ఆర్యా.........(డా.పిట్టా నుండి) అప్రవరాళి జుట్టులను ..అంటే సరపోతుంది కాని అవి ప్రత్యేకంగా యెక్కడుంటాయని ప్రశ్న రాకుండా.క్రాపులనగానే బయటి డిజైన్లు ప్రకటితం.దుష్ట చర్యలకు దుష్ట సమాసం స్వాభావకమని మెచ్చరా?
ఆర్యా! కామేశ్వరరావు గారు, నమస్కారములు, యజ్ఞోపవీత ధారణకు కారణాలను వివరిస్తూ చేసిన మీ మొదటి పూరణ, సంధ్యావందనావశ్యకతను స్పష్టపరుస్తూ చేసిన రెండవ పూరణ ఉత్తమములుగా నున్నవి.
విరించి గారు "ఆప్రపదీపము" " అంసువు" నా కర్థము కాలేదు. ఆప్రపదీనమనియా? అంశుకమన్న వస్త్రము. "పురుష అంశుక", "సదా అప్రియము" అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి వర్తిస్తుంది. మీ యభిప్రాయము వివరించ గోర్తాను.
కామేశ్వరరావు గారికీ నమస్కారములు అప్రపదీపమైై మీగాలు వరకు వ్రేలాడుతూ పురుష యంసువు పురుషుని భుజము పై నుండునదనే భావనతో వ్రాసాను పొరపాటైనచో టెలియజేయ మనవి .....నామొబైల్ డిస్ ప్లే పోవడంతో కూడా అక్షరదొషాలవుతున్నాయి ధన్యవాదములతో....
విరించి గారు మీ భావమర్థమైనది. అవి ఆప్రపదీనము, అంసము లు. పురుషాంసము సాధువు. వేయగన్ "ఓ ప్రతిముక్తమై" కూడా సమంజసముగా లేదు. ఇప్పుడు చక్కగా సవరించ గలరని యాశిస్తాను.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మిత్రుల పూరణలను సమీక్షిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి! నా ఒంటి నొప్పులు పూర్తిగా తగ్గలేదు. కంప్యూటర్ ముందు కూర్చొనడం ఇబ్బందిగా ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని నమ్మకం! మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. ******* కవిమిత్రులకు నమస్కృతులు. సాధారణంగా మనం ఏదైనా సమస్యను పూరించినా, పద్యాన్ని వ్రాసినా, వ్యాఖ్యను పెట్టినా స్పందన లేకుంటే నిరుత్సాహపడి వ్రాయడం మానుకుంటాము. ఇది నాకూ అనుభవమే! ఈ మధ్య తరచూ ప్రయాణాలు, అనారోగ్యం తదితర కారణాల వల్ల మీ పూరణలను వెంట వెంట సమీక్షించలేకపోతున్నాను. అయినా ఆసక్తిని కోల్పోక, ఉత్సాహంతో పూరణలు చేస్తూ బ్లాగులో పద్య దీపాలను వెలిగిస్తున్నారు. చాలా సంతోషం! మీ యీ భాగస్వామ్యం కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పద్యం వ్రాసి, దాని గుణదోషాల సమీక్షకై ఎదురు చూడడమే కాకుండా మిగిలిన మిత్రుల పద్యాలపై (వీలైతే) స్పందించండి. అందరికీ ధన్యవాదాలు... దీపావళి శుభాకాంక్షలు!
సుమలత గారు మీ పూరణ బాగుంది. మూడవ పాదము లో యతి భంగము. గురుతును యిచ్చగోరు విసంధి గా వ్రాసారు. కులగురుతు దుష్ట సమాసము. తదనుగుణముగా సవరించ గలరని భావిస్తాను.
బాహ్య చిహ్నాల బాదర బంది లేక
ప్రత్యుత్తరంతొలగించుమనము దేవాలయముగను మదిని దలచి
నిత్య మీశ్వరా రాధన నెఱపు నట్టి
విప్ర వరునకు యజ్ఞోప వీతమేల ?
జనార్దన రావు గారు మీ పూరణ బాగుంది. "బాదర బంది" వ్యవహారికము.
