13, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2252 (జలమున నగ్ని పుట్టెనని...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్"
లేదా...
"జలములో నగ్ని పుట్టె మత్స్యములు మురిసె"

63 కామెంట్‌లు:

  1. సోదర సోదరీ మణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
    ------------------------------------
    విలువగు ముత్తెముల్ మణులు వేయి రకమ్ముల శంఖు చక్రముల్
    కలవట సంద్ర గర్భమున గవ్వలు కానని కాల కూటముల్
    తెలియని మోహ మందునను ధీటుగ నొక్కరమై చరించగన్
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలమున్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      చక్కని పద్యంతో (మాకు) శుభోదయం చేశారు. బాగుంది. భోగి పండుగ శుభాకాంక్షలతో అభినందనలు.
      'శంఖ చక్రముల్... వార్ధి గర్భమున' అనండి.

      తొలగించండి
  2. వేడి నీటి బుగ్గలు = hot springs


    వింత లెన్నియో జూడగ విశ్వ మందు
    గౌరి కుండమున మునుగ గ్లాని దీరు
    వేడి నీటిబుగ్గ ప్రకృతి వింత గాదె
    జలములో నగ్ని పుట్టె మత్స్యములు మురిసె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (ఇంతకూ వేడినీటి బుగ్గల్లో చేప లుంటాయా?)

      తొలగించండి
    2. "There are fantastic fishing holes throughout Hot Springs Village. An Arkansas fishing license is required for all HSV lakes. The lakes in Hot Springs Village are stocked with bass, catfish,bluegill and sunfish by the Arkansas Game and Fish Commission. The fish population is monitored by Game and Fish biologists and additional stockings are done if needed. In addition to the Hot Springs Village POA’s specific regulations, all U.S. and Arkansas fishing and boating regulations apply to HSV lakes...:


      http://hsvpoa.org/recreation/fishing/

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      మీ వివరణకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. మరుగు నీటను ప్రాణులు మాడి పోవు.
    జలములో నగ్ని పుట్టె, మత్స్యములు మురిసె
    కొలను లందున మనకేమి కొఱత లేదు
    మత్స్య కారులు నిటువైపు మరలి రారు

    రిప్లయితొలగించండి


  4. వాయువును వీడి పరిణామ వరముగాను
    జలములో నగ్ని పుట్టె, మత్స్యములు మురిసె
    సూర్య రశ్మియటు విభుని సొబగు గనుచు
    విశ్వ మండల మందున విరివి గాన !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    ఆమ్లజని మండు నుదజని యార్పివేయు
    గుణములీరెండు తగుపాళ్ళ గూడ గాదె
    దనరె నగ్నియు సలిలముల్ ధనములయ్యి!
    జలములోనగ్ని పుట్టె మత్స్యములు మురిసె
    "ధనమగ్నిర్ధనమ్ వాయుః ధనమ్ సూర్యో ధనమ్ వసుః
    ధనమింద్రో బృహస్పతిః,వరుణమ్ ధనమశ్నుతే" శ్రీసూక్తము
    బలమున నోట్ల రద్దులను బాదెను యార్థిక యోగపుంజముల్
    వెలవెల బోయె మోది యవివేకమటన్నవి వార్త మాధ్యమాల్
    గలగల లందె బొక్కసము గాంచె బరిశ్రమ వీథి లాభముల్
    జలమున నగ్ని పుట్టెనని సంతసమందెను మీన జాలముల్
    (తేది12-1-2017 నాటి రాత్రి అందిన వార్త నాధారముగా గొని.....)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      శాస్ర విషయంగా మొదటి పూరణ, కాలానుగుణమైన రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
      'బాదెను+ఆర్థిక' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'బాదగ నార్థిక..' అందామా? 'వార్తా మాధ్యమాలు' సాధు సమాసం.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా,కృతజ్ఞతలు
      వార్తమాద్యముల్ కు బదులు వార్తలాదిగాన్ అని తప్పుకున్నాను.బాదగనార్థిక మీ సూచనను పాటించాను.నా సమస్యా"ఖరము"ను గాంచక పోయితిరి, నా ఆలస్యం మూలంగా.ద.చే.చూడగలరు.

      తొలగించండి
  6. వాన, వడగల్లు కురియగ బాల మురిసె,
    ననలు డంబువుల గలియ నా హిమాద్రి
    జలములో నగ్ని పుట్టె; మత్స్యములు మురిసె
    జాలరులు వల పన్నగ జాలరనుచు

    నిన్నటి సమస్యకు నా పూరణ

    రావులపాలె మెచ్చటని రాత్రినె జేరగ పాంధు డేగుచున్
    జీవిక కేది మార్గమని చేరుచు పల్లెను పార పట్టుచున్
    గోవుల సంతలో కొనగ గొల్లల తోడనె గంతులేయుచున్
    వేవుర సంప్రతించ నవివేకము వోవును; విద్య లేలయా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. తనరబడబాగ్నిపైపైకిదన్నుకతన
    జలములోనగ్నిపుట్టె,మత్స్యములుమురిసె
    చెరువులోనికిజలములుచేరువలన
    జలములేకదచేపలసదనములిల

    రిప్లయితొలగించండి
  8. భద్రముగదాచి తెచ్చెడు భాస్వరమ్మె
    జారిపడిపోయి నంతట సత్త్రమందు
    జలములో నగ్నిపుట్టె, మత్స్యములు మురిసె
    తమకు ముప్పువాటిల్లలేదంచు నెఱగి


    మలమల మాడెడెండలకు మత్తడెయింకగ నందునుండెడిన్
    జలచరరాశి దాపుగల సత్త్రము జేరెను తూడులెండగన్
    వలిభుడు నిప్పువెట్టెనట వాజము లేని నెపమ్ముతోడ ని
    ర్జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మాడు నెండలకు' అనండి. 'మత్తడి+ఎ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ 'మత్తడి యింకను' అనండి.

      తొలగించండి
  9. కవి మిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు

    వేకువ జామునన్ జనులు వీడకె నిద్దుర నేస్తకాళ్ళతో
    పోకిరులౌచు జట్లుగను పోయి గభాలున దొడ్ల గోడలన్
    దూకుచు కర్రకంపలను దుంగల దొంగిలి తెచ్చి పేర్చి మా
    మూకలు భోగిమంటలను మోదముతో రగిలించుటెంచెదన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పద్యంతో నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు. బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
  10. శ్రీగురుభ్యోనమః
    తెలియవు వేదశాస్త్రములు తెల్పెడువారును లేరు చూడగ
    న్నలరగ నేత్రపర్వముగ నంబుధి నందున నావికాదళ
    మ్ములు తమ సాహసంబులన్ మోదము గూర్చగ జూపుచుండగా
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    రిప్లయితొలగించండి
  11. మధ్యాహ్న భోజనానికి ఒకరింటికి అతిథిగా వచ్చిన ఓ కవి అన్నాడు.
    "చారుగా చారుగా చారుగా"
    తిరిగి ఆయనే విడదీసి అర్థం చెప్పాడు.
    చారు అంటే సంస్కృతంలో బాగా (Good) అని అర్థం, ఇక చారు అంటే ఒక ఆదరువు తెలిసిందే! గాచారుగా = కాచినారు కదా !
    (రసం చాల బాగా కాచారుగా !)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      ఈ చమత్కారాన్ని మొదటిసారిగా చదువుతున్నాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  12. నలినజు సృష్టి చిత్రములు నైపుణి నెంచఁ దరమ్మె యేరికిన్
    జలనిధి నింపె రత్నముల జాతము సేసె నబింధనమ్మునున్
    వలనుగ భోజనార్థము నపార విహార విలాస నీరధిన్
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    [అబింధనము = బడబాగ్ని; అగ్ని = చిత్రమూలము (మొక్క పేరు)]


    కన్నులా యవి నిజమెంచఁ జెన్ను మీన
    ములు సుమీ చూడఁ జూడగ ముద్దు గొలుపు
    చేడియ ప్రియకాంతునిఁ జూడ సిగ్గు తోడఁ
    జలములో నగ్ని పుట్టె! మత్స్యములు మురిసె!

    [చలము = వణుకు; మత్స్యములు = నయనోక్తములు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      వాహ్! మీ పూరణాప్రతిభకు నమోవాకాలు. దేనికదే ప్రత్యేకంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  13. జలమున దాన మాడగను జాస్మిను బోవగ దె ల్సె నామెకున్
    జలమున నగ్ని పుట్టెనని, సంతసమందెను మీ నజాలముల్
    జలములు బొర్లి వచ్చె దమ సాగర మందున నంచు బ్రీతితో
    జలజల పారు చుండె నట సాటిగనౌ చిరు చేప లత్తఱిన్

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జీవులకు తేజమమరించి చేవ గూర్చ
    నదితి నారున్నొక శిఖల నడరు నగ్ని
    యుదధి ప్రాణుల వృద్ధికై నొక్క శిఖను
    జలములో నగ్ని పుట్టె మత్స్యములు మురిసె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. బలముగ గాలివీచగను వారిధి బోయెడి నౌక వేగమై
    బలిమిని డీకొనెన్ గిరిని, వ్రక్కలవంగను పాకశాలలో
    కొలిమిని నిప్పు యంటుకొని గూల్చెను నౌకను మంట లేర్పడన్
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగుంది సార్...వాస్తవికంగా...

      ..Titanic sank due to enormous uncontrollable fire, not iceberg, claim experts...

      https://www.google.co.in/amp/www.independent.co.uk/news/uk/home-news/rms-titanic-evidence-fire-senan-molony-belfast-new-york-southampton-sink-april-1912-a7504236.html%3Famp

      తొలగించండి
    2. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిప్పు+అంటుకొని' అన్నపుడు సంధి నిత్యం. 'నిప్పు లంటుకొని' అనండి.
      ****
      శాస్త్రి గారూ,
      క్రొత్త విషయాన్ని తెలిపారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    3. shaastrigaariki





      శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి నమస్కారములు. నాపద్యము మీకు నచ్చి నందుకు ధన్యవాదములు






      తొలగించండి
  16. సంక్రాంతి శుభాకాంక్షలు
    ------------------
    భోగ భాగ్యములు గలుగు భోగి నాడు
    సిరియు సంపద లువిరియు శివుని గృపను
    పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
    పాడి పంటల వృద్ధియు బాగు గాను
    కనుము దినమున మొదలిడు ననుట నిజము .
    సంక్రాంతి శుభా కాంక్షలు
    సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
    సంక్రాంతి మూడు రోజులు
    ‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

    రిప్లయితొలగించండి
  17. విలువలు గల్గి మానవులు వేకువ జామున భోగి పర్వమున్
    కలువల గూడినట్టి సరకంబున కొడ్డున సంతసంబునన్
    పలువురు జేరి వృక్షముల బద్దలు పేర్చుచు నగ్గి బెట్ట క
    జ్జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    రిప్లయితొలగించండి
  18. మాస్టరుగారికి, కవిమిత్రులకు వీక్షలకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

    కందము:
    వెదకుచు నింటను చెత్తను
    కుదురుగ జనమంతజేరి కూరిచి వేయన్
    ఉదయమున భోగిమంటల
    పదిలముగా సుఖములందు పరిశుభ్రతతో.

    తేటగీతి:
    చిన్న పిల్లల గూర్చుండజేసి వారి
    రేగియున్నట్టి తలలపై భోగినాడు.
    రెచ్చి పెద్దలు వోయగా రేగుపండ్లు
    ముచ్చటందుచు రేగును ముఖపు కాంతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      చక్కని పద్యాలతో శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  19. శ్రికందిశంకరయ్య గురువర్యులకు,కవిమిత్రులకు భోగిశుభాకాంక్షలు .నిన్నటిపూరణ
    జీవనయానమందు పరజీవులభావన సారమెంచగా?
    పావన మైన యోగమగు|భావితరాలకు మార్గ దర్శమై
    యేవిధమైన విద్యలనునెంచని పక్షులు గూళ్ళుగట్టవా?
    వేవురసంప్రతించ నవివేకము వోవును విద్యలేలయా?
    13.1.17. జలకళ వంటి కాపురము జాగ్రుతులందున నిండియుండగా?
    అలజడి క్రొత్త కోడలుల యత్తల పెత్తనమన్నయగ్నిచే
    విలవిల లాడుచుండ గని వింతగ నవ్వెడి లోకులట్లుగా
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్|
    2.మత్స్యకారులు పడవలో మరలి రాగ?
    వలలు వేయగ బడబాగ్ని బస్మబరచ
    జలములో నగ్ని పుట్టె మత్స్యములు మురిసె|
    చెడప దలచిన వారికే చేటు గలుగ|



    రిప్లయితొలగించండి
  20. కలగని యున్నయట్టి చెలికాఁడు వనాంతర మౌ సరస్సులో
    పల జలకంబులాఁడఁ గని వర్ధిలు నావిరహాగ్ని వేదనన్
    కలయుచు నా వయస్య లట కాంతుని సఖ్యముకై చెలంగిరే
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    జలమున = సరస్సులో
    అగ్ని = విరహాగ్ని
    మీనజాలముల్ = మీననేత్రులు ( స్త్రీలు ) చెలికత్తెలు ( వయస్యలు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు


    శీతల ఘనీభవమ్మున చింతలఁ బడ
    కడలి గాలివానలెగయ గ్రమ్మ, మేఘ
    మండలంపు పిడుగు జారి మహిని కొలను
    జలములో నగ్నిపుట్టె మత్స్యములు మురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. కడలి ఘోషల భీకర మడరు కొనగ
    జలములో నగ్ని పుట్టె, మత్స్యములు మురిసె!
    కొలను నందలి యలలను కూడి దుముక
    నలము కొనియెడి యానందములు కుదురగ!

    రిప్లయితొలగించండి

  23. గురువర్యుల సూచన మేరకు సవరించిన పద్యము
    బలముగ గాలివీచగను వారిధి బోయెడి నౌక వేగమై
    బలిమిని డీకొనెన్ గిరిని, వ్రక్కలవంగను పాకశాలలో
    కొలిమిని నిప్పు లంటుకొని గూల్చెను నౌకను మంట లేర్పడన్
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

    [శివుని రేతస్సు నుండి వేఁడిమి వెలువడుటనుం గాంచి, యందుండి కుమారుఁడుద్భవించి, తారకునిఁ జంపి, లోకాల బాధను దొలఁగించునని మత్స్యాదులు సంతసించెనని యాశయము]

    చలమునఁ దారకుం దునుమఁ జంద్రకళాధర సూన జన్మకై
    చలిమలచూలి ముక్కనుల జన్నపుఁదిండినిఁ గూర్పఁగాఁ ద్వరన్
    జలధి నిషంగు రేత మది జారఁగ నగ్ని శరమ్మునం దిడన్
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్!
    [జలము = రేతస్సు]

    రిప్లయితొలగించండి
  25. భోగి మంటల గతమును బుగ్గి జేసి
    బ్రతుకు నందున సంక్రాంతి పరచు కొనఁగ
    కనుమ! జీవిత గమనము కలత వీడి
    ప్రతిది మీరనుకూల దృక్పథము తోడ

    రిప్లయితొలగించండి
  26. నిన్నటి పూరణ:
    ప్రణవమె గాక పరమపద
    మును దెలిపెడి విజ్ఙతగల భూసురుఁ చాగం
    టిని బోలు వారిఁ గలిసినఁ
    జను నజ్ఙత, విన బలువుర? జదువది యేలా?

    రిప్లయితొలగించండి
  27. మెున్నటి పూరణ:
    1.
    ఓ చాకలి మధురస్మృతి:

    భరమౌ బట్టలపై నను
    చిరుతనమున చాకిరేవు చేర్చగ నో చి
    త్తరువున గురుతెరుగుచు నా
    ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ

    2.
    పరిపూర్ణ శాస్త్రవేత్తగ
    భరతావని మెచ్చ రాష్ట్రపతిగ వెలుంగన్
    ధరణిని కలాము కీర్తి శి
    ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం, పూరణలు అన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  28. వార ఫలాలు:

    వలవల నేడ్చుచుండగను వారిధి లోనను మేష సింహముల్
    గలగల పారుచుండగను కన్యలు కర్కట వృశ్చికమ్ములున్
    కొలనుల వేగుచుండగను కుంభము మక్రము రాశులింకనున్
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్ :)

    అర్ధం అడక్కండి ...సమస్య అట్టిది

    రిప్లయితొలగించండి

  29. అర్థం కిట్టించా నను కుంటున్నా :)


    అలసెను మానసమ్ము కలగాంచితి దృశ్యమపూర్వమైనద
    య్య! లయపు కాల మందున వయారము లెల్లను బోవ గానటన్
    ప్రళయపు కొక్కురాయెను! కపర్దియు శాంతిగొనన్ ప్రభాతమై
    జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి