17, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2256 (పార్వతి ముద్దాడె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్"
లేదా...
"పార్వతి మెచ్చి ముద్దుగొనె పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్"

56 కామెంట్‌లు:

  1. సర్వము భస్మాసుర కథ
    శర్వాణి వినగనె నవ్వి శంకరు మోమున్
    గర్వముగ జూసి, భర్తను
    పార్వతి ముద్దాడె; మెచ్చి పంకజనాభున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శాస్త్రి గారు మీ పూరణకు నా యీ సవరణ యెట్లున్నదో చెప్పండి.

      సర్వము భస్మాసుర కథ
      శర్వాణి వినగనె కుంది సర్వజ్ఞు విప
      త్తుర్వగ నిట్టూర్చి పతినిఁ
      బార్వతి ముద్దాడె, మెచ్చి పంకజనాభున్!

      [ఉర్వు = పరిహరించు]

      తొలగించండి
    3. అయ్యా పూజ్యశ్రీ కామేశ్వర రావు గారు:

      నా పూరణ మీరు చదివారు అంటేనే నాకు మహదానందం. మీ రచనపై వ్యాఖ్య చేయుటకు నాకు అర్హత పునర్జన్మలోనే!

      తొలగించండి
    4. అంత లేదండి. నా పరిజ్ఞానము నల్ప మాత్రమే. పార్వతీ దేవి మనోభావమును వేరు వేరు కోణములలో చూచాము మనమిద్దరము. అంతే. మీ పద్య రచన పాకాన పడుతోందనడములో సందేహము లేదు.

      తొలగించండి
  2. కంది శంకరయ్యజనవరి 16, 2017 6:07 PM

    గుఱ్ఱం సీతాదేవి గారూ, 
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'హంసుడు జీవులకు, విజిత\కంసుడు...' అనండి. అన్వయం కుదురుతుంది. 
    (జనార్దన రావు గారికి మీరేమవుతారు?)

    **************************

    పూజ్యులు శంకరయ్య గారికి గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి వందనములు. 

    గుఱ్ఱం సీతా దేవి నా సహోదరి. కొన్నాళ్ళక్రితం మీరిచ్చిన న్యస్తాక్షరికి సీతా దేవి ఉత్పలమాల పూరణను నేను తనపేరున శంకరాభరణం లో ప్రచురించాను. మీరూ శ్రీ కామేశ్వర రావు గారు సహృదయతో స్పందించి ప్రొత్సహించారు. మొత్తానికి నా రాకతో శంకరాభరణ వేదికలో గుఱ్ఱాల జనాభా త్రిగుణీకృతం అయినది...

    రిప్లయితొలగించండి
  3. నిర్వాకము చాలు వరముల
    నుర్విని రక్కసులు మెండు నూరక నిడగన్
    సర్వము నీకై నేనని
    పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది.
      కాని అన్వయం కుదిరినట్టు లేదు.

      తొలగించండి
    2. సర్వము నీవే యనుకొని
      గర్వముతో సరస నుండె గాదిలి సతియై
      పర్వత పుత్రిక ప్రియముగ
      పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్

      తొలగించండి


  4. పర్వదినము పరమశివుని
    పార్వతి ముద్దాడె, మెచ్చి పంకజనాభున్
    సర్వము తానై కొలిచెను
    గర్వము పిసరంతలేక కమలాక్షి సదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. సర్వులు రాక్షసుల్ సురలు చయ్యన త్రచ్చిరి పాలసంద్రమున్
    పర్వులు బెట్టిిినారుగద భళ్ళున పుట్ట విషమ్ము మ్రింగ నీ శర్వుడు పిమ్మటన్ కమల సంభవమై హరి జూచినంతనే
    పార్వతి! మెచ్చి ముద్దుగొనె పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      సంబోధనతో మీ పూరణ వైవిధ్యంగా, మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    సర్వము హరి హర మయమే
    గర్వముతో నొకట పతిని గాంచని సతియై
    ఖర్వుని వామను సుతుడని
    పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్!(పార్వతి ముద్దాడె మరచి పంకజనాభున్)
    శ్రీ శంకర ఉవాచ:
    నేర్వనివౌనె సత్కథలు నే వివరించగ వింటి వెన్నియో
    పూర్వము నిప్పుడెప్పుడును బూర్ణుని లీల లనంత వింతలౌ
    గర్వమడంచ కొన్నియును గావగ గొన్నియు జూప లక్ష్మి,యో
    పార్వతి ! మెచ్చి ముద్దుగొనె పంకజనాభుని ప్రేమ మీరగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. ఉర్విజని బాలగణపతి
    పర్వతమున తిరుగుచుండ బట్టుక హరియే
    శర్వాణికీయ సుతునే
    పార్వతి ముద్దాడె, మెచ్చి పంకజనాభున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  8. శర్వుని శూలిని యభవుని
    పార్వతి ముద్దాడె; మెచ్చి పంకజనాభున్
    ధూర్వాహమున గజాసురు
    నిర్వాసించగను జనగ నేమము తోడన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శూలిని నభవుని' అనండి. 'ధూర్వహము' శబ్ద మున్నది కాని 'ధూర్వాహము' లేదు. "ధూర్వహమునన్ గజాసురు" అనవచ్చు కదా!

      తొలగించండి
    2. గురువు గారూ....నమస్సులు....మీ సూచనలకు కృతజ్ఞతలు.
      సవరణతో:

      శర్వుని శూలిని నభవుని
      పార్వతి ముద్దాడె; మెచ్చి పంకజనాభున్
      ధూర్వహమునన్ గజాసురు
      నిర్వాసించగను జనగ నేమము తోడన్!

      తొలగించండి
  9. సర్వ జగతిఁ గాయ, శివుని
    పార్వతి ముద్దాడె మెచ్చి, పంకజనాభున్
    సర్వేశు ముదముతోడను
    సర్వ దివౌకసులు గాంచి, చల్లిరి విరులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. అర్వార్వతీ నికా యా
    ఖర్వాగార పరి పోషకద్యుతి మంతున్
    గర్వ రహితు ననునయుఁ జం
    పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్

    [చంపా+అర్వతి = చంపార్వతి = చంప పేరు గల గుఱ్ఱము; అర్వతి = ఆఁడు గుఱ్ఱము; నాభి = క్షత్రియుడు; పంకజనాభి = పద్మమువంటి సుకుమార క్షత్రియుడు]


    సర్వ నిశావిహారగణ సంక్షయ కార్యధురీణు దేవగం
    ధర్వ ముఖోర గానిమిష తాపస సేవిత పాద పద్మునిన్
    సర్వ శుభప్రదప్రవర సాగర కన్యక సంస్తవాత్త దృ
    క్పార్వతి మెచ్చి ముద్దుగొనె పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      రోజురోజుకు పూరణలలో మీరు చూపిస్తున్న వైవిధ్యం అబ్బురపరుస్తున్నది. అనన్యసామాన్యంగా ఉంటున్నవి. అభినందనలు, ధన్యవాదాలు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      నేను నా పూరణలలో నిదివరకు వాడిన “భావ గభీర గూఢముల్”, “సుందర శబ్ద సుసంహితమ్ములున్”, “సహేతుకమౌ పద సంహితంబునై”, “స్తవనీయాంశ విశేషభావ యుత శబ్దార్థప్రభా రాశినిన్” మున్నగు విశేషణములను నిత్యము గుర్తు పెట్టు కుంటాను.

      తొలగించండి
  11. దుర్వహమౌ విషమ్ముగొన ధూర్జటి లోకహితమ్ముకోరుచున్
    పార్వతి మెచ్చి ముద్దుగొనె, పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్
    సర్వ దివౌకసుల్ పొగిడి చల్లిరి పువ్వుల వానజల్లులన్
    పర్వదినమ్ముగా తలచి పండిత పామరు లుల్లసిల్లగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      ఈ వృత్త పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. సర్వగణాధిపతియనుచు
    పార్వతి ముద్దాడె మెచ్చి, పంకజ నాభున్
    సర్వజగద్రక్షు గడకు
    శర్వాణి కదిలె సుతుడు గజానను తోడన్

    సర్వము తానెయై చెరగు శంకరు డొక్కపరీక్షపెట్టగా
    సర్వగణాధిపత్యము గజాననునే వరియింపమోదమున్
    బార్వతి మెచ్చిముద్దుగొనె , పంకజ నాభుని ప్రేమమీరగ
    న్నుర్విని బ్రోచువాడిని మహోత్తము గొల్వ జేరెనే
    .............. .............

    రిప్లయితొలగించండి
  13. శర్వుడు హాయి నుండెను గజా సురుగర్భము నందు ,చింతిలెన్
    సర్వగణమ్ములున్నుమయు,సౌరభమేళము శౌరిగూర్చగా,
    కర్వరి కోర్కె దీర్తు నన, కడ్పును జీల్చ బయల్పడన్ శివున్
    పార్వతి మెచ్చి ముద్దు గొనె,పంకజనాభుని ప్రేమమీరగన్
    దుర్విధిపాల బడ్డ నట ధూర్జటి ని౦డుగ సంస్తుతి౦చగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. శర్వునిమహిమనునెరిగిన
    పార్వతిముద్దాడెమెచ్చి,పంకజనాభున్
    సర్వులుభక్తినిగొలిచిన
    సర్వముదానిచ్చునిజముశంకర!వినుమా

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దుర్వర్తుల నడచు శివుని
    పార్వతి ముద్దాడె మెచ్చి; పంకజనాభున్
    నిర్వాణి యగు తనపతి
    న్నిర్వాహకము నెఱిగి రమ నెమ్మిని గూడెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దుర్వర్తనులు' అనడం సాధువు కదా! అక్కడ 'దుర్వర్తన నడచు శివుని' అనండి.

      తొలగించండి
    2. మంకరయ్య గారూ, 'దుర్వర్తన నడచు' అనా 'దుర్వర్తన మడచు' అనా? ఏది సాధుప్రయోగమూ సముచితమూ అన్న సంశయం తీర్చగొర్తాను. ఒకవేళ ఉభయత్రా ఔచితి ఉన్నట్లైతే మరీ సంతోషం.

      తొలగించండి
  16. శార్వరిసూనుకున్దిరిగిజన్మనునిచ్చినశంకరున్సదా
    పార్వతిమెచ్చిముద్దుగొనెపంకజనాభునిబ్రేమమీరగన్
    సర్వులుభక్తిభావమునసాదరమొప్పగమ్రోకరిల్లగా
    సర్వముదానయిచ్చునికశంకరునానతినెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  17. పర్వదినమ్మున ప్రియుఁడట
    నిర్వాహక నాటకాన నిలువఁగ హరియై
    సర్వులు భేషన ప్రేయసి
    పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. పర్యంకముఁ జేరి ప్రియుడ !
    యుర్విని నిను బొగడనిడితివుబ్బుచు వరముల్,
    పర్విడ గాచెను హరి యని
    పార్వతి ముద్దాడె; మెచ్చి పంకజనాభున్

    రిప్లయితొలగించండి
  19. సర్వులగు హరిహరు లసుర
    పర్వమునకు చరమ గీతి పలుకగ యంతన్
    గర్వాతిశయమున మగని
    పార్వతి ముద్దాడె, మెచ్చె పంకజ నాభున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పలుకగ నంతన్' అనండి.

      తొలగించండి
  20. కర్వుని గెలిచిన శంభుని
    పార్వతి ముద్దాడె మెచ్చి,పంకజనాభున్
    సర్వ విధులనూరార్చుచు
    కర్వుని జీవింప జేసె గాదిలి రతికై

    రిప్లయితొలగించండి
  21. నిర్వహణాన విష్ణువుగ నిత్యముశంకరుడైన భర్తతో
    పర్వదినాన నాటకము “పట్టుగనేర్చియు మెప్పుబొందగా
    గర్వముబొందురీతిగను గానముజేయగ లక్ష్య సిద్దితో
    పార్వతి మెచ్చి ముద్దుగొనె పంకజ నాభుని బ్రేమ మీరగన్ {నాటకానహరి జీవితానశంకరుడుభార్యపార్వతి}
    2.సర్వాంతర్యామి శివుని
    పార్వతిముద్దాడె|”మెచ్చిపంకజ నాభున్
    సర్వులు గుడిలో భక్తిగ
    నిర్వేదులునైనభజననెంచుటకద్దే|

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి నమస్కారాలు! పార్వతి అంటే గోపిక అనే అర్ధం ఉందని తెలిసింది. అందుచేత ఇలా పూరించాను !

    రిప్లయితొలగించండి
  23. గర్వము వీడగ యింద్రుడు
    పర్వతమెత్తిన యనంతు పాదము చెంతన్
    సర్వోన్నతి బృందావన
    పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్!

    రిప్లయితొలగించండి
  24. *సహస్ర కవిరత్న,సహస్రకవిభూషణ*
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *పర్వదినంబునన్ గెలిచె పంకజనాభుడు పందెమందునన్*
    *గర్వము వీడిపల్కెజయకారణమారయ తల్లిదీవెనల్*
    *పార్వతినాదుమాతయనెఁ!బాలునికౌగిటఁజేర్చినిల్చి యా*
    *పార్వతి మెచ్చి ముద్దుగొనె పంకజనాభుని ప్రేమ మీరగన్ !!*
    *🙏శ్రీమతి జి సందిత బెంగుళూరు🙏*

    రిప్లయితొలగించండి
  25. దర్వుల తోడు మోహినియె దానవ భస్మము నిర్వహించగా
    గర్వము వీడుచున్ హరుడు గౌరిని శోధిలి వెండికొండనున్
    పర్వులు బెట్టుచున్ వడిగ భవ్యను గట్టిగ కౌగిలించగన్
    పార్వతి మెచ్చి ముద్దుగొనె;...పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్ :)

    రిప్లయితొలగించండి