2, జనవరి 2017, సోమవారం

సమస్య - 2241 (మాతను బెండ్లియాడి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మాతనుఁ బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుఁడే"
లేదా...
"మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్"

51 కామెంట్‌లు:

  1. "ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి..."

    రాతిని నాతిగ జేసిన
    శీతల హృదయుండశేష శ్రితజన హితుడౌ
    భూతల నాథుడు సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి


  2. మాతల్లి సీతను ముదము
    తోతను గాంచెను విరిచెనహో విల్లునటన్
    జోతలు, రాముడు, సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'విరిచెను తోరపు విల్లున్' అందామా?

      తొలగించండి
  3. డా.పిట్టా
    ఊతము సృష్టిక్రమముకు
    వాతల బెట్టుటయె? తగదు;వటువై నిలువన్!
    చేతల జనకుడు యోగి సు
    మా! తను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్
    తాతకు సంతుతో నయిన ద్రవ్యమె వారల కీర్తియౌ నిలన్
    భ్రాతకు వచ్చు బేరు తగు భద్రతనున్ గొను తమ్ముడుండగన్
    పూత చరిత్ర దంపతులు,పుత్రుల వల్లనె లవ,కుశాఖ్యు స
    న్మాతను బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఉత్పలమాల మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  4. నా నిన్నటి పూరణ

    భూతలమదరగ కేకలు
    చేతులలోమందు తోడ చెంగున గంతుల్
    భూతములు తిరుగు వేళల
    నూతన వత్సర మనుచు వినోదము లేలా?

    రిప్లయితొలగించండి
  5. సీతమ్మయె రామునికై
    ప్రీతిగ నవతారమందె,విరుచుచు విల్లున్
    ఖ్యాతిగ నాతడు సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. శీత మయూఖ తేజముఖి శ్రీవని తాంశజ రోచి తాంగినిన్
    భీత మృగీ విలోకన నపేత వికల్పమ తీభయాననున్
    భూతల జన్మ భాసిత విభూషిత వస్త్ర లలామ జానకీ
    మాతనుఁ బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుఁడే


    ఆతడు లోకమునకు విప
    రీతముగ నరణ మొకింత లేకయ తరుణిన్
    భీతహరిణలోచన, విను
    మా, తనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 20 జులై 2016 నాటి పూరణలు:

      ఆతత బాహు విక్రముడు నంబర రత్న కులాంబురాశి సం
      జాతుడు రాఘవుండు శివ చాప సుభంగము సేసి వేగ భూ
      జాత విరాజమాన తను ఛాయ జితాంబుజ దేవి జానకీ
      మాతను బెండ్లియాడి జనమాన్యుఁడుగా నుతి కెక్కె మిత్రమా!


      వీతపతిని బుచ్చెమ్మను
      బాతక మనక విధవా వివాహ నిచయ సం
      ధాత గిరీశమ్మట, విను
      మా, తను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మతి మరుపు ఎక్కువైపోతున్నది. అందుకే అప్పుడప్పుడు సమస్యలు పునరుక్తమౌతున్నవి. మన్నించండి.
      తాజా పూరణలతో సహా మీ అన్ని పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      సమస్యలు పునరుక్తమైన పరవాలేదు పూరణలు క్రొత్తగా వ్రాయ సౌలభ్యముంది కదా. మీ దృష్టికి తీసుకు రావడానికి మాత్రమే పాత పూరణలు కూడా పొందు పరచితిని.

      తొలగించండి
  7. రాతిగనహల్యయుండగ
    నాతిగనేజేసినట్టినారాయణుడే
    ప్రీతినినీమాసీతా
    మాతనుబెండ్లాడిలోకమాన్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ఘాతకి తాటకిఁ దునిమి
    ప్రీతిని కలిగించి మునికి, విఱిచి శివ విలున్
    దైతేయ వైరి సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  9. రాతిని నాతి జేసినను రాక్షసులన్ దునుమాడి దానవా
    రాతిగ పేరుగాంచినను రాఘవ వీరుడు గాంచనట్టి వి
    ఖ్యాతిని బొందెకాదె శివకార్ముక మెక్కిడి చేత జానకీ
    మాతను పెండ్లియాడి జన మాన్యత నందెను రామ భద్రుడే

    రిప్లయితొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    భూతలమున్ - దివిన్ - నభము భూజుడు

    …………… ఖేద మొనర్ప దేవతల్

    మా తర మి౦క కాదని తల౦చగ శ్రీ పతి

    …………… యా క్షమా౦శ స౦

    భూతకు , సత్యభామకు , విభు౦ డయి

    ………… చ౦పెను | కృష్ణు డట్లు భూ

    మాతను పె౦డ్లియాడి జన మాన్యత

    ………… న౦దెను | రామ భద్రుడే

    స్ఫీత చరిత్రు డౌచు నల సీతను భూసుత c

    ……………… బె౦డ్లి యాడె | నౌ

    రా ! తరచ న్నసాధ్యము గదా ! హరి లీలల

    ……………… నేరి కేనియున్ ! !

    { నభము = పాతాళము ; భూజుడు = నరకుడు ;

    తల౦చగ = వేడగ ; క్షమ + అ౦శ స౦భూత =

    భూదేవి అ౦శ తో జని౦చినది ; తరచన్ =

    పరిశీలి౦చగా }

    రిప్లయితొలగించండి
  11. ఆతొలి యుగమున శ్రీహరి
    శ్వేత వరహ రూపు దాల్చి చించి దనుజుని
    న్నాతోయధి మునిగిన భూ
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వరహ' అన్న రూపం లేదు. "శ్వేత వరాహాకృతి గొని చించియు దనుజు। న్నాతోయధి...' అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. ఆతొలి యుగమున శ్రీహరి
      శ్వేత వరాహాకృతి గొని చించి దనుజుని
      న్నాతోయధి మునిగిన భూ
      మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్.

      తొలగించండి
  12. ఆతత బాహుదండముల నంబర వర్ణుడు సూర్యవంశ సం
    జాతునిగాజనించి జలజాక్షుడు, రుద్రుని విల్లుఁ ద్రుంచి తా
    ప్రీతి ఘటిల్లజేసి నిజవేల్పులకున్ కడు తృప్తి, జానకీ
    మాతను బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుడే

    రిప్లయితొలగించండి
  13. కోతుల గూడి రాక్షసుల గూల్చగ నెంచియు లంకకేగి భూ
    జాతను రక్షసేయ దనుజాధములన్ తెగటార్చి వచ్చి ప్రా
    భాతము నందు పట్టపు వివాహము చేతను రాజసాన భూ
    మాతనుఁ బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుఁడే

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు. 20, జులై 2016న ఈ సమస్య మన శంకరాభరణం బ్లాగులో అడిగినారు.

    భూతేశు డా సురూపుడు
    కౌతుక మొప్పగ నగపతి గారాల సుతన్
    రీతిగ ప్రీతిని గిరిజా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ పూరణ అప్పటిదేనా? క్రొత్తదా?

      తొలగించండి
    2. గురువుగారూ! ఇది క్రొత్తదే!

      తొలగించండి
  15. ఆతతవీర్యవంతుడునునాయువుపట్టువుగాగదండ్రికి
    న్బూతననామకంబలరుబోడినిజంపినవీరుడేయిట
    న్బూతచరిత్రయైమిగులబోడిమితోడనుజక్కనైనభూ
    మాతనుబెండ్లియాడిజనమాన్యతనందెనురామభద్రుడే

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    రాతబిసి జనకు నాస్థన
    చేతనుని శరాసనంబు చేబూనిన దా
    రీతిగ రఘుపతి సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. నీతిగ పాలన జేసియు
    భూతలమున సత్య ధర్మ పూజ్యుం డనగా
    ప్రీతిగ సాధ్వీ సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ....

    ఘాతక తారకుఁ జంపగ
    భూతగణాధిపుఁ గొమరుని పొందగ వేడన్
    ప్రీతిగ నపర్ణను జగ
    న్మాతను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. నీతిని నిలుపగరాముడు
    జాతికి నాదర్సు డయ్యు జగతియు మెచ్చే
    నేతగ సీతయునగు స
    న్మాతనుబెండ్లాడి లోక మాన్యుండయ్యెన్
    2.జాతిపురోభి వృద్ధిమనజాలగజేసెడి మార్గ దర్శియై
    నీతిని నిల్పబూని యవినీతిని పారగజేయు దక్షుడై
    యేతర మైన మెచ్చగల యీర్షయులేని మహానుభావ|భూ
    మాతను బెండ్లియాడి జనమాన్యత నందెనురామభద్రుడే| {భూమాత=భూమికిమాతసీత=భూపతిభార్యగాన}



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మెచ్చే' అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. "సజ్జననుతుండై" అందామా?

      తొలగించండి
  20. భూతలమున రాముని గా
    నాతండవతార మొంది యా రావణునిన్
    పాతకు నిజంప సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  21. భూతల సుందరాంగి గుణ భూషిత కోమల గాత్ర జానకీ
    మాతను పెండ్లి యాడి జనమాన్యత జెందెను రామ భద్రుడే
    ఖ్యాతి వహించినట్టి పలు గండరు లెవ్వరు వంచనట్టి యా
    సీతకు ప్రీతి పాత్రమగు శ్రీ శివ చాపము నొంచి నేర్పునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒంచి' అనడం గ్రామ్యం. 'చాపము వంచి/ చాపము ద్రుంచి' ఆనండి.

      తొలగించండి
  22. భూతల స్వర్గమై విరియు పుణ్యధరీత్రి యయోధ్య యందునన్
    జాతికి మేలొనర్పనర జన్మము నెత్తిన యట్టి దానవా
    రాతియె నాతిజేసె నిల రాతిని, చాపము నెత్తి జానకీ
    మాతనుఁ బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుఁడే

    చేతధనువుబట్టి దనుజ
    జాతిని దునుమాడ బుట్టి జనకుని సుతయౌ
    యా తీగబోడి సీతా
    మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  23. నిన్న,మొన్నటి పద్యాలతో పాటు నేటిపద్యం
    గాఢపు కోర్కెల తోడను
    గూఢముగా పతి కుశలము కోరుచు తమితో
    వేడుకతో చేయు వ్రతము
    మూఢాచారము,ముదితకు మురిపెము నొసగున్.

    జనులకు తిండియునొసగగ
    ననయము శ్రమియించు రైతు నవనిని జూడన్
    ఘనముగ పండెను భువిలో
    జనులకు వరినిచ్చు నెలయె జనవరి యనగా .

    రాతిని తరుణిగ మార్చుచు
    సీతను పరిణయమునాడ శీఘ్రపు గతితో
    ప్రీతిఁవిలువిరిచి సీతా
    మాతను బెండ్లాడి లోకమాన్యుడయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి