12, జనవరి 2017, గురువారం

సమస్య - 2251 (వేవుర సంప్రతించ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వేవుర  సంప్రతించ నవివేకము వోవును విద్య లేలయా"
లేదా...
"చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

  1. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||


    వినవలె సద్గురు బోధలు
    కనవలె కాశీ నగరము గంగా నదియున్
    తినవలె భిక్షాన్నమ్మును
    చనునజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా!

    రిప్లయితొలగించండి

  2. వినువీధిని యూట్యూబూ
    వినిపించు సకల విషయము విదురుని వోలెన్
    వినవే జిలేబి రయ్యన
    చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. వినుటకు నీతులు మెండగు
    తినినంతనె వేము చాల తీయగ నౌనున్
    కనులకు విందగు ప్రమదము
    చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా

    రిప్లయితొలగించండి
  4. వినుముర చదువును మించిన
    ధనమనునది యొండు లేదు ధారుణి నెచట
    న్వినకుము సుద్దులు పరులవి
    చ ను నజ్ఞత విన బలువుర జదువది యేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      పద్యం బాగుంది.
      పరుల సుద్దులు వినవద్దని అంటూనే పలువుర మాటలు వింటే అజ్ఞానం తొలగుతుంది అనడంలో ఔచిత్యం?

      తొలగించండి
  5. ఉ.ఏవిధి నెంచి జూచినను నీ భువి నెందరొ పండితోత్తముల్
    దేవుని రూపమోయనగ తేజిలు చుందురు జ్ఞాన సంపదన్
    జీవన సౌరభమ్ములను జిమ్ముచు నుండెడి యట్టి వారినిన్
    "వేవుర సంప్రతించ నవివేకము వోవును విద్య లేలయా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గుఱ్ఱం జనార్దన రావు గారూ -చక్కని పూరణ చేశారు. నేను 63 వ యేట పద్యములను నేర్చుకొనటానికి ముగ్గురు గురువులదగ్గరకు వెళ్ళే వాడిని. చింతా రామకృష్ణా రావు గారి సలహా తో శంకరాభరణం లో చేరాను. గురువుగారి సహకారంతో అభివృద్ధి చెందటానికి ప్రయత్నిస్తున్నాను. మీ పద్యంతో నాకు ఆరోజులు గుర్తుకు వచ్చాయి.ధన్యవాదములు.

      తొలగించండి
  6. వినయము గలవారలకున్
    జను నజ్ఞత వినఁ బలువురఁ, జదువది యేలా
    ధనసంపాదనమే మది
    ననయము తలచుచు వసించు నవివేకులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. జనులేగురువులు, జగమొక
    ఘనమగు బడి, కరపు నిచట,కలివిడి తో జీ
    వనమే విధి గడపినచో
    చను నజ్ఞత, వినఁ బలువురఁ ,జదువది యేలా?

    రిప్లయితొలగించండి
  8. వేవుర సంప్రతించ నవివేకము బోవును విద్య లేలయా
    వేవుర సంప్రతించ నవివేకముబోవదు గాక పో దుగా
    నీవ యెఱుంగుమా భువిని నీతియు ధర్మము నుండ గోరుచో
    పావన మైన యీచదువు వారధి గానిక నుండునే గదా

    రిప్లయితొలగించండి
  9. ఏవిధి తిన్నడే చదువు నెంచె నుమాపతి మెప్పు నొందఁ దా
    నేవిధి నేకలవ్యుడు నహీన గుణాఢ్యుఁ డుదారుఁ డయ్యెనే
    దైవసమాన సద్గురు వితాన పథాశ్రయులై చరించుచున్
    వేవుర సంప్రతించ నవివేకము వోవును విద్యలేలయా!


    ఎనలేని యాస్తిపరు డొక
    డు నరుగు బడికి నను, నావుడున్ ధనదర్పం
    బునఁ జదువక వ్యర్థంబం
    చను నజ్ఞత, వినఁ బలువురఁ జదువది యేలా!

    [ వ్యర్థంబంచు + అనును + అజ్ఞత = వ్యర్థంబంచను నజ్ఞత]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  10. సేవలఁ జేయుచున్ సతము జీర్ణులకున్ గడు గారవమ్ముతో
    దేవుని పూజనమ్ములనుఁ దృప్తినిఁ బొందుచు నిష్టపూర్తిగా
    వేవుర సంప్రతించ నవివేకము వోవును, విద్య లేలయా
    కేవలమైన స్వార్థమున కీర్తియుఁ గాసులఁ గూడబెట్టగన్
    జీర్ణుడుః జీనుడు, ముసలివాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. దేవిని నమ్మి పంతమిడు ధీరశిఖామణి కాళిదాసుకి
    న్నే విధి శాస్త్రమబ్బె? కృపనెన్నడు తప్పని తల్లియుండగా
    ద్రోవను పోవువారలగు ద్రోహులు కొందరు మందబుద్ధులౌ
    వేవుర సంప్రతించ నవివేకము వోవును విద్య లేలయా

    రిప్లయితొలగించండి
  12. కోవెల జేరి దేవతల గొల్చుట కంటెను దీనమానవున్
    సేవయె మిన్నగా దలచి చేసిన మోక్షము దక్కురీతిగన్
    పావన మైన బోధకుల పాఠము కన్నను భూరిజ్ఞానులౌ
    వేవుర  సంప్రతించ నవివేకము వోవును విద్య లేలయా

    వినయము విజ్ఞత గలిగిన
    ఘనసంస్కారమ్ము యె సిరిగా గల జనుల
    న్ననునిత్యమ్ము కలిసినను
    చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సంస్కారమ్ము+ఎ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'ఘనసంస్కారమ్మె సిరిగ గలిగిన జనుల...' అనండి.

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు. సవరించిన నిన్నటి పూరణ పద్యం:

    నిరతము భక్తుల నరయుచు
    నొరవుగ మహిమను బఱచుచు నుండెడి నభయం
    కరుడగు శంకరుని గుడిశి
    ఖరమును గనినంతనాకు గడు సంతసమౌ.

    క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనువగు బోధనల నిడుచు
    ననయము తెలివిని నయించు నభిరూపుండు
    న్వినయము తోడను దొడరగ
    చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. డా.పిట్టా
    తన పరి ప్రశ్నల దేల్చుచు
    ఘనుడౌ యా సోక్రటీసు గాంచెను తత్త్వం
    బనిశము పొత్తములేనా?
    చను నజ్ఞత విన బలువుర జదువది యేలా?
    పోవుచు "సున్న"దాటగను పొంకముగా నట మైలు రాళ్ళతో
    లావుగ నొక్కటొక్కటి గలంగగ నంకెల నేర్చె;"చంద్రు"నిన్
    భావుకు "నీశ్వరా"ఖ్యు బడి బట్టదు యండగ నుండగా బరుల్
    వేవుర సంప్రతించ నవివేకము పోవును విద్య లేలయా?!
    (ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు రోడ్డు వెంబడి నడుస్తూ అంకెలు నేర్చుకున్నాడు.చరిత్రాంశమునాధారంగా జరిగిన పూరణము)
    (సోక్రటీసు,తత్త్వవేత్త,చౌరాస్తాలో కూర్చుని పాదచారులకు ప్రశ్నలు వేస్తూండే వాడు,మై మరచి యింటికి రాకుంటే అతని భార్య పేడ గలిపిన నీరు బకెట్ నిండా తెచ్చి అతని తలపై పోసిందని ఉదంతం.వారి సిద్ధాంతాలు plato,Aristotle అనుసరించి నారీ గ్రీకు గురువు ఘనతయిది.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేవుర సంప్రతించ నవివేకము పోవును విద్య లేలయా?
      నావుడు,యిచ్చినట్టిసలహాలను నాణ్యత నెంచి చూడగన్
      యే విధినాచరించవలె నేమివిధానములో నెరుంగగన్
      కావలె విద్య నేర్చియవగాహన బొందగ మానవాళికిన్

      తొలగించండి
    2. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      '...బట్టదు+అండగ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'బట్టదె యండగ' అనవచ్చు.
      *****
      కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'విధానములో యేరుంగగన్' అనండి.

      తొలగించండి

  15. వినయము, విజ్ఞతయు గలిగి

    యనయము విజ్ఞాన బోధలందరి కిడెడున్

    ఘన గురువుల చెంత గడుప

    చను నజ్ఞత,విన బలువురజదువది యేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. వినుమీ మాటలు పుత్రా
    ననయముపెద్దలగువారి ననవరతంబున్
    వినయముతోకొల్చుచు విన
    చను నజ్ఞత విన బలువుర జదువది యేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పుత్రా యనయము...' అనండి.

      తొలగించండి
  17. చావును బాపలేరుగద చాకిరి చేయుచు విత్తభక్తులౌ
    వేవుర సంప్రతించ;...నవివేకము వోవును;...విద్య లేల?...యా
    గోవుల గ్రాసమున్ నమిలి గొప్పగ జీర్ణము చేసికొంచు తా
    పావుల వడ్డికిన్ ఋణము పన్నుగ తెచ్చుచు పారిపోవగా!

    రిప్లయితొలగించండి