10, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2194 (మానిని మానముం జెఱచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా"
లేదా...
"మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్"

80 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఉత్తర గోగ్రహణమునందు బృహన్నల:

      మానావమాన మెంచక
      రానిక! నను విడువుమనెడి రాజకుమారున్,
      వానిని నాయర్భక యజ
      మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్!

      తొలగించండి
    2. శాస్త్రి గారు యజమానిని గా మీ పూరణ చాలా బాగుంది.

      తొలగించండి
    3. విజ్ఞులు కామేశ్వర రావు గారు:

      "యజమానిని" అని రాత్రే వ్రాశాను. కానీ అన్వయ లోపముందేమోనని శంక యుండినది. మీ "దురభిమానిని" చూడగానే ధైర్యం కలిగినది.

      వందనములు!

      తొలగించండి
    4. ఇక్కడొక్క విశేషమును గమనింప వచ్చును. యజమానుని మానమన్న యజమానునియొక్క మానము. యజమానిని మానమన్న యజమానిని మరియు మానమును చెఱచెనని భావము.

      తొలగించండి
  2. పానము జేయుచు,మధువును
    గానము జేయంగ నతడు గార్ధభ స్వరమున్
    తూనిక మతిచెడి యాత్మాభి
    మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారు మీ పూరణ బాగుంది. మూడవ పాదములో గణ భంగము. గార్దభ.
      యొక్కతె / మానిని అన్న బాగుంటుంది.

      తొలగించండి
  3. డా.పిట్టా
    కానని వాని కెప్పటికి గప్పయె దయ్యము (ఇదిTSసామెత)గాగ దోచు నె
    వ్వానికి భాగ్య రీతులును వాసియు నర్థము గావు నోట్లవే
    లేని ప్రపంచమున్ గనగ లీలలు జేయుచు ద్రవ్య లక్ష్మి యౌ
    మానిని మానముం జెరచి మన్ననలన్ మగవాడు పొందెరా!
    కానని కష్టము లక్ష్మీ!
    పూనిక జిల్లరలనీరు పుణ్య స్థలినిన్
    జానెడు పొట్టకు మోదీ
    మానిని మానమును జెర్చి మన్ననలందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు మీ రెండు పూరణలు నద్భుతముగానున్నవి. "జెఱచి" సమస్య పాదములో.

      తొలగించండి
    2. డా.పిట్టా.....ఆర్యా
      మానమ్ము.తగణం.కందంలోతగణంరాదు.అది6వగణం.జగణం రావాలి.అందుకే మానమును జెరచి అన్నాను.బండి ర నుtype లో కనుగొనలేదు.ర.తో సరి పుచ్చుకున్నా .మానమ్ము జెరచియే చెల్లునా?

      తొలగించండి
    3. ఆర్యా ఇచ్చిన సమస్య పాదము "మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్" ర యయిన పరవాలేదండి.
      మానమ్ముఁ జెఱచి లో మాన: గగ; మ్ముజెఱచి: నల. సరిపోయింది కదా. 6 వ గణమిక్కడ నల.

      తొలగించండి
  4. దానవుడైన నాయకుడు తాఁజనె జైలుకుఁ ద్రాగిన మత్తులో
    మానిని మానమున్ జెఱచి, మన్ననలన్ మగవాడు పొందెరా
    ప్రాణము లెక్కచేయకను భాసుర మైన విజృంభణమ్ముతో
    వానిని పట్టియిచ్చి, శని పాచె నటంచు జనమ్ముతల్చగా

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ విరుపుతో నుత్తమముగా నున్నది.

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వైనము గూడని వాడని
    మానసమున దల్చు జుండు మగనాలునుకున్
    పూనిన నెనరున పతి తన
    మానిని మానమ్ము జెఱచి మన్నన లొందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు మీ పూరణ చాలా బాగుంది. మగనాలెపుడున్ అంటే బాగుంటుందేమో? బూనిన, నెనరునఁ బతి అనండి.

      తొలగించండి


  7. స్థానము తప్పుచు తానొక
    మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్
    పానపు మత్తున తూగెడి
    కాని పనుల జేయువారి కరతాళికలన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. మానాయకుడే చిత్రజ
    గానమహా గొప్పయనుచు కవ్వింపులతో
    ప్రాణముదీసుకొను దురభి
    మానిని మానమ్ము జెఱచి మన్ననలందెన్

    రిప్లయితొలగించండి
  9. తానె జయముఁ గొందుననెడి
    మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్
    వేనోళ్ళఁ బొగడ స్వజనులు
    హీనుడటంచు ప్రతిదినము హేళన గొనియున్
    మానముః గర్వము

    రిప్లయితొలగించండి
  10. పూనికతోడ ధర్మగుణముల్ మదినెంచనివాడునై దయా
    హీనుని సత్ప్రవర్తన విహీనుని ధూర్తునరాచకత్వ సం
    ధానునుడునై చెలంగుచు ధనంబును వ్యర్థముచేయు దుష్ట స
    న్మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా

    రిప్లయితొలగించండి
  11. కానని మైకమం దునను గాదిలి కోడలు జానకీ సతిన్
    దానవ శ్రేష్టుడౌ నతడు దావర మందున మ్రుచ్చిలిం చగా
    హీనము గాదటంచు దశ గ్రీవుడు గర్వము నొందుచున్ మదిన్
    మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా ?










    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారు మంచి యంశము నెత్తుకున్నారు. కానీ సమస్యకు సరియైన పరిష్కారము చూపలేదు. మన్ననలు పొందాడనడము సమంజసముగా లేదు. లంకలోని రాక్షసులు కూడా రాజునకు భయపడి హితవు చెప్పలేదు కాని సంతోషించ లేదు.
      మూడవ పాదములో యతి భంగము.

      యీ నా సవరణ మెట్లుండును?

      కానని మైకమం దునను గాదిలి కోడలు జానకీ సతిన్
      దానవవంశ రావణుడు దావర మందున మ్రుచ్చిలిం చగా
      హీనము గాదటంచు మది నెంచి రఘూద్వహుఁ డుగ్రు డంత దు
      ర్మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా ?

      తొలగించండి
  12. తా నే యెటకో పోయెను
    మానిని మానమ్ము జెఱచి ,మన్నన లందెన్
    దానము జేయుచు మునిగిన
    మానిని ప్రాణంబు నిలిపి మగువల చేతన్

    రిప్లయితొలగించండి
  13. మానినిమానముంజెరచిమన్ననలన్ మగవాడుపొందెరా
    మానినిమానమున్ జెరచమన్ననలిచ్చుటసిగ్గుచేటురా
    వానినికట్టిచెట్టునకువాతలుబెట్టిననింకనెవ్వరున్
    మానినిజోలికిన్నెపుడుమానవుడెవ్వడుబోవడేగదా

    రిప్లయితొలగించండి
  14. భూనుత! గౌరవాన్వితకు బూజ్యకు నాఖ్య యదేమి యొప్పు నె
    ద్దాన బురందరుండపుడు తాను వహించెను శాపభారమున్
    స్త్రీనిల నక్షరజ్ఞనుగ జేయ లభించినదేమి యన్నచో

    మానిని,మానముంజెరచి,మన్ననలన్ మగవాడుపొందెరా.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  15. మానవునిగ గాచె నతడు
    మానిని మానమ్ము! జెఱచి మన్నన లందెన్!
    కానగ యువకుల నడుమ
    న్నీ నారీమణికి రక్ష యేదను బ్రశ్నన్!

    రిప్లయితొలగించండి
  16. ఆ నవనీత చోరుడు దయారస మానస శోభితుండు స
    న్మాన మునీంద్ర పూజితుడు ధర్షిత భామయ సత్యభామ తో
    దానికఁ బారిజాతమును దప్పక తెచ్చెద నంచుఁ బల్కి యా
    మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా

    [మానము = స్త్రీలకు పురుషులయెడఁ గలుగు కోపవిశేషము; మగవాఁడు = శూరుఁడు]


    అన్న గారి యాజ్ఞను బీముడు దుర్యోధను కట్లు విప్పు సందర్భము:


    మౌనమున భీమసేనుడు
    సేనాయుత చిత్రసేన శృంఖల బద్ధుం
    గానల సుయోధను దురభి
    మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధర్షిత భామ: సత్యబామ కోప కారణమును తెలుపుటకు ప్రయోగము.
      నవనీత చోరుడు: ఇక్కడ జరుగబోవు పారిజాతాపహరణమునకు చోరత్వములో ననుభవమును సూచించుట.
      శేష విశేషణములు: చోరుడని తలంపమికి గొప్పతనమును సూచించుట.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! ఆలస్యంగా చూసినందులకు మన్నించగలరు.

      మీ పూరణములద్భుతముగ నున్నవి. అభినందనలు!

      చిన్న సందేహముల నివృత్తి చేయగలరు.

      మొదటి పూరణమున...
      రెండవ పాదంలోని యతిమైత్రి?

      రెండవ పూరణమున...
      రెండవ పాదంలో...శృంఖలా బద్ధుం...అనవలె ననిపించుచున్నది.
      ఎందుకంటే...మనం తఱచుగా శృంఖలాబంధం...అనే పదాన్ని దీర్ఘంతోనే వాడుతాం. శృంఖలబంధం అని హ్రస్వంగా వాడం. అలాగే...శృంఖలా బద్ధున్...అనవలెనేమో పరిశీలించగలరు.

      తొలగించండి
    3. సత్+మానః సన్మాన - ఇందు "త" తో గాని "న" తో గాని యతి వేయజెల్లును - దీనిని వికల్ప యతి అంటారు. ఇది నా అభిప్రాయము. కవివర్యులు గుండు మధుసూదన్ గారూ / కామేశ్వర రావు గారూ వివరించ ప్రార్థన.

      తొలగించండి
    4. బాగా చెప్పారండీ సత్యనారాయణ రెడ్డి గారూ! ఆ సంయుక్తాక్షరానికి త, న, మ కారములలో దేనితోనైనను యతిమైత్రినిం గూర్చవచ్చును.

      తొలగించండి
    5. కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చక్కటి విషయమును ప్రస్తావించితిరి. “శృంఖలబద్ధున్” సమాసౌచిత్యముపై మీ యభిప్రాయము కూడా తెలుసుకొన వలెననే ప్రత్యేకముగా మిమ్ములను గోరితిని. నేను బాగా యాలోచించిన పిదపయే వాడితిని.
      శృంఖల స్త్రీలింగములో ఆ కారాంతము. పుంలింగ నపుంసక లింగములలో అ కారంతము.
      ఇక్కడ శృంఖలబద్ధున్ అని దుర్యోధనునకు అన్వయించుట వలన నా పదమును పుంలింగ శబ్దముగా తీసుకొని శృంఖలబద్ధున్ గా ప్రయోగించితిని.
      సమంజసమేనా తెలుప గోర్తాను.
      శృంఖలబద్ధున్ – కానల : శృంఖలబద్ధున్ గానల; ఆదేశ సరళముకావున బిందుపూర్వకము గా వ్రాసితిని.
      సత్యనారాయణరెడ్డి గారు నమస్సులు. మీరు చెప్పినట్లే వికల్ప యతి వాడితిని.

      తొలగించండి
    6. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు!
      నాకు సంస్కృతంలో పరిజ్ఞానం తక్కువ. నాకు సందేహం కలిగి, మిమ్మల్ని నివృత్తి చేయడానికే ప్రశ్నించాను. దీనిని సంస్కృతం తెలిసిన మిత్రులెవరైనా నివృత్తిచేయగలిగితే బాగుండును. నాకన్న మీకే ఎక్కువ పరిజ్ఞానము కలదు. కావున మీ ప్రయోగం సరియే యై యుండును. ఏమైనను మరొకమారు భాషాభిజ్ఞుల యభిప్రాయముం దెలిసికొని వివరించగలరు.
      ధన్యవాదములు!

