చూసుకోండి

    బతుకు బండిని నీశుని పథము నందు
    భక్తి భావము గొని నడుప తెలిపె నది
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము
    చక్కగ సమస్య నొకటినక్షరము జేసె !

    జిలేబి

    రిప్లయితొలగించండి

  2. రమాపతిన్ నుతించుచున్ ధరాతలంబుఁ భక్తితో
    నమేయమైన కార్యముల్ భయమ్ము సుంత లేకయే
    సుమా ! రచింపవచ్చు, క్లేశశోకపీడలల్పమౌ
    ప్రమాదముల్, ప్రమోదమిచ్చి రక్షసేయు నెల్లరన్ ||

    మనిషి జన్మించినది మొదలనవరతము
    గండములు గడచుచునుండు, కనికరించి
    దేవుడపమృత్యువునుఁ దొల్చి బ్రోవనొసగు
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మాడుగుల వారు

      నమో నమః !

      తిరుపతి లో జరిగిన రాంభట్ల వారి అవధానానికి ఏదన్నా వీడియో లింకు ఉంటే తెలుపగలరు

      ఆ సభ లో పృచ్చకుల ప్రశ్నలు అవధానులగారి పూరణ ల గురించి తెలియ జేయగలరు

      జిలేబి

      తొలగించండి
    2. మాన్యశ్రీ జిలేబి గారూ! నమోనమః. బ్రహ్మశ్రీ శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు తిరుపతిలో జరిగిన తమ అష్టావధాన కార్యక్రమం గంటసమయం నిడివి గల విడియోను యూట్యూబ్ లోను మరియు వారి ముఖపుస్తకం ప్రోఫైల్ లోను ఉంచినారు. "అన్నమాచార్య కళా మందిరంలో అష్టావధానం" అనే శీర్షిక తో యూట్యూబ్ లో శర్మ గారు ఉంచినారు. మీరు చూడవచ్చు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. శ్ర్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్షలతో....
      తిరుపతిలోని
      అన్నమాచార్య కళా మందిరంలో
      అష్టావధాన కార్యక్రమం 16/10/2016 వ తేదీన జరిగినది. మాన్యమిత్రులు జిలేబి గారి కోరికపై అవధానిగారు తమ ముఖపుస్తకంలో ప్రకటించిన పద్యములను ఇచ్చట పొందుపరచుచున్నాను. ధన్యవాదములు.

      సమస్య : హనుమంతుండు వరించె సీతను సురల్ హర్షించి దీవించగన్

      వినుమా నాటకమైన మృచ్ఛకటికంబిచ్చోట నే చెప్పెదన్
      ఘనుడైనట్టి శకారుడక్కట మహత్కార్యంబులన్ చేయుచున్
      కనగా నీవిధి పల్కె మేధ కలదే? గంభీర వాక్యంబులన్
      “హనుమంతుండు వరించె సీతను సురల్ హర్షించి దీవించగన్”

      దత్తపది: వేంకటేశ్వర, రామేశ్వర, పరమేశ్వర, ముక్తేశ్వర వేంకటేశ్వర వైభవం

      చూడ వేంకటేశ్వరుని సత్ శోభ గిరుల
      దివ్య మౌను రామేశ్వర దీప్తులమర
      దీనతన్ పరమేశ్వర తీర్చుమయ్య
      మమ్ము ముక్తేశ్వరాఖ్యతో మనుపుమయ్య!!

      వర్ణన : శ్రీనివాసుడి విరాట్స్వరూపం – సుగంధి వృత్తంలో.

      పాదహస్తముల్ సహస్రపావనమ్ములైనచో
      మోదమబ్బు భక్తకోటిముక్తిదాయకా హరీ
      పాదుకొల్పి నీ స్వరూపభాగ్యమున్ జగత్తుకున్
      వేదరాశిగాచినట్లు వే జనాళి బ్రోవుమా

      నిషిద్ధాక్షరి : అన్నమయ్యను గూర్చి

      అచ్చంబౌ తెన్గుకు సమ!
      వెచ్చగ పదరాజి చేర్చి వేల పరార్థుల్
      మెచ్చగ సంకీర్తనలన
      నిచ్చలునిడె నన్నమయ్య నీరాజనమున్

      న్యస్తాక్షరి: ఒకటో పాదం పదవ అక్షరం వేం
      రెండో పాదం రెండో అక్షరం క
      మూడోపాదం పదహారవ అక్షరం టే
      నాలుగోపాదం పద్నాలుగో అక్షరం శ

      భీకరమైన పాపములు వేంకటనాథుడు త్రుంచివేయగా
      శ్రీకరమౌను సర్వులకు స్నిగ్ధ మనస్కుని ఉత్సవంబులన్
      ప్రాకటమైన గీతముల భవ్య పదంపు నటేశ్వరాకృతిన్
      లోకముకందజేయుమయ లోకులకాశలుతీర నిండుగా!!

      తొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పవిది నమరక తెరలెడి బ్రదుకు నందు
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము
    ననుచు దల్చి నీశుని గొల్వ ననవరతము
    విధమె మారి బ్రదుకు నీకు వేడుకగును.

    (ప్రమోదము = కలత)

    రిప్లయితొలగించండి
  4. చిన్న తనమున మొసలిచే జిక్కు కొనక;
    మాకు ద్వాదశ మంజరి లేక పోను;
    శంకరాచార్య! దీనిలో శంక లేదు
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము

    రిప్లయితొలగించండి
  5. సుఖము లందున మత్తుగ సోలి పోయి
    కడలి నీదగ మదినిండ గాసి వడగ
    మబ్బు వీడిన పిమ్మట నిబ్బ రమ్ము
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము

    రిప్లయితొలగించండి
  6. అమోఘమైన యత్నమున్, మహత్సులక్ష్యకాంక్షయున్'
    క్రమానుసారవర్తనం బగణ్యభావదీప్తియున్
    సమాదరంబుతో ధరించు సజ్జనాళి నెప్పుడున్
    ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరిన్.

    సవ్యమార్గానుసారియై సర్వగతుల
    జన్మభూమిని రక్షించు సవనమునకు
    నడుము కట్టిన శ్రేష్ఠుడౌ నరుని కెపుడు
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    క్రమంబులేని సృష్టిలీల గాంచ దోచ దేమియున్
    సమాశ్రయించి బోవుటేమొ చక్కనైన మార్గ మీ
    భ్రమల్ సుఖాలు దుఃఖముల్ భరింప జాలు యోపికన్
    ప్రమాదముల్ ప్రమోదమిచ్చి రక్షసేయు నెల్లరిన్
    భక్తినిన్ యేడు కొండల బస్సునెక్క
    రక్తిగట్టు ప్రమాదపు రాశి బెంచె
    ఎవ్వరాగిరి పోబోక నెచటనున్న
    పెను ప్రమాదములు;ప్రమోదమునకె సుమ్ము!👌

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రవేత్తలు కృషిఁజేసి సత్వరమ్మె
    గాలివానల భూకంప గమనములవి
    తెలియజెప్పెడుద్దేశ్యమ్ము తొలఁగజేయు
    పెనుప్రమాదములు! ప్రమోదమునకె సుమ్ము!

    రిప్లయితొలగించండి

  9. తరచి జూడ విపత్తులు తరచు మేలు
    కలుగ జేయుచును మనకు కలిమి బెంచు
    బవర కతమున దేశము బలపడెగద !
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము.
    ******
    (చైనా తో యుద్ధం తర్వాతే భారత దేశం
    సైనికంగా బల పడిన మాట వాస్తవం కదా !)

    రిప్లయితొలగించండి
  10. జయము వలన కలుగునట్టి సంతసమ్ము
    కన్న, ఘోర ప్రమాదము క్షణము లోన
    తప్పి జయమొంద , నగునది గొప్ప వరము ;
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి నమస్సులు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  12. మనసు కలచి వేయునుగాదె వినగనెపుడు
    పెను ప్రమాదములు; ప్రమోదమునకె సుమ్ము;
    స్వాంత మంతయు మెలిగొను సంఘటనము
    నరయ జాగ్రత నెరిగెడి తరుణమదియె!

    రిప్లయితొలగించండి

  13. పూరణ 2:
    చరాచర ప్రపంచ మందు జాల నుండు చిత్రముల్
    విపత్తు లందు గూడ మేళ్ళు వేన వేలు గల్గుగా
    వినాశ యుద్ధము న్నొకింత వెల్గు గూర్చ శక్యమౌ
    ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్ష సేయు నెల్లరన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు నమస్సులు. పూరణ చాలా బాగుంది. కాని ప్రాస మర్చి పోయారు.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ ! నమస్సులు ! ధన్యవాదాలు ! నిజమే ! అలవాటు లేని వృత్తము కదా ! సవరిస్తాను. మరొక్క మారు ధన్యవాదాలు ! -జనార్దన రావు.

      తొలగించండి
    3. జనార్దన రావు గారు మీ పద్యమునకు నా సవరణ:

      సమున్నత ప్రపంచ మందు జాల నుండు చిత్రముల్
      విమర్శ లందు గూడ మేళ్ళు వేన వేలు గల్గుగా
      ప్రమత్త యుద్ధము న్నొకింత లాభమీయ వచ్చునే
      ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్ష సేయు నెల్లరన్.

      తొలగించండి
    4. ధన్య వాదలు కామేశ్వర రావు గారు! మరొక పద్యము పోస్ట్ చేసినాను. చూడగలరు.

      తొలగించండి
  14. కులమతమ్ముల కుమ్ములాటలు సతతము
    పెను ప్రమాదములు, ప్రమోదమునకె సుమ్మ
    సర్వమత సమధర్మము సంతతమ్ము
    తెలిసి మనుజులవ్విధిగను మెలగవలయు

    రిప్లయితొలగించండి
  15. అమోఘమౌ వరమ్ము తో నహంకరించి దానవో
    త్తముండు మోద కంబమంత తత్క్షణమ్ము ఘోరమౌ
    ప్రమాదమే ఘటించి మృత్యు వాతనొందడే ధరన్
    ప్రమాదముల్ ప్రమోదమిచ్చి రక్ష సేయు నెల్లరన్

    రిప్లయితొలగించండి
  16. సమాదరించకున్న తోటి జాతులన్ ఘటిల్లు చూ
    ప్రమాదముల్, ప్రమోదమిచ్చి రక్షసేయు నెల్లరన్
    సమానమైన గౌరవమ్ము సంతతమ్ముచూపుచున్
    సుమమ్ము వంటి స్వచ్ఛమైన చూడ్కితో కనన్ ప్రజన్

    రిప్లయితొలగించండి
  17. జరుగు చున్నవి నిత్యము జనుల కకట
    పెను ప్రమాదములు,ప్ర మోదము నకెసుమ్ము
    రోడ్ల ప్రక్కన జెట్లను నాటు ట రయ
    పిల్ల గాలులు వీచును జల్ల గాను

    రిప్లయితొలగించండి
  18. పంచచామరము.
    విమోహ మెల్ల వీడి సత్య వేద విద్య లందు ని
    త్యమున్ నిమగ్నులై చరింత్రు తాపసోత్తముల్ ధరన్
    సమంచితప్రవృత్తి భాస సద్గుణాత్త చిత్త వి
    ప్ర మాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరన్

    [మాదము= మదము=సంతోషము]


    భద్రత నొసంగ మది నెంచి ప్రభువు సేయు
    దుష్కరమ్ములైన నియమ పుష్కలమ్ము
    లాపదల నోర్చు మెలకుఁవ లన్నినేర్పఁ
    బెను ప్రమాదములు, ప్రమోదమునకె సుమ్ము

    రిప్లయితొలగించండి
  19. సమాదరంబుతోడజూచి సాటివారినెప్పుడున్
    సమాశ్రయించుకున్నవారి సంతతమ్ము గాచుచు
    న్నమేయమైన భక్తితోడ నంతరాత్మ గొల్వగన్
    ప్రమాదముల్ ప్రమోదమిచ్చి రక్షసేయు నెల్లరన్!!!

