30, అక్టోబర్ 2016, ఆదివారం

సమస్య - 2185 (ఫాల్గుణమున దీపావళి...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దేవా ఫాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే"
లేదా...
"ఫాల్గుణమున దీపావళి పండుగ కద"

86 కామెంట్‌లు:

  1. (1)
    (ఫాల్గుణ మాసంలో పెండ్లి జరుగనున్న అమ్మాయి స్వగతం....)

    యావజ్జీవము కన్నెగానె బ్రతుకంతా చీకటే నిండు నం
    చా వయ్యారి తలంచఁ బెండ్లి కుదురన్ హాయిన్ దలంచెన్ "హరీ!
    దేవా! ఫాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే
    భావింపంగను నాదు జీవిజము దీపజ్యోతులన్ వెల్గగన్"
    (2)
    ఉల్లమలర వచ్చును వసంతోత్సవమ్ము
    ఫాల్గుణమున; దీపావళి పండుగ కద
    తిమిరసంహారి, వచ్చు దేదీప్యమగుచు
    నాశ్వయుజ మాసమున, ముద మంద జనులు.

    రిప్లయితొలగించండి
  2. బాస చేసితిని కొనగ పట్టు చీర
    ఫాల్గుణమున ; దీపావళి పండుగ కద
    యనుచు కొత్త చీర మరల యడుగ నేల?
    ముందు కొన్నది యుండ మామూలు చీర.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      'మరల నడుగ నేల' అనండి.

      తొలగించండి

  3. అందరకూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు:
    .
    "హోళి" రంగుల పండుగ కేళి వచ్చు
    ఫాల్గుణమున; దీపావళి పండుగ కద
    శరదృతువులోని యాశ్వయుజమున నమవ
    సను, వెలుగుపూలు ముంగిట గనగనగును!

    రిప్లయితొలగించండి
  4. భావింపన్ భరతోర్వి మిక్కుటముగా పర్వంబులేయుండగా
    నీవేరీతిని లెక్కఁబెట్టెదవు తండ్రీ ! హోళికా పర్వమున్
    దేవా ! ఫాల్గుణమందు వచ్చును గదా; దీపావళీ పర్వమే
    ఠీవిన్నాశ్వయుజమ్మునన్ ముదముఁబాటింపన్ వలెన్ నేర్వుమా!

    భారతోర్వి పండుగలకు మేరలేదు
    బాలకా! కామదహనమ్ము పర్వదినము
    ఫాల్గుణమున; దీపావళి పండుగ కద
    యాశ్వయుజ మాసమున్ వచ్చునరయుమయ్య !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. కావంగన్నిను వేడు కొంటిని గదా కష్టాల గట్టెక్కగా !
    ఏవేళన్నిను వీడ కుంటిని గదా యీశా!మహేశా!ప్రభో !
    సేవల్పూజలు పెక్కు చేసితినిగా ! క్షీరాభి షేకమ్ములన్
    దేవా!ఫాల్గుణమందు; వచ్చును గదా దీపావళీ పర్వమే !

    రిప్లయితొలగించండి
  6. శిశిర ఋతువంట చలిమంట చెలియ చెంత
    పాల్గుణమున , దీపావళి పండుగ కద
    కోటి దివ్వెల కాంతులు కురియు జగతి
    కొత్త జంటల మదినిండ కులుకు వలపు

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    "పోవా కష్టములష్టమాశనియునున్పూర్ణంబు నీ జన్మనే
    రావా రాహువు కేతువుల్ గురువదే రంజిల్లగా చీకటుల్
    లేవా పోవగ ?న"న్న బృచ్ఛకునికిన్ లిప్తన్ గణించెన్ తగన్
    "దేవా!ఫాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే!"
    సూర్య గణనముత్తర దేశ సుగమ విద్య
    దక్షిణాదిన చంద్రునాధారముగను
    జరుగు జ్యోతిష్య కళల నిజాలు తెలియ
    ఫాల్గుణమున దీపావళి పండుగ కద!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'అష్టమశని'ని 'అష్టమాశని' అన్నారు. అక్కడ "కష్టము లష్టమంపు శనియు న్బూర్ణంబు..." అనండి.

