31, అక్టోబర్ 2016, సోమవారం

సమస్య - 2186 (రణమేగా సుఖశాంతు లిచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్"
లేదా...
"రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

109 కామెంట్‌లు:

  1. కం.తృణములగుచు బ్రాణములే
    క్షణమైనను శాంతిలేక చను భువిలో స
    ద్గుణములతో నల్లిన తో
    రణమేగా సుఖ శాంతులిచ్చి రంజిల జేయున్.
    ****&&&&*****
    మ.ఋణగ్రస్తమ్మగు పేద దేశముల దుర్నీతిన్ దగా చేసి దా
    రుణమౌ పద్ధతి దోచు రాజ్యముల దారుల్ మార్చి యెట్లేని త
    క్షణమే యల్లిన మేలిమౌ వివిధ దేశ స్నేహ బంధాల తో
    రణమేగా సుఖ శాంతులిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్.
    &&&&&=====&&&&&
    తృణములగుచు బ్రాణములే
    క్షణమైనను శాంతిలేక చను భువిలో స
    ద్గుణములతో నల్లిన తో
    రణమేగా సుఖ శాంతులిచ్చి రంజిల జేయున్.
    ****&&&&*****
    (తృణ సమమై ప్రాణమ్ములు?)

    రిప్లయితొలగించండి
  2. క్షతవ్యుడను."రణమేగా" అని కంద పద్యంలో తప్పుగా టైప్ అయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తత్క్షణము' అనండి.

      తొలగించండి
    2. శంకరయ్య గారికి, నమస్సులు !
      సవరణ చేసినందులకు ధన్య వాదాలు!

      తొలగించండి


  3. జనులకు కీడొనరించును
    రణమే, సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్
    మనమొండొరుపట్ల సుమన
    మునుగొన్నయెడల ప్రపంచమున మేలుగనౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. గురువర్యా!

    నాఈ వార్ధక్యములో దుస్సంధులూ దుష్టసమాసములూ మన్నింపగోరుచూ సరదాగా:


    క్షణమొక యుగమై గడిచెడి
    రణగొణ ధ్వనిపూరిత దినరాత్రుల, మీస
    ద్గణభరిత సమస్యాపూ
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణం బాగున్నది. అభినందనలు.
      '..గొణధ్వని' అన్నపుడు ణ గురువై గణదోషం. 'రణగొణ శబ్ద సహిత దినరాత్రుల..' అందామా?

      తొలగించండి
  5. క్షణమొక యుగముగ గడుపుచు
    క్షణికా వేశమున మునిగి క్షైణ్యము కంటెన్
    గణముల గుచ్చెడి మాలల
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా!
      నమస్కారములు,
      అనిల్ కుమార్ గారి పద్యములలో ప్రాసాక్షరము విస్మరించుట జరిగినదా, లేక ర,ణ లకు ప్రాస చెల్లునా?

      తొలగించండి
    3. నిజమేనండోయ్... నేను గమనించనేలేదు. ధన్యవాదాలు.
      ******
      అనిల్ కుమార్ గారూ,
      ప్రాసదోషాన్ని సవరించి క్రొత్తగా పూరించండి.

      తొలగించండి
    4. అప్పకవీయం లో ర,డ లకభేదం చెప్పినట్లు గుర్తున్నది. మరి ర,ణల విషయమేమిటో తెలియదు.

      తొలగించండి
    5. ఆర్య! అనేక నమఃపూర్వక ధన్యవాదములు. పొరపాటు జరిగినది. సవరించి పంపుతాను.

      తొలగించండి
    6. ఆర్య ! అనేక నమస్కారములు. సవరించిన పద్యమును పంపుతున్నాను. ధన్యవాదములు.

