21, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2205 (తన్నం జూచిన...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌ"
లేదా...
"తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్"

65 కామెంట్‌లు:



  1. ఛిన్నాభిన్నములాయె జీవితము యోచింపంగ పాగెమ్ము లే
    కన్నర్తించిరిగాద కోరికల సాకారంబు గావింపగ
    న్నన్నా మిన్నగు, నేటికాల మున మిన్నాగైన మోహంబులన్
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రహ్యమౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  2. అన్ని రకముల మన మదిని
    మన్నిక గా మోసగించి మత్తున్ ద్రోలున్
    మిన్నాగులైన కోర్కెల
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. "అన్నం పరబ్రహ్మ స్వరూపం"


    ఎన్నియొ శాస్త్రములు జదివి
    అన్నియు జపములనుజేసి యాకలినుండన్
    సన్నటి బియ్యపు చేటం
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్!

    రిప్లయితొలగించండి
  4. * సబబైన పూరణ మనసుకి తట్టక సరదాగా వ్రాశాను...క్షమించాలి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      భక్తితత్త్వం అలవడాలంటే సుఖభోజనాన్ని తృణీకరించాలంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. '...పురుషుం డద్వై...' అనండి.

      తొలగించండి
    2. అన్నింటినిదనలోపల
      తన్నన్నింటన్నొకటిగ దర్శింపగలం
      డున్నతపురుషుండద్వై
      తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్"
      గురువుగారూ టైపు చేయడంమరచాను. కృతజ్ఞతలు

      తొలగించండి
  6. డా.పిట్టా
    జన్నంబంచు గరిష్ట బ్రీతినొకచో సర్వస్వదానంబిడన్
    మన్నించున్ యను యూహ జేయ వడుగౌ మాన్యుండు యా బల్లిదుం
    డెన్నం వానిని గట్టి వేయును సుమా! కాంక్షింపకీ మోహమున్
    దన్నం జూచిన భక్తి గల్గు మదికిన్ దత్త్వంబు సుగ్రాహ్యమౌ!

    ఎన్నెన్నో యూహలబడ
    మన్నించగ గల్గు హరిని మౌలిక ప్రేమన్
    గన్నందుకు భోగంబుల
    దన్నం జూచిననె భక్తి తత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మన్నించున్+అను, మానుండు+ఆ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  7. వెన్నను దోచిన వానిని
    వన్నెల చీరలను దాచి వలచిన వానిన్
    వెన్నుని, కథరాసినపో
    తన్నం జూచిన భక్తి తత్త్వముదెలియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      పోతన్నను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..జూచిననె..' లో నె టైపు చెయ్యలేదు.

      తొలగించండి
  8. కన్నుల గానగ రాకనె
    యన్నిట తామౌచు మనిషి యహమై పెనగన్
    బన్నెడి యరిషడ్వర్గాల్
    దన్నం జూచిననె భక్తి తత్త్వము దెలియున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనిషి' అన్నది కేవలం జనవ్యవహారంలో ఉంది. బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువులు పేర్కొన్నా అది గ్రాంధికం కాదు. మనుష్యుడు అన్నది సాధువు. అక్కడ 'నరుడు' అనండి.

      తొలగించండి
  9. ఎన్నంగన్ మరి దండనమ్మె సరియౌ యెవ్వారి కైనన్ భువిన్
    కన్నుంగాలును కానబోక జగతిన్ గాండ్రించు దుష్టాత్ముకున్
    అన్నన్నా ! యిల దెబ్బ కన్న కలదే ? ఆయాతమౌ శిక్షయే !
    "తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రహ్యమౌ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సరియౌ నెవ్వారి...' అనండి.

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వెన్నుని మదిలో దలచుచు
    చెన్నగు తీరున నిరతము సేవల దోడన్
    వన్నెల చిన్నెల వలపుల
    తన్నం జూచిననె భక్తి తత్వము దెలియున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పూరణలో మధురభక్తిని ప్రస్తావించారా?

