27, నవంబర్ 2016, ఆదివారం

సమస్య - 2211 (రాతినిఁ గూడినట్టి చెలి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాతినిఁ గూడినట్టి  చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?"
లేదా...
"రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె"

65 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    ఊళ్ళో లేనందున నిన్న నా పూరణలు పంపలేక ఈ రోజు పంపి మీకసౌకర్యము కలిగిస్తున్నందుకు క్షమించగలరని మనవి

    నిన్నటి సమస్యకు నా పూరణలు

    కీర్తిని, ముక్తినిచ్చునట కేలుల మోడ్చుచు భక్తితో జనుల్
    కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ, బాపమౌ
    ఆర్తజనాళి వేదనల నంతము జేసెడి వాడినీ భువిన్
    ధూర్తుల సాహచర్యమున దూషణ జేయుచు నిందమోపుటన్

    కీర్తియు పున్నియ మేగద
    కార్తికమున శివుని పూజ, గడుఁ బాపమగున్
    ఆర్తజన రక్షకునిల
    ధూర్తుడ వగుచున్ సతతము దూషణ జేయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. నన్నువిడచి వెళ్ళె నమ్మి తానా గుజ
    రాతిఁ గూడి చెలియ - రాయి యయ్యె
    నాదుగుండె యింత నమ్మకద్రోహమ్ము
    గట్టి దెబ్బకొట్టి కఠినపరచ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గతంలో రోజూ మీ పద్యం చదివిన తరువాత పూరణకు ప్రయత్నించేవాడిని.మీ ఆగమనము సంతోషదాయకము.చక్కని విరుపుతో మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. అభినందనలు కవి మిత్రమా.

      తొలగించండి
    2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      చక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. ముఖ్యంగా పూరణలో 'గుజరాతి'ని తీసుకురావడం ప్రత్యేకంగా ప్రశంసింపదగినది. అభినందనలు.
      'వెళ్ళె'(వ్యావహారికం)ను 'వెడలె' అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదాలు మాష్టారు...
      ధన్యవాదాలు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ..మీరు చూపిస్తున్న ఆప్యాయతకి సర్వధా కృతజ్ఞుణ్ణి...

      తొలగించండి


  3. అంద చంద ములకు నందనవనమగు
    శిల్ప తోరణమున చిన్న వాడు
    కనుల కనులు కలుప కదలిక మరచుచు
    రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చక్కని శిల్పాన్ని చూచి స్థాణువైపోయిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  4. నాదు ప్రేమ నీకు చేదుగా తోచెనే
    నమ్మి వెడలి నావు నన్ను విడచి
    మోస గించు ప్రియుడు కసాయి గావున
    రాతిఁగూడి చెలియ రాయి యయ్యె

    రిప్లయితొలగించండి
  5. చెలియ గూడి జనియె తొలిప్రేమ యాత్రకై
    హంపి రాతి విగ్రహాలు జూడ
    చెలియ నిలిచె శిల్ప చిత్రగ్రహణమున
    రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె!


    శిల్పచిత్రగ్రహణము = స్టిల్ ఫోటొగ్రఫీ

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    [అహల్యకు గౌతముఁడు శాపమిడఁగాఁ గాంచిన యామె చెలికత్తె మఱొక చెలికత్తెతో నా వృత్తాంతమునుం జెప్పుచున్న సందర్భము]

    "పాతక మొందు నాకు నను భావన నొందక జార యౌటచే
    జాతక మడ్డదిడ్డమయె! సాంత్వనయే కఱవాయె! భర్త యా
    నాతికి శాప మీయఁగను నబ్రముగా నిటులాయెనే? బలా

    రాతినిఁ గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "మోహముననుఁ బతిని మోసగింపఁగఁ బూనెఁ;
      దప్పుసేయఁ బ్రియుఁడు దరికిఁ జేరెఁ;
      బాపులైరి యిర్వు రా పనిచే; బలా

      రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె!"

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      బలారాతితో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. గౌతముఁ బత్ని తోడ మమకారము జూపుచు భర్తరూపునన్
    భీతియు లేక పాపపు నపేక్షను జూపుచు చెంతచేరగ
    న్నాతని తోడ సంగమము నక్కజ రీతిని కోరి దానవా
    రాతినిఁ గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణి కుమార్ గారూ - దానవారాతి అనే పదమునకు జి.ఎన్.రెడ్డి గారు విష్ణువు అనేఅర్థం యిచ్చారు. యింద్రునికి ఎక్కడన్నా ప్రయోగంఉన్నదా. దానవకులవైరి దర్పమ్ము వర్ణించు చదువు లెవ్వరు గాని చదువరాదు. అనే పద్యంలో కూడా విష్ణువు గురించే ఉన్నది.

      తొలగించండి
    2. సత్యనారాయణరెడ్డి గారూ, నమస్కారములు. నేను నిఘంటువు చూడలేదు. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడే చూశాను. దానవులు ఎప్పుడూ దండయాత్ర చేసినా అమరావతి మీదనే కదా. అందువలన దానవులకు శత్రువు ఇంద్రుడు అనే ఉద్దేశ్యంతో వ్రాశాను. అది అంగీకార యోగ్యము అవునో కాదో తెలియదు. సవరించాను. ధన్యవాదములు.

      న్నాతని తోడ సంగమము నక్కజ రీతిని కోరియా బలా

      తొలగించండి
    3. ఫణికుమార్ తాతా గారూ,
      ఇంద్రుణ్ణి దానవారాతి అనడంలో దోషం లేదు. మీ సవరణ (అవసరం లేకున్నా) బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    4. గురువుగారూ నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  8. డా.పిట్టా
    (నారీణామ్ వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమమాదపి)
    నాతిగ నంగనన్ జనులు నమ్మిరి కోమలగాత్రిగాదె వే
    చేతలనైన నచ్చముగ చిన్మయ లీలగ పుష్పభాతియౌ
    కోతలుగోయు వజ్రమగు గ్రుంగిన వేళల భూషణాదులన్
    రాతిని గూడినట్టి చెలి రాతి(యి)గ మారె నదేమి చోద్యమో!
    బందిపోటుదొంగ బాల్యాన గొంపోయి
    పెంచి బెద్దజేసి ప్రేమ జూప
    వాని వాసి జూసి వంచించి జంపెను
    రాతి గూడి చెలియ రాయి యయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లలికి జిక్కి నట్టి లలన గ్రుడ్డి దగుచు
    తమిని గూడి గుణము దలచ కుండ
    కమనుడై చెలగెడి ఖలుని వెంట బడియె
    రాతి గూడి చెలియ రాయి యయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. హంపి క్షేత్రమున విహార యాత్ర కొఱకు

    చెలియ తోడ వెళ్లి శిల్పములను

    చూచుచుండ నొకచొ చోద్యమ్ముగా నున్న

    రాతి గూడి చెలియ రాయి యయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. సంభ్రమంబు నందె సాంధ్యలో విభ్రమా
    రాతి గూడి; చెలియ, రాయి యయ్యె,
    నిబిడ తిమిర దిశల నిండిన నిశ నట
    దాట లేక తాను బాట గనక!

    రిప్లయితొలగించండి
  12. రాయిగూడిచెలియరాయియయ్యెనునట
    కనకలక్ష్మిదానుగాంతలందు
    కఠినమనముగలిగికాఠిన్యమునుజూపు
    నెపుడుదనపరమనియెంచకిచట

    రిప్లయితొలగించండి
  13. ప్రేమమీరమేము పెళ్లైన తరువాత
    నుదకమండలమ్ము ముదము చేర
    సేద దీరఁ గొలను శీతలంపు దహనా
    రాతిఁగూడి చెలియ రాయియయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అజుని తనయ యైన నా యహల్యను జూచి
    మరులు గొనుచు నామె మగని వలెను
    పొడను మార్చి వచ్చి పొరలాడిన బలా
    రాతి గూడి చెలియ రాయి యయ్యె.

    (పొర = మోసము)

    రిప్లయితొలగించండి
  15. చేతలు దైవ చోదిత విచిత్ర విధాయక సంభవమ్ములే
    హేతువు లారయన్ జగ దభీష్ట సమృద్ధికి ఘోర దుష్టపుం
    గూతలు గూసి నట్టి వెడ కుబ్జయ మంథర రామ వైభ వా
    రాతినిఁ గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?


    శక్రుడు సురవిభుడు సంక్రందనుండట
    పంచ కన్యక యట చంచలాక్షి
    నుడువ గల రహల్యను జను లిటుల బలా
    రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. గౌతముశాపముందగిలికాంతయెరాయిగమారగానిల
    న్నాతతరామచంద్రునిపదావళిసోకగవెంటనేమరిన్
    రాతినిగూడినట్టిచెలిరాతిగమారెనదేమిచోద్యమో
    రాతినిమార్చగల్గుటనరామునికొక్కడికేయగున్సుమా

    రిప్లయితొలగించండి
  17. భూతల భాగ్యశాలి యగు బోటిని నెంపికచేయు స్పర్థలో
    భీతిలకుండ దోసలను విస్తృతరీతి భుజించి యెన్నియో
    చేతను లెక్కపెట్టుమన క్షిప్రముగా నట నుంచినట్టి కీ
    రా తిని, గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో!
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. సింధు కన్యను గని శ్రీనివాసుని మేను
    శిలగ మారిపోవ, చెంతనున్న
    మంగ గూడ శిలగ మారెను,దానవా
    రాతి గూడి చెలియ రాయి యయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గౌతమ పత్ని నాత్మభువు గాదిలి కూతు నహల్య నెంచుచున్
    భ్రాతిని గూడి మోహమున వాసవుఁ డాశను గౌతమున్వలెన్
    నాతి నహల్యనిం గలియు నంత మగండిడు శాపమున్ బలా
    రాతిని గూడినట్టి చెలి రాతిగ మారిన దేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  20. గౌతమి బొందగా దలచి కాముకు డైనసురాధిపుండు తా
    గౌతము రూపమందు జనె, కల్లరి మోనమెఱంగి భర్తయే
    పాతకియంచు దూరి తన పత్నికి శాపమొసంగ, దాసవా
    రాతినిఁ గూడినట్టి  చెలి రాతిగ మారె నదేమి చోద్యమో

    కాముకుండు చేరి కలికి గౌతమి వొంద
    కోపమందు మునియె శాప మిడిన
    ఫలిత మదియె జూడ పాపియౌ దానవా
    రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె

    రిప్లయితొలగించండి

  21. శ్రీగురుభ్యోనమః

    భూతలమందు సౌఖ్యముల బొంద మహేంద్రుడు మౌని రూపుడై
    గౌతమ యాశ్రమమ్ము కడ గాంచె నహల్యను కామ మోహసం
    జాత మదంధుడౌచు దన సన్నిధి నిల్వగ భ్రాంతితో నగా
    రాతినిఁ గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  22. గౌతమ మౌని పుంగవుని కాంతను గాంచియు మోహబుద్ధిచే
    నాతని యాశ్రమమ్మరిగి యామెను బొందగ నింద్రుడంతటన్
    గౌతము డాగ్రహించి తన కర్కశ శాపము లీయ దానవా
    రాతిని గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో !

    రిప్లయితొలగించండి
  23. ఉపశమనము బొంది సొలయించి కీచకా
    రాతిఁ గూడి చెలియ, రాయి యయ్యె
    డును మనంబు నెప్పుడూ నిట్టి యవమాన
    ముల మరెన్ని హృదయమోర్చ వలెనొ!

    రిప్లయితొలగించండి
  24. 'రావి తిలకు ' తోడ రమ్యంబుగా పెండ్లి
    జరిగె 'నిచ్చ ' పేరు సఖియతోడ
    ఇంటిపేరు తోడ నింపుగా నిట్లుండు
    రా.తిఁ గూడి చెలియ రా.యి యయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  25. లేతగులాబివంటి పసిలేమను కోరినకట్నమిచ్చి గో
    మాతను కోరియా కటిక గోష్ఠము కంపినరీతిఁ శ్వశ్రుసం
    ఘాతముజేర్పనాకట!మగండను రాక్షస మానసుండైన పెన్
    "రాతినిఁ గూడినట్టి చెలి, రాతిగ మారె నదేమి చోద్యమో?"

    రిప్లయితొలగించండి
  26. వనితచిన్నిబాబుతోవడిలోనుంచుకొనివెళ్లిగుడులదర్శనాలతో చేతగాకతిరిగిన అలసటతోకన్నడవనితఈవిదంగా హంపియందుగల 50చదరపు కిలోమీటర్లదూరమునడచినడచిచూచిన పలికినదట{హంపిగోగద కింతు కొంపేగిరదు మేలు=హంపివెళ్ళుటకన్న ఇంట నుండుటమేలు}అనగానేఆమెశిలగాకొడుకుతో సహా మారిఇప్పటికి శిలయున్నదిఈవిషయాన్నిపూరించడ మైనది
    1.భూతల శిల్ప కల్పనల బుద్దివికాశము జూడ నెంచగా
    మాతగ బిడ్డ నెత్తుకొని మాపటి వేళకు చేతగాకనే
    చూతమటన్న గాక|మనసొప్పక నొచ్చుకొనంగ తిట్టగా
    రాతిని గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో| {నేటికిఆశిల్పము జూడవచ్చుహంపియందు}
    2.పిల్లనెత్తు కొనియు మెల్లగ నడచుచు
    ఆనె గొంది,హంపియద్బుతాలు
    జూడ లేకతిట్ట?చోద్యముగామారె
    రాతి గూడి చెలియ రాయి యయ్యె|


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      క్రొత్త విషయాన్ని తెలియజేశారు. బాగున్నవి మీ పూరణలు. అభినందనలు.

      తొలగించండి
  27. గౌతమ మౌని పుంగవుని కాంతను గాంచియు మోహబుద్ధిచే
    నాతని యాశ్రమమ్మరిగి యామెను బొందగ నింద్రుడంతటన్
    గౌతము డాగ్రహించి తన కర్కశ శాపము లీయ దానవా
    రాతిని గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో !

    రిప్లయితొలగించండి
  28. పతిగ రూపు దాల్చి పడతి చెంతకు చేరె
    నర్ధరాత్రమందు నతివ గూడ
    వాసవుండు రాగ వాంఛతో నా నగా
    రాతి గూడి చెలియ రాయి యయ్యె.

    రిప్లయితొలగించండి
  29. హా! శకుంతలే!:

    ప్రీతిని కూడ రిద్దరును పేరిమి తోడను బిడ్డపుట్టగా
    రాతిని వోలుచున్ ప్రియుడు రాతిరి రాతిరి పారిపోవగా
    నాతియు రాతియై శిశుని నందము మీరగ పారవేసెనే...
    రాతినిఁ గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?

    రిప్లయితొలగించండి

  30. ప్రీతిని పెండ్లియాడుచును ప్రేమను చేర్చుచు బ్యూటి పార్లరున్
    రేతిరి చూడగా నగుచు రెప్పల మీదను కాటుకన్ మహా
    కోతివి నీవనంగ పడి కొట్టగ బోవుచు రుబ్బురోలుదౌ
    రాతినిఁ గూడినట్టి  చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?

    రిప్లయితొలగించండి