27, డిసెంబర్ 2016, మంగళవారం

సమస్య - 2235 (వీరుడు పోవిడుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్"

53 కామెంట్‌లు:

  1. కం. పోరున బందుగు లుండిన
    పోరాటము జేయలేక పోవును గదరా !
    ఆరటమున విజయుని వలె!
    "వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్"

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. అశోక చక్రవర్తి:

      శూరుడు మౌర్యుడజేయుడు
      పోరు కళింగమ్ము నందు పొందగ విజయం
      దారుణ భీభత్సము గని
      వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విజయం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'పొందగ గెలుపున్' అనండి.

      తొలగించండి
  3. శూరత నొప్పని వాడయి
    ధీరత గోల్పోయి తనదు ధ్యేయము గనకన్
    పేరునకే పదుగురిలో
    వీరుడుపో; విడుచు యుద్ధ విముఖుం డగుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  4. నేరమును సమ్మతించుచు
    గారుణ్యము జూపి నన్ను గావుమటంచున్
    గోరిన శత్రువు నైనను
    వీరుడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  5. శ్రీగురుభ్యోనమః

    వారిజనేత్రా కృష్ణా
    యీ రణరంగమ్మునందు నెల్లరు సఖులే
    వారల జంపగలేనని
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    బీరమె సంస్కృతి మనదన
    పోరన్నది పశువుబుద్ధి బూడ్చగ మనిరే?
    నేరడు పాపము సిఫాయి
    వీరుడుపోవిడుచు యుద్ధ విముఖుండగుచున్!
    యేరీతింగన బోరె నిర్ణయముగానెన్నేరు యిన్నాళ్ళుగా
    సారాచారవిశారదుల్ గ్రహగతిన్ శాసించు శాస్త్రార్థులున్
    తీరా యావలి యస్త్రధారి ‌సముడౌతీరున్ గ్రహించేరె?పో
    వీరాగ్రేసరు డాజి వీడ సబబౌ వేర్పాటు వర్ధిల్లగన్!‌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ మొదటి పూరణలో మూడవ పాదంలో బేసిగణం (సిపాయి) జగణం అయింది.
      శార్దూలాన్ని యడాగమంతో ప్రారంభించారు. '..యెన్నేరు, తీరా, గ్రహించేరె' అని వ్యావహారికాలను ప్రయోగించారు.
      సమస్యపాదాన్ని శార్దూలంగా మలచిన తీరు ప్రశంసనీయం.

      తొలగించండి
    2. ఏరీతిన్ గన 'బోరె'(పోరు మాత్రమే)నిర్ణయము(తీర్పు)గా నెన్నంగ నిన్నాళ్ళుగా
      సారాచార విశారదుల్ గ్రహములన్ గాలించు శాస్త్రార్థులా?!
      కారా యావలి యస్త్రధారులు సముల్ కార్పణ్యమున్ మానగన్?
      వీరాగ్రేసరు డాజి వీడ ‌సబబౌ వేర్పాటు వర్ధిల్లగన్!
      (యుద్ధవాతావరణపు సమస్య.లోక విరుద్ధపు ప్రతిపాదన.ఉదయమే పూరణ.చేయవలసిన పనులకై తొందరపాటు.వెరసి దోషాలు.అవీ మీరు కొన్ని కడుపులో పెట్టుకోవడం పెద్ద మనసుతో.మీ ఓపికకు జోహార్లు.అట్లే ఈ సవరణను స్వీకరించండి,ఆర్యా!కందాన్ని గణవిభజన చేసిన తరువాత మాత్రమే పంపేవాణ్ణి మై మరచాను."నేరడు పాపము యోధుడు"గా చదువ గలరు.)

      తొలగించండి
    3. డా.పిట్టానుండి
      గాలించు అసాధువు.శాసించుతో యతి సరిపోతుంది.

      తొలగించండి
    4. మానగనన్ 'అక'క్రిందికి రాదు.డాపి.నుండి

      తొలగించండి
  7. వారిజ నేత్రుల మరి మగ
    వారిగ సుకృతాన మారు వనితలనెల్లన్
    పోరున నిలువని భీరుల
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టానుండి
    ఆర్యా,W. B.Yeats,An Irish Airman Foresees His Death అనే పద్యంలో Kiltarton అనే ప్రాంతం నుండి ఎంపికైన సైనికునితో మీరిచ్చిన సమస్యను పలికించాడు.ఎదుటి సిఫాయి నన్నెప్పుడేమనకున్నా విరుచుక పడాలంటే నాకిష్టం లేదు.గాలిలో విహరించే మోజుతో వచ్చాను.నేను చావడం ఖాయం అని నాకు తెలుసు అంటాడు

    రిప్లయితొలగించండి
  9. -------------------------------
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శూరుడ నని రిపు క౦ఠ వి

    దారణ మొనరి౦ప గినుక c దరలుట మేలే ?

    శౌరి సఖుని వలె నారసి

    వీరుడు పో విడుచు యుద్ధ విముఖు౦ డగుచున్

    ( ఆరసి= విచారి౦చి )

    రిప్లయితొలగించండి
  10. బృహన్నల యుత్తర కుమారునితో నన్న పల్కులు:

    కౌరవ వీరులఁ జూచి వి
    కారముఁ బొందఁ దగు నెట్లు క్షత్రియున కిలన్
    శూరుడ! బాణమ్ముల ని
    ర్వీరుఁడు పో! విడుచు యుద్ధ విముఖుం డగుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉండి ఔత్సాహికులకు మార్గదర్శనం చేస్తుంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. వైరులపై విజయమ్మును
    పోరున సాధింప లేమి, పోడిమి మరలన్
    పారగుడు చేయ తగునని
    వీరుడు పో విడుచు యుద్ధ విముఖు౦ డగుచున్

    రిప్లయితొలగించండి
  12. పోరాడడు శరణార్ధుల
    నీరసి వీరులు పొగలిన నిస్సంతులతోన్
    భీరుల బాలల నింతుల
    వీరుడు పో విడుచు యుధ్ధ విముఖుండగుచున్

    రిప్లయితొలగించండి
  13. వీరత్వ లేమి యున్నను
    పోరాటమునందు తన సముఁడు గాకున్నన్
    నారీ బాలుర తోడన్
    వీరుఁడు పోవిడుచు యుద్ధ విముఖుండగుచున్.

    రిప్లయితొలగించండి
  14. భీరుడుతావేడినచో
    వీరుడుపోవిడుచు,యుధ్ధవిముఖుండగుచున్
    పారుటభీరునినైజము
    వీరునిగానుంటమేలువేవిధములుగన్

    రిప్లయితొలగించండి
  15. సారథి గాను బృహన్నల
    తేరునడుపుచుండ వెడలె ధీరుడ నంచు
    న్నారణ క్షేత్రము గాంచిన
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    పోరున తాతను గురువుల
    నేరీతిగ జంపవలయు నేనీ యనినన్
    కోరను విజయ మ్మనుచును
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పోరున కెదురుగ నుండెడి
    తేరున పందలు ముదుకలు తెఱవలు పిల్ల
    ల్నారభటించ నదీజుడు
    వీరుడు పోవిడుచు యుద్ధ విముఖుండగుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పిల్లల్ని' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  17. శ్రీగురుభ్యోనమః

    అర్జునుడు భీష్మునితో యుద్ధము చేయునపుడు

    భూరి శరమ్ములు వేసియు
    వారింపగలేక నిల్ప బడతి సిఖండిన్
    నారిని దింపుచు (గాంచగ) శాంతన
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శాంతనువుడు' అనవలసింది 'శాంతన' అన్నారు. శిఖండి/సిఖండి... టైపాటు.

      తొలగించండి
    2. గురువుగారూ ధన్యవాదములు. సవరించిన పద్యము

      భూరి శరమ్ములు వేసియు
      వారింపగలేక నిల్ప బడతి శిఖండిన్
      నారిని గని శాంతనువుడు
      వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

      తొలగించండి
  18. పోరున నసంఖ్య వైరుల
    వీరులు గూలగ నశోక విఖ్యాత ప్రభుం
    డారసి వరించె శాంతిని
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కవితకు పదముల నెమకుచు
    నవగతమగునట్లు గాక నతుకుల బొంతై
    చవిగొను డను పసలుడిగిన
    యవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. వీరుడు సమ వీరునితో
    పోరాటమ్మును సలుపును పృథ్వీతలమున్
    భీరువగు ప్రతిద్వందిన్
    వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ సత్యనారయణరెడ్డి గారికి వందనములు.
      "పోరాటమ్మును సలుపును భూతలమందున్ " అని అంటే సబబుగా ఉంటుందండీ.
      " పో - పృ " లకు యతిమైత్రి కుదరదు కదా

      తొలగించండి
    2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శాస్త్రి గారి సవరణను స్వీకరించినందుకు సంతోషం!
      హైదరాబాదులో మీరు, రామమోహన్ రావు గారు నాపట్ల చూపిన సౌహార్దతకు, మీరిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు!

      తొలగించండి
    3. గురువర్యులకు నమస్సులు. నా సవరించిన పూరణ.
      వీరుడు సమ వీరునితో
      పోరాటమ్మును సలుపును భూతలమందున్
      భీరువగు ప్రతిద్వందిన్
      వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్

      తొలగించండి
  20. .ప్రేరణకరుణయు నొసగగ?
    మారె నశోకుడు విచిత్ర మనసేజేరన్
    సూరత్వంబును వీడియు
    వీరుడు పోవిడుచు యుద్ధవిముఖుండగుచున్|

    రిప్లయితొలగించండి
  21. దారుణముగ నభిమన్యుని
    పోరున వధియించి జిక్క పురమాయించన్
    శౌరియె కూల్చగ నరి నే
    వీరుడు పోవిడుచు యుద్ధ విముఖుండగుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి