15, నవంబర్ 2016, మంగళవారం

సమస్య - 2199 (ఫలితముఁ గోరి పాటుపడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్"
లేదా...
"పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్"

89 వ్యాఖ్యలు:


  1. ఏటికి నెదురీదు నటుల
    పోటీ పడి లంచములను పొందుట కొరకై
    చాటుగ సంపాదింపగ
    "పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్"

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ప్రత్యుత్తరాలు
    1. చంపకమాలలో సవరణ: "తప్పుల నెంచక"

      తొలగించు
    2. సవరణతో:
      అలసట చెందకుండ మరి యార్జన జేయగ జూచు వారికిన్
      కలిమియె గొప్ప లక్ష్యముగ గాసిలు చుండెడి చెడ్డవారికిన్
      దలపక పాప పుణ్యములె తప్పుల నెంచక యక్రమార్జనన్
      "ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్"

      తొలగించు
  3. అలసట చెందకుండ మరి యార్జన జేయగ జూచు వారికిన్
    కలిమియె పారమార్థమని గాసిలు చుండెడి దుష్ట మూకకున్
    దలపక పాప పుణ్యములె దప్పుల నెంచక యక్రమార్జనన్
    "ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్"

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జనార్దన రావు గారు మీ పూరణ బాగుంది. పరమార్థము, పారమార్థికము, పారమాత్మికము లు సాధువులు. దుష్టమూక సమాసము సరికాదు.

      తొలగించు
    2. ధన్యవాదాలు ,సవరిస్తాను.

      తొలగించు
  4. పాటుల్, పొరపాటొకటియు,
    ఘాటౌ గ్రహపాటురెండు, ఘనముగ యలవా
    టౌటయు మూడౌ, ఇటులే
    పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్!



    గమనిక:

    పొరపాటు, గ్రహపాటు, అలవాటు అందరికీ తెలిసినవే. నేనీమధ్య శంకరాభరణం లో నేర్చుకున్న నాల్గవది: టైపాటు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. * బొరపాటొకటియు?
      * యిటులే?

      తొలగించు
    2. ఆటగ నాటవెలదులును
      తేటగ మరి తేటగీత్లు తెప్పలు కుప్పల్
      చాటువులు జెప్పి మరిటై
      పాటు పడినవారి కెట్లు ఫలితము దక్కున్?

      తొలగించు
    3. శాస్త్రి గారు మీ రెండు పూరణలు బాగున్నవి. పాటుల్ పొరపాటొకటియు లేదా పాటుల్,వొరపాటొకటియు రెండు సాధువులు.
      తేట గీతుల్ సాధువు. టైపాటు గ్రాంథికము కాదు. కవిత్వములో వాడదగదు.

      తొలగించు
  5. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మూర్తి గారు మీ పూరణ బాగుంది. నేర్వవలె అంటే బాగుంటుంది. బాగని పొగడన్ సాధువు.

      తొలగించు
    2. వాటముగ పనిజరుపు నల
      వాటును నేర్వవలె నొరులు బాగని పొగడన్
      మాటికి నూరక కలవర
      పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్"
      గురువు గారూ మీరు శ్రమతో చెబుతున్న సూచనలకు,సవరణలకు మనఃపూర్వక కృతజ్ఞతలు.

      తొలగించు
  6. చాటువు లుపలికి జనులకు
    ధీటుగ నడుగంగ నోటు తేకువ నిడగన్
    మాటలు గోడలు దాటగ
    పాటుపడిన వారి కెట్లు ఫలితము దక్కున్




    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. అక్కయ్య గారు మీ పూరణ బాగుంది. దీటుగ అనండి.

      తొలగించు


  7. ఏటికి యెదురీతగనౌ
    పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్,
    వాటము జూచుచు పయనము
    ధీటుగ జేయవలెనోయి ధీశక్తిగొనీ‌!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబి గారు మీ పూరణ చాలా బాగుంది. దీటుగ అనండి. కొనీ వ్యావహారికము. గొనన్ అన్న సరిపోవును.

      తొలగించు
  8. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

      తొలగించు
    2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

      తొలగించు
    3. మూర్తి గారు మీ పూరణ బాగుంది. మొదటి పాదములో గణదోషము.

      తొలగించు
    4. వలసిన విద్యలెన్నిటినొ బాగుగనేర్చి విభిన్న రీతుల
      న్నులకనఁ గర్జముల్సలుప నూర్జితులైన దురాత్ములూరకన్
      కలుషితబుద్ధులై పరుల కార్యములడ్డుచు సంతతంబుదు
      ష్ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్"
      గురువు గారూ కృతజ్ఞతలు.సవరించాను.చిత్తగించ ప్రార్థన

      తొలగించు
    5. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

      తొలగించు
  9. డా.పిట్టా
    కలియుగ ధర్మమే పనియ కాదనకుండగ కర్మచేయుచున్
    కలుముల నాశ చేయకను గడ్చునె కాలము?లక్ష్యసాధనన్
    ఛలమున బొంద జూడకుము సైచరణ గావలె నప్పుడప్పుడే
    ఫలితము గోరి పాటుపడు వారక దక్కునె లాభ మెయ్యెడన్

    వాటము జూసియు సరియగు
    బాటను పయనించలేక భాగ్యము గనగన్
    చాటుగ లంచాల్ బట్టిన
    పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్

    ప్రత్యుత్తరంతొలగించు
  10. డా.పిట్టా
    System తొందర పెట్టిందిమొదటి పూరణలోసైరణ&4వ పాదంలో వారికి సరియైనవిగా భావించండి.ఉన్నదున్నట్లు చదువడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. డా.పిట్టా వారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి.

      తొలగించు
  11. ఆటలనైనను మఱియే
    పోటీ యందైన వలయు స్ఫూర్తి కొఱవడన్
    వాటము సడలగ బిత్తఱ
    పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. బిత్తఱ/పాటు కాదు- తత్తఱ/పాటు. పొరబాటు మన్నించండి.

      తొలగించు
    2. శ్రీధర రావు గారు మీ పూరణ చాలా బాగుంది.

      తొలగించు
    3. కవివర్యులు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు .

      తొలగించు
  12. ( ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఈ
    సమస్యను ఇచ్చినప్పుడు నేను పంపిన పూరణము )

    మాటలు కోటలు దాటెడు

    కూటికి గతిలేనివారి కుటిలత్వము నా

    నాటికి హద్దులు దాటగ

    పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్?

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. నాగేశ్వర రావు గారు అప్పటి మీ పూరణ ముత్తమముగా నున్నది.

      తొలగించు
  13. దాటిగ పోరును సల్పిన
    మేటి విజయములు కలుగును మేదినిలోనన్
    వాటమగు సమయ మున పొర
    పాటుపడిన వారి కెట్లు ఫలితము దక్కున్

    ప్రత్యుత్తరంతొలగించు
  14. కలవరపాటు నొందకను కచ్చితమైన పథమ్ము నన్ జనన్
    కలుగు జయమ్ము లెప్పుడును కాశ్యపిపైనను నిశ్చయమ్ముగా
    విలయము సృష్టి జేయగను వీడి సమాజపు మేలు చెడ్డదౌ
    ఫలితముఁ గోరి పాటుపడువారికి దక్కునె లాభ మెయ్యెడన్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. ధాటిగ అనండి.

      తొలగించు
    2. కవివర్యులు కామేశ్వర రావుగారికి ధన్యవాదములు.

      తొలగించు
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దీటగు కార్యము లందున
    నీటగు విధమది నడపక నిరతము శ్రమిలై
    ఘాటించుచు దిశ గూడక
    పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్?

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రాజారావు గారు మీ పూరణ బాగుంది. శ్రములై అనండి. నీటగు యే భావము తో వ్రాసారు?

