18, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2202 (రద్దన రాద్ధాంత మేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ"

84 కామెంట్‌లు:

  1. సుద్దుల సెప్పగ నెన్నడు
    పద్దుల సరిసేయనెంచి పాత కరెన్సీ
    వద్దని ముద్దుగ పలుకుచు
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి
  2. వద్దను కొంటివి పెళ్ళియు
    వద్దంటివి రాజకీయ పదవుల్ హోదాల్
    వద్దిక యీ కాలధనము
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి


  3. నారదా ! శంకరాభరణపు మొదటి పొలిటికల్ సెటైర్ సమస్యా పూరణమా యిది ?

    పెద్దల వయసై పోయెను
    బుద్ధిగను జిలేబి బుట్టబొమ్మను గానన్,
    ముద్దుమురిపెమ్ముల వదిలి
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      నా రాజకీయ పరిజ్ఞాన మెంతటిదో 'నాది మతిమరుపా? అజ్ఞానమా?' అన్న శీర్షికతో క్రింద పెట్టిన వ్యాఖ్య చూడండి.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. కంది వారు

      మీ యమ్మణ్ణి సూక్ష్మగ్రాహి ! చరిత్రే కాదు కరెంట్ అఫైర్స్ లో కూడా జిలేబి లా ఉన్నారు :)


      జిలేబి


      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      ఏనాడో ఏ సందర్భంలోనో నా భార్య పేరు 'అమ్మణి' అని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకున్న మీ జ్ఞాపకశక్తికి జోహార్లు!

      తొలగించండి
  4. హద్దెరుగని నల్లధనము,
    హద్దుల కడ నుగ్రవాదమాపెడు దిశగా
    పెద్దవగు నోట్లనిప్పుడు
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ?

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    వద్దన గల్గుట నొకచో
    పద్దగు బ్రతి పక్ష బృంద బహుళ విమర్షల్
    ఒద్దిక నెదిగిన నోట్లవి
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ?

    రిప్లయితొలగించండి
  6. ఒద్దక॥ ఒక వస్తువునకు సరియెత్తుగానుంచి తూచెడు రాయిలోనగునది,ప్రతి మానము,శ.ర
    డా.పిట్టా నుండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విమర్శల్ ఒద్దిక' అని పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి.

      తొలగించండి
  7. పెద్దల యనుమతితోనొక
    ముద్దియ బెండ్లాడి యిపుడు మురియక మోదీ
    వద్దిక యీకాగితములు
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ.

    పెద్దలు పిన్నల కందరి
    కద్దిర! సుఖమందగలుగు నంచును మోదీ
    ముద్దుగ బలుకుచు నోట్లను
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. డా.పిట్టా
    వద్దని నీటిని "చాయె"న్
    రద్దనియే యమ్మె ; నేడు రాజై మోదీ
    గద్దరి తనపు కరెన్సిని
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
  9. పద్దులు చూపని సొమ్ములు
    పెద్దలపేటికలయందు పెనునోటులుగా
    నిద్దుర పోయెడి వాటిని
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ"

    రిప్లయితొలగించండి
  10. గ్రద్దల భరతము పట్టెడి
    యుద్దేశముతోడ మోడి యుత్తమపుమదిన్
    పెద్దకరెన్సీ నోట్లను
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి
  11. పద్దులు చూపని సొమ్ములు
    పెద్దలకడ మూల్గుచుండ, పీడిత ప్రజకై
    తద్దయు ధృతి నడినోట్లను
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ
    అడిః అధికము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కవిశ్రీ సత్తిబాబు గారూ,
      బ్లాగులో బహుకాలానికి దర్శనమిచ్చారు. సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వద్దు'ను 'ఒద్దు' అన్నారు. మూడవ పాదంలో గణదోషం. 'రద్దనియెను ప్రగతికొఱకు' అనండి.

