కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు"
లేదా...
"ధనికుఁడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు"
లేదా...
"ధనికుఁడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా"
మూలం తరోః కేవలమాశ్రయన్తః
ప్రత్యుత్తరంతొలగించుపాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః |
శ్రియం చ కంథామివ కుత్సయన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ||
...యతిపంచకం
చెట్టు నీడన వసియించి జెప్పు శృతులు
పట్టుమని పది మెతుకులు పట్టు చేత
మట్టి బుట్టిన వనియెంచు మణులు సిరులు
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు!
ధనికుండు = జ్ఞాన ధనుడు
శాస్త్రి గారు చక్కని శాలా విషమవృత్త శ్లోకాన్ని పరిచయము చేశారు. ధన్యవాదములు.
తొలగించు__/\__
తొలగించుhttp://stotras.krishnasrikanth.in/yati-panchakam-kaupeena-panchakam-in-telugu/
తొలగించుప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుచక్కని శ్లోకాన్ని పరిచయం చేస్తూ మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
__/\__
తొలగించుఅనువాదము:
తొలగించుఇంద్రవజ్రము.
భూజంపు మూలమ్మునఁ బొర్లు వారల్
పాజమ్ము పాణిద్వయ వర్జి తాత్ముల్
బ్రాజిల్లు సంపత్తిని పారి భంగిం
బైజార్చు కౌపీనులె భాగ్యవంతుల్
__/\__
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుఇంద్ర వజ్రము ఛందస్సు నేర్పినందులకు ధన్యవాదములు కామేశ్వర రావు గారికి...త త జ గగ...
తొలగించుపోతన తెలుగు భాగవతంలో వాడిన ఇంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 4
(భా-10.1-690-ఇ.)
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.
...wikipedia..
తొలగించుశాస్త్రి గారు శ్లోకము శాలా వృత్తము. 1,2,4 పాదములు: త త జ గగ; 3 వ పాదము జ త జ గగ. ప్రాసలేదు. విషమ వృతము.
తొలగించుతెలుగు పద్యము ఇంద్రవజ్రము. సమ వృత్తము. త త జ గగ. యతి: 8 వ అక్షరము. ప్రాస నియమము గలదు.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించుపట్టు పంచెలు గట్టుచు పరమ ప్రీతి
ప్రత్యుత్తరంతొలగించుపంట కాపును గాంచగ పరవ శమున
బుద్ధి పుట్టెను తనకింత భోగ మేల
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తన కేల భోగ మనుచు' అంటే బాగుంటుందేమో?
పట్టు పంచెలు గట్టుచు పరమ ప్రీతి
తొలగించుపంట కాపును గాంచగ పరవ శమున
బుద్ధి పుట్టెను తనకేల భోగ మనుచు
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
డా.పిట్టా
ప్రత్యుత్తరంతొలగించుదానమెరుగడు భోగాన దరుగు కలిమి
భోగమే నాశమునకైన భుక్తిగాగ
నాశమును గుర్తు జేయుచు నరయనేమొ
పుట్టగోచిని ధనికుండు పెట్టి మురియు!
పనిబడి బంగళా చివర బ్రాపుగ బెంకలు బేర్చనందమౌ
మునుగన రాక్షసాకృతియె మోదము నిచ్చునివాసమందు తా
మనగ దరిద్రవేశమున మానవు జిష్టియె దాకకుండగా
ధనికుడు పుట్టగోచిని సతంబు ధరించి ముదంబునందురా!
"దానము భోగము నాశము
పూనికతో మూడు గతులు భువి జనమునకున్" ఆర్యోక్తి
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పెట్ట లేడుగ పేదల పొట్ట గడువ
ప్రత్యుత్తరంతొలగించుకట్ట లేడుగ మెయినిండు బట్ట లెపుడు
చుట్టముల జేరనీయడు పట్టు మనుచు
పుట్ట గోచిని ధనికుండు పెట్టి మురియు!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
ప్రత్యుత్తరంతొలగించుగురువుగారూ నిన్నటి పద్యమునకు చక్కని సవరణ సూచించినందులకు ధన్యవాదములు.
ఘనమగు పట్టు వస్త్రములు గర్వమునన్ ధరియించి వచ్చె నా
ధనికుఁడు, పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
మునివరుడై మహర్షి కడు మోదము నిచ్చెడు జ్ఞానరూపమై
మన రమణుండు నిల్చె నిల మాన్యుడు సూర్య సమాన తేజుడై
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రత్యుత్తరంతొలగించుపిల్లికిని బిచ్చమేయని పిసిని గొట్టు
పైసయున్ ఖర్చు చేయని పరమ లోభి
వలువ లెందుకు మేనికి వ్యర్ధమనుచు
పుట్టగోచిని ధనికుండు పెట్టి మురియు.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
………………………………………
ప్రత్యుత్తరంతొలగించుగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పూర్వకాలము కౌపీనమును ధరి౦చె
పుట్టు - పేద | దోవతి c గట్టు మోజు >
పుట్ట , గోచిని ధనికు౦డు పెట్టి మురియు
నేటి కాలము , నవ్యత నిగ్గు లీన
______________________
పూర్వకాలము పేదవాడు పుట్ట గోచి ధరి౦చే
వాడు . నేటికాలము , దోవతిని కట్టుకునే
మోజు కలిగి నపుడు ధనికుడు దోవతి గోచి
పెట్టుకొని మురిసి పోతు౦టాడు .
____________________________
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టు వలువలు లేనట్టి పాతనాళ్లు
ప్రత్యుత్తరంతొలగించుమరువఁ జాలక తనదైన గురుతు గాను
చూచి యొకపరి పెట్టెలో దాచు కొనఁగ
పుట్ట గోఁచిని ధనికుండు పెట్టి మురియు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మట్టిలోని మానికములు గట్టివారు
ప్రత్యుత్తరంతొలగించుచేటికా చేటులకు వర చేలములను
పట్టు తో నేచి నట్టివి దట్టము మరి
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
[దట్టము = పావడ; పాలేరులు పంచిని గూడ గోచివలెనే కట్టు కుంటారు]
వనమున నిండు కుండ గతిఁ బారదు కావడి నుండి యెన్నడున్
వినయ విధేయ సద్గుణ వివేకియుఁ దా పనివేళ లందు న
న్ననయముగాఁ దలంపడట హాలికుఁడుత్తమ బుద్ధిశాలి యా
ధనికుఁడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
[అనయము = అశుభము]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చెట్టుపుట్టల దిరుగుచు కట్టుకొనగ
ప్రత్యుత్తరంతొలగించుపుట్టములులేేేని జనములు రొట్టకోసి
చుట్టుకొను తట్టులకుబోయి జూచివారి
పుట్జగోచిని ధనికుండు పెట్టి మురియు.
వనములలో జరించుచును వానయు నెండయు దాక స్రుక్కుచున్
ప్రత్యుత్తరంతొలగించుతనువుల దాచు వస్త్రముల దాల్చుటెరుంగక రొట్టకట్టుతో తనిసెడివారి పాలి జని తాప్రకటింపగ కల్మి నెంచు నా ధనికుడు పుట్టగోచిని సతంబు ధరించుచు మోదమందురా.
మిస్సన్న గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గ్రీష్మ తాపంబుదా ళక గీము లోన
ప్రత్యుత్తరంతొలగించుదాన కూర్చుండి యొంటరి దనము దోడ
పట్టు వస్త్రము లయ్యవి బరువ నుచును
పుట్ట గోచిని ధనికుండు పెట్టి మురియు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వడ్డికాసుల మోజుతో దుడ్డునంత
ప్రత్యుత్తరంతొలగించుపరులకిడుచును సతతము, వలువ విడిచి
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
మురికినోటివాడని ప్రజ పరిహసించ
అనయము మానసమ్ముధనపార్జనమందున మగ్న మవ్వగా
ప్రత్యుత్తరంతొలగించుకనుచుశివమ్ము డెందమునఁ గట్టు పరిచ్ఛదమున్ త్యజించుచున్
ధనికుడు పుట్టగోచిని సతంబు ధరించి ముదంబునందురా
ఘనముగ కూడబెట్టుసిరి కాలము తీరిన నూరడించునే?
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ధనపార్జన'...?
గురువర్యులకు నమస్సులు. నిధి యార్జనమందున అంటే సరిపోతుందా. దయతో తెలియజేయ ప్రార్థన.
తొలగించురెడ్డి గారు నిధి + ఆర్జన = నిధ్యార్జన అవుతుంది. ధనము + ఆర్జన = ధనపుటార్జన అవుతుంది.
తొలగించు"మానసమ్మది ధనార్జనమందున" అన్న సరి పోతుంది.
Kameswara Rao gariki dhanya vadamulu.
తొలగించునాటకముతన ప్రాణమన్న ధనికుండు
ప్రత్యుత్తరంతొలగించువేసెనొక నాటకమ్మున వేమనార్యు
వేశమును కడు మోజుతో ఫిబ్రవరిన
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
నతడు పాత్రలో లీనమౌ నటన జూపి
విరించి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కూడబెట్టుటయే గాని కూడి పెట్టి
ప్రత్యుత్తరంతొలగించుయెరుగడీతడు, సంపద యినుమడింప
బ్రతుక సౌఖ్యముడుగి లేని వాని వోలె
పుట్టగోచిని ధనికుండు పెట్టి మురియు
తంగిరాల రఘురామ్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వినుత విశాల బుద్ధి, మునివేషము, నిత్య జపార్చనాది స
ప్రత్యుత్తరంతొలగించున్మునిగణ బంధుజాలము, ముముక్ష కుతూహలుఁడాత్మలోన పా
వన శివరూప చింతనము భావజ వైరము నిచ్చలేమి చేఁ
ధనికుఁడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలిమి,బలిమినిజూచియు-విలువలున్న
ప్రత్యుత్తరంతొలగించువేమనార్యుని సాహిత్య వేదవిధులు
పుట్ట?గోచినిధనికుండుపెట్టిమురియు
నాటివేమన్న భావాలు నాటుకొనగ|
2.ధనమును దోచిపెట్టియు,నధర్మ పథంబున దాచియుంచగా?
మనుగడ యందు”మోడి”పరమావధి పాలననోట్ల కట్టలున్
గనుగొని జైలు కీడ్చెనని కల్పితమౌ కలరాత్రి నిద్రలో
ధనికుడు| పుట్ట గోచిని సతంబుధరించి ముదంబు నందురా|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
.చదువు,పదవులు,పెళ్ళిళ్ళు చక్కబెట్టి
ప్రత్యుత్తరంతొలగించుకోట్లయాస్తని సంతుకు గూర్చిపెట్ట?
“వయసు మీరిన తండ్రిని బయటి కంప|
అంత్యకాలాన యాశ నిరాశ గాగ?
పుట్ట గోచినిధనికుండు పెట్టి మురియు|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధనికుడు పుట్ట గోచిని సతంబు ధరించి ముదంబు నందురా
ప్రత్యుత్తరంతొలగించుధనికుడు వోలె బేదయును దా భరియించగ లేక దాపము
న్నన వరతంబు గట్టును ననాదిగ బట్టును గాక గోచియున్
విను మదియేగదా భువిని వేసవి వేడికి మార్గ మయ్యెడున్
సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనమగు పట్టువస్త్రములు గట్టిచరించెడువాడెవండనన్
ప్రత్యుత్తరంతొలగించుధనికుఁడు , పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
వనముజరించెడాదితెగ వాసులు , ముక్తిని గోరువారెయౌ
ముని జనులున్ విరాగులు ముముక్షువులెల్లరు, లేని పేదలే
విరించి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వనము జరించు గ్రామవన వాసులు...' అనండి. 'ఆది తెగ' దుష్టసమాసం. 'చరించెడు+ఆది = చరించెడు నాది' అవుతుంది. అక్కడ సంధి లేదు.
