30, జనవరి 2017, సోమవారం

సమస్య - 2268 (చీర విప్పి సుదతి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"చీర విప్పి సుదతి చిందులాడె"
లేదా...
"చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్"

83 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. జీన్సు ప్యాంటు టాపు చిన్నతనము నుంచి
      తొడిగి నట్టి యువతి తొలుత గాను
      పెళ్ళిచూపు లందు తల్లి కట్టమనిన 
      చీర విప్పి సుదతి చిందులాడె

      తొలగించండి
    2. నా ఆటవెలది పూరణలో గణదోషము తెల్పి సవరించిన మా చిన్నాయన, శ్రీ భట్టారం రాధాక్రిష్ణయ్య (85) గారికి ధన్యవాదములు.

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారికి ప్రణామాలు!

      తొలగించండి
    4. పదవీ విరమణ పిమ్మట శ్రీ భట్టారం రాధాక్రిష్ణయ్య గారు భగవద్గీతను ఆటవెలది, తేటగీతి పద్యాలలో అందముగా రచించి ప్రచురించిరి.

      తొలగించండి
    5. అన్నయ్యా! జీన్సు ప్యాంటు టాపు యని ఆంగ్ల పదముల బదులు
      ఉత్తరాది వారి యుడుపులు యలవాటు
      అంటే బాగుంటుందేమో!

      తొలగించండి
    6. జీన్సు ప్యాంట్లు ఉత్తరాది వారి దుస్తులు కావు...పాశ్చ్యాత్య దేశములవి.

      తొలగించండి
    7. శాస్త్రి గారు స్వచ్చమైన సుందరమైన తెలుగు పద్య కుసుమములలో అన్యభాషాపదసంకరము భాషామతల్లి నవమాన పరచినట్లని నేను భావిస్తాను. ఏభాష కాభాష పదములు వాడుటయే శ్రేయస్కరము.

      తొలగించండి


  2. సరస ధర గనుడని చక్కగ బిల్వగ
    లెస్సగ పరుగిడి జిలేబి చప్పు
    న కొని తెచ్చి జూడన నయగారి కఱల
    చీర విప్పి, సుదతి చిందులాడె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారు: నిన్నటి సమస్యకు చాలా పరిష్కారములు పరశురాముని పరం గానూ, కొద్దివి శుక్రాచార్యుని పరం గానూ వచ్చినవి. కేవలం మీరు మాత్రమే శుక్ర గ్రహాన్ని పలకరించారు. ముచ్చటైన పూరణ. అంతరిక్ష సంక్షోభం. స్టార్ వార్స్...

      తొలగించండి

    2. శాస్త్రి గారు

      మీ ప్రోత్సాహానికి నెనర్లు !

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. క్రొత్త చీర దెచ్చి కోరికట్టుకొనగ
    ముదము తోన గాంచె మోజు దీర
    మడత లందు మకిలి మరకలు గనుపించ
    చీర విప్పి సుదతి చిందు లాడె

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    హాని నెంచక హనీమూనుకు రామప్ప
    దర్శనాన వివశ తాను గాగ
    కామసూత్ర రతిని గన తన పతి ముందు
    చీర విప్పి సుదతి చిందులాడె!
    వీరవతంసులౌ పతుల వైనమునెంచిన నాతి గాన వి
    స్ఫార మరీచి నూని" రతి సార మెరింగిన శిల్ప సుందరిన్
    కారణగాత్రి"నంచు వెటకారము మానియు నూహలందు తా
    చీరను విప్పి మానవతి చిందులువేసెను చూడ నెల్లరున్!!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    ఆర్యా మొదటి చరణం సవరణ
    హానినెన్నదాయె "హనిమూను"రామప్ప..గా చదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హనీమూను' అంటే గణదోషం. 'హనిమూను' అనండి.