      తొలగించండి
  8. గురువర్యులకు, కవిమిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. ...........పూజ్య గురుదేవులకు,కవిమిత్రులందరకూ పేరుపేరునా "దీపావళి పండుగ శుభాకాంక్షలు"........

    రంగు రంగుల పండుగ చెంగలించు
    ఫాల్గుణమున, దీపావళి పండుగ కద
    తిమిరమును పార ద్రోలుచు ధిషణిలోన
    వచ్చునాశ్వయుజమ్మున భాసురముగ !!!

    రిప్లయితొలగించండి
  10. అందరికి దీపావళి పర్వదినోత్సవ శుభాకాంక్షలు

    ఆవిద్యార్థికి జన్మమాస మగుటన్ హర్షంబుతో మిత్రులన్
    రావించున్, బహుదీపపంక్తు లచటన్ రమ్యంబుగా నుంచుచున్
    వేవేల్ దీవెన లందుచుండి పలుకున్ విన్నాణ మేపారగా
    దేవా!ఫాల్గుణమందు వచ్ఛును గదా దీపావళీ పర్వమే.

    వత్సరాంతంబు నిజముగ వత్స! వినుము
    ఫాల్గుణమున, దీపావళి పర్వము గద
    యాశ్వయుజమున, కార్తీకమందు పిదప
    శివుని గొల్చిన నబ్బును స్థిరసుఖంబు.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ఫాల్గుణంలో పుట్టిన వాని జన్మదిన దీపావళి ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  11. మాస్టరుగారికి, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు.

    సీసము:
    ధరలు ధరను వీడి 'తార జువ్వ'ల వోలె
    పైకెగయక కనబడిన నాడు
    భుగభుగ మంటలన్ 'భూచక్రము'గ గాక
    చల్లబడుచు భూమి సాగు నాడు
    మారణ హోమాల మానవ 'బాంబు'లే
    మహిని పేలక శాంతి మసలు నాడు
    సరిహద్దు దేశమ్ము సరి 'చిచ్చు' బుడ్డులే
    మండించకుండగా నుండు నాడు

    తేటగీతి:
    స్త్రీల, బాలల బట్టుక జెరచు ఖలుల
    'విష్ణుచక్రమ్ము' ఖండించి వెలుగునాడు
    నిండు వెలుగులు భువిపైన మెండుగాను
    నిజము దీపాల పండుగౌ ప్రజకు నాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.

      తొలగించండి
    2. హనుమచ్ఛాస్త్రి గారూ కవనప్రపంచములో నిజమైన దీపావళి పండుగ జరుపు కున్నారు. దేదీప్యమానముగా వెలుగు చున్నది మీ పద్యము.

      తొలగించండి
    3. మాస్టరుగారికి, పోచిరాజు వారికి ధన్యవాదములు.

      తొలగించండి
  12. పూజ్యశ్రీ శంకరయ్య గారికి నమోనమ:


    అమెరికా లోన నివసించు నాంధ్రు డొకడు
    పెండ్లి చూపున కేతెంచి బెండ్లి యాడ
    నర్ధ జ్ఞానమ్మున బలికె నర్భకుండు:
    "ఫాల్గుణమున దీపావళి పండుగ కద"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అర్ధ జ్ఞాన' మన్నచోట జ్ఞ చేత ర్ధ గురువై గణదోషం. "అర్ధమౌ జ్ఞానమున బల్కె నర్భకుండు" అనండి.

      తొలగించండి
    2. అర్ధమైనది...ధన్యవాదాలు! గురువర్యా!