      తొలగించండి
    3. కం రద్దీగా దాచిన నో
      ట్లొద్దనుకొని మోదిగారు టూకిగ వాటిన్,
      రద్దనియెను ప్రగతికొఱకు
      "రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ"

      తొలగించండి
  13. పెద్దగక జనుల కస్టాల్
    ముద్ద్దుగ తీర్చంగమనక మోడిని, మరియీ
    పెద్దగు నోట్లన్నిటినీ
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెద్దగక'...? 'అన్నిటినీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'పెద్దగు నోట్లన్నింటిని' అనండి.

      తొలగించండి
  14. గ్రద్దల బోలిన వారగు
    పెద్దల వదలి యణిచెదవు పేదల; మోడీ!
    వద్దనుచు పెద్ద నోటులు
    "రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ"

    రిప్లయితొలగించండి
  15. హద్దులు దాటుట చేతను
    రద్దును జేయంగ మోడి ,రహిచెడి యిటులన్
    బెద్దగ నఱచుచు నుంటివి
    రద్దన రాధ్ధాంత మేల రాహుల్ గాంధీ !

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమః

    పద్దుల కెక్కని సంపద
    వద్దన్నా యనిన నీవె వణికెదవేలా
    నిద్దుర కరువై పోయన?(ఇంట్లోను, పార్లమెంట్లోను)
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోయెన'... 'పోయన' అని టైపయింది.

      తొలగించండి
  17. నాది మతిమరుపా? అజ్ఞానమా?
    నిన్న రాత్రి 'శంకరాభరణం' బ్లాగులో ఈనాటి సమస్యను షెడ్యూల్ చేస్తూ "రద్దన రాద్ధాంతమేల రాజీవ్ గాంధీ" అన్నాను. ఏదో అపశ్రుతి తోచింది. కాసేపు ఆలోచించాక నేను చేసిన పొరపాటు తెలిసివచ్చింది. నేను సంబోధించాలనుకున్నది రాజీవ్ గాంధీని కాదు, ఆయన కొడుకును. మరి ఆ కొడుకు పేరేమిటి? ఎంతకూ గుర్తుకు రాలేదు. ఇక లాభం లేదనుకొని నిరక్షరాస్యురాలైన మా ఆవిడను అడిగాను. "రాహుల్ గాంధీ" అన్నది. సమస్యను "రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ" అని సవరించాను.
    ఇంతకూ నాది మతిమరుపా? అజ్ఞానమా? ఎటూ తేల్చుకోలేక పోతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కందివారు

      రెండూ కాదు మా లక్కు :)

      మతిమరుపో యజ్ఞానం
      బదియో రాహులుని పేరు భార్యామణి నె
      మ్మదిగ తెలియజేయ నదిరె
      నిదిగో భళిభళి జిలేబి నేటి సమస్యా !

      జిలేబి

      తొలగించండి
    2. పూజ్యులు శ్రీ శంకరయ్య గారు:

      పన్నిండేళ్ళ తర్వాత శరీరంలో మార్పులు రావడం, నలభై ఏళ్ళ తరువాత చత్వారం రావడం, అరవై ఏళ్ళ పిదప పేర్లు మరచిపోవడం చాలా సహజం.

      కాల: క్రీడతి గఛ్ఛత్యాయు:

      తొలగించండి
    3. గురువుగారూ, మీజ్ఞాపకశక్తి ఘనంగాఉంది. ఎటొచ్చీ మనమనవసరమనుకున్న విషయాలు మైండ్ లో రికార్డ్ కావు.అందువల్ల (రికలెక్ట్)జ్ఞాప్తికి రావు

      తొలగించండి
  18. ప్రణామములు గురువుగారు...

    పెద్దగు నల్లధనంబు
    న్నొద్దికగా సాగనంపి యుర్వీతలమున్
    సుద్దము జేయగ, నోట్లను
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ!!!

    రిప్లయితొలగించండి
  19. కం మొద్దబ్బాయివి నీవని
    సుద్దులుతలకెక్కవనుచు సోనియె బలికెన్.
    గ్రద్దల చిక్కిన నోట్లన్
    "రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిశ్రీ సత్తిబాబు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. పెద్దగు ప్రధాన మంత్రియె
    కద్దుగ నల్లటి నగదును కట్టడి సేయన్
    పెద్ద చలామణి పత్రాల్
    రద్దన రాద్దాంతమేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిటితోటి విజయకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కరెన్సీని చెలామణి పత్రా లనడం బాగుంది!

      తొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పద్దుల కెక్కని ద్రవ్యము
    నొద్దిక బఱచెడి పధకము నుంచుచు మోదీ
    నుద్దీపించెడి క్షణమున
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
  22. పెద్దలు మిద్దెల నొద్దిక
    గద్దెల వద్దన్న వినరు గ్రద్దన నగునే
    సుద్దుల గ్రుద్దులు కద్దులు
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ శంకరయ్య గారు:

      శుభాకాంక్షలు! గత రెండు వారాలలో శ్రీ కామేశ్వర రావు గారి సూక్ష్మమైన సూచనలు నాకు చాల ఉపయోగించాయి. మీరిరువుర మార్గదర్శకత్వం మహదానంద దాయకం.

      __/\__

      తొలగించండి
    2. పద్దును భారత వర్షపు
      ముద్దుల భద్రార్థనిథియ ముద్రించంగన్
      బుద్ధిగఁ బట్టజ వసువున
      రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

      [పద్దు = ప్రతిజ్ఞ; భారత భద్ర+అర్థనిథి= భారత భద్రార్థ నిథి (Reserve Bank of India); పట్టజము= చెట్టు బెరడునుండి పుట్టినది, కాగితము; వసువు = ధనము]

      తొలగించండి
    3. నేర మవినీతు లెల్లయు
      దూరము మానవులు లేని తోరపు భువినిన్
      ఘోరారణ్యము పంపిన
      రౌరవ మేగినను నరులు లంచముఁ దినరే

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పద్యం బాగుంది. కాని సందర్భం? ఆ పద్యంలో 'ఎల్లయు' అని కాకుండా 'ఎల్లను' అనవలసి ఉంటుంది కదా!

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      ముందు ఎల్లను వ్రాసి ద్వితీయా విభక్తి యవుతుందేమో యని యనుమానమొచ్చి మార్చితిని. అన్నియు గా సవరణ.
      రద్దు చేసినా యవినీతి యాగదన్న భావము.

      నేర మవినీతు లన్నియు
      దూరము మానవులు లేని తోరపు భువినిన్
      ఘోరారణ్యము పంపిన
      రౌరవ మేగినను నరులు లంచముఁ దినరే

      తొలగించండి
  23. పద్దుల కందని ధనమిట
    హద్దులు మీరి నడయాడ నారంభింపన్
    శుద్ధిని గోరిన నోట్లను
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి

  24. రద్దయె రాజరికమ్ములు
    రద్దయె రైతుల ఋణములు రద్దయె నురియున్
    పెద్ద కరెన్సీ నోటుల
    రద్దన రాధ్ధాంతమేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పద్దుల కెక్కక నుండిన
    పెద్దవియౌ నోట్లనన్ని విధముగ నెడపన్
    యొద్దిక గూర్చదు మాకిట
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎడపన్+ఒద్దిక' అన్నపుడు యడాగమం రాదు. 'విధముగ నెడప। న్నొద్దిక...' అనండి.

      తొలగించండి
  26. పద్దుల కెక్కక నుర్విని
    యుద్దవడిగ నున్న సొమ్ములొద్దని మోదీ!
    గ్రద్దన పెదనోట్లనిలన్
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ!!!

    ఉద్దవడి - అధికము, గ్రద్దన - తటాలున, శీఘ్రము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎక్కక' అన్నది కళ. కనుక 'ఎక్కక యుర్విని' అనాలి. అలాగే '..యుర్విని। నిద్దవడిగ..' అనండి.

      తొలగించండి
  27. విరించి గారి పూరణలు...

    హద్దులు మీరిన స్వార్థపు
    గ్రద్దల నల్లధనము పయి రణమే జేయన్
    పెద్దవగు నోట్లు మోడియె
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ.

    బుద్ధిగ బ్రతిపక్షమ్మున
    నొద్దికగా మెదలుకోనక నూరీకృతమౌ
    పెద్దవగు నోట్లికపయిన్
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ.

    రిప్లయితొలగించండి
  28. ఒద్దికగా కూర్చుండరు
    వద్దన పోడియము జుట్టి వదలరు సభలో
    హద్దులు మీరగ నేటికి
    రద్దన రాద్ధాంతమేల రాజీవ్ గాంధీ?

    రిప్లయితొలగించండి
  29. నిద్దురసమయమునందున
    రద్దన రాద్ధాంతమేలరాహుల్?”గాంధీ
    మద్దతుగల నోట్లను బహు
    రద్దీ గల బ్యాంకు కంపె రయముగ మోడీ”| {గాంధీగారిముఖ చిత్రపు మద్దతునందు}




    రిప్లయితొలగించండి
  30. ముద్దుగ సుద్దులు జెప్పిన-
    పెద్దగ లాభంంబులేదు పేదలకెపుడున్
    వద్దిక నోట్లవి పెద్దవి
    రద్దన రాద్ధాంంతమేల రాహుల్ గాంంధీ!

    రిప్లయితొలగించండి
  31. నిద్దుర పట్టెను నోటులు
    రద్దన, రాద్ధాంత మేల రాహుల్ గాంధీ?
    హద్దులు దాటిన నోటులు
    రద్దైననుఁ బడుగు జనులు బ్రతుకులుమారున్.

    రిప్లయితొలగించండి
  32. కం గద్దెను యెక్కిన పెద్దలు
    సుద్దులు నుడువుతు ధనమును సుళువుగ దోచెన్.
    హద్దున నుంచగ నోట్లన్
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిశ్రీ సత్తిబాబు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  33. పద్ధతి వీడి గడించిన
    పెద్దవిలువ నోట్లనన్ని పేర్చుంచితివే
    పద్దిక చూపకపోతే
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ

    .....కిభశ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కిభశ్రీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పేర్చి+ఉంచితివే' అన్నపుడు సంధి లేదు. 'పోతే' అనడం వ్యావహారికం. "పేర్చితివే యా। పద్దులు చూపక పోయిన...' అనండి.

      తొలగించండి
  34. డా.పిట్టా
    వద్దని నీటిని "చాయె"న్
    రద్దనియే యమ్మె ; నేడు రాజై మోదీ
    గద్దరి తనపు కరెన్సిని
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
  35. డా.పిట్టా
    వద్దన గల్గుట నొకచో
    పద్దగు బ్రతి పక్ష బృంద బహుళ విమర్షల్
    ఒద్దిక నెదిగిన నోట్లవి
    రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      ఈ పూరణలను పైన సమీక్షించాను కదా! మళ్ళీ పోస్ట్ చేశారెందుకు?

      తొలగించండి
  36. పులికొండ సుబ్బాచారి గారి (ముఖపుస్తక) పూరణ....

    గద్దల్ దోచిన ధనమది
    అద్దరి చీకటి సరగున అటమట చెందే
    పెద్దగు విలువౌ నోట్లన్
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ.

    రిప్లయితొలగించండి
  37. వద్దని యధ్యక్ష పదవి
    సుద్దులు బలుకుచును కాంగ్రెసును పెంచుచు నీ
    వొద్దిక నుండక నోట్లవి
    రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ!

    రిప్లయితొలగించండి
  38. పద్దులు సరిగా కట్టవు
    ముద్దల కొద్దీ సొమ్నును మూటలు గట్టీ
    పెద్దలు చేసిన మంచిని
    రద్దన రాద్దాంతమేల? రాహుల్ గాంధీ

    రిప్లయితొలగించండి