      గణుతింపన్ తమ పూర్వజన్మకృత సంస్కారంబులే ప్రాణికిన్
      పణమౌ నూత్న విభిన్నదేహములలోనంబుట్టి జీవించుటన్
      చణుడే ధాత్రి గ్రహించుపుణ్యగతి మోక్షంబెన్నుచున్, పాప వా
      రణమేగా సుఖశాంతులిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్ ||

      గణుతింపఁ బ్రాణికోటికి
      పణమౌ గతజన్మపుణ్య ఫలముల్ ధాత్రిన్
      చణుడెరిగిమసలు, దురితహ
      రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్ ||

      తొలగించండి
    7. అనిల్ కుమార్ గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. మునివందిత సురపూజిత
    ప్రణవరూపు హరి పాద పద్మములందున్
    మనమునునిలుపుచుకోరుశ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదం ప్రారంభంలో గణదోషం. "ప్రణవాకారు హరి పాద..." అనండి.
      (మీరు వృత్తరచన ఎప్పుడు ప్రారంభిస్తారు? అవి కూడా అభ్యాసం చేయండి)

      తొలగించండి
  8. డా.పిట్టా
    క్షణమున్ దీరికలేక లౌక్యములనే సంకెళ్ళలో గ్రాలగా
    రణమౌ జీవనయాన మీ యవనినిన్ రమ్మింక నాధ్యాత్మ స
    ద్గుణమౌ నొక్క వ్రతోపవాస విధినిన్ గూర్చంగ యాకొన్న పా
    రణమే యౌ సుఖశాంతులివ్వ మనకున్ రంజిల్ల జేయన్ మదిన్
    ఫణమొడ్డిన సాహసపుం
    కణముల్ గుమిగూడి సైన్య గములేర్పడగా
    క్షణికపు జీవన సుఖమా?!
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిలజేయున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అనే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'లౌకికములన్ సంకెళ్ళలో..' అనండి.
      'సాహసపుం గణముల్' అనండి. పుంప్వాదేశంలో ఉత్తరపదాది పరుషం సరళమౌతుంది.

      తొలగించండి
  9. గణములు, యతి ప్రాసలతో
    రణమును బ్రకటించ శంకరార్యుని పద తో
    రణమందు సమస్యా పూ
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిల జేయున్!

    రిప్లయితొలగించండి
  10. మునివందిత సురపూజిత
    ప్రణవరూపు హరి పాద పద్మములందున్
    మనమునునిలుపుచుకోరుశ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      రెండవపాదంలో గణదోషానికి పైన సవరణను సూచించాను. గమనించండి.

      తొలగించండి
  11. కని,విని,చదివిన శ్రమియిం
    చిన వారలు వృద్ధినందు జీవితచరితల్
    మనకొన గూర్చెడు చిరు ప్రే
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిలఁజేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. గుణముల్ దాల్చుట, సజ్జనాప్తు లగుటల్, కూర్మిన్ సదాచారులై
    యణుమాత్రం బవినీతి లేక సతతం బంతస్థమౌ వైరి షట్
    గణమున్ సత్త్వవిహీనమౌ విధముగా గావించి యద్దాని మా
    రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్.

    రణములకు చేరకుండుట
    గుణహీనులతోడ చెలిమి కోరక భువిలో
    ప్రణతులు గొనదగు గుణధా
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. మూర్తి గారు చక్కటి పూరణ. "షడ్గణమున్"(జస్త్వ సంధి) అనండి.

      తొలగించండి
  13. రణమే కనుడిది సరి ప్రే
    రణమును తానీయ గురుడు రంజిలునటు ధా
    రణమునను సమస్యా పూ
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "రణమున సమస్యాపూ.." అనండి.

      తొలగించండి
    2. మాస్టరు గారూ! ధన్యవాదములండీ...సరిజేశాను.

      రణమే కనుడిది సరి ప్రే
      రణమును తానీయ గురుడు రంజిలునటు ధా
      రణమంది సమస్యా పూ
      రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్.

      తొలగించండి
  14. క్షమించాలి.

    అణుమాత్రపు విషయ స్మృతి
    వ్రణమై గాసించు గాన ప్రణవాక్షర భూ
    షణులకు కు వాసనా వా
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిల జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిటితోటి విజయకుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  15. అణగన్ ద్రొక్కిరి జూదాన;
    గుణముల జూడక వలువలు గుంజిరి; యకటా
    కణకణ మండెడి పార్ధుకు
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వేంకటప్పయ్య గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "అణచితి జూదమునందున" అందామా? 'పార్థునకు' అనాలి కదా! ఒకవేళ 'పార్థు కురణము' అని విభాగం చేసినా అర్జునుడు దుష్టరణం చేయలేదు కదా! కనుక అక్కడ 'నరునకు' అంటే సరి!

      తొలగించండి
  16. అనయము ప్రశాంత మదితో
    వినయముచూపుచు బుధులకు విష్ణుఁగొలుచుచున్
    ధనహీనులకన్నపు విత
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రశాంత మది' అని సమాసం చేయరాదు. అక్కడ 'అనయము శాంత మనమ్మున' అనండి.

      తొలగించండి
    2. గురువర్యుల సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  17. ప్రణవము శ్రీ కరమందురు
    కణకణమున దేవదేవు కాంతింగనగన్
    బ్రణతిని వేడెడి స్వర ధా
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిలజేయున్!

    రిప్లయితొలగించండి
  18. మణిభూషణములు,సిరులును
    క్షణికానందమ్ము నిచ్చు.సద్గతి నొందన్
    ఫణితల్పగు చరణముల శ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఫణితల్పుని' అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
      మణిభూషణములు,సిరులును
      క్షణికానందమ్ము నిచ్చు.సద్గతి నొందన్
      ఫణితల్పుని చరణముల శ
      రణమే సుఖశాంతులిచ్చి రంజిలఁ జేయున్

      తొలగించండి
  19. రణమే రావణుని యడచె
    రణమే పాండవుల కొసగె రాజ్యము, మరియా
    రణమే లేకున్న యగునె?
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్

    రణమున నరకుడు గూలెను
    రణమొనరించి మడిసెకద రావణు డవనిన్;
    గణనము జేయ, నసురుల మ
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రావణు నడచెను/ రావణుని నడచె' అనండి.

      తొలగించండి
  20. గణుతిం బొందని స్వాస్థ్యహీనత, కికన్ క్షామంబు వాటిల్ల, ధా
    రుణిపై నిత్య మవార్యదుఃఖములకున్, రోగాలకున్ జూడ కా
    రణ మా వృక్షము లెందు గూల్చుట గదా రాగాత్మతో తన్నివా
    రణమేగా సుఖశాంతులిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. మణిమాణిక్యము లాదులున్ గలిగియున్ మాన్యంబులున్ గల్గియున్
    ఘనవైభోగము లెన్నిగల్గిన సరే జ్ఞానాత్ములై పూర్వమున్
    ఘనులీ రీతిగ దల్పినారు తమలో కంజాక్షు పైభక్తి తో
    రణమేగా సుఖశాంతులిచ్చు మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఐతగోని వెంకటేశ్వర్లు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దల్పినారు'...? అది దాల్చినారుకు టైపాటా?

      తొలగించండి
    2. సుకవి మిత్రులు ఐతగోని వారూ...నమస్సులు!

      మీ పద్య బాగున్నది. అభినందనలు.

      మూడవపాదంలో...
      "ఘనులీ రీతిగ దాల్చినట్టి వరమౌ కంజాక్షుపై భక్తి తో/రణమేగా..." అంటే ఎలా వుంటుంది?
      పరిశీలించగలరు.

      తొలగించండి
  22. ఘనమౌ దేశపు రక్షకై సమరమున్ కావించు సేనాళికై
    మనమున్ స్థానము నిచ్చిసంతతము సమ్మానించుచున్ ప్రేమతో,
    రణమున్ ప్రాణము లొడ్డు మోహరపు భార్యా సంతతిన్ బ్రోచు, యం
    త్రణమేగా సుఖశాంతులిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్

    రిప్లయితొలగించండి
  23. శంకరయ్య గారు మీస్పందన తెలియజేయగలరు.
    నమస్కృతులతో....

    రిప్లయితొలగించండి
  24. గుణహీనుడు,కామియు,రా
    వణు చేతిని చావు కన్న భవసాగర తా
    రణు డగు రాముని చేత మ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. రిప్లయిలు
    1. మణి రత్నాంబర వాహ నాదిగ మహా మాంగల్య దాయంపు భూ
      షణ సంభారము చిత్త శాంతి నిడగన్ సామర్థ్యముం జూపునే
      ఘృణయుం బ్రేమ గుణాధికమ్ముల సుసంకీర్ణమ్ము శీలాసుధా
      రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్

      [శీల+అసుధారణము= శీలాసుధారణము; అసుధారణము=జీవము, బ్రదుకు]


      అణు మాత్రపు సద్గురు వీ
      క్షణ జననీ జనక సచివ సంఘ సహిత ల
      క్షణ యుత సాధు జనుల ప్రే
      రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  26. గుణహీనుల్ రుధిరాశనుల్ సురరిపుల్ క్రూరుల్ మహాహంతకుల్
    రణతంత్రేష్టులు తీవ్రవాదులు క్షమారాహిత్యదుర్మానసుల్
    ఘనులే? ధాత్రికి వైరి చూడ క్షితమే కాబట్టి యేతన్నియం
    త్రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్.

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    { దుర్యోధనునితో గా౦గేయుని పలుకులు }
    ……………………………………………………


    కణమున్ లేదు విచక్షణా గుణము |

    ………… రక్త౦ బ౦దు విద్వేషపున్

    గణముల్ ( కణముల్ ) ని౦డెను | వక్రి యౌ

    శకుని వాక్య౦బుల్ విన౦ జెల్లునే |

    గణియి౦ప౦ దగు ధర్మమున్ గురుపతీ ! |

    …………… కానన్ , మహా స౦గ్రామ వా

    రణమేగా సుఖ శా౦తు లిచ్చి మనకున్

    ………… ర౦జిల్ల జేయున్ మదిన్


    { కణమున్ లేదు = కాస్తయిననూ లేదు ;

    కణము = ఉదా = జీవకణము సూక్ష్మకణము ;

    గణియి౦చు = లక్ష్య పెట్టు ; వారణము =

    నివారణము ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహాసంగ్రామ' అన్నచోట గణదోషం. 'కానన్ మహాయుద్ధ వా।రణమే...' అనండి.

      తొలగించండి
  28. రణగొణశబ్దములొకపరి
    సణుగుడులేయేకధాటిసాధింపులునున్
    గణకొనకసమస్యాపూ
    రణమేసుఖశాంతులిచ్చిరంజిలజేయున్

    రిప్లయితొలగించండి
  29. ప్రణతుల్ బొందెడి దీప కాంతులిల సంబ్రంబమ్మె దీపావళీ
    ప్రణయించంగను వత్తిగాలుచును సర్వా భీష్ట సంతోషమౌ
    క్షణముల్ బంచెడి శక్తి యుక్తిగన ?లక్ష్యంబుంచుసంక్రాంతి|తో
    రణమేగా సుఖశాంతులిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్
    2.తృణమగు జీవన సారపు
    క్షణములు రణమైన ఫలమ? కాంక్షలయందున్
    గుణమే ముఖ్య మనెడికా
    రణమే సుఖ శాంతు లిచ్చి రంజిల జేయున్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సంబ్రంబమ్మె'...?

      తొలగించండి
  30. నా రెండవ పూరణము:

    తృణమైనన్ సదయంబుతో నొసగ
    వేవేలట్లు భాసించునే
    పణమైనన్ ఘనమై స్ఫురించు నిట గాపాడంగ నార్తిన్దగన్
    ప్రణుతింగాంచును మానవుండిలను, స్వాభావంబునం బొందు ప్రే
    రణమే గా సుఖ శాంతులిచ్చి మనకున్ రంజిల్లజేయున్ మదిన్!