      తొలగించండి
  17. దేనిన హీన మైనదిగ దెల్పుచు నుందుర దెల్ల వేళలన్?
    హీనుడు కాముకుండు మరి యెందు నిమిత్తము నింద జెందెడిన్?
    సేనల సంహరించియును చిత్తుగ, పార్థుడు రేగి నప్పుడున్
    "మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా"

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రా ! నవలా ! మదీయ మగు ప్రాణము

    ……… నీవ యట౦చు ప్రేమ స౦

    ధాన మొనర్చు చావిడను తన్మయ చిత్తను

    ……… జేసి , పొ౦దె | కా

    నీ నయవ౦చనమ్ము నొనరి౦చక

    …… పె౦డిలి యాడె , నెల్ల రౌ

    రా ! నయశాలి య౦చు కొనియాడెడు

    ………… భ౦గిని | తద్విధమ్మునన్

    "" మానిని మానమున్ జెరచి మన్ననలన్

    ………… మగవాడు పొ౦దెగా ""

    { నయశాలి = నీతి మ౦తుడు }
    ి

    రిప్లయితొలగించండి
  19. నానావిధసంపదలిడి
    తూనికవేయంగ సత్య దూగని హరియే
    నాణెముగ దూగి తులసికి
    మానిని మానమ్ము జెఱచి మన్నన లందెన్!!!

    మానము= గర్వము

    రిప్లయితొలగించండి
  20. జానకి భర్తతోడ నొక జాతర కేగెను చేత సంచితో
    నూనె గొనన్ దలంచి యట నోటొకటివ్వగ వర్తకుండటన్
    తూ నిక రాళ్ళుమార్చుచును తూ చుచు వంచన జేయగాంచెనా
    మానిని, మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా

    జ్ఞానము గలిగిన వాడను
    నేనొక్కడినే యనుచును నిరతము పలుకన్
    వానిని గనియట్టి దురభి
    మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్

    ** నిన్నటి సమస్యకు నా పూరణలు **

    పూషణుఁ జుట్టు నిత్యమును భూమి భ్రమించు విధమ్ము మానవుల్
    భీషణ యత్నమున్ సలిపి వీడక పైకము చుట్టుతిర్గు చున్
    భేషగు జీవనమ్మునకు భేషజ మేయది యంచు చెప్పెనే
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో

    పరుల వంచింప నేమయ్యె వాసిగాను
    సిరుల నార్జించి కులికెడు నరుల గాంచి
    గౌర వింతురు నిజమిదీ కల్పమందు
    దోషము లరుదు ధనమున్న దుష్టునందు.

    రిప్లయితొలగించండి
  21. హీనుడు కామదాహమున నెల్లలు కానని వాడు కీచకుం
    డా నరరాక్షసుం డధము డక్కను చెల్లిని నెన్న బోడులే
    వానిని జూడ పాప మగు వద్దటు పోకుము డబ్బు మత్తులో
    కానక రాజకీయముల కన్నును మిన్నును నమ్మినట్టి స
    మ్మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాడు పొందె రా.

    రిప్లయితొలగించండి
  22. కానగ చోద్యమాయె బహు కాలమ మేరిక మంత్రి యైన యా
    చానకు తప్పదాయె గద సాగిన యెన్నిక లందు, ట్రంపు చే
    మానవు లంచనల్ కలగ మారె పరాజయ, మమ్మొ! వింటిరే !
    మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్శ్మినారాయణ గారు మీ పూరణ బాగుంది. అమెరికా ను అమేరిక యనడము సరియేనా?

      తొలగించండి
  23. కానను సీతను దొంగలి
    మానవుడౌ రాముడెదిరి మనలేడనగా
    దానవ రావణుని దురభి
    మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్

    రిప్లయితొలగించండి
  24. కామేశ్వరరవుగారు మీ సూచనకు కృతజ్ఞతలు
    సాధారణంగా అనేకులు అమేరిక అనే ఉచ్చరిస్తారు కదా

    రిప్లయితొలగించండి
  25. కామేశ్వరరవుగారు మీ సూచనకు కృతజ్ఞతలు
    సాధారణంగా అనేకులు అమేరిక అనే ఉచ్చరిస్తారు కదా

    రిప్లయితొలగించండి
  26. కురు సభలో ద్రౌపది ఆక్రందన:

    జ్ఞానులు మీరై సభలో
    కాని పనినిఁ జేయు వారిఁ గాదను తీరే
    కానగ లేరనె పెద్దల
    మానిని, మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్