      తొలగించండి
  11. అన్నల్దమ్ములు సోదరీమణులుగా నత్యంతమోదంబుతో
    నెన్నంగల్గుచు లోకమున్ సకలమం దింపార సర్వేశునిన్
    గన్నుల్ విప్పి కనంగబూని శుచియై కామాది షడ్వర్గముం
    దన్నం జూచిన భక్తి గల్గు మదికిన్ దత్త్వంబు సుగ్రాహ్యమౌ.

    వెన్నుని మదిలో నిలుపుచు
    సన్నుతులగు సాధుజనుల సంగతి గొనుచున్
    మున్నా దుర్గుణరాశిని
    దన్నం జూచిననె భక్తి తత్త్వము దెలియున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. వెన్నుని భజియించుచు నా
    పన్నుల కన్నీరుదుడిచి యనవరతంబున్
    తిన్నగ నరిషడ్వర్గాల్
    దన్నంజూచిననె భక్తితత్వము దెలియున్!!!

    రిప్లయితొలగించండి
  13. కం.వెన్నుని జేరగ నిలలో
    నున్నట్టి సకల సుఖముల నోర్పుగను వెస
    న్నన్నిటి బారంద్రోలగ
    దన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్"

    రిప్లయితొలగించండి

  14. శ్రీగురుభ్యోనమః

    ఎన్నో రీతుల వైద్యమున్ సలిపినన్నీశుండు శాంతించడే
    తిన్నండంతట దేవదేవునకిడెన్ దేదీప్యమౌ భక్తితోన్
    కన్నున్ దీయుచు కన్నెరుంగు టకునై కాలూనెడిన్ భంగిమన్
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రహ్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      వైవిధ్యమైన భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ఎన్నో పూజల జేసి నప్పటికి , ని౦ కెన్నో

    …......... పురాణ౦బులన్

    విన్నన్ , క్షేత్రము లెన్ని చూసిన ఫల౦

    ............ బే రాదు | నీవి౦క పో

    తన్నామాత్యుని గ్ర౦ధమున్ జదువ

    ………… పుణ్య౦ బబ్బు | డె౦దాన పో

    తన్న౦ జూచిన భక్తి గల్గు మదికిన్ దత్వ౦బు

    …………… సుగ్రహ్య మౌ ! !

    { డె౦దాన పోతన్న౦ జూచిన = మనసు లో

    పోతనను స్మరి౦చు కొనగానే }

    రిప్లయితొలగించండి
  16. మున్నెన్నడులేనంతగ
    దన్నంజూచిననెభక్తితత్త్వముదెలియున్
    గన్ననివోలెనుజగతిని
    విన్నారామీరుసామి!వీనులతోడన్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. చెన్నుగ నవధాన్యములను
    తిన్నగ బండించి ధరకు దీర్ప జిఘత్సన్
    నన్నము నందించెడు రై
    తన్నంజూచిననె భక్తితత్వము దెలియున్!!!

    రిప్లయితొలగించండి
  19. కన్నుల్ కానని కాల రాత్రుల మహా క్ష్మాభృత్తు లందైననుం
    జిన్నాభిన్నములైన గాత్రములు నుత్సేకంబు నక్షీణమై
    దన్నొప్పార నభీతి భీకరపు యుద్ధంబందు నేపారు రౌ
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రహ్యమౌ


    కన్నీరే సద్గంధపుఁ
    బన్నీరైనను గుములక వరిపొల మందా
    వెన్నులు సూచి మురియు రై
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  20. వెన్నన్ దొంగిలి ఇండ్లను
    చెన్నుగ నాగోపికాళి చిత్తహరుండౌ
    కన్నని వర్ణించిన,పో
    తన్నంజూచిననె భక్తి తత్త్వము దెలియున్.