    రిప్లయితొలగించండి
  20. బండి పైనుండి పడినను బాధ యైన
    గాయముల నొచ్చియున్నను కాయమెల్ల
    మీకె తగు శంకరా యిట్టి జోకు వేయ
    "పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము".

    ప్రమాదముల్ ఘటిల్లు వేళ బాధ నొంద సాజమౌ
    ప్రమాద మాయె శంకరుండు బండినుండి జారినన్
    సమాదరమ్ముగా ననెన్ శశాంకమౌళి సత్కృపన్
    ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరన్.

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ప్రమత్త చిత్త రీతి తోడ వాహన౦బు దోలుచున్

    ప్రమాణ మీ వతిక్రమి౦ప రాదు | స౦భవి౦చుగా

    ప్రమాదముల్ | ప్రమోద మిచ్చి రక్షసేయు

    ……………………………… నెల్లరన్ |


    ప్రమాపణ౦బు సేయ కోయి , పా శ ధా రి వై

    …………………………… యికన్



    { ప్రమత్త = బాగా మత్తు సేవి౦చిన
    ……………………………………………
    ప్రమాణము = వేగ ప్రమాణము
    ………………………………………
    ప్రమోదమిచ్చి రక్షసేయు నెల్లరన్ =ఎల్లరిని

    స౦తసి౦పజేసి రక్ష సేయు , రక్షి౦చుము
    …………………………………………………
    ప్రమాపణము = వధ ; పాశధారి =యముడు
    ………………………………………………………… ప్రమాపణ౦బు సేయ కోయి పాశధారివై =

    య ము ని వై చ౦ప వద్దు
    ………………...................... . ..............

    రిప్లయితొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గురువర్యా నిన్నటి పూరణ స్వీకరి౦చ౦డి


    { పాపము కోడలికి మాటాడితే కనుబొమ

    అదరుతు౦ ది , నరాలబలహీనత కాబోలు ! }


    వేడిగ ను౦డె , " యిడ్డెనులు " , ప్రీతి
    ి
    …………… భుజి౦పగ మేల ట౦చు నా

    కోడలు మామ జూచి కను గొట్టెను రమ్మని

    …………… సైగ జేయుచున్ |

    కోడలు మ౦చి | ది౦చుకయు

    ………… కొ౦టె తన౦ బది లేదు | పాప మా

    చేడియ యొక్క భ్రూకుటి , వచి౦పగ మాట ,

    …………… వడ౦కు చు౦డుగా !


    పా డగు రోగముల్ గలవు , వైద్యుల కే

    ………… యవి య౦తు చిక్కకన్


    { యుడ్డెనులు = ఇడ్లీలు ; భ్రూకుటి =

    కను బొమ ; }

    రిప్లయితొలగించండి
  23. భారతాహవమెంత దుర్భరము నైన
    భరత భువికి గీతయనెడు వరము నిచ్చె
    ధర్మ మునుధరఁ బెంచి యధర్మమడచె
    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము".