లోభతత్వము గలిగిన రొచ్చుమనిషి
ప్రత్యుత్తరంతొలగించుధనము నార్జించి తినకుండ దానమేమి
జేయకుండ జీవించును చివరి వరకు
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుట్ట గోచిని ధనికుండు పెట్టి మురియు
ప్రత్యుత్తరంతొలగించుపెట్టి బుట్టితి ననిదల్చి పెద్ద మనసు
బెట్టి గోపుడు తనకున్న పేద తనము
నిట్టె బాపెను నటుకుల నిచ్చి నంత
సి. రామమోహన రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలుములకు సరి తూగక కట్టు కొనును
ప్రత్యుత్తరంతొలగించుపుట్ట గోచిని ధనికుండు! పెట్టి మురియు
పేద యైన సిరుల నిరు పేద కెపుడు!
ధనము కోరదె భోగము, దానములను!
శ్రీధర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
ప్రత్యుత్తరంతొలగించుకలిమి గలిగినా కుముదుడై మెలగు నతడు
అజ్ఞు డౌచు నిచ్చలు నన్వయమ్ము లేక
వీగుచు మరియాద చలుప పిచ్చపట్టి
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు!
(పిచ్చపట్టి = లోభించి)
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనజభవుండు పాలమున వ్రాసిన వ్రాతలు నమ్మినట్టి ని
ప్రత్యుత్తరంతొలగించుర్ధనికుడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా
జననముపూర్వకర్మఫల సారమటంచు దలంచి యాత్మలో
మనమున ఖేదమెప్పుడును మాన్యుల గాంచియు పొందడిద్ధరన్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుట్టినప్పుడు తనువుపై బట్టలేదు
ప్రత్యుత్తరంతొలగించుపోవువేళను రావెట్టి పుట్టములును
తొడుగ నేలను తొడవులీ నడిమటంచు
పుట్టగోచిని ధనికుడుపెట్టి మురియు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ప్రత్యుత్తరంతొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాను తినబోక పరులకు దానమిడక
ప్రత్యుత్తరంతొలగించుధనము దాచుటె తనదగు ధర్మమనుచు
చెలగి పుట్టలు పెట్టెడి చెద పురుగటు
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు
నిన్నటి సమస్యకు నా పూరణ
రాహువే మ్రింగ పున్నమి రాత్రి శశిని
యంధకారము భూమిని యలము కొనగ
నాకసమునందు కాంతిని యమర జేయ
కడచె రాతిరి చుక్కల గములు వొడమె
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుపట్టు పంచెలు గట్టును, పరుగు లిడును,
ప్రత్యుత్తరంతొలగించుసంతసముతోడ నాట్యంబు సలుపు నిజము,
తనకు వారసుడై వెలుగొందు తనయుడొకడు
పుట్ట, గోచిని ధనికుండు పెట్టి మురియు.
ఘనతరమైన యోగమున కాలము బుచ్చెడివాడు, దైవమం
దనయము భక్తిజూపుచు మహత్సుఖ మొంది చరించువాడు, స
న్మునివరు, డన్నిబంధములు మున్నె త్యజించినవాడు, సాధుతన్
ధనికుడు పుట్టగోచిని సతంబు ధరించి ముదంబు నందురా.
హ.వేం.స.నా.మూర్తి.
పూట కైనను లేకుండ పుడమి యందు
ప్రత్యుత్తరంతొలగించుదిరుగు చుండెడు పేదలీ ధరియింత్రు
పుట్టగోచిని, ధనికుoడు పెట్టి మురియు
పట్టువలువలె కట్నాలు బంధువులకు
పుట్ట గోచిని ధనికుండు పెట్టి మరియు
ప్రత్యుత్తరంతొలగించుజనుల నమ్మించి దాచెను ధనమునంత;
పెద్ద నోట్లెల్ల రద్దయ్యె; బుధ్ధి వచ్చె;
ధనము పోయెనంచేడ్చెను ధనికుడతిగ.
డాక్టర్ మూలె రామమునిరెడ్డి;విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు. కడప జిల్లా. 7396564549