    రిప్లయితొలగించండి
  27. భానుడు సంభోగించెను
    మానిని మానమ్ము జెరచి,మన్ననలందెన్
    తానొక వెలుగులవేల్పుగ
    మానవులకు ఋతువు లొసగి మహిలో వెలసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు మీ పూరణ బాగుంది.
      భారతము ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము లోని పద్యము: సూర్యభగవానుడు కుంతీకన్య తో
      ఆ.మత్సమాగమమున మదిరాక్షి! నీదు క | న్యావ్రతంబుఁ జెడదు; నందనుండు
      నధికతేజుఁ డుదయ మగు; నిన్ను నొక్కనిం | దయును బొందకుండుఁ; దథ్య మబల! 338

      తొలగించండి
  28. దానవు డట్లహల్యను విధానములెంచని కాముకుండుగా
    మానిని మానముంజెఱచి మన్ననలన్ మగవాడు పొందెరా
    జ్ఞానవిహీన మార్గమన జన్మకుసార్థకమౌననెంచగా?
    దేనికి తప్పుజేయుట జితేంద్రియు డవ్వక ఇంద్రుడవ్వుటా?
    2.తానొక తాత్వికశక్తే
    మానిని మానమ్ముజెఱచి మన్ననలందెన్
    జ్ఞానము వీడి వరూధిని
    పూనియు ప్రవరుని జేర?పూర్తిగ మార్చెన్| {మానము=గర్వము}




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారు మీ మొదటి పురాణ బాగుంది. దానవునియట్లు అనాలికద దానవుడట్లహల్యను అంటే ఇంద్రుడు దానవుడని యర్థము వచ్చును. కొన్ని ముద్రణ లోపములున్నవి.
      మీ రెండవ పద్యము నాకు సరిగా బోధ పడలేదు.

      తొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    [సైంధవ పరాభవ ఘట్టము]

    మానాపహారమునకై
    పూనఁగ, భీముండు గెరలి, పొసగెడి రీతిన్
    బూనుచు, నా ద్రౌపద్యవ

    మానిని, మానమ్ముఁ జెఱచి, మన్నన లందెన్!

    (మానమ్ముఁ జెఱచి = తలను ఐదు శిఖలుగా గొఱిగి యవమానించి; మన్నన లందెన్ = ద్రౌపది మెప్పును పొందాడు;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి పుంగవులు మధుసూదన్ గారు ద్రౌపద్యవమానిని యని చక్కటి పూరణ నందించారు.

      తొలగించండి
    2. కవిపుంగవులు మధుసూదన్ గారు నా పూరణ తిలకించి గుణదోషములను తెలియ జేయగోర్తాను.

      తొలగించండి
  30. ఒకసారి అవధానం లో ఒకసమస్య యిచ్చారు.
    "వక్త్రా స్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్" ఎంత క్లిష్ట ప్రాసనో చూడండి.డా.నాగఫణి శర్మ గారి పూరణ.

    దృక్త్రాసాయుత జీవితమ్మున మహాదేవీ ప్రసాదమ్ముతో
    స క్త్రైంత వచోవిచారిణి లసద్రాజేశ్వరీ మూర్తినిన్
    యోక్త్రాలంబిని నా సరస్వతి రమా సోమాడ్య నా తత్రయీ
    వక్త్రా స్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్
    తా:--దుఃఖ పూరిత మైన ఈ జీవితములో ఆ మహాదేవి కరుణ వలన వేదాలన్నీ తెలిసిన ఆ రాజేశ్వరీ దేవి,
    యోక్త్రము (పెళ్ళప్పుడు నడుముచుట్టూ కట్టే తాడు)ఆలంబన గాగల సరస్వతీ, రమాదేవి (లక్ష్మీ దేవి)ఉమా దేవి (సోమా =స ఉమ)వీరు ముగ్గురి ఆశీర్వాదము వల్ల నీ వాగ్ధార పొగడబడుతుంది

    రిప్లయితొలగించండి
  31. "Indira Gandhi, the only man in her Cabinet"

    కానల కానలన్ వెదకి కన్నెల మానము దోచమంచుచున్
    కోనల కోనలన్ తరిమి ఖూనులు జేయుచు బంగవాసులన్
    దానవ రూపుడై మెలగి దండన జేసిన యాహ్యఖానునిన్,..
    మానిని,...మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా!

    రిప్లయితొలగించండి