      తొలగించు
    2. శ్రీయుత కామేశ్వరరావు గారికి నమస్కారములు. నేను
      ' నీటు ' పదాన్ని ' సక్రమము ' అనే భావంతో వ్రాసాను.

      తొలగించు
    3. అయితే యది యాంగ్ల పదము కదా.

      తొలగించు
  16. ఏటీయమ్ సెంటర్లో నున్నప్పుడు...

    మీటను నొక్కెడు సంఖ్యను
    చాటుగ గమనించు మేటి చౌర్యము వలనన్
    చేటొన గూడఁగ నేమరు
    పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. పాటును నేమరుపాటు చేసిన మీ ప్రతిభకు జోహార్లు !

      తొలగించు
    2. సహదేవుడు గారు మీ పూరణ చాలా బాగుంది.

      తొలగించు
    3. జనార్ధన రావు గారికి మరియు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.

      తొలగించు
    4. జనార్ధన రావు గారికి మరియు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.

      తొలగించు
  17. పలికెను కృష్ణు డీ గతిని పార్థ! మనోవ్యధ చెందనేలనీ
    యిలపయి కర్మలందు విను మెవ్వరి కైనను నాధిపత్య, మా
    ఫలముల పైన గాదనుచు వాస్తవ మియ్యది స్వార్ధపూర్ణు లై
    ఫలితము గోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్
    హ.వేం.స.నా.మూర్తి

    ప్రత్యుత్తరంతొలగించు
  18. పోటీపడి యుద్ధండుల
    దీటై వెలుగొందలేక ధీశాలురకుం
    జేటొనరించుట కొరకై
    పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్.
    హ.వేం.స.నా.మూర్తి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మూర్తి గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి.

      తొలగించు
  19. చేట ల గొలదిగనిత్తురు
    పాటు పడినవారి కె,ట్లు ఫలితము దక్కున్
    మాటల గారడి జేయుచు
    బూటకములు బలుకు నెడల భువిలో మనకున్

    ప్రత్యుత్తరంతొలగించు
  20. కంది శంకరయ్య గారూ ! నమస్సులు. "కర్మణ్యే వాధికారస్తే" శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినారా ఈ సమస్యను?

    ప్రత్యుత్తరంతొలగించు
  21. పాటున శాస్త్రము జదివియు
    పాటిగ దన ప్రతిభ జూపు వైనంబదియే
    బాటించలేక బ్రతుకున
    పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శర్మ గారు పాటు బహుళముతో మీ పూరణ మనోహరముగా నున్నది.

      తొలగించు
    2. ధన్యవాదములు కామేశ్వర రావు గారూ....

      తొలగించు
  22. పోటీ తత్వము తోడన్
    దీటుగ పని మొదలుబెట్టి తేకువ కరువై
    చేటును దెచ్చెడు తొందర
    పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్!!!

    ప్రత్యుత్తరంతొలగించు
  23. సలిలము లందుఁ ద్రోసిరి విషజ్వలి తాన్నము వెట్టి రీసునన్
    హలహల దర్ప సర్పమున హాని యొనర్చగ నెంచి రుగ్రులై
    మలమల మాడ్చ నెంచిరి యమానుష రీతిని వారణాసి దు
    ష్పలితముఁ గోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్


    దీటుగ నూహలు మనమున
    నాటగఁ బరికించ వలె గుణ మగుణము లిలన్
    చీటికి మాటికి నాతుర
    పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్

    ప్రత్యుత్తరంతొలగించు
  24. దీటుగ మార్కొనిననె నీ
    పోటిల యుగమున సమస్య పూరింప నగున్
    మాటల గారడిలో తడ
    పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శ్రీధర రావు గారు మీ పూరణ బాగుంది. యీ పోటిల, తడఁబాటు అనండి.

      తొలగించు
  25. వేటాడ చెల్లవనుచును
    వాటముగావేయి,యైదు,వందల నోట్లన్
    చాటుగ కోటులు దాచగ
    పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్.