తొలగించుఅప్రియ మైన దేదియు మనంబున లేకయె సత్య వాదియై
ప్రత్యుత్తరంతొలగించుసుప్రియ భావమే మదిని శోభిలు చుండగ జ్ఞాన రూపుడై
విప్రతి పత్తి లేక మది విష్ణువు నందె చెలంగు చుండగన్
విప్రకులావ తంసునకు బేరగు జంద్యమ దేల వేయగన్?
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుజనార్దన రావు గారు మీ పూరణ బాగుంది. మొదటి పాదము లో యతి భంగము. మనంబు లో "నం" లోసంధి లేదు కద.
తొలగించునిజం! ధన్యవాదాలు ! రెండు పద్యాలు సవరిస్తాను.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
ప్రత్యుత్తరంతొలగించుమనుజులందరి యందును మధురిపువును
గాంచుచుండి నలవి దోడ గరిమ నొంది
సర్వవేదసారమరయు సాత్వికుడగు
విప్రవరునకు యజ్ఞోపవీత మేల?
(విప్రుడు = సర్వతోముఖుడు)
క్రొవ్విడి వెంకట రాజారావు మీ పూరణ బాగుంది. "యలవి" అనండి.
తొలగించుసెంటు జాజుల మాలకు సెంట దేల?
ప్రత్యుత్తరంతొలగించుగున్న మామిడి చెట్టుకు గొడుగ దేల?
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మేల?
విప్రవరునకు యజ్ఞోపవీత మేల?
ప్రభాకర శాస్త్రి గారు తేట తెనుగు నానుడి తో మీ పూరణ బాగుంది. "సెంటు" అన్య దేశ్యము కదా.
తొలగించుసంధ్య వార్చడు గాయిత్రి జపములేదు
ప్రత్యుత్తరంతొలగించుమద్య మాంససేవనముల మరగినాడు
జందెమునకర్థమెరుగని జడుడు నట్టి
విప్రవరునకు యజ్ఞోపవీత మేల?
మూర్తి గారు మీ పూరణ బాగుంది. "గాయత్రి" అనండి.
తొలగించు
ప్రత్యుత్తరంతొలగించుచేయ కూడని పనులను చేయుచు నడ
వడిక సరిలేక గొప్పగ వాదముల స
మయము గడుపుచు నితరుల మాయ జేయు
విప్రవరునకు యజ్ఞోపవీత మేల
జిలేబి
జిలేబి గారు మీ పూరణ బాగుంది.
తొలగించుధనముఁ గొన చెడు మార్గముఁ జనక, సతము
ప్రత్యుత్తరంతొలగించుదేవునిభజియించుచు కడు దీక్షతోడ
మనుజుల మనస్సుల కరము మాన్యుడైన
విప్రవరునకు యజ్ఞోపవీత మేల
సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ బాగుంది.
తొలగించుడా.పిట్టా
ప్రత్యుత్తరంతొలగించుక్షిప్ర జగత్తునన్ దొడవు శీలములేయగు తారుమారుగా
నప్రవరాళి క్రాపులను నారడి ద్రొక్కు ద్విచక్ర వాహనా
లప్రియమౌనె బాపనికి నాతలపై దగు రక్ష ,కోటునున్
విప్ర కులావతంసునకు బేరగు జంధ్యమదేల వేయగన్?
నిలిచి మూత్రించు గోచియు నిముడ గనడు
ఉత్తరీయమే యాటంక మురుకు పరుగు
లెక్కడో దారముల ప్రోవు లెక్కయె యది?
విప్రవరునకు యజ్ఞోపవీతమేల?
డా. పిట్టా వారు మీ పూరణ బాగుంది. అప్రవరాళి క్రాపు సమాసము సరి కాదనుకుంటాను.
తొలగించుఆర్యా.........(డా.పిట్టా నుండి)
తొలగించుఅప్రవరాళి జుట్టులను ..అంటే సరపోతుంది కాని అవి ప్రత్యేకంగా యెక్కడుంటాయని ప్రశ్న రాకుండా.క్రాపులనగానే బయటి డిజైన్లు ప్రకటితం.దుష్ట చర్యలకు దుష్ట సమాసం స్వాభావకమని మెచ్చరా?
ఉపనయన మొనరించిన నోర్మి లేక
ప్రత్యుత్తరంతొలగించుసంధ్యవార్చక గాయత్రి స్మరణ లేక
మేకునకు వేసి మాంసమ్ము మెక్కుచుండు
విప్రవరునకు యజ్ఞోపవీత మేల?
పద్యం బాగానే ఉన్నది కాని విప్రవరుడు అంటే విప్రుల్లో శ్రేష్ఠుడు అని అర్థం కదా. అందుచేత అన్వయం పొసగటం లేదు!
తొలగించుధన్యవాదములండీ. సవరించి ప్రచురించగలవాడను.
తొలగించుశాస్త్ర మెరిగిన వాడంచు సన్నుతించి
తొలగించువిప్రులందున మా యూర వేల్పుడనని
సానికొంపల జేరెడు సరసుడైన
విప్రవరునకు యజ్ఞోపవీతమేల?
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుPrayer,
ప్రత్యుత్తరంతొలగించుLet Sri Kandi garu get speedy recovery with today's vipravaraas!
Dr.Pitta
అవనినద్వైతమతమును వ్యాప్తిజేయ
ప్రత్యుత్తరంతొలగించుచంద్రశేఖరుడే పుట్టె శంకరుడన
జగమెరిగిన దేశికుడయి సన్యసింప
విప్రవరునకు యజ్ఞోపవీత మేల.
ఆ ప్రమథాధిపుండిల దయాన్వితుడై ప్రభవించె సర్వలో
కప్రథితంబు బ్రహ్మమె జగత్తిది మిథ్యయటంచుదెల్పగన్
క్షిప్రము శంకరార్యుడయి, శ్రేష్ఠగురుండయి సన్యసింపగన్
విప్ర కులావతంసునకుఁ బేరగు జంధ్య మదేల వేయఁగన్ ||
అధీతో వేద ఇతి విప్రః
రెండు పద్యాలూ బాగున్నాయండీ. జగత్తిది అన్నపదం శ్రుతిసుభగంగా అనిపించటం లేదు నాకు. దాని కన్నా జగంబిది అంటే బాగుంటుందేమో యోచించండి.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుఆర్య! శ్యామలీయం గారూ! అనేక నమస్కారములు. మంచి సవరణ సూచించినారు. ఆలాగే చేసి పంపుచున్నాను. ధన్యవాదములు.
తొలగించుఆ ప్రమథాధిపుండిల దయాన్వితుడై ప్రభవించె సర్వలో
కప్రథితంబు బ్రహ్మమె జగంబిది మిథ్యయటంచుదెల్పగన్
క్షిప్రము శంకరార్యుడయి, శ్రేష్ఠగురుండయి సన్యసింపగన్
విప్ర కులావతంసునకుఁ బేరగు జంధ్య మదేల వేయఁగన్ ||
అధీతో వేద ఇతి విప్రః.
చేతులారంగ శివుని పూజించుకుంటు
ప్రత్యుత్తరంతొలగించునోరు నొవ్వంగ హరికీర్తి నుడుచు కుంటు
సతత సత్సంగ సహృదీ సాధు శీల
విప్రవరునికి యజ్ఞోపవీతమేల
శ్రీరామా రావు గారు మీ పూరణ బాగుంది. "సహృద్సాధు" సాధువు.
తొలగించుఅప్రతిమప్రభావుడయి యద్భుతవాక్యవిశేషయుక్తుడై
ప్రత్యుత్తరంతొలగించుక్షిప్రగతిన్ సమాజమున శ్రేయములన్ సమకూర్చగల్గు వా
డప్రియముల్ దలంచని మహామహుడైన జగత్ప్రసిద్ధుడౌ
విప్రకులావతంసునకు బేరగు జంధ్య మదేల వేయగన్.
నవ్యభావాలు జీర్ణించ నరములందు
కులమతంబుల భేదంబు దలచకుండ
నుండు నీతండు పెండ్లాడ నుత్సహించె
విప్ర! వరునకు యజ్ఞోపవీత మేల.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారు మీ పూరణలు రెండు నుత్తమముగా నున్నవి.
తొలగించువేదసాంప్రదాయములను వెక్కిరించి
ప్రత్యుత్తరంతొలగించుజపతపాదులు జన్నము జందెమేల?
యనెడి, తను మన శ్శుచిలేని యల్పు డైన
విప్రవరునకు యజ్ఞోపవీత మేల.
మూర్తి గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుకదనమున యోధ వరునకు కవచమేల?,
ప్రత్యుత్తరంతొలగించుకన్య పెండ్లాడ తాళిని గట్టనేల?,
విప్రవరునకు యజ్ఞోపవీతమేల?,
విధి యుతములైన కర్మలు పెంపు సేయ.
తిమ్మాజీ రావు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించు"కన్యఁ బెండ్లాడ" అనండి.
తొలగించుగు రు మూ ర్తి ఆ చా రి
ప్రత్యుత్తరంతొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కోడి కూరయె లేకు౦డ కూడు దిగదు
" ఫుల్లు బాటిలు " కొట్టక పోడు నిద్ర
పూజ సేయగ మ౦త్రపు ముక్క రాదు
నోరు విప్పిన బూతు | లాకార పుష్టి ,
యైన , నైవేద్య నష్టి యన్నట్టు లున్న
విప్రవరునకు యఙ్ఞోప వీత మేల ? ?
గురు మూర్తి ఆచారి గారు మీ పూరణ బాగుంది. ఆంగ్ల పదముల యందు మీకు మక్కువ యెక్కువ.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించు
తొలగించుపరహితార్థమె జీవన పథమవంగ
దేహమే దేవళమ్మను తీరు నరసి
శమము, ధర్మము దరిగొని గమన మిడెడి
"విప్ర వరునకు యజ్ఞోపవీతమేల?!"
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుశర్మగారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుఅప్రతికర్ముడై సతము హర్షముతో హరి పూజసల్పుచు
ప్రత్యుత్తరంతొలగించున్నప్రమితమ్ముగా నడపి యాగములన్ ఖజపమ్ము లిచ్చుచున్
ప్రప్రపితామహుండుకని స్వర్గము నుండిముదమ్మునొంద నా
విప్రకులావ తంసునకు బేరగు జంద్యమ దేల వేయగన్
సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ బాగుంది. "అప్రమత్తమ్ముగా" అనండి. "ఖజపమ్ము లీయగన్" అనిన అన్వయము బాగుండుననుకుంటాను.
తొలగించుకామేశ్వర రావు గారు - మీ విశ్లేషణకు ధన్యవాదములు. అప్రమత్తమ్ముగా అంటే భగణం - రగ ణ మౌతుంది గదా?
తొలగించు"అప్రమిత్తముగా" చదివి యట్లు సూచించితిని. మీరు వాడిన అప్రమితమ్ముగా పదము లో దోషము లేదు. నా పొరపాటును మన్నించండి.
తొలగించుఅంతమాటనకండి. గురువుగారి బాధ్యత వహించి కవి మిత్రుల పద్యములను చక్కగా విశ్లేషిస్తున్నందుకు ధన్యవాదములు.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించువిప్ర వరునకు యజ్ఞోపవీత మేల
తొలగించునన గలవు పెక్కు లిల కారణమ్ము లెంచ
యజ్ఞ యాగ వేదాధ్యయ నాది కార్య
నిర్వహణ నిత్య కర్మాది నివహములకు
వప్ర నివాస భాగ్యము నపారము గల్గిన నైన నేమి యు
ద్దీప్రము యజ్ఞసూత్రము విధేయత తోడ ధరింపనొప్పునే
ప్రప్రథమంపు కార్య మది వార్చుట సంధ్య, విహీనమైనచో
విప్ర కులావతంసునకుఁ బేరగు జంధ్య మదేల వేయఁగన్
[వప్రము=కోట, ఉద్దీప్రము=ప్రకాశించునది]
ఆర్యా!
తొలగించుకామేశ్వరరావు గారు,
నమస్కారములు, యజ్ఞోపవీత ధారణకు కారణాలను వివరిస్తూ చేసిన మీ మొదటి పూరణ, సంధ్యావందనావశ్యకతను స్పష్టపరుస్తూ చేసిన రెండవ పూరణ ఉత్తమములుగా నున్నవి.
మూర్తి గారు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుచిన్న సవరణ తో:
తొలగించువిప్ర వరునకు యజ్ఞోపవీత మేల
యనఁ గలవు పెక్కు కారణా లవని నెంచ
యజ్ఞ యాగ వేదాధ్యయ నాది కార్య
నిర్వహణ నిత్య కర్మాది నివహములకు
జ్ఞాన సముపార్జనంబున శ్రద్ధ లేక
ప్రత్యుత్తరంతొలగించుదావరమ్మును జేయుచు ధనము కొఱకు
సాని కొంపల వెంబడి సంచరించు
విప్ర వరునకు యజ్ఞోపవీత మేల?
నాగేశ్వర రావు గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుఆప్రపదీపమై పురుష యంసువుయందుధరింతురే సదా
ప్రత్యుత్తరంతొలగించుయప్రియ మైననేమిల నిరక్షర కుక్షియు నైన తప్పదే
విప్ర కులావతంసునకుఁ బేరగు జంధ్య మదేల వేయఁగ
న్నో ప్రతిముక్తమై తొడుగ నొప్పదు శాస్త్రమనందురన్యులన్
ఉపనయనమను సంస్కార ముర్వినేల
విప్రవరునకు? యజ్ఞోప వీత మేల?
యనుచు సంశయము గలిగి యడిగె నొక్క
పడుచు శాస్త్రమెరిగినట్టి పండితుడను.
విరించి గారు "ఆప్రపదీపము" " అంసువు" నా కర్థము కాలేదు. ఆప్రపదీనమనియా? అంశుకమన్న వస్త్రము. "పురుష అంశుక", "సదా అప్రియము" అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి వర్తిస్తుంది. మీ యభిప్రాయము వివరించ గోర్తాను.
తొలగించుమీ రెండవ పూరణ బాగుంది. "పండితునిని" అనండి.
డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాష నగు.
రామునిని - రాముని, రామునిచేతను - రాముచేతను, రామునికిని - రామునకును.
కామేశ్వరరావు గారికీ నమస్కారములు
తొలగించుఅప్రపదీపమైై మీగాలు వరకు వ్రేలాడుతూ పురుష యంసువు పురుషుని భుజము పై నుండునదనే భావనతో వ్రాసాను పొరపాటైనచో టెలియజేయ మనవి .....నామొబైల్ డిస్ ప్లే పోవడంతో కూడా అక్షరదొషాలవుతున్నాయి ధన్యవాదములతో....
విరించి గారు మీ భావమర్థమైనది. అవి ఆప్రపదీనము, అంసము లు. పురుషాంసము సాధువు. వేయగన్ "ఓ ప్రతిముక్తమై" కూడా సమంజసముగా లేదు. ఇప్పుడు చక్కగా సవరించ గలరని యాశిస్తాను.
తొలగించుసుప్రతిభాసమానుఁడు యశోవిభవాత్మజుఁడార్యపూజిత
ప్రత్యుత్తరంతొలగించుప్రప్రథముండు సద్గురుపరంపర వైభవ దార్శనీకుఁడా
ర్యప్రథితుండు శంకరులు రాజిత దివ్య విశుద్ధ తేజికిన్
విప్ర కులావతంసునకుఁ బేరగు జంధ్య మదేల వేయఁగన్
సంపత్ కుమార్ శాస్త్రి గారు మీ పూరణ ప్రశస్తముగా నున్నది. దార్శనిక సాధువు.
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించువేద శాస్త్రము లెఱిగిన విబుధుడైన
ప్రత్యుత్తరంతొలగించువిప్రవరునకు యఙ్ఞోపవీతమేల
నడ్డ మగును? నిత్యార్చన లాచరించు
వేదమూర్తి దీనినెటుల వీడ గలడు?
శ్రీధర రావు గారు మీ పూరణ ముత్తమముగా నున్నది.
తొలగించువేద విధి నుపవీతమునాది నొంది
ప్రత్యుత్తరంతొలగించుపరమ నిష్టా గరిష్ఠుడై బరగి, పిదప
సర్వ సంగ పరిత్యాగి శంకరునకు
విప్రవరునకు యజ్ఞోపవీత మేల ?
కృష్ణా రావు గారు మీ పూరణ ప్రశస్తముగానున్నది.
తొలగించుసక్రమంబును సాకెడిసాధువైన
ప్రత్యుత్తరంతొలగించువిప్రవరునకు యజ్ఞోప వీత మేల?
ఆత్మగుణములు తొమ్మిది యంటుకొన్న
పరులసేవలె పరమాత్మశరణమనగ?
2.విప్రతి కారమే వదలి విజ్ఞత చేత పరోప కారమే
సుప్రియ మెంచి నీతిగను సూచకు డై మనగల్గు పెద్దయై
విప్ర కులావతాంసునకు బేరగు జంధ్యమదేల వేయగన్
అప్రతి హాస మేల?మనమందరు నొక్కటె నన్నవాడికిన్.
ఈశ్వరప్ప గారు మీ రెండు పూరణలు బాగున్నవి. "నాత్మగుణములు" అన్న బాగుండును.
తొలగించుఅప్రతి హాసము ?
"మనమందరు నొక్కటె యన్నవాడికిన్" అనండి.
తొలగించుసకల శాస్త్రము లన్నియు జక్క జదివి
ప్రత్యుత్తరంతొలగించుపేరు ప్రఖ్యాతు లార్జించి వినుతి కెక్కు
విప్ర వరునకు యజ్నో ప వీత మేల
యవస రమ్మది లేదిల యార్య !వినుము
అన్నయ్య మీ పూరణ బాగుంది.
తొలగించుపుట్టు గిట్టుట మర్మమ్ము బూర్తి దెలిసి
ప్రత్యుత్తరంతొలగించుయాత్మ బరమాత్మ భేధంబులరసి యుండి
సంతసమ్మును బాధను సరిగ గొలుచు
విప్రవరునకు యజ్ఞోపవీతమేల
బాహ్యలంకారములతోడ బనియెగలదె!!!
శైలజ గారు మీ పూరణ బాగుంది. మొదటి పాదమును సవరిస్తే బాగుంటుంది.
తొలగించు"చావు పుట్టుకల నెళవు చక్క నెఱిఁగి" పరిశీలించండి.
బాహ్యాలంకారము సాధువు.
తొలగించుధన్యవాదములు సర్..మీసూచన చాలా బాగుంది..సవరణతో.
తొలగించు"చావు పుట్టుకల నెళవు చక్క నెఱిఁగి
యాత్మ బరమాత్మ భేధంబులరసి యుండి
సంతసమ్మును బాధను సరిగ గొలుచు
విప్రవరునకు యజ్ఞోపవీతమేల
బాహ్యలంకారములతోడ బనియెగలదె!!!
శైలజ గారు బాహ్యలంకారము కూడా సవరించవలెను గదా
తొలగించుకప్రపు రంబునందు గల కాంతలు పెద్దలు సంశయించి రీ
ప్రత్యుత్తరంతొలగించువిప్ర కులావతంసునకు బేరగు జంధ్య మదేల వేయగన్
విప్ర కులావతంసుడును వేలుగ శాస్త్రము లెన్నియో దగన్
విప్రులు మెచ్చగా దనర వేమఱు సారులు పాఠ నంబునన్
అన్నయ్య నీ పూరణ బాగుంది. వేమఱు అంటేనే ఎన్నో సారులు కద!
తొలగించుకామేశ్వర రావు గారికి, నమస్సులు
ప్రత్యుత్తరంతొలగించుసవరించినవి ప్రచురిస్తున్నాను.చూడ మనవి.
*****%%%%*****
బాహ్య చిహ్నాల డంబాల బరువు లేక
మనము దేవాలయముగను మదిని దలచి
నిత్య మీశ్వరా రాధన నెఱపు నట్టి
విప్ర వరునకు యజ్ఞోప వీతమేల ?
*****
అప్రియ మైన దేది మనమందున లేకయె సత్య వాదియై
సుప్రియ భావమే మదిని శోభిలు చుండగ జ్ఞాన రూపుడై
విప్రతి పత్తి లేక మది విష్ణువు నందె చెలంగు చుండగన్
విప్రకులావ తంసునకు బేరగు జంద్యమ దేల వేయగన్?
*******
అప్రియ మైన దేదియు మదియందున లేకయె సత్య వాదియై
సుప్రియ భావమే మదిని శోభిలు చుండగ జ్ఞాన రూపుడై
విప్రతి పత్తి లేక మది విష్ణువు నందె చెలంగు చుండగన్
విప్రకులావ తంసునకు బేరగు జంద్యమ దేల వేయగన్?
&&&***&&&
సవరించిన రెండు పూరణలు చక్కగనున్నవి.
తొలగించుధన్య వాదాలు !
తొలగించుపోచిరాజు కామేశ్వర రావు గారూ,
ప్రత్యుత్తరంతొలగించుమిత్రుల పూరణలను సమీక్షిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి!
నా ఒంటి నొప్పులు పూర్తిగా తగ్గలేదు. కంప్యూటర్ ముందు కూర్చొనడం ఇబ్బందిగా ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని నమ్మకం!
మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను.
*******
కవిమిత్రులకు నమస్కృతులు.
సాధారణంగా మనం ఏదైనా సమస్యను పూరించినా, పద్యాన్ని వ్రాసినా, వ్యాఖ్యను పెట్టినా స్పందన లేకుంటే నిరుత్సాహపడి వ్రాయడం మానుకుంటాము. ఇది నాకూ అనుభవమే! ఈ మధ్య తరచూ ప్రయాణాలు, అనారోగ్యం తదితర కారణాల వల్ల మీ పూరణలను వెంట వెంట సమీక్షించలేకపోతున్నాను. అయినా ఆసక్తిని కోల్పోక, ఉత్సాహంతో పూరణలు చేస్తూ బ్లాగులో పద్య దీపాలను వెలిగిస్తున్నారు. చాలా సంతోషం! మీ యీ భాగస్వామ్యం కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పద్యం వ్రాసి, దాని గుణదోషాల సమీక్షకై ఎదురు చూడడమే కాకుండా మిగిలిన మిత్రుల పద్యాలపై (వీలైతే) స్పందించండి.
అందరికీ ధన్యవాదాలు...
దీపావళి శుభాకాంక్షలు!
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విశ్రాంతి తీసుకున్న త్వరగా కోలుకోగలరు.
తొలగించు
ప్రత్యుత్తరంతొలగించువేదపారంగతుడితడు విశ్వమందు
సకలశాస్త్రము లెల్లను చక్కగాను
నేర్చినట్టి దిట్ట కవికి నిక్కమైన
విప్రవరునకు యజ్ఞోపవీతమేల.
ప్రత్యుత్తరంతొలగించువేదపారంగతుడితడు విశ్వమందు
సకలశాస్త్రము లెల్లను చక్కగాను
నేర్చినట్టి దిట్ట కవికి నిక్కమైన
విప్రవరునకు యజ్ఞోపవీతమేల.
డా. ఉమా దేవి గారు మీ పూరణ బాగుంది. సకల ఎల్లను పునరుక్తి కద. వేద పారంగతుడన్నారు మరి యజ్ఞోపవీత ప్రాశస్త్యము తెలియదంటారా?
తొలగించుజాతి ధర్మమెరుగక స్వఛ్చతను వీడి
ప్రత్యుత్తరంతొలగించునవ్య నగరంపు విద్యల నాదరించి
కేవలము కులగురుతును యిచ్చగోరు
విప్రవరునకు యజ్ఞోపవీత మేల ?
వరుడు : పెండ్లికుమారుడు
సుమలత గారు మీ పూరణ బాగుంది. మూడవ పాదము లో యతి భంగము. గురుతును యిచ్చగోరు విసంధి గా వ్రాసారు. కులగురుతు దుష్ట సమాసము. తదనుగుణముగా సవరించ గలరని భావిస్తాను.
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదములండీ, మారుస్తాను.
తొలగించుజాతి ధర్మమెరుగక స్వఛ్చతను వీడి
తొలగించునవ్య నగరంపు విద్యల నాదరించి
మిగుల కేవల కులనామ మిచ్చగోరు
విప్రవరునకు యజ్ఞోపవీత మేల ?
సుమలత గారు దీపావళి శుభాకాంక్షలు. సవరించిన మీ పూరణ బాగుంది. 2,3 పాదాలలో "అఖండ యతి"ని వాడారు. తప్పు లేదు. కొంతమది వాడరు.
తొలగించుహార్దిక దీపావళి శుభాకాంక్షలు. నేను గబగబ వ్రాసినాను. క్షమించగలరు. తీరికగా అలోచించి ఒక్క పని కూడా చేయలేను. సమయాభావము. ఇప్పుడు కూడా...ఏదో పని తొందర.
తొలగించుకామేశ్వరరావు గారికి వందనములు. శ్యామసీయంగారి సలహా ప్రకారం అన్వయ పరచుచు మరియొక పద్యమును ప్రచురించితిని. దయతో పరిశీలించ ప్రార్థన.
ప్రత్యుత్తరంతొలగించుసహదేవుడు గారు సవరించిన మీ పూరణ బాగున్నది.
తొలగించు