      తొలగించండి
  13. దీపావళి శుభా కాంక్షలు
    రాక్ష సుండగు నరకుని గక్షతోడ
    సంహ రించిన యాసతి సత్య భామ
    శాంత రూపము వహియించి సంతసమున
    బ్లాగు కవులకు నీయుత ! వరము శతము

    రిప్లయితొలగించండి
  14. పద ప్రహేళిక నింపగ బాటుబడుచు
    తెలుగుమాసము,వరుసన దీపకళిక
    లనుచు కనబడ పూరించె లాఘవమున
    ఫాల్గుణమువ,దీపావళిపండుగ కద

    రిప్లయితొలగించండి
  15. చెట్ల యాకులు రాలును జిత్ర ముగను
    ఫాల్గుణమున ,దీపావళి పండుగ కద
    వచ్చు నాశ్వయుజ బహుళ పక్ష యమవ
    సముననే టే ట దప్పక సత్కవి వర !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పక్ష+అమవస' అని విసంధిగా, దుష్టసమాసాన్ని వ్రాయకూడదు కదా! "...బహుళ పక్షమందు। నమవసను బ్రతివత్సర మమలకీర్తి!" అందామా?

      తొలగించండి
  16. మాన్యులు శంకరయ్యగారికి, తదితర కవిపండితమండలికి, దీపావళి శుభాకాంక్షలు.

    కాముపున్నమి యేతెంచు ఘనతరముగ
    ఫాల్గుణమున-దీపావళి పండుగకద
    ఆశ్వయుజమున జనులెల్ల హ్లాదమంది
    వెల్గురేఖలు పంచెడు వేదికనగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వేదిక+అనగ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ 'వేదిక యన' అనండి.

      తొలగించండి
  17. కామ దహనము గావించి కాంతు లీను
    రంగులను జిమ్ము పండుగ రంజిలంగ
    ఫాల్గుణమున, దీపావళి పండుగ కద
    ఆశ్వయుజ మందు వెలుగులనవని నింపు !

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    రా వీ రోజుల లోని పిల్లలకు నా౦ధ్ర౦ బ౦దు

    …………… మాసాల పే

    ర్లేవిన్ | " య౦ . ఇ . ఒ " పాఠశాల c జని

    ………………… ప్రశ్ని౦చ౦గ నొక్క౦ డనెన్

    " దేవా ! ఫాల్గుణ మ౦దు వచ్చును గదా

    ……………… దీపావళీ పర్వమే "

    యేవన్ జె౦దిన " ఆఫిసర్ " మిగుల

    ………… ని౦ది౦చె న్నుపాధ్యాయునిన్


    { దేవా = S i r ! ఏ వ జె౦ దు =

    అసహ్య పడు }


    ………………………………………………………

    దీ పా వ ళీ పర్వదిన వ ర్ణ న

    ========================


    అ ౦ బు రు హ వృ త్త ము

    :::::::::::::::::::::::::::::::::::::


    మె౦డుగ మ్రోగు పటాకుల సవ్వడి

    ………… మేళవి౦చు జయధ్వనిన్

    ప౦డుగ గొల్పును పూల మతాబులు

    ……… భాగ్య రేఖల నీనుచున్

    మ౦డును దీపపు టావళి ము౦గిట

    ………… మ౦గళ౦ బగు జ్యోతులై !

    ని౦డుకొనున్ గద య౦దరి డె౦దము ని౦డుగా

    ………………… ముద మీయడన్ !



    ి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ, దీపావళి పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. ఆ వైవాహిక కార్య సంచయము సత్యంబై ప్రవర్తింపగన్
    దైవానుగ్రహమున్నఁ జాలు నిక నిత్యంబున్ సుపర్వంబులే
    దేవా ఫాల్గుణమందు, వచ్చును గదా దీపావళీ పర్వమే
    ప్రావృట్కాలము దాట నివ్వసుధ సంరంభమ్ములుప్పొంగగన్


    కాల గమన మాపగ లేడు కాలు డైన
    నాశ్వయుజమున గాని మహాశివ హరి
    నీరజభవు లడిగిన రానేర దెపుడు
    ఫాల్గుణమున దీపావళి పండుగ కద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యభామ కృష్ణుని చిరునవ్వులొలుకు చూపులతోటి, నరకుని కోపంగా చూస్తూ యుద్దము చేస్తున్నప్పుడామె ముఖ గాంభీర్యాన్ని చూసి కృష్ణునికి ననురాగానందములు, నరకుడికి రౌద్ర రూపము కనిపించి భయాటోపములు కలుగుతాయి. విభిన్న ముఖకవలికలతో ఉన్న వారిని చూస్తూ యుద్దము చేసి నరకుని సైన్యాన్ని ఖండిస్తుంది. ఆ సందర్భము:



      అంభోజాక్షుని భూమిపుత్రుఁ జిరుహర్షావేశ దృగ్జాలల
      న్నంభోజాననజూచి ఘోర తర బాణాగ్రక్షతేంద్రారి యా
      గంభీరానన రౌద్ర రూపి యనురాగహ్లాద సంత్రాస సం
      రంభాహార్యుల సత్యభామ గని పోరాడెన్ రణోత్సాహియై

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు, వాటి ననుసరించి అందించిన పద్యం మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి నమస్సులు! చాలా బాగున్నదండీ మీ పద్యము!

      నిన్న నేను "పద్యాల సవ్వడి"లో నరకాసుర సంహార కథను తేటగీతులలో వ్రాసిన సందర్భములోని దీ పద్యము. చిన్న పద్యము కావున వర్ణనయు జిన్నగనే చేసితిని. గమనింపుడు:

      ఒక్క కంటను హరిని నింకొక్క కంట
      వైరిఁ జూచుచు శృంగార వీరములును
      స్నేహ రోషాలు ముఖమునఁ జిందులాడ
      ధనువు నంది విజృంభించెఁ ద్వరగ సత్య!

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. ధన్యవాదములు.
      మీ పద్యము మనోహరముగా నున్నది.
      పోతనామాత్యుని పద్యస్ఫూర్తితో వ్రాసితిని నేనా పద్యము.

      తొలగించండి
    5. సంతోషమండీ! పోతనకు గూడా స్ఫూర్తి నిచ్చినవాడు నాచన సోమన. ఆయన "అరిఁ జూచున్ హరిఁ జూచు..." పద్యం ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. పూర్వకవి స్మరణము సంతోషదాయకము గదా! ధన్యవాదములు!

      తొలగించండి
  20. జాగరణ చేసి శివుని పూజలను సల్పు

    నమవస దినము శివరాత్రి యరుగుదెంచు

    ఫాల్గుణమున; దీపావళి పండుగ కద

    యాశ్వయుజ మాసమందున, యందరిండ్ల

    వేల దీపాల కాంతులు వెలుగులీను.

    రిప్లయితొలగించండి


  21. రమానాధుని కాకా బట్టి దీపావళి ని ఫాల్గుణమునకు మార్చేసా మండీ :)


    రావమ్మాయని బిల్వ తా బిరబిరా రాదా రమానాథ ! మా
    దేవా! ఫాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే ?
    భావావేశము మీ కవీంద్రు లకు మేల్భాసించు సొమ్ముల్ గదా
    ధీ వాక్కేళియనన్ జిలేబి వినువీధిన్తార లేమారు బో !

    జిలేబి


    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

    [ఏయే మాసములం దేయే పర్వములు వచ్చుననఁగాఁ దికమకపడి ముందువెనుకలుగాఁ జెప్పిన శిష్యునిఁ దిట్టుచున్న గురువుగారి పలుకులు]

    "భావిం జూడఁగలేక ముందువెనుకల్ వల్కంగఁ దప్పే యగున్!
    నీవే యాశ్వయుజాన హోళి యగునం; చీరీతి నజ్ఞానమం

    దేవా? ఫాల్గునమందు వచ్చును గదా! దీపావళీ పర్వమే
    ప్రోవ న్నాశ్వయుజాన వచ్చుఁ గదరా! మూర్ఖంపు గ్రామాశ్వమా!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అందెదవా' అన్నదానిని 'అందేవా' అనడం సాధువు కాదేమో అని సందేహం!

      తొలగించండి
    2. సమస్యాపూరణము గదా యని ["అందేవా?"=అందితివా?] వ్యావహారికమును (హాస్యమునకై) వాడితిని. దీనిని సవరించితిని. పరిశీలింపగలరు.

      "భావిం జూడఁగలేక ముందువెనుకల్ వల్కంగఁ దప్పే యగున్!
      నీవే యాశ్వయుజాన హోళి యగునంటే? యయ్యొ! తప్పయ్యె నో
      దేవా! ఫాల్గునమందు వచ్చును గదా! దీపావళీ పర్వమే
      ప్రోవ న్నాశ్వయుజాన వచ్చుఁ గదరా! మూర్ఖంపు గ్రామాశ్వమా!"

      తొలగించండి
    3. మధురకవి గారూ,
      సవరించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  23. ఓ భర్తతో తన సతి:

    కూతురు వివాహ లగ్నమ్ము గుర్తెరుగము
    ఫాల్గుణమున, దీపావళి పండుగ కద
    నేడు, చూడ మిగిలె నాల్గు నెలలె మనకు
    చేయవలసిన పనులేవొ వ్రాయుమయ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. రావా మిత్రుని బెండ్లికైన నిటకున్ రమ్యంబులౌ జ్ఞాపికల్
    దేవా ఫాల్గుణమందు? వచ్చును గదా దీపావళీ పర్వమే
    బావా! యాశ్వయుజంబులోన నపుడే వత్తున్ ననున్ నమ్ము మం
    టావా? యంచును సాగె వారి నడుమన్ హర్షంపు సల్లాపముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అంటావా' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
    2. ఆర్యా!
      నమస్కారములు, సవరించాను.

      రావా మిత్రుని బెండ్లికైన నిటకున్ రమ్యంబులౌ జ్ఞాపికల్
      దేవా ఫాల్గుణమందు? వచ్చును గదా దీపావళీ పర్వమే
      బావా! యాశ్వయుజంబులోన నపుడే వత్తున్ హరీ! నమ్ము నా
      భావం బంచును సాగె వారి నడుమన్ బల్మారు సల్లాపముల్.

      తొలగించండి
  25. గురువర్యులకు , కవి మిత్రులకు మఱియు బ్లాగు వీక్షకులందరికి దీపావళి శుభాకాంక్షలు.
    పాడ్యమి, విదియ తదియల వరుస కాదు!
    మెయిని దీపావళి ప్రతి యాశ్వయుజ మందె
    వచ్చుచుండు! నెటులగు శ్రావణములోన,
    ఫాల్గుణమున? దీపావళి పండుగ కద!
    (మెయిని = భూమిపై)
    'వచ్చుచుండు' బదులుగా 'పలుకరించు' అంటే ఇంకా బాగుంటుందేమో తెలుప గలరు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చుచుండు/పలుకరించు' ఏదైనా సరియే!

      తొలగించండి
  26. మాధవుని భజియించిన మంచి జరుగు
    ఫాల్గుణమున, దీపావళి పండుగ కద
    నరక సంహార మొనరించనల్లనయ్య
    ప్రజలు ప్రీతి జరుపుకొను పర్వదినము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. బావా! న్యాయము గాదు రంగులను నాపై జల్లగా గూడదే
    భావోద్రేకము చెందబోకు మనుచున్ ప్రార్థింతు హోళీ యదే
    దేవా ఫాల్గుణ మందు వచ్చును గదా, దీపావళీ పర్వమే
    తా వచ్చెన్ గద నేడు గాంచుమదిగో దండైన దీపావళుల్

    భరత భూమిఁ రంగులనాడు పౌర్ణమదియె
    వచ్చునట హోళి యనునొక పర్వదినము
    "ఫాల్గుణమున, దీపావళి పండుగ కద
    యాశ్వయుజయమా వాస్యనే యాచరింత్రు

    రిప్లయితొలగించండి
  28. మావారల్ శుభమెంచి నిశ్చయమునే మామామతోజేసిరే
    దేవా|పాల్గుణ మందు|”వచ్చునుగదాదీపావళి పర్వమే
    రావా చూపుల కందవా మనసునన్ రాద్దాంతమేమాన్పగా
    జీవంబన్నదినిన్నుగోరుగద సంజీ వంబు నీబంధమౌ|

    రిప్లయితొలగించండి
  29. పూవిల్కాడు ఘటిల్లజేయు యువతన్ మోహమ్ము శీఘ్రమ్ముగా
    దేవా! ఫాల్గుణమందు, వచ్చును గదా దీపావళీ పర్వమే
    చేవం జూపి నిశాచరుండు నరకున్ శ్రీజాని త్రెళ్ళించగన్
    కావం దేవతలన్ మనుష్యులను లోకమ్మందు శాంతిన్ గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కావన్+దేవతలన్' అన్నపుడు ద్రుతం పూర్ణబిందు రూపాన్ని పొందదు. 'కావన్ దేవతలన్' అనే ఉంటుంది.

      తొలగించండి
  30. రాముడనదేవుడుగద, రాజధాని
    హస్తినాపురమేగద, హాస్యమొక్క
    రసము గాదామరియు శిశిరమ్ము గాద
    ఫాల్గుణమున, దీపావళి పండుగ కద.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'దేవుడే గద..' అనండి.

      తొలగించండి
    2. మాస్టరుగారికి, జనార్దన్ గారికి ధన్యవాదములు.
      సవరణతో..

      రాముడనదేవుడేగద, రాజధాని
      హస్తినాపురమేగద, హాస్యమొక్క
      రసము గాదామరియు శిశిరమ్ము గాద
      ఫాల్గుణమున, దీపావళి పండుగ కద.

      తొలగించండి
  31. డోల పౌర్ణిమ నే నెల గ్రాలుచుండు?
    ఫాల్గుణమున.,దీపావళీ పండుగ కద,
    నరకునిన్,లోకకళ్యాణ మరసి శౌరి
    హత మొనర్చగ, జేతురు హర్ష మలర.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పౌర్ణిమ యేనెల..' అనండి.

      తొలగించండి
  32. ఆకు రాలుచు నుండును నవని యందు
    ఫాల్గుణమున,దీపావళి పండుగ గద
    వచ్చు నాశ్వీజ మాసాన ఖచ్చితముగ
    భక్తి తోడ నాచరింత్రు ప్రజలు భువిని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. 'భక్తితోడ నాచరింతురు ప్రజలు భువిని' అనండి.

      తొలగించండి
    2. భక్తితో నాచరింతురు ప్రజలు భువిని...అంటే సరిపోతుంది. లేకుంటే గణభంగ మవుతుంది.

      తొలగించండి
  33. డా.పిట్టా
    అమవస..భరతోర్వి మిక్కుటముగలో భరతోర్విన్ అవసరం కాదా..జేసితినిగా.వ్యావ.కాదా.కార్తీకమా.కార్తికమా..మాసమందున నందరిండ్ల..యందరిండ్ల.దండైన దీపావళుల్..
    ఆర్యా వీటి నిజ స్వరూపాలు తీరికగా తెలుపండి

    రిప్లయితొలగించండి
  34. గురుదేవుల సూచనతో సవరించిన పద్యము

    డోల పౌర్ణిమ యే నెల గ్రాలుచుండు?
    ఫాల్గుణమున.,దీపావళీ పండుగ కద,
    నరకునిన్,లోకకళ్యాణ మరసి శౌరి
    హత మొనర్చగ, జేతురు హర్ష మలర

    రిప్లయితొలగించండి