4, జనవరి 2017, బుధవారం

సమస్య - 2243 (కడచె రాతిరి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కడచె రాతిరి చుక్కల గములు వొడమె"
లేదా...
"కడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్"

56 కామెంట్‌లు:

  1. అడవి గాచిన వెన్నెల యలుక చెంది
    కడలి యలలకు చెలికాగ కలత బడిన
    చంద్ర కాంతులు వెలవెల చెదరి పోయె
    గడచె రాతిరి చుక్కల గములు వొడమె

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. సిధ్ధార్థుని జ్ఞానోదయం:


      విడిచి రాతిరి పురమును వీడి జనుల
      తపము జేయ రేలుబవలు తనివి దీర
      తుదకు నజ్ఞాన తిమిరము తొలగి పోవ
      గడచె రాతిరి చుక్కల గములు వొడమె!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. విడచెన్ సోముని రాహుకే తువులు వేవేలౌ శుభాశీ స్సులన్
    పుడమిన్ మోదము పొంగిపో వగను నేపూర్వ సుకృతం బహో
    కడలిన్ వెన్నెల కాంతులీను సొగసుల్ గాంచంగ విందేయనన్
    గడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. '..నే పూర్వంపు పుణ్యం బహో' అనండి.

      తొలగించండి
    2. విడచెన్ సోముని రాహుకే తువులు వేవేలౌ శుభాశీ స్సులన్
      పుడమిన్ మోదము పొంగిపో వగను నేపూర్వంపు పుణ్యం బహో
      కడలిన్ వెన్నెల కాంతులీను సొగసుల్ గాంచంగ విందేయనన్
      గడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్

      తొలగించండి
  4. సాగె సూరీడు గమనము సడల నీక
    చేవ జూపుచు పడమర జేరె, పగలు
    గడచె, రాతిరి చుక్కల గములు వొడమె
    చంద్రికా శోభ లలమెను సాంద్ర మగుచు!.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    నోటు జారిపడన్ వేగ నొచ్చుకొనుచు
    కళ్లకద్దుకొనన్ లక్ష్మి కనికరించు
    గీతగీసెడి యంత్రముల్ ఘీంకరించె
    గడిచెరాతిరి చుక్కల గములు వొడమె!
    కడగండ్లెన్నగలేము దేశమును నా గర్వాంధులాంగ్లేయులే
    ఎడమే లేకను యేలి దోచుకొనరే యీ రత్నగర్భన్నొహో!
    పడిరండోయన బట్టనీ యవనిన్ బారంగ వే కంపెనీల్
    గడిచెన్ రాతిరి చుక్కలెల్ల పొడమెన్ గన్పట్టె చంద్రద్యుతుల్!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    ఆర్యా,
    బట్టనీయవనినిన్ .లో టైపాటు జరగింది.గణదోషంగా భావించకండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'లేకను+ఏలి' అన్నపుడు యడాగమం రాదు. 'లేకయె యేలి' అనండి.

      తొలగించండి
  7. కార్యమగ్నుఁడై వెడలె మగండు, పగలు
    గడిచె; రాతిరి చుక్కల గములు వొడమె,
    విరహతాపమ్ము పీడింప వేగిరపడి
    యింతి పతి రాకకై నిరీక్షింపసాగె.

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమః

    నడిచే కాలనదీప్రవాహమున యెన్నన్ వింతలెన్నున్నవో
    విడిచెన్ పాతదనంపు సోయగములీ విశ్వమ్మునన్ క్రొత్తదై
    యెడదల్ హర్షము నొందునట్టులుగ సాహిత్య గానంబుతో
    గడచెన్ రాతిరి, చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నడిచే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'నడకల్ సాగెడు కాలవాహినికి నెన్నన్' అందామా?

      తొలగించండి
  9. శోభనమ్మునకై చూచు చుండ పగలు
    గడచె, రాతిరి చుక్కల గములు వొడమె
    తరళనయన యేతెంచె తలుపు తెఱచి
    చిలిపి మగనికనుల ధృతి చెంగలించ

    రిప్లయితొలగించండి
  10. పద్మములు కుమిలె సరసి సద్మ మందు
    సూర్యు డస్తమింప భువిని సూర్యకాంతి
    కడచె, రాతిరి చుక్కల గములు వొడమె
    కలువలు మెరసె చంద్రుని గని దివమున


    అడరన్ శైత్య సమీరణమ్ము లిక నాహ్లాదమ్ము దీపింపగం
    దడబాటుం బడనేల వేసరపుఁ బ్రాణంబుల్ సుఖంబందగన్,
    నడయాడం బగ లెల్ల కార్యచయ సంతాపమ్మునన్ ఘస్రముం
    గడచెన్, రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారు:

      మీ పద్మావతీ శ్రీనివాసం ప్రచురితమైనదా? ప్రతులు హైదరాబాదులో ఎచ్చట దొరకును? నాకొక పది కాపీలు కావలయును. బంధుమిత్రులలో పలువురు తెలుగు పండితులూ, "వైద్యులూ", రచయితలూ, గాయకులూ, అభిమానులూ ఉన్నారు...

      దయజేసి తెలుపగోరెదను.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      శాస్త్రి గారు నా రచనలన్నింటిని నా బ్లాగు లోనే నుంచితిని. ప్రచురించ లేదు.
      మీరు పైన నా పేరు మీద నదిమిన వాటిని చూడ గలరు.
      అయినను మీ ఈ-మెయిలునకు “పద్మావతి శ్రీనివాసము” పంపుచున్నాను. చూడండి.

      తొలగించండి
  11. వేడి వేడిగా బగలంత భీకర ముగను
    గడచె, రాతిరి చుక్కల గములు వొడమె
    చంద్రు రాకకుమోదానజ ద లు నిండ
    సూర్య చంద్రులు జగతికి జూడ్కు లుగద

    రిప్లయితొలగించండి
  12. కడు సంతోషముతోడుతన్ వెడలితిన్ గార్యార్థియై, ప్రొద్దు వే
    గడచెన్, రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్
    పడతీ రత్నము మెల్లగా నడచుచున్ వచ్చెన్ ప్రమోదమ్ముతో
    వడిగాచేరితి కౌగిలింతఁ గొనగన్ వాటమ్ముగా శర్వరిన్

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:
    తీక్ష్ణ మైనట్టి ఎండతో దివస మంత
    గడచె; రాతిరి చుక్కలు గములు వొడమె,
    పండు రేయె౦డ పొడలతోవహ్నికమది
    మందగించి పులకలొ౦దె మహిని జనులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ఎడబాటున్ సహియి౦చ జాలను ప్రియా !

    ……………… యెట్టెట్టులో యీ పవల్

    గడచెన్ | రాతిరి చుక్క లెల్ల వొడమెన్ ,

    … ........ గన్పట్టె చ౦ద్రద్యుతుల్ |

    దడియ౦ జేసెను నా మదిన్ , నిశిత

    ………… క౦దర్ప ప్రసూనాస్త్రముల్ |

    వడి నన్నున్ దడియ౦గ జేయు , రస

    …………… లీలా ఖేలనా వారిధిన్ |

    ________________________________________

    ద డి యు = వణకు , భయపడు ;

    దడియ౦జేసెను = భయపడు నటుల చేసెను ;

    త డి యు = తడిసి పోవు ;

    తడియ౦గ జేయు = తడిసిపోవునటుల చేయుము

    ఖేలనము = ఖేల = క్రీడ

    _____________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  15. నవ్య వత్సర స్వాగతానంద వేళ
    మదిర సేవనమ్మొనరింప మత్తు నందు
    గడచె రాతిరి, చుక్కల గములు వొడమె
    కంటి ముందర తెలవారి కైపు వదల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తంగిరాల రఘురామ్ గారూ,
      మీ పూరణ చమత్కారభరితమై ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. వలచి వచ్చిన రక్కసు వలువ బిగియ
    గడచె రాతిరి చుక్కల గములు వొడమె
    వరుడు కీచకు దున్మగ వలజము నట
    వగపు బాపగ మెచ్చెను వనిత నగుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సి. రామమోహన్ గారూ,
      బ్లాగులో బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'వలువ బిగియ'...? 'దున్మగ వలలు డచట' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. వలజము నట అనగా అచట యుధ్ధమున యను భావము రాగలదని భావించాను. క్షమించగలరు.

