20, డిసెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2230 (దైవమును నమ్మకుండ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ"
లేదా...
"దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

54 కామెంట్‌లు:

  1. ఏవో చాదస్తమ్ములు
    నేవో బలహీనతలును హెచ్చిన భయమున్
    ప్రోవై యుండిన నరులిక
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కవి మిత్రుని పునరాగమనం సంతోషదాయకం.

      తొలగించండి


  2. ఓ వనితా జీవమ్మును
    నావగ నిచ్చెను విభుండు నాకము జేరన్
    రేవతడు మార్గమతడౌ
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ విశ్వము బాలించుచు
      సేవించెడి వారి యొక్క క్షేమము కొఱకై
      యీవిగ వరముల గుప్పెడు
      "దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్"

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. డా.పిట్టా
    కావడి గట్టుక యాశల
    రావలె నోట్లనుచు బలికి రాజ్యము సేయన్
    మావోయిస్టుగ మారిన
    దైవమ్మును నమ్మకుండ దరమే యుండన్?!
    ప్రకృతి వైపరీత్యాలును పగల సెగలు
    కలిసి రానట్టి కాలము ఘన కురీతి
    హేయ భావనల్ శాంతివిహీనత గని
    దైవమును నమ్మకుండగదరమె యుండ?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ
    చూడ గోరుతాను. ధన్యవాదములు.
    వేశ్యమున విటుడు మురిసెను
    వేశ్యను వీక్షించి! వేద విదులిడిరి నతుల్
    కాశ్యపిలో పరమేశు న
    వశ్యము సేవించి దైవ ప్రార్ధన తోడన్!

    రిప్లయితొలగించండి
  5. చావే లేదని నమ్ముచు
    లావుగ రూకలనుజేర్చు లాలస పురుషున్
    జావుని గాంచిన ఘడియన
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘడియను' అనండి.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నాస్తికులకు కేంద్రమునగు నంగణమున
    నివ్వెఱబడునటుల నుండి నెసకమెసగె
    సోయగమగు యక్షరముల సూక్తి యొకటి
    " దైవమును నమ్మకుండ దరమె యుండ ".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. దైవమె తల్లియు దండ్రియు
    దైవమె మఱి యత్త మామ దైవమె గురుడున్
    దైవము లేనిది లేదిల
    దైవమ్మును నమ్మ కుండ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
  8. దైవమును నమ్మ కుండగద ర మె యుండ
    కాదు ముమ్మాటి కినిసామి ! కాదు తరము
    దైవ మనునది లేనిచో ధరణి యేది ?
    యవని లేనిచో లేదుగా జీవ కోటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బావా! కృష్ణా! నీవగు
    దైవమ్మును నమ్మకుండ దరమే యుండన్
    కావుము పాదము లంటిని
    భావమిడుమనుచు విజయుడు ప్రార్ధించె ననిన్.

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారికి నమస్కారములు. నేను గత రెండు రోజులుగా లేకపోవుట వలన పూరణలు పంపియుండలేదు. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించండి.

    16-12-2016:

    వర్తకుండొక్కడు శిఖరి పట్టు నుండి
    నెంచు కాసులు జిగిదేఱి నివ్వటిల్ల
    వెఱగు బడుచుండి వెఱ్ఱివై వృక్షము దిగి
    కాసులు గని వచ్చె గపులు గంతు లిడుచు.

    17-12-2016:

    దేవు డనెడి వాని తెఱగు దెలియకుండు
    నకృత బుద్ధులైన నాస్తికులకు
    పరమపదము నుండి యిర కొచ్చిన హరి యా
    తిరుమలేశు డెట్లు దేవు డగును?

    18-12-2016:

    గోళము వంటి దొకటి యొ
    గ్గాళమగు రోదను బఱచుచు కాటమ్ము న్నా
    తాళము నంటుచు బడ పా
    తాళములో నుండు గప్ప దడదడ లాడెన్.

    19-12-2016:

    వేశ్య కులములో మనినను
    వేశ్యము నుండని సుచరిత పెంపగు నిమ్మున్
    పశ్యత్ఫాలుని గొలువగ
    వేశ్యను వీక్షించి వేదవిడులిడిరి నుతుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      17 నాటి పూరణలో 'ఒచ్చిన' అన్నారు. వచ్చిన సాధురూపం. '...యిలకు వచ్చిన హరి' అనండి.

      తొలగించండి
  11. ఈ విస్తృత వేధో౦డము
    నీ విధి సుందర తరముగ నేర్పరచి భువిన్
    జీవుల సృష్టించిన యా
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
  12. ఈ వసుమతిపయి వెలసిన
    దేవతలున్ మూడు కోట్లు తిరుగుచునుండన్
    భావమ్మున ననునిత్యము
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
  13. ఈ వసుమతిపయి వెలసిన
    దేవతలున్ కోట్లు కోట్లు తిరుగుచునుండన్
    భావమ్మున ననునిత్యము
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
  14. శార్వరి సాగర సైకతస్థలి నిల్చినాకమ్ము వీక్షించ నాస్తికునకు
    నిర్మలానంత వినీల నభోవీధి రత్నరాశుల వోలె రంజిలుచును
    దేదీప్యమానమై దివ్యగ్రహ శశాంక తారాగణమ్ములు దర్శన మిడ
    జలధి తరంగ నిస్వనము దశదిశలు వ్యాపింప జేసిన వనధిని గన

    వృక్షముల నగల్చు పవన వేగముఁ గన
    జగమున నడరు ధవళంపుఁ జంద్రికఁ గనఁ
    గన్నుల మిఱుమిట్లు దెరలి కడలు కొనగ
    దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ


    ఏవిధి బ్రహ్మాండ మొదవు?
    రావ రహిత సజలధి ధర భ్రమణము సలుపున్?
    జీవము చరాచరులకును?
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      ఆహా! ఎంతటి మనోజ్ఞ పద్యరత్నాలు! అద్భుతమైన పూరణలు... అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు బాగా నచ్చినందులకు కడుంగడు ధన్యవాదములు.

      తొలగించండి
    3. సీసములో మొదటి పాదమున వీక్షింప గాఁ జదువఁ గోరెదను.

      తొలగించండి
  15. సేవలు చేయుచు సంతత
    మవారణముగ బడుగులకు హరిని తలచుచున్
    కైవల్యముఁ బొందు కొరకు
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. భావనల వాక్కులందున
    గావించెడి పనులలోన గడు వత్సలతన్
    భావింప నిలిచియుండెడి
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్.

    భవము నొసఁగుచు విస్తృత భువనమందు
    ఖ్యాతి గూర్చుచు సత్కృతుల్ కరము చేయు
    శక్తి నిచ్చుచు నద్దాన ముక్తి నిడెడు
    దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. లోకము లేలుచు భక్తుల శోకములను
    బాపు వాడయిన పరమ పావనుండ
    నాది మధ్యాంతరహితుండై యవని బ్రోచు
    దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ.


    దేవా శరణము నీవని
    కావగ రమ్మని పిలిచిన కరుణించుచు భ
    క్తావళి బాధల దీర్చెడు
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి
  18. .జీవుల మనుగడ యందున
    దైవమ్మును నమ్మకుండ దరమే”|”యుండన్
    దేవునివలె సహకారపు
    భావన లందించు వారిబాధ్యత బెరుగన్|
    2భార్యభర్తల బంధమ్ము భవితకొరకె
    కార్య శూరులుగామార కలిమి బలిమి
    దైవమును నమ్మకుండగ దరమెయుండ?
    మంచి మనుగడ మసలంగ నెంచునపుడె|



    రిప్లయితొలగించండి
  19. ..... .......................

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నాస్తికత్వము ప్రబల మొనర్ప నె౦చి

    చనుచు ను౦డ నాస్తికులు వాహనము లోన

    చచ్చిరి పెను ప్రమాదము స౦ఘటి౦చ

    బ్రతికి బైటపడిన వాడు పలికె నిటుల

    దైవమును నమ్మ కు౦డగ దరమె యు౦డ |

    " దైవ మగుపి౦చు నొక దెబ్బ తగిలి నపుడె "

    రిప్లయితొలగించండి
  20. హరి యనెడి వాడు నెచ్చట నవని యందు
    లేడు లేడన నాపల్కు లెక్క నిడక
    దైవమును నమ్మకుండగ దరమె యుండ
    ననుచు కంబాన హరిఁజూపె నర్భకుండు.

    2.సతము మనల కాచెడి వాడు జగతి నతడె
    దైవమిట లేడనెడి మాట తప్పుతప్పు
    సకల జనులను కాపాడు చక్రి యతడు
    దైమమును నమ్మకుండగ దరమె యుండ.

    1.దేవా కావుము నన్నును
    భావము నందున గొలుతును భక్తిని నిన్నున్
    నీవే నాకిల సర్వము
    దైవమ్మును నమ్మకుండ దరమే యుండన్.

    2.దేవా కావుమనంగనె
    నీవొసగితి వక్షయముగ నెలతకు కోకల్
    యీవిధి కాచుచు నుండగ
    దైవమ్మును నమ్మకుండ దరమే యుండన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. అన్నయ్యగారూ నమస్తే మునుపున్న పద్యాలను కొన్నింటిని పరిశీలించలేదు.మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేయమంటారా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోదరీ, నాలుగైదు రోజులుగా పనుల ఒత్తిడి వల్ల, ప్రయాణాల వల్ల బ్లాగులోని పద్యాలను సమీక్షించలేదు. రేపు హైదరాబాదు ప్రయాణం. రెండు మూడు రోజుల్లో వీలును బట్టి మునుపటి పూరణలను పరిశీలించి నా అభిప్రాయాలను తెలియజేస్తాను. ఆలస్యానికి మన్నించండి.

      తొలగించండి
  22. నీవూ నేనను వారల,
    జీవుల, సమస్త ధరణికి జీవము తానై
    బ్రోవుచు మనలో మెదలే
    దైవమ్మును నమ్మకుండ దరమే యుండన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీవును నేనను..' అనండి.

      తొలగించండి
  23. జీవుల సృష్టి స్థితి లయ
    లేవిధి జూచినను దైవలీల లె కాగా
    యీవైన మెరుగరెవ్వరు ?
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్!

    రిప్లయితొలగించండి
  24. అవని జనులను గాపాడ ననవరతము

    దినకరుండు,హిమకరుడు దిరుకుటకును

    శక్తి పనిచేయుచుండు నా శక్తి యనెడు

    దైవమును నమ్మకుండగ దరమె యుండ?

    రిప్లయితొలగించండి
  25. జీవమ్మున క్రియలన్నియు
    జీవులకే తెలియకుండ స్థిరముగ సాగ
    న్నే విధి మానవ మాత్రుడు
    దైవమ్మును నమ్మకుండ దరమే యుండన్?

    రిప్లయితొలగించండి
  26. జీవుల పుట్టుక నిత్యము
    చావును సత్యంబు జూడ సాధులకైనన్
    జీవన చక్రము నడిపెడి
    దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్

    రిప్లయితొలగించండి