    రిప్లయితొలగించండి
  31. పణమున్ గోరక రాగబంధములనే పంకమ్ముగానెంచుచున్
    గణనీయమ్మగు జీవనమ్ము గడపన్ కల్పమ్ములో కొందరే
    క్షణికమ్మౌ సుఖభోగముల్ విడిచి మోక్షమ్మొక్కటే గోరు కా
    రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్

    తృణతుల్యమె ప్రాణమనుచు
    క్షణికమ్మౌసుఖ మువీడి కల్పము నందున్
    గణనీయము ద్వాదశి పా
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్

    రిప్లయితొలగించండి

  32. తృణమైనను పణమైనను
    క్షణమైనను చింతచేయక యథేచ్ఛముగన్
    ఘనముగ నొసగెడి యావిత
    రణమే సుఖశాంతులిచ్చి రంజిల చేయున్

    అనయము నాలోచించుచు
    క్షణమైనను శ్రాంతినొసగకననవ రతమున్
    గణములు పదములు యతితో
    రణమే సుఖశాఖంతులిచ్చి రంజిల చేయున్

    ప్రణవాకారుడగు హరి శ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిల చేయున్
    క్షణార్ధమునందే తొల
    గును యఘములునమ్ముమయ్య కువలయమందున్.

    వినయము తోడను గొల్వగ
    క్షణమున నేవిజయ మొదవు కంగారేల
    న్ననయము నర్చించగ శివశ
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిల చేయున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణ మూడవపాదంలో గణదోషం. 'క్షణభంగుర మగుచు తొలం।గును..' అందామా?

      తొలగించండి
  33. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. క్రిందటి నెల మీరు పర్యవేక్షించిన రాజమహేంద్రవరములోని యష్టావధానమున యిచ్చిన వర్ణనాంశము సరస్వతీ దేవి నఖ వర్ణన. మీరిస్తారనుకున్నాము.
    అప్పుడు నేను చేసిన వర్ణన పరిశీలించ గోర్తాను.


    వీణా తంత్రుల మీద నాట్యమును ప్రావీణ్యమ్ముగన్ సల్పుచున్
    వాణీ హస్త నఖాంకురప్రతతి భవ్యాంభోజ రేఖాభలై
    ప్రాణిశ్రేణుల సృష్టికర్తృ చికురాపారాళి సంచారముల్
    వీణాపాణి కరాంచి తోద్భవములై విద్యోత మానమ్ములే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఆహా! ఎంతటి మధుమైన భావన! ఎంతటి పదప్రయోగవైచిత్రి! అద్భుతం!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.ధన్యోస్మి.

      తొలగించండి
  34. క్షణికావేశములేకయుండగనునాసాంతంబుజేయంగపూ
    రణమేసుఖశాంతులిచ్చిమనకున్ రంజిల్లజేయున్ మదిన్
    వినుడీసూత్రముమీరలందరునునోవీరాభిమానుల్ ! దగన్
    బ్రణవంబీయదిగాదలంచియెదనభ్యాసంబుజేయుండహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రణమేగా'లో గా లోపించింది.

      తొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    ప్రణతుల్ సేయుచు, విఘ్ననాథు కృపచే బల్ విద్యలం బొంద, దు
    ర్గుణముల్ డుల్పఁగ, సద్గుణమ్ము లిడఁగన్, గూర్మిం బ్రతిష్ఠింప, స
    త్ఫణితిన్ బేర్పఁగ, వేగిరమ్మె కొలువన్, దానై ప్రసాదించు పూ

    రణమేగా, సుఖశాంతు లిచ్చి మనకున్, రంజిల్లఁ జేయున్ మదిన్!

    రిప్లయితొలగించండి
  36. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారి (వాట్సప్) పూరణలు.....

    తనువును వ్రణమది దొలచగ
    దన సంపద జనులకంత దానమొసగి మే
    దిని వీడ దలచువాని, మ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    కనగను గణగణగణ ని
    క్వణము లొలికి దన మనమున కనుదిన సుఖమున్
    ఘనముగ నిడెడు నిజసతి చ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    తన వారల గాపాడగ
    దను యాస్తులు గూడబెట్ట దా బెరుగుటకై
    తన పై లీడరు చరణ శ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    తనపద సంపద బెరుగగ
    దన కవనము వృద్ధి జెంద దా గవి గాగన్
    గనగ నా వాణి శుభ చ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    మనమున బొరపొచ్చాలతొ
    తన పతియే తనను విడువ దగ నా సతికిన్
    దా నిచ్చెఁడు నా కొలది భ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్

    అనయము గుయ్యని దిరుగుచు
    దనువంతయు గుట్టుచుండి దద్దులు రేపన్
    పనిగట్టుక దోమలతో
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారూ,
      మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      నాల్గవ పూరణ మూడవపాదంలో గణదోషం. 'గనగా నా వాణి శుభ చ...' అనండి.
      ఐదవ పూరణలో 'పొచ్చాలతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ 'పొచ్చాలను' అనవచ్చు. (తృతీయార్థంలో ద్వితీయ).

      తొలగించండి
  37. ప్రణవము తానై బరగి య
    గణితంబగు జగతి నేలు కౌస్తుభధరుడౌ
    పణితల్పుని దివ్యమగు చ
    రణమే సుఖశాంతులిచ్చి రంజిల జేయున్!!!

    అనవరతంబును నారా
    యణుని మనమ్మున దలంచి యంజలిలుడుచున్
    గణుతించ గలుగు నసుధా
    రణమే సుఖశాంతులిచ్చి రంజిలజేయున్!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అసుధారణము'...?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. జీవము లేక బ్రదుకు. నేను కూడా ప్రయోగించితిని. శీలాసుధారణము. అసువులు ధరించుట.

      తొలగించండి
  38. పిన్నక నాగేశ్వర రావు గారి (వాట్సప్) పూరణ....

    అణువున్ కోపము లేక
    న్నణకువ,నిస్స్వార్ధబుద్ధి యందరి యెడల
    న్ననురాగము సద్గుణ తో
    రణమే సుఖ శాంతులిచ్చి రంజిల జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణను వాట్సప్‍లో పెట్టారు కాని బ్లాగులో పెట్టడం మరిచినట్టున్నారు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అణువున్'...?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారూ !

      అణువున్= లేశమైన ....అనే అర్ధంలో వ్రాశాను

      తొలగించండి
  39. బండకాడి అంజయ్య గౌడ్ గారి (వాట్సప్) పూరణ.....

    రణమేలను కవివర్యా
    రణమన భయమును కలుగును రమ్య కవులకున్
    రణమునకును సరియగు పూ
    రణమే సుఖశాంతు లిచ్చి రంజిల జేయున్

    రిప్లయితొలగించండి
  40. త్రుణముగ నెంచెన్ వీరుడు

    ప్రాణము; రణరంగమందు ప్రభు రక్షణకై;

    ప్రాణము కంటెన్ వీరమ

    రణమే సుఖశాంతులిచ్చి రంజిల జేయున్.

    విద్వాన్,డాక్టర్, మూలె రామమునిరెడ్డి;విశ్రాంత తెలుగు పండితులు;ప్రొద్దుటూరు,కడప జిల్లా.7396564549.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూలె రామముని రెడ్డి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. భావము బాగున్నది. అభినందనలు ! కంద పద్యంలో నాలుగు పాదాలూ లఘువుతో మొదలు పెట్టాలి, లేదా గురువుతో మొదలు పెట్టాలి కదా !

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. శంకరయ్య గారికి నమస్సులు !
      కం. కవిమిత్రులు పూరణలను
      చెవులకు నింపుగను గూర్చి చెలరేగిరిగా !
      చవి చూచెడి భాగ్యమ్మును
      నవిరళముగ మాకు మీరె యందించితిరే !

      తొలగించండి
  41. వినకన్ సాకుల నెన్నిజెప్పినను నిర్వీర్యుండుగా నవ్వుచున్
    తినకన్ లంచము లెప్పుడున్ మనలనున్ తిన్నీయకుండెప్పుడున్
    పనికిన్ మాలిన బాసు తోడ నెపుడున్ వాగ్యుద్ధమై జేసెడిన్
    రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్

    రిప్లయితొలగించండి