8, డిసెంబర్ 2016, గురువారం

సమస్య - 2219 (సాహిత్యాధ్వమున దుమ్ము....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై"
లేదా...
"సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్"
(ఆకాశవాణి వారి సమస్య)

52 కామెంట్‌లు:

  1. మాహాత్మ్యమ్మును జూపు నట్టి కవితల్ మాయమ్మయే పోయెనే
    ఊహా శక్తియె లేక వ్రాయ దొడగ న్నొక్కింత యైనన్ మదిన్
    హాహాకారము మిన్నుముట్టె నిలలో నావైభ వమ్మేగగన్
    "సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై"

    రిప్లయితొలగించండి
  2. 2218 వ సమస్యకు పూరణ:
    తప్పులు సేయు మాత్రమున ధర్మ విరోధిగ నెంచవచ్చునే
    యిప్పుడమిన్ రవంతయును నెప్పుడు దప్పులు సేయకుందురే
    తప్పులు సేయు మానవుడె ధర్మ విదుండన నొప్పు నెల్లెడన్
    తప్పుల నుండి నేర్చుకొని తానవి మాటికి చేయకుండినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మాయమ్మయేపోయె' అనడం వ్యాకరణరీత్యా సాధువు కాదు. 'మాయమ్మయెన్ జూడుమా' అందామా?

      తొలగించండి
    2. అలాగే ! ధన్యవాదాలు శ్రి కంది శంకరయ్య గారు !

      తొలగించండి

  3. ఈహా రాగ రసా నివేశమున నే
    డిచ్చోట వీక్షించగా
    నోహో మారెను కైత జెప్పడి విధం
    బొప్పారెడిన్ దీరునం
    దాహా జొచ్చిన వన్యభాషల పదా
    లందంబు ద్రుంచేయుచున్
    సాహిత్యాధ్వము దుమ్మురేగినది దు
    ష్కాలమ్ము ప్రారంభమై!


    ఊహా జగతిని దేలుచు
    నీహామయ రచన లందు నిపుడిట జూడన్
    హాహా హీహీ లలమెను
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రసనివేశము' అవడం సాధువు. 'ఊహారాగ రసానుబంధమున...' అందామా? '..ద్రుంచేయు' అనడం వ్యావహారికం. 'పదా లందంబులం ద్రుంచుచున్' అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు సవరిస్తాను.... ధన్యవాదములు.

      తొలగించండి
  4. మోహము పర భాషలపై
    వాహనముల్ యంత్ర తతిగ వాసిని బొందన్
    "సో2హం"బంతర్జాలము
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధికమయ్యెన్..డా.పిట్టా
    బాహాబాహి బరిశ్రమల్ గదియగా బ్రహ్మాండ బాండంబున
    న్నా హూణాళియె గన్న భాష వరమై యంతస్తులన్ బెంచగా
    పాహీ!యన్నవి దేశభాషలకటా భాసిల్లునే యిత్తరిన్?
    సాహిత్యాధ్వము దుమ్మురేగినది దుష్కాలమ్ము ప్రారంభమై..డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టానుండి
    సో॥ఆ బ్రహ్మము హం॥నేనే ఐయున్నాను అను జపము/యోగ సాధన లో internet యే పరమార్థంగా మారిందనే భావన తో సాహిత్యారాధన సన్నగల్లినది.అందరు ఐఫోన్లతో busy గా ఉన్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. బాహాటంబున చెత్త పొత్తములు లభ్యంబయ్యెగా బాధ్యతా
    రాహిత్యంబుగ కాలకూట విష వృక్షంబుల్ సముద్యోతమై
    నీ హారంబుగ మారె నేడు ధరణిన్ నిర్భీతి నో భారతీ
    సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై

    రిప్లయితొలగించండి
  7. రాహిత్యమ్మై హితవు.క
    ళాహీన వచనరచన విలాసమునొందన్
    ద్రోహము నొందెను పద్యము
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధికమయ్యెన్

    రిప్లయితొలగించండి
  8. హాహా హీహీ యనుచును
    కుహనా గేయాలు వ్రాయ గోవిదు డనుచున్
    హాహా యోహో యనుటన
    సాహిత్యాధ్వ మున దుమ్ము సమధిక మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పై కంద పద్యం లో రెండవ పాదం ప్రథమాక్షరం గురువుండ వలసిన చోట లఘువున్నది. గమనించినారా ?

      తొలగించండి
  9. ఊహాలోక విహారమున్ రచయితల్ నుర్రూత లూగించుచున్
    బాహాటంబుగ రాసినట్టి రచనల్ ప్రాధాన్యతన్ బొందగా
    సాహిత్యమ్మిసుమంత లేని సరసుల్ శ్లాఘించగా వాటినే
    సాహిత్యాధ్వము దుమ్మురేగి నది దుష్కాలమ్ము ప్రారంభమై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రచయితల్+ఉర్రూతలు' అన్నపుడు నుగాగమం రాదు. 'కవిగణం బుర్రూత..' అనండి.

      తొలగించండి
  10. శ్రీరాఘవం దశరతాత్మజ మప్రమేయం
    సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం !
    ఆజాను బాహుం అరవింద దళాయతాక్షుం
    రామం నిశాచర వినాశకరం నమామి. !!
    *****^^^^^^*****
    నాకిష్టమైన శ్లోకం. "శ్రీరాఘవం...
    ఇదే శైలిలో శివుడి గురించి నేను వ్రాసిన ప్రార్థనా గీతం (శ్లోకం కాదు)
    ఇందులో వ్యాకరణ దోషాలేవైనా ఉంటే విజ్ఞులు సవరింపగలరని మనవి, ప్రార్థన.
    *****&&&&&*****
    విశ్వేశ్వరున్ గిరిజ కన్యక చిత్త చోరున్
    ఫాలాక్షునిన్ పరమ పావన పుణ్య మూర్తిన్
    గంగాధరున్నసమ నేత్రుని నీలకంఠున్
    కామారినిన్ గొలుతు త్ర్యక్షుని చంద్రచూడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ 'వసంతతిలక' రచనాప్రయత్నం ప్రశంసనీయం.
      మీరు యతి ప్రాసలను పాటించలేదు. వసంత తిలక లక్షణం... గణాలు త,భ,జ,జ,గగ. యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు శంకరయ్య గారు ! అందుకే దాన్ని పద్యమనికానీ, శ్లోకమని కానీ అన లేదు. ప్రార్థనా గీతమన్నాను.ఏదేమైనా నియమబద్ధమైన మరొక పద్యం వ్రాస్తాను.

      తొలగించండి
  11. బాహాటంబుగఁ బండితబ్రువుల వే వారింప ఘోరమ్ముగన్
    సాహాయ్యమ్మును బొంది సత్కవుల సత్సారార్థ లీలా పద
    వ్రీహివ్రాత సమృద్ధ సంయుతము ప్రావృట్కాల మేపారగన్
    సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై

    [పదవ్రీహివ్రాతము= పదము లనెడి వడ్ల సమూహము]


    ఆహా! సుదినంబిది కో
    లాహల మింక చెలరేగ లలిత కవులకుం
    బాహి యనఁ గుకవి సంఘము
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. ఆభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పోహణ శూన్యత దోడన్
    వ్యాహృతి పొసగని రచనలు పరిగొను నిపుడున్
    వాహిని కెక్కిన తెలుగుల
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధికమయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. మోహమ్ము కీర్తి నందెడు
    దాహమ్మై, మాధ్యమముల తళుకుమనంగన్
    సాహస కవులమని చెలఁగ
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఊహకు పొసగని మాటల
    సాహిత్యముతో రచనలు సాగెడి వేళ
    న్నీహేమలో నడరు మన
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధికమయ్యెన్.

    రిప్లయితొలగించండి
  15. దేహపు పోషణ కొరకై
    దోహదమగుచు పరభాష తోషము నివ్వన్
    రాహువు బట్ట తెలుంగును
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. ఊహా జనితపు గ్రంథము
    నాహా యోహో యటంచు నర్థము లేకన్
    సాహిత్యంబన నిదె యన
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్.

    రిప్లయితొలగించండి
  17. ఆ హేమంత నిశీధిని
    మోహితులై పిల్లకవులు ముదమున నత్యు
    త్సాహముతో నినది౦పగ
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధికమయ్యెన్.

    రిప్లయితొలగించండి

  18. సాహసము చేయగానౌ
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యె
    న్నాహార్యంబాయె జిలే
    బీ, హారములవలె కూర్పు పేర్పుల సుళువుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. ఇది ఆకాశవాణి విజయవాడ తే 13 /12 /1973 దీ కి సమస్య

    ఆహా ! వ్యాకరణమ్ము భావములు నాపై నింక ఛందస్సుయున్
    రాహిత్యమ్మగు కైత సేసి ఘనతన్ రాగోరు వారెందరో
    సాహిత్యమ్మనుపేర వాణి కపహాస్యంబున్ ఘటింపన్ , కటా!
    సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై

    నిన్నటి సమస్యకు నాపూరణ

    తరుల చాటునుండి ధనువును సంధించి
    వానరుని వధించె చాన కొఱకు
    దశరథాత్మజుండు; ధర్మము నిలుపగా
    తప్పు సేయువాఁడె ధర్మవిదుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బాహటము' అన్న పదం లేదు. అది 'బాహాటము'. 'బాహిరముగ భంగపడెడి...' అందామా?

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  21. ఊహాతీతముగాగ నాంధ్రమున దాముత్సాహపూర్ణాత్ములై
    యాహా సౌఖ్యద మిద్దియం దలపుతో నాంగ్లాది శబ్దంబులన్
    స్నేహంబొప్పగ గూర్చి చేతురు కృతుల్ నిష్ఠం బ్రదర్శించుచున్
    సాహిత్యాధ్వము దుమ్మురేగినది దుష్కాలమ్ము ప్రారంభమై.

    ఊహాతీతంబగువిధి
    యాహా! యన్యములజేర్చి యాంధ్రమునందున్
    శ్రీహరి! కైతలు పలుకుట
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఇద్దియం దలపుతో..' ?

      తొలగించండి
  22. సాహిత్యంబన?ధర్మ మార్గమున విశ్వాసాన నమ్మించుటే
    సాహాయమ్మది మానవత్వమును నాస్వాంతమ్మురక్షించుగా|
    మొహంబందున యవ్వనాళి కవియే ముఖ్యంబు|గాదన్నచో?
    సాహిత్యాధ్యము దుమ్మురేగినది దుష్కాలమ్ము ప్రారంభమై|
    2.సాహిత్యపు సంతోషము
    బాహిరముగ భంగబడెడి పదముల చేతన్
    దేహముగలిగిన కొందరు
    సాహిత్యాధ్యమునదుమ్ము సమధిక మయ్యెన్.


    రిప్లయితొలగించండి
  23. మోహావేశము గల్గియు
    నే హవణిక లేక గవన నెలతుక దిరగన్
    వాహ్యమ్ముల, నవ నిర్మిత
    సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్

    మోహము = అజ్ఞానము
    ఆవేశము = గర్వము

    రిప్లయితొలగించండి
  24. ఆహాహా! యని మెచ్చుచున్ చిలిపివౌ హాస్యంపు గానాలనున్
    బాహాటమ్ముగ రోయుచున్ గణములన్ బంధించు సంకెళ్ళుగా
    మోహావేశము నొందగా కవివరుల్ మూన్నాళ్ళ ముచ్చట్లలో
    సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై...

    రిప్లయితొలగించండి