    ప్రత్యుత్తరంతొలగించు
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఫలితము గోర కే నరుడు పాటొనరి౦చడు |

    …..... మి౦చు నాసతో

    ఫలితము గోరి పాటుపడు వారికి దక్కునె

    ………………… లాభ మెయ్యెడన్ ? |

    కలిలము దైవ లీల యగు గాదె ? |

    …….. పవిత్ర హృదిన్ శ్రమి౦చినన్ ,

    ఫలితము నిచ్చి తీరు భగవ౦తుడు |

    ……… కర్తవు గావు దేనికిన్ |


    పాటు = కష్టము ; మి౦చు నాస = దురాశ ;

    క లి ల ము = ఎ రు గ రా ని ది

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. గురుమూర్తి ఆచారి గారూ మీ పూరణము బాగున్నది.

      తొలగించు
    2. గురుమూర్తి ఆచారి గారూ మీ పూరణము చాలా బాగున్నది. మించు విశేషణముగా నున్న "మించుటాస" అనవలెను కదా.

      తొలగించు
  27. ఫలితము గోరి పాటు పడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్
    ఫలితము గోరి పాటు పడు వారికి దప్పక దక్కునే సుమా
    కలుగుట సంశయంబిదియకారణ మేమది చెప్పుమా మరిన్
    మలమల మాడ మంటివె ?యు మాసుత !లాభ ములేక నయ్యెడన్

    ప్రత్యుత్తరంతొలగించు
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తెలివిగ కార్యమెంచి గడతేర్చెడి నేర్పును జూపు నొమ్మికన్
    దెలియక నుండు లౌల్యమున దీధయె లేని గ్రుడ్డిదౌ
    బలదము చేనులో దిరుగు బద్ధతి నాచరణమ్ము లేకనే
    ఫలితముగోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రాజారావు గారు మీ పూరణ బాగుంది. రెండవ పాదములో గణదోషము. దీధయె?
      లేకయే అనండి.

      తొలగించు
    2. శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు.
      ' దీధ ' అనగా ' బుద్ధి/జ్ఞానము ' అని అర్ధం.

      తొలగించు
    3. శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు.
      ' దీధ ' అనగా ' బుద్ధి/జ్ఞానము ' అని అర్ధం.
      పద్యాన్ని మీ సూచనా ప్రకారము మార్చినాను. దయతో పరిశీలించ గలరు.

      తెలివిగ కార్యమెంచి గడతేర్చెడి నేర్పును జూపు నొమ్మికన్
      దెలియక నుండు లౌల్యమున దీధయె లేని యాంధ్యమౌ
      బలదము చేనులో దిరుగు బద్ధతి నాచరణమ్ము లేకయే
      ఫలితముగోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్.

      తొలగించు
    4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

      తొలగించు
    5. రాజారావు గారు ధీ, ధీద లన బుద్ధి . తారుమారు చేశారు మీరక్షరములను.
      అమరకోశము
      బుద్ధి ర్మనీషా ధిషణా ధీః ప్రజ్ఞామతిః
      ప్రేక్షోపలబ్ధి శ్చిత్సంవిత్ప్రతిపద్ఙ్ఞప్తి చేతనాః
      (ప్రేక్షా ఉపలబ్ధిః చిత్ సంవిత్ ప్రతిపత్ జ్ఞప్తి చేతనాః )

      రెండవ పాదములో గణదోషమట్లే ఉన్నది.

      తొలగించు
  29. మలిన మనస్కులై సుజనమానవులన్ గని గౌరవించకన్
    బలమగు ద్వేష భావమున వారల నిత్యము నింద జేయు ధూ
    ర్తులకు, సుధర్మవర్తనము తోడను మేలొనరించువారి దు
    ష్ఫలతముగోరి పాటుపడువారికి, దక్కునె లాభ మెయ్యెడన్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. లక్ష్మీనారాయణ గారు మీ పూరణ చాలా బాగుంది. గౌరవించక ద్రుతాంతము కాదు. ద్రుతాంతముగా పొరపడుతుంటారు చాలా మంది.