      తొలగించండి
  17. చదలుమానిక మస్తాద్రి జారిపడగ
    శమని వీడ్కోలు పలికెను, స్వాగతించె
    సంజ,కెంజాయ మిలమిలల్ సాంత్వన మిడ
    గడచె; రాతిరి చుక్కలు గములు వొడమె
    తిమిర నీలాభ్రమ౦దు దీపములు వోలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  18. పిడుగుల్ ఫెళ్ళున రాలె మాటికిని పెన్విద్యుల్లతల్ తీవ్రమై
    వడకించెన్ చలి నింగిరంధ్ర మనగా భాసించె ధారార్భటుల్
    వడిగా సాగిన వర్ష మాగె తృటిలో పర్జన్యముల్ బోయి తా
    కడచెన్, రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్.


    కడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్.

    రిప్లయితొలగించండి
  19. పగలె జూచితివింతయౌ ప్రతిభయున్న
    కలల రీతినగుపడు నక్షత్ర శాల|
    శాస్త్ర వేత్తలసొత్తు|ప్రశాంతమత్తు
    గడచె రాతిరి చుక్కల గములువొడిమె|
    2.విడువన్ జాలనివింత పంతమది|ప్రావీణ్యంపునక్షత్రశా
    ల|డఫేదారుడుచంద్రుడే నిలిచెగా లక్ష్యాన మార్గంబునన్
    వెడలన్ జూచితి దృశ్య మాలికల నిర్వేదంబు మధ్యాహ్నమే
    గడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టె చంద్ర ద్యుతుల్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  20. ఉదయమే చలి వణికించు చుండ,సూర్య

    కిరణములు తీక్ష్ణతయు నొలికించ పగలు

    గడచె ; రాతిరి చుక్కల గములు వొడమె

    చందురుడు హిమకాంతుల నందజేసె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. మండు వేసంగి మెండుగనెండలుండ
    క్షణమొకయుగమయ్యెను వచ్చె జావు , పగలు
    గడచె , రాతిరి చుక్కల గములు వొడమె
    చేరబోయితి వెన్నెలన్ సేదతీర

    వడిగా గాలులు వీచె సూర్యుని ప్రతాపమ్మే విజృంభింపగన్
    వడగండ్లెన్నియొ తెచ్చెనా పవలు తీవ్రమ్మైన భారమ్ముతో
    గడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్
    మడుగున్ గల్వలు మోదమున్ విరిసి సమ్మానించెనే రేయినే

    రిప్లయితొలగించండి
  22. మోది మోదిన పేదలు బాధలీద
    బ్యాంకు చెంత బారులు తీరు వారిగోడు
    తగ్గె యాబది రోజుల ద్వాంత మిపుడు
    కడచె, రాతిరి చుక్కల గములు వొడమె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. చిమ్మచీకటిన్ మేఘముల్ గ్రమ్మినంత
    కుండపోతగ వర్షమ్ము కురిసి పిదప
    తేటబడుచును పున్నమి నాటి పగలుఁ
    గడచె, రాతిరి చుక్కల గములు వొడమె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. నిన్నటి పద్యములను చూడండి అన్నయ్యగారూ.

    పూర్తిగ విరియనట్టి పూ పుడమిలోన
    కనులకిటు విందు కల్గించు కమ్మగాను
    నందమైన యతివ కన నచ్చెరువగు
    నంది యందని యందమే విందొసంగు.

    గగనమున చేతికందక గబగబమని
    సాగు తరణి బింబము గన సతము ముదము
    కలుగు గాని నెప్పుడు కర గతము కాదు
    నంది యందని యందమె విందొసంగు.

    గగనమందున సాగుచు కమల సఖుడు
    సంద్రమందున చేరెను సంజవేళ
    గడచె రాతిరి చుక్కల గములు వొడమె
    వెండి వెన్నెల వ్యాపించె విశ్వమందు.

    వేళ కేతెంతు ననిపల్కి విభుడు చనియె
    కడచె రాతిరి చుక్కల గములు వొడమె
    తారలను గాంచి మురిసెనా ధవళకరుడు
    నైన రాడయ్యె పతియంచు నడలె సతియు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. నడచెన్ యోగియె పేర్లు మార్చుచును నానా రీతు లెల్లెల్లడన్
    వడిగా మార్చెను ఫైజబాదు నలహాబాదున్ ముఘల్ స్రాయినున్
    కడచెన్ రాతిరి;...చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్...
    కడకున్ మారెన కాకి కాకియెగదా కాకుత్స రామారమా?

    రిప్లయితొలగించండి