    రిప్లయితొలగించండి
  24. * పంచామరము *
    సమస్య లెన్నియో మిగుల్చు శాంతినే హరించు నే
    ప్రమాదముల్ , ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరన్
    శ్రమైక జీవనమ్మనంచెఱంగుచున్ సదా నిదా
    నమే ప్రధానమంచు లోక నానుడొక్కటే సుమా

    * తేటగీతి *

    శోకమున్ మిగుల్చుగద వసుధన జూడ
    పెను ప్రమాదములు, ప్రమొదమునకె సుమ్ము
    పాటిగా రహ దారుల భద్రత నెఱ
    గుచును మసలిన క్షేమము గూర్చు మనకు

    రిప్లయితొలగించండి
  25. దేవుని దయ తోడుత వెను దిరిగి పోయె
    పెను ప్రమాదములు! ప్రమోదమునకె సుమ్ము
    నిటులగుననుచు గడచిన ఘటన మఱచి
    మంచి నాశించి నడువగ నెంచ వలయు!

    రిప్లయితొలగించండి
  26. గాలివానకు గృహములు కూలిపోవ

    నాశ్రయమ్ము లేకను పేదలలమటించ

    ప్రభుత యిండ్లనిచ్చెనుచిత పథకమందు

    పెను ప్రమాదములు ప్రమోదమునకె సుమ్ము!

    రిప్లయితొలగించండి
  27. మీకుజరిగిన దానికిమేముకూడ
    బాధనొందితిమిమిగులపరమగురువ!
    వేళతప్పకమందులువేసికొనుము
    సరియయగుమీకువెంటనేశంకరార్య!

    రిప్లయితొలగించండి
  28. పంచచామరము
    విమోచనంబు గూర్చగల్గు వేంకటేశు డెప్పుడున్
    అమాంతమందు మమ్మగల్పి నాదరించు నట్లుగా
    ప్రమాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయ నెల్లరున్
    క్రమంబుగా వివాహమాయె కాలముంచు తీర్పునన్|
    2. వినుట కెంతయో వింతగు విశ్వ మందు
    పెను ప్రమాదములు|”ప్రమోదమునకె సుమ్మి
    నమ్మిగొల్వగ రాముడు నరక మనగ?
    రామదాసును జైలున రక్ష గూర్చె|
    దైవ మెంచెడి కార్యాల దర్పణాలు|



    రిప్లయితొలగించండి
  29. దారుణ రక్త పిపాసులై దారులన్ని
    జోరు మితిమీరి వర్తించ చుట్టుముట్టు
    పెను ప్రమాదములు! ప్రమోదమునకు సుమ్ము
    జీవితము,జాగ్రత యునికి జీవగఱ్ఱ

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులకు నమస్కృతులు.
    హాస్పిటల్‍కు వెళ్ళి వచ్చాను. మూడు ఎక్స్‌రేలు తీశారు. అన్నీ నార్మల్‍గా ఉన్నాయన్నారు. భయపడవలసిన పని లేదన్నారు డాక్టరు గారు. కాకుంటే ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు. మందులు వాడుతున్నాను.
    ఈనాటి మీ పూరణలను సమీక్షించలేక పోతున్నందుకు మన్నించండి.
    రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను.
    పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అంతా బాగున్నందులకు సంతోషమండి. విశ్రాంతి తీసుకోండి.

      తొలగించండి
    2. గురువులకు నమస్కారములు
      పూరణలకు తొందర ఏముంది ? ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. మనవడు కులాసా అనుకుంటాను .అందరినీ ఆశీర్వ దించి .
      దీపావళి శుభాకాంక్షలు .అక్క

      తొలగించండి
    3. అయ్యా విశ్రాంతి తీసుకోండి. మందులు వాడండి. త్వరలోనే స్వస్థులౌతారు.

      తొలగించండి
  31. సమాజ మందు కొన్ని మార్లు సంభవించు నాపదల్
    ప్రమాణముల్ గణించి జూడ బాధ లేని వేయగున్
    అమానుషమ్ముగాదు యుద్ధ మంతమందు మేలగున్
    ప్రమాదముల్ ప్రమోదమిచ్చి రక్ష సేయు నెల్లరన్.

    రిప్లయితొలగించండి
  32. ప్రణామములు గురువుగారు...బ్లాగు గురించి ఆలోచించక తగిన మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోండి...

    రిప్లయితొలగించండి