      తొలగించండి
  6. ……………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    క౦చి పట్టు చీర కట్టుకొమ్మని చీర ,

    చీర విప్పి సుదతి చి౦దు లాడె ||

    తళుకులొలుకు నగల ధరియి౦పుమా యన

    కా౦త మురిసి పోయి గ౦తు వేసె ||

    { చీ రు = పి లు చు ; చీర విప్పి చి౦దు

    వేసె = చీర మడత విప్పి దాని నాణ్యత

    చూచి ఆన౦ద పడెను }

    రిప్లయితొలగించండి
  7. చిర్రుబుస్సులాడి చీరలంగడి లోన
    మొన్న గొన్న చీర వన్నె తగ్గ
    కట్టు కొనఁగ లేను గమనించుమని దెచ్చి
    చీర విప్పి సుదతి చిందులాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వెంకట సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. వృశ్చికంబు దూరి వెతలను కల్గించు
    తలపు మనసు లోన తాండవించె,
    కట్టు చెంగులోన గరగర యనిపించ
    చీర విప్పి సుదతి చిందులేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. "స్వర్ణ కంచి" కరగి వర్ణ భరితమైన
    వస్త్ర ములను జూచి పరవసించి
    జరిని యొప్పు మేలు సరివన్నె లీనెడి
    చీర విప్పి సుదతి చిందు లేసె!

    రిప్లయితొలగించండి
  10. చేరె విందు కొఱకు చెచ్చెర చుట్టాలు
    వంట చేయుచుండె వారి కువిద--
    గాసుపొయ్యి మంట కాల్చగ చీరను
    చీరవిప్పి సుదతి చందులాడె

    రిప్లయితొలగించండి
  11. భర్తప్రేమమీరబట్టుచీరనుగొన
    చీరవిప్పిసుదతిచిందులాడె
    చినుగునటులగనగచీరలోపలయది
    విభుడుజూసిదెచ్చెవేరొకటిది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. ఎఛట నుండి వచ్చె నీ గొలు సంచును
    దిక్కు లెల్ల నంతఁ బిక్క టిల్లఁ
    గోపమున దనపతి గుట్టు విప్పమనుచుం
    జీర, విప్పి సుదతి చిందులాడె


    బేరము లాడి చీరను వివేకముతోఁ గొని వచ్చి తా నహం
    కారముఁ జూప నెంచి చెలికత్తియ లెల్లరఁ బిల్చి యింటికిన్
    గారవ ముప్పతిల్ల నొక కాంతకుఁ జూపి వెసన్నవీనపుం
    జీరను విప్పి, మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  13. భారమయైననున్దనకుభార్యకుగేగదయంచునాతడు
    న్వారమువర్జ్యమున్గనకపట్టునుగల్గినచీరతీయగా
    చీరనువిప్పిమానవతిచిందులువేసెనుజూడనెల్లరు
    న్చీరదిచూడగామిగులజేగురురంగునుబోలియుంటకున్

    రిప్లయితొలగించండి
  14. కొత్తచీర తెచ్చె కోమలికై భర్త
    సంకురాత్రి తాను సంబరపడి
    కట్టుకొనగ జూడ కన్నములు౦డెరా
    చీర విప్పి సుదతి చిందు లాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. పెళ్ళిరోజు తాను పెందలకడ వచ్చి
    చలనచిత్రమునకు జంటగాను
    జనెదమన్న మగని జాడగానక కొత్త
    చీర విప్పి సుదతి చిందులాడె!

    రిప్లయితొలగించండి
  16. హోళి పండుగందు యోగము,భోగము
    రంగులాట లనగ పొంగుమనసు|
    భర్తచెంత నాడు కర్తవ్య మందున
    చీరవిప్పి సుదతిచిందు లాడె|
    2.కోరితి పట్టుచీర గనకొంగు నలంకృతి గానరాదు సొం
    పారెడి రంగులేదు మనపాపయు గట్టినబొమ్మచీరలా
    మూరలు తక్కువుండె|యిది మోసము”చీరను కట్ట బోకనే
    చీరను విప్పిమానవతిచిందులు వేసెను చూడ నెల్లరున్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. గౌనుపైన చీరె కరమింపు గాఁ గట్టి
    అమ్మ కనుల ముందు నిమ్ముగాను
    గృహము దాట గానె కేరింత లాడుచు
    చీరె విప్పి సుదతి చిందులాడె