      తొలగించు
  30. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ధాటిగ సామర్థ్యంబును
      మేటిగ ధైర్యంబమితపు మేధయు నున్నన్
      చేటుగ శనిగ్రహంపున్
      పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్

      తొలగించు
    2. మూర్తి గారు మీ పూరణ బాగుంది. శనిగ్రహంపుంబాటు అనండి. శనిగ్రహంపుం బాటనుట యుచితమేనా?

      తొలగించు
  31. పూటకు గతిలేదనుకొని
    నోటులు వేలిచ్చి మార్చ, నూరిత్తుననన్
    మేటరి కుటిలుండయె ; పొర
    పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్

    ఇదే సమస్యను " పాటు పడిన వారికెట్లు ఫలితము గల్గున్"
    అని ఆకాశవాణి - విజయవాడ కేంద్రం నిర్వహించిన
    సమస్యా పూరణం కార్యక్రమం తే 25 / 9 /1966దీ కై
    యిచ్చినప్పుడు, ప్రసారమైన నా పూరణములను క్రిందనిచ్చితిని.

    చీటికి మాటికి సమ్మెలు
    చేటుకు మూలంబు, వలదు; చేసిన, స్పర్ధల్
    వాటిలు, తథ్యము ; యీ పోర
    పాటుపడినవారి కెట్లు ఫలితము గల్గున్

    కోటీశ్వరులొక వంకన్
    కాటకమొక వంక ధరల గగనము జేర్చెన్,
    నేటి యభావము బాపగ
    పాటు పడిన వారికెట్లు ఫలితము గల్గున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. కృష్ణారావు గారు మీ మూడు పూరణలు బాగున్నవి. రెండవ పద్యములో పొరపాటు .
      మూడవ పద్యములో జేర్చన్ అంటే బాగుంటుంది.

      తొలగించు
  32. విలువగు నోట్లుగల్గి పదవీచ్యుతు డయ్యునుబిడ్డపెళ్లికై
    నిలువలు నింప క్రొత్తగను నెమ్మది లేకను పాతనోట్లతో
    ఫలితము గోరిపాటు పడువారికి దక్కునె లాభ మెయ్యెడన్?
    నలుగుచు బిడ్డ పెళ్లి తగునాణ్యత లేకను జేయుటాయెగా|
    2.కోటీశ్వరు డైనను సరి
    పోటీ బడుటందు పూర్తి బుద్దియులేకన్
    మేటియు నగునా?తగు గ్రహ
    పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్?

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

      తొలగించు
    2. ఈశ్వరప్ప గారు మీ రెండు పూరణలు బాగున్నాయి.
      లేక ద్రుతాంతము కాదు.

      తొలగించు
    3. ఈశ్వరప్ప గారు మీ రెండు పూరణలు బాగున్నాయి.
      లేక ద్రుతాంతము కాదు.

      తొలగించు
  33. కామేశ్వరరావుగారు ధన్యవాదములు. సవరిగంచాను
    మలిన మనస్కులై సుజనమానవులన్గని యీర్శజెందుచున్
    బలమగు ద్వేష భావమున వారల నిత్యము నింద జేయు ధూ
    ర్తులకు, సుధర్మవర్తనము తోడను మేలొనరించువారి దు
    ష్ఫలతముగోరి పాటుపడువారికి, దక్కునె లాభ మెయ్యెడన్

    ప్రత్యుత్తరంతొలగించు
  34. కామేశ్వరరావుగారు ధన్యవాదములు. సవరిగంచాను
    మలిన మనస్కులై సుజనమానవులన్గని యీర్షజెందుచున్
    బలమగు ద్వేష భావమున వారల నిత్యము నింద జేయు ధూ
    ర్తులకు, సుధర్మవర్తనము తోడను మేలొనరించువారి దు
    ష్ఫలతముగోరి పాటుపడువారికి, దక్కునె లాభ మెయ్యెడన్


    ప్రత్యుత్తరంతొలగించు