26, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2210 (కార్తిక మాసమందు శితికంఠుని...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ"
లేదా...
"కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

56 కామెంట్‌లు:

  1. ఆర్తుల రక్షించు శివుడు
    కార్తిక మాసమున దీర్చు కాంక్షల నన్నిన్
    ధూర్తులు వంచన జేసెడి
    కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      వంచనతో జేసే పూజ పాపమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఆర్తిగ దేవుని కొలిచిన
    ధూర్తుల మదమణచి జనుల దోహద పడగన్
    సూక్తులు బలికిన చాలదు
    కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      కొంత అన్వయక్లేశం ఉన్నది. పూరణ భావం సమర్థంగా ఉన్నట్టు లేదు.

      తొలగించండి
    2. ఆర్తిగ దేవుని కొలిచిన
      ధూర్తుల మదమణచి జనుల దోహద పడగన్
      సూక్తుల కపటపు పలుకుల
      కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్

      తొలగించండి


  3. ఆర్తిగ జేయవలయునౌ
    కార్తికమున శివుని పూజ, గడుఁ బాపమగున్
    సూక్తుల బలుకుచు కాలము
    పూర్తిగ వ్యర్థమొనరింప పుత్తడి బొమ్మా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    (దేశమంతటను ద్రవ్య చింతనయే కాని దైవ చింతనపై మనసెక్కడ నిలిపేము? చేతులారంగ శివుని పూజించే యవకాశం కలుగ లేదండీ.ఈ యేడు కార్తిక మాసంలో శివపూజ చేస్తే పాపం.మోదీ చింతన ,భవిష్యత్తు యెట్లుందో యన్న భయంతో నేను శివపూజ చేస్తేపాపం!నన్నునమ్మండి అనేధోరణిలో"పాపము"అన్న పదాన్ని వాడినాను)
    పూర్తిగ నోట్ల సంచయన పూరిత మాయెను,నాయకమ్మనుల్
    మూర్తులు నర్ధరాత్రి శివ మోహన యుద్భవమట్లు వ్యూహముల్
    గూర్తురు మూర్తిహీనుడెటు గూర్చును శాంతి?నశాంతి పూజలీ
    కార్తక మాసమందు; శితికంఠుని పూజలు సేయ బాపమౌ!

    ఆర్తిని గని బ్రోవుము యని
    మూర్తిని గొను దైవ పూజ మోక్షము కొరకౌ;
    పూర్తిగ "మోదీ"చింతయె(అతని మూర్తి పూజ వర్త మానం కొరకై సాగాలి అన్న ధ్వని)
    కార్తికమున శివుని పూజ గడు బాపమగున్.(శివుడు నిరాకారుడాయె.పట్టుకోవడం కష్టంకదా!)

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టానుండి
    ఆర్యులారా!
    మోదీ శివుడు కాదు.నారాయణుడు.బహురూపి.నాడు అమ్మిన చాయె లో నీరుగలిపెనా,నేడు ,రోజుకు ఒక్కంటికి లెక్కలేనన్ని దుస్తులు వేసికోవడం లేదా.మనకు మూర్తి పూజ రాజకీయ రంగంలో ఉన్నమాటే!ఆయన గారి పూజ వైరంతో నల్లధనం గలవారు,సఖ్యతతో పేదలు భజించేవారే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బ్రోవుము+అని' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'బ్రోవు మనుచు' అనండి.

      తొలగించండి
  6. ఆర్తి యడంగు, మిక్కిలిగ హర్షము గల్గును, సర్వమాన్యమౌ
    కీర్తియు వచ్చి చేరునిక క్షిప్రమె సౌఖ్యము లందవచ్చు నీ
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయ, బాపమౌ
    ధూర్తత ధిక్కరించినను దోషము లెంచిన సత్య మెల్లెడన్.

    ఆర్తిహరంబగు సత్యము
    కార్తికమున శివుని పూజ, గడు బాపమగున్
    ధూర్తుండౌచును రుద్రుని
    గీర్తించుచునుండువారి క్రియలం గూల్చన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. ఆర్తిగ పూజ చూయుటకు నాదిగ ముఖ్యమదేమి మిత్రమా
    పూర్తిగ వర్జనీయమగు పూజను సేయగ నెద్దిజెప్పుమా
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ
    వర్తన మెంచిచూడ మది పాపపుఁ జింతన కానెకాదుగా

    రిప్లయితొలగించండి
  8. ఆర్తిని బొంది భక్త సుజనావళిజేరి విశుద్ధ తత్త్వ సం
    కీర్తనలాలపించిన వికీర్ణము గాదె సమస్తపాపముల్
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ, బాపమౌ
    ధూర్తుల సాన్నిహిత్యమును దుష్టతలంపులు నిజ్జగంబునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఆర్తిగ నిముసమ్మైనను
    కీర్తించిన భవుని గలుగు కీర్తి శుభమ్ముల్
    పూర్తిగ నెగగొట్టినచో
    కార్తికమున శివుని పూజ, గడుఁ బాపమగున్

    రిప్లయితొలగించండి
  10. మూర్తీభవించితినిల
    న్నార్తులఁ గాచెడుమహేశునవతారుడనన్
    ధూర్తుని మదిలోఁ దలఁచుచు
    కార్తీకమున శివుని పూజ గడుఁ బాపమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూర్తిగ నార్తిని దీర్చును
    కార్తికమున శివుని పూజ, గడు పాపమగున్
    ధౌర్తిక మెంచెడి మనమున
    కీర్తిని గోరుచు చలిపెడి కేదారర్చల్.

    (అర్చ = పూజ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధౌర్తికము' అన్న పదం లేదు. 'ధూర్తత నెంచెడి మనమున' అనవచ్చు కదా!

      తొలగించండి
  12. కర్తవ్యము దొంగతనము
    వర్తకముగ వాడలందు వ్యభిచారమ్మున్
    పూర్తిగ మద్యమున మునుగ
    కార్తికమున శివుని పూజ గడుఁ బాపమగున్

    రిప్లయితొలగించండి
  13. ధూర్తునిమాటగనెరుగుడు
    కార్తికమునశివునిపూజగడుబాపమగున్
    కార్తీకమాసమంతయు
    బూర్తిగశివపూజజేయబుణ్యమునిచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కార్తిక మాస మ్మంతయు...' అనండి.

      తొలగించండి

  14. హర్తలు,నల్లధనమ్ముకు
    భర్తలు,ధూర్తులును, స్వార్ధ పరులున్ తృష నా
    వర్తించిన భక్తివినా
    కార్తికమున శివుని పూజ గడు పాపమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నల్ల ధనమునకు' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము
      హర్తలు,నల్లధనమునకు
      భర్తలు,ధూర్తులును, స్వార్ధ పరులున్ తృష నా
      వర్తించిన భక్తివినా
      కార్తికమున శివుని పూజ గడు పాపమగున్

      తొలగించండి
  15. పూర్తిస్థాయి సుభము నిడు
    కార్తికమున శివుని పూజ, గడు బాపమగున్
    హర్తగ మారి గుడి నిధుల,
    కర్తవ్యమును విడనాడి, కాజేయు పనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శుభమును సుఖము అన్నారు.

      తొలగించండి
  16. కార్తికమాసమందుశితికంఠునిపూజలుసేయపాపమౌ
    ఆర్తినిబొందినామనసుహాయిగనుండమియట్లుపల్కితిన్
    కార్తికమాసమందిలనుగాలునిపూజనుజేయనొప్పగు
    న్నార్తినినొక్కరోజయినహారములేకనునుంటమేలగున్

    రిప్లయితొలగించండి
  17. ఆర్తుల కల్పవృక్ష మిల నంగజ గాత్రవినాశ ధీజనో
    ద్ధర్తృ విభూతిగాత్ర భవతాప విదూరుడు చంద్రశేఖరున్
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాప మౌ
    హూర్తికు డావిలాంతమున హోత్రియుడై వెలుగొందు నిత్యమున్

    [పాప మౌహూర్తికుడు= దుష్కృతపు జోస్యుఁడు; ఆవిలము= కలుషము]


    ఆర్తి జనుల సకలాఘా
    హర్తమని మదిం దలంతు రట శర్వాంత
    ర్వర్తిత ముత్తమ మాసము
    కార్తికము నశివుని పూజ గడుఁ బాపమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రౌఢంగా, గూఢ భావోద్దీపితాలై అలరింపజేస్తున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. కీర్తించుచు భూతేశుని
    యార్తిగ బూజింపగలుగు నఖిలశుభమ్ముల్
    పూర్తిగ విడనాడినచో
    కార్తికమున శివుని పూజ, గడు బాపమగున్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూతేశుని। నార్తిగ...' అనండి.

      తొలగించండి
  19. శ్రీగురుభ్యోనమః

    స్ఫూర్తిని కల్గజేసి పలు పూజల గల్పనజేసి డబ్బు దా
    హార్తులు కొందరీ ప్రజల యాతనలన్ గమనించి యుక్తితో
    వర్తకులౌచు దాము కడు భక్తి నటించు ద్రోహ బుద్ధితో
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో 'నటించు' అన్నచోట గణభంగం. 'నటించుచు' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూర్తిగ డెందమున్నిలిపి పూనిక జూపుచు భక్తి తోడుతన్
    కీర్తనలెంచి సాగునెడ ఖేదము లాఱుచు మేలుగల్గునౌ
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయ, బాపమౌ
    ధౌర్తిక తత్వమున్నడప దల్చెడి నీశ్వర బూజలన్నియున్.

    రిప్లయితొలగించండి
  21. కర్తలటంచునెంచి శుభ కార్యములన్నియు నొప్పగించగా
    ధూర్తమనస్కులై సతము దోచుచు సొమ్ముల దేవళమ్ములన్
    పూర్తిగ పొల్లు వస్తువుల మోసముతోగొని తెచ్చి నిత్యమున్
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ

    రిప్లయితొలగించండి
  22. ఆర్తిగ వేత్తయై హరిహరాద్వయతత్వమునాశ్రయింపకన్,
    'ధూర్తుడు విష్ణువం'చుమదిఁ దోడనజేయుచు కుంచితాత్ముడై
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ,
    స్ఫూర్తిగఁ'బ్రహ్మమొక్కట'ని జూచిన పుణ్య మగణ్యమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఆర్తగ బూజలన్సలుపు మా శివదేవుడు సంతసింపగన్
    బూర్తగ మానసమ్మునను పొందుగ నిల్పియు దివ్యరూపమున్
    కీర్తిప్రతిష్ఠలన్ గొనక కీర్తన జేయగ నెట్టి తీరునన్
    గార్తక మాసమందు శితికంఠుని పూజలు సేయ బాపమౌ???

    రిప్లయితొలగించండి
  24. ధూర్తులు గేలిని సేసిన
    కార్తికమున శివుని పూజ, గడుఁ బాపమగున్"
    నేర్తురె యట్ఠిదురాత్ములు
    భర్తయనిసకల జనులకు పార్వతి నాథున్

    రిప్లయితొలగించండి
  25. .”ఆర్తిగ భక్తియుక్తులచె యాశివనామము నుచ్చరించ?సా
    హార్తిగ నిన్నుజేరు హర|హాశివ దైవమటన్నతోడుగా
    కార్తిక మాసమందుశితి కంఠునిపూజలు సేయ”|” బాపమౌ
    దూర్తమనస్సుగల్గి పరధూషణజేయుచునుండ బూనగా”
    2.వర్తనగసౌమ్య వారము
    కార్తికమున శివుని పూజ”|”గడుపాపమగున్
    వార్తలతోవిడ బూనగ
    దూర్తత్వము జేరిపోవు దోషంబదియే”.




    రిప్లయితొలగించండి
  26. భర్తలు దేవళమ్మునను భార్యల దింపుచు ముద్దుమీరగా
    కార్తిక జాగరమ్మనుచు కమ్మగ జారుచు రాత్రివేళనున్
    పూర్తిగ మూడు పిక్చరులు ముచ్చట మీరగ చూచుచుండెడిన్
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాపమౌ

    రిప్లయితొలగించండి