    రిప్లయితొలగించండి
  18. మారెను వేషమంచు మరి మార్చుము చీరెనటంచు పిల్వగా
    కారగ నీరు వేగముగకాటుక కన్నుల నుండి, స్రుక్కుచున్
    చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్
    చేరిరి కొంటెకాయలట చిందర వందర జేయ సర్వమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు

    కొట్టునందు గౌర కోక జరితి గూర్చి
    రకము జెప్పునంత రహిని దాని
    లగ్గు నెంచి నాసిరక మిద్ది యంచుచు
    చీర విప్పి, సుదతి చిందులాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. 🍀 *శంకరాభరణం*🍀

    🌷 *సమస్య పూరణం* 🌷

    🍀 కవిః- *విరించి* 🍀

    🌷 సమస్యః *చీర విప్పి సుదతి చిందులాడె*
    లేదా...
    *చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్*


    పతియె కోరెనంచు పట్టుచీరనుగట్టి
    వేచి యుండె రాత్రివేళ దాటె
    మగడు చేరడయ్యె, వగచుచు కినుకతో
    *చీర విప్పి సుదతి చిందు లాడె*

    కూరిమి తోడ భర్త తన కోర్కెను తెల్పెను కోమలాంగితో
    నేరము గాదు సాలెలిల నేసిన చీరనిలన్ ధరించినన్
    వారికి సాయమౌననగ పౌరుష మందుచు సంచిలో ని యా
    చీరను విప్పిమానవతి చిందులు వేసెను చూడనెల్లరుల్

    ........ ......... ....విరించి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఇక్కడ మీరు ప్రత్యేకంగా సమస్యలను పేర్కొన నక్కరలేదు. కేవలం పూరణలు పెడితే చాలు.

      తొలగించండి
  21. నాది మరియొక పూరణ

    చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడనెల్లరున్
    చీరను కప్పి వేశ్య వివశీకృతయయ్యె విరుల్ హసింపగన్-
    యీరకమైన పోకడలు యిమ్మహిలో కలికాలమందు నొ
    ప్పారుట నైజమే కద! యపార్ధములిచ్చుట యుక్తియుక్తమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హసింపగన్+ఈరకము' అన్నపుడు యడాగమం రాదు. "హసింపగ న్నీరకమైన...' అనండి.

      తొలగించండి
  22. కోరక యిచ్చు చౌక ధరకున్ మనసించుచు పోయి యంగడిన్
    బేరముమాని చీరగొని,వేడబమించుక దోచ,శంకతో
    మూరలు వైవ కన్పడెను పుట్టము నందున రంధ్రముల్,వెసన్
    చీరను విప్పి మానవతి చిందులువేసెను చూడ నెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
    కుశలానుయోగ నమస్కారములతో,

    కౌరవరాజు కొల్వున నగౌరవ మోర్వఁగలేక - దత్క్రియా
    కారిత వాడినట్టి కనుఁగల్వలఁ – బోరున దుస్ససేనునిన్
    మారుతి ఘోరరీతిఁ దునుమన్ బెనుగోళ్లను ఱొమ్ము నిల్వునన్
    జీరను – విప్పి, మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్.


    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏల్చూరి మురళీధర రావు గారూ,
      మీ పునరాగమనం మిక్కిలి ఆనందదాయకం!
      ఏమా అన్వయం? అనితరసాధ్యం! అసాధారణం! అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. నిశ్చయంగా అత్యధ్భుతమైన పూరణ!🙏🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  24. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
    శ్రీ వాల్మీకి రామాయణములోని సుందర కాండ కు నాంధ్రీకరణకు పూనుకొని శ్రీకారము చుట్టి యీ విద్వన్మండలి యాశీర్వచనములను కోరుకుంటున్నాను.


    శ్రీరామాయణ కావ్యా
    పారప్రవచన కృతార్థ పరమర్షి సదా
    చార పరాయణుఁ దలతుం
    బౌరాణికుఁ బుణ్యపురుషు వాల్మీకి మునిన్ 1.