    రిప్లయితొలగించండి
  21. వన్నెల్జూపుచు గోపికాళి మనముల్ వంశీకృతాలాపమున్
    చెన్నారన్ తనవైపులాగికొనుచున్ శ్రీదివ్యతేజుండునౌ
    వెన్నున్ హాస విలాససంపదల నెవ్వేళన్వివిచారించు పో
    తన్నంజూచిన భక్తిగల్గు మదికిందత్త్వంబు సుగ్రహ్యమౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. తిన్నాడు రాచధనమని,
    తన్నంజూచిననె భక్తి తత్వము తెలియు
    న్నున్నాడన గోపయ,రా
    మన్న ధనము దెచ్చి యిచ్చె నా ఖానునకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. పున్నెము కలుగుననుచు పెరు
    గన్నము, పులిహోర బంచ నాలయమందు
    న్నన్నార్తులగు జనుల చే
    తన్నం జూచిననె భక్తి తత్త్వము దెలియున్!

    రిప్లయితొలగించండి
  24. అన్నుల మిన్నను గానక
    కన్నీరున్ గార్చురాము గలతన్ గని తా
    మున్నీరు దాటు హనుమం
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    విన్నన్ జాలును సద్గుణోత్తముల సద్వృత్తాంతముల్ తొల్గునే
    యెన్నో జన్మల పాపముల్ , వసుధలో నిక్ష్వాకు చంద్రుండు రా
    మన్నన్ నమ్మిన శ్రేష్ఠుడిన్ కవి వరున్ మాన్యుండె యౌ భక్త పో
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రహ్యమౌ

    రిప్లయితొలగించండి
  25. సన్నాయందున నాదమట్లుగను విశ్వాసాన సద్భక్తియే
    నిన్నంటన్ తగుజీవితాశయమె సాన్నిధ్యాన సాగించుటౌ|
    పన్నాగంబున బట్టి భాగవత సద్భావంబు జొప్పించ?పో
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిన్ దత్త్వంబు సుగ్రహ్యమౌ|
    2. పన్నాగంబగు మాయను
    తన్నంజూచిననె భక్తి తత్వము దెలియున్
    అన్నా|భాగవతంబే
    విన్నా,చదివిన?కలుగును విశ్వాసంబే|

    రిప్లయితొలగించండి
  26. కన్న తలిదండ్రుల సదా
    మన్నన జేయుచు కరమగు మాన్యత తోడన్
    చెన్నగు మదినుండి చెడున్
    దన్నంజూచిననె భక్తితత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. మన్నున శ్రమించి దినమున్

    తిన్నగ నెరువేసి పంట తీరిచిదిద్దు

    న్నన్నము మిన్నగ నిడు రై

    తన్నన్ జూచిననె భక్తి తత్త్వము దెలియున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. దున్నుచు వరుణుని గొలుచుచు
    చెన్నుగ వరి పంట పండ క్షితి జీవులకు
    నన్నంబిడ గోరెడి రై
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    వెన్నను దొంగిలి, నోటను
    మన్నే లేదనుచు జూపె మాతకు మహి, నా
    కన్నయ్యను గోపికలటు
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జీవులకు' అని రెండవ పాదాన్ని హ్రస్వాంతంగా టైప్ చేశారు. 'జీవులకు। న్నన్నంబు...' అనండి.

      తొలగించండి
  29. మన్నున కస్టము బడుచును
    అన్నియు ఫలితములిక పరమాత్మునివనుచున్
    అన్నము జగతికి నిడు రై
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      అది కేవలం టైపాటు. సవరించాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  31. అన్నవగు పాదుకల్ గొని
    మిన్నగ తలనుంచి రాజ్యమేలఁగఁ దా చే
    గొన్న నయోధ్యాపురి భర
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
  32. క్రన్నన పామరుడైనను
    పన్నుగ గనగానె పరమ భాగవతున్ సం
    పన్ను బగితి యందును బో
    తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్

    రిప్లయితొలగించండి
  33. కన్నాల్గొట్టుచు దేశ కోశములకున్ గర్భంబునన్ దాచుచున్
    ఛిన్నాభిన్నము జేయుచున్ పొలుపులన్ చీల్చించి చెండాడుచున్
    తిన్నద్జాలక నేత లెల్లరికి తా తిన్పించు వారెల్లరిన్
    తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌ

    రిప్లయితొలగించండి