    శ్రీజానకీ సతీమణి
    భూజాత సుశోధ నానుపూర్వ సఫలమున్
    భ్రాజిత సుందర వృత్తము
    తేజోమయ వాయుజాత ధీర చరితమున్ 2.

    నుడివెద భక్తిపూర్వక వినోద భరాంచిత వీర గాధల
    న్నడుగిడి మారుతాత్మజుడు నద్భుత లీలఁ ద్రికూట శృంగినిన్
    నడినిసి రావణావసధ నందన భంగి యశోక వాటికం
    గడువడి చేసిశోధనము కాంతను గాంచిన రీతి నంతయున్ 3.

    శ్రీభూనందన దర్శనార్థము కపిశ్రేష్టుండు వాతాత్మజుం
    డాభీలాద్రిని రావణాపహృత చింతాక్రాంత చిత్తంబుతో
    భీభత్సంబుగ హుంకరించి పద సంపీడ్యక్షతాద్రిద్యుతిన్
    వైభోగంబుగఁ జేరె వేగమునఁ దా వాయ్వాస్పదం బివ్విధిన్ 4.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. నమస్కారములు
      తప్పక త్వరలో మీ ఆశయం నెరవేరాలని ఆశీర్వదించి .

      తొలగించండి
    3. మహదానందకరమైన వార్త. శుభాశీస్సులు.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      మనోజ్ఞమైన ప్రారంభం! మీ కావ్యరచన నిరాటంకంగా, శీఘ్రంగా పూర్తి కావాలని ఆశిస్తూ, నా శుభాకాంక్ష లందిస్తున్నాను.

      తొలగించండి
    5. కవివర్యులకు నమస్కారములు!
      ఆభూజాత, వాయుజాతల అనుగ్రహంతో మీ కావ్యరచన నల్లేరు పై నడకలా, యే ఆటంకం లేకుండా, సత్వరం పూర్తయి పాఠకులను అలరించాలని ఆకాంక్షిస్తూ,
      శుభాభినందనలు!

      తొలగించండి
    6. మీ కావ్యరచన త్వరితముగా పూర్తికావాలని ఆకాంక్షిస్తున్నాను. శుభాభినందనలు.

      తొలగించండి


    7. పోచిరాజు కామేశ్వర రావు గారికి,

      మరల నిదేల రామాయణం బన్నచో
      తనదైన యనుభూతి తనది కాన
      తలచిన రామునే తలచెద నేనును
      నా భక్తి రచనలు నావి గాన

      విశ్వనాథ వారి మాటలు గుర్తుకొస్తున్నాయి !

      శుభాకాంక్షలతో !

      మీ సుందర కాండ అంతర్జాలం లో ధారావాహిక గా చేస్తే లింకు తెలియ జేయ గలరు !

      జిలేబి

      తొలగించండి
    8. సుందరకాండనుదెనుగున
      నందముగావ్రాయునీకుహరిహరులికనీ
      ముందరనిలబడిమిగులప
      సందుగనుండుకొరకుదగుశక్తినినిచ్చున్

      తొలగించండి
  25. అందమైన యువతి యాహార్యమందున
    జిలుగు కాంతులీను జీన్సు కోరి
    పెళ్ళిచూపు లయిన పిదప ధర్మవరపు
    చీర విప్పి సుదతి చిందులాడె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    భవుని విల్లును విరిచిన పద్మనాభు
    నెదిరి నిల్పగ లేనని నిశ్చయించి
    యోటమికి బలి యౌదునేమో యనుచునె
    భండనమ్మునఁ, బాఱెను భార్గవుండు

    రావణుని జాంపె నెచ్చట రామ విభుడు ?
    ఉత్తరుండేమి జేసెను యుద్ధమందు ?
    దశరథాత్మజుని గనుచు తరలె నెవడు ?
    భండనమ్మునఁ బాఱెను భార్గవుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. శ్రీ శంకరయ్య గారిక నమస్కారములు.మీ సూచనలకు,సలహాలకు కృతజ్ఞతలు.నా పూర్త పేరు బొగ్గరం వేంకట వాణీ
    హనుమత్ భుజంగ ప్రసాదరావు.నేను గుంటూరులో ఉంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      సంతోషం! గోలి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరులోనే ఉంటారు. మీకు పరిచితులేనా?

      తొలగించండి
  27. మోజుతోడ దెచ్చె ముదమున కొట్టున
    వెలయు తక్కువనుచు వేగిరముగ
    మూరతక్కువనుచు మూతి తిప్పుచు కొత్త
    చీర విప్పి సుదతి చిందులేసె.

    వాయిదాల లెక్కవర్తకుడేతెంచి
    కొత్తరకపు చీర కొనుడనంగ
    కూర్మి తోడ కొన్న కోక చిరుగు గాంచి
    చీరె విప్పి సుదతి చిందులాడె

    వంట యింటిలోన వంట చేయుచునుండ
    నిప్పురవ్వ యెగిసి నెలత కొంగు
    కంట,భీతి తోడ నచట రోదించుచు
    చీరె విప్పి సుదతి చిందులాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  28. క్రొత్త వింత తెచ్చె క్రొత్త సంస్కృతులను
    పాతచింతకాయపచ్చడనుచు
    బరువు తాళ లేక బరబర దనపట్టు
    చీర విప్పి సుదతి చిందులాడె

    రిప్లయితొలగించండి
  29. 🌺🙏🌺

    అంబటి భానుప్రకాశ్.
    నేటి పూరణ.


    చీరవిప్పి సుదతి చిందులాడె.

    *పండుగనుచు లేమ పట్టుచీరనుగట్టి*
    *మొగని కొరకు జూసెముదము మీర*
    *నాలసించి వచ్చు నాతని కోపించి*
    *చీరవిప్పి సుదతి చిందులాడె*


    🌻🌷🌻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంబటి భానుప్రకాశ్ గారూ,
      మీరు బ్లాగులో పూరణ చేయడం సంతోషాన్ని కలిగించింది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. ఆరె నేమి ?యనగ నారినదనె బాల
    చీర విప్పి - సుదతి చిందులేసె
    ఆర వేసి నట్టి యా చీర ముట్టక
    చెప్ప వలయు ననుచు చిన్న బుచ్చె
    (అది మదికి ఆరవేసిన చీర. ఆరినదేమో చూసి చెప్పమని తల్లి అంటే ఆ బాలిక ఆరినది అని ఆ చీర విప్పుకొచ్చింది. అలా ముట్టుకుంటే మడికి పనికి రాదని తల్లి చిందులేసి ఆ అమ్మాయిని చిన్నబుచ్చింది.)

    రిప్లయితొలగించండి
  31. "ఆరిన దేమి ?" యంచనగ , "నారెను గా !" యనె బాల తీగపై
    చీరను విప్పి - మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్
    "చీరను తాకనేల ? మడి చీరను తాకక చూచి చెప్పుటన్
    నేరవె ?" యంచు బాలికను నేరని తప్పుకు చిన్నబుచ్చుచున్
    (మడిబట్ట ఆరినదా ? అని అడిగితే తాకకుండా గమనించి చెప్పాలి. ఆ పిల్ల అది తెలియక ఏకంగా ఆరేసిన చీర విప్పుకొచ్చింది. ఆ చీర మడికి పనికి రాదు. మళ్లీ ఆరెయ్యాలి. అందుకు తల్లి కోప్పడితే ఆ పిల్ల తెలియక చిన్నబుచ్చుకుంది. )

    రిప్లయితొలగించండి
  32. కూరిమి మీర చెల్లెలికి కొన్నది నాథుడు మూటనుండు నా
    చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్
    బేరము సారమున్ మరచి వేయివి రూకలు పెట్టినాడు నా
    శూరుడు పోటుగాడయెను చూరున కెక్కగ తన్నెదంచుచున్

    రిప్లయితొలగించండి