14, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2282 (కుసుమమందునఁ గుసుమముల్...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును"
లేదా...
"సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించెఁ గాంచుమా"
ఈ సమస్యను అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

  1. భోజరాజ సమస్య:

    "కుసుమే కుసుమోత్పత్తిః శృయతే న చ దృష్టతే"

    కాళిదాస పూరణ:

    "బాలే! తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినము కనమీ జగమునందు వింత లిటుల:
      "కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును": 
      రవి గనని వింతలెన్నొ సుకవియె గనును:
      "చెలియ ముఖపద్మ మందున కలువ కనులు!"

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      అద్భుతమైన సమన్వయంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    3. శాస్త్రి గారు మీ పద్య మాణిముత్యములా వెలుగుచున్నది.

      తొలగించండి
    4. సారూ: అది నాది కాదు...కాళిదాసుది. కాపీ కొట్టడంలో నేను ప్రతిభాశాలిని!

      మీ సహృదయతకు నమస్సులు!

      నిన్న నా చిరకాల వాంఛ నెరవేరినది...పూజ్యులు శ్రీ కంది శంకరయ్య గారిని కలిశాను. మిమ్మల్నెప్పుడో!

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మీ బ్లాగును వీక్షించాను. ఆంగ్లంలో చక్కగా వివరించారు. సంతోషం!

      తొలగించండి
  3. జగతి యందున కలవెన్నొ సొగసు పూలు
    తల్లి జన్మకు ఫలితమ్ము పిల్ల లనగ
    మల్లె లుండును దొంతర వెల్లి విరియ
    కుసుమ మందునఁ గుసుమముల్ బ్రసవ మగును .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      తల్లివనిపించుకున్నారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి

  4. వలదు వలదమ్మ చింతయు వగచ వలదు
    కుసుమ మందునఁ గుసుమముల్ బ్రసవమగును
    వెళ్ళు వైద్యుని వద్దకు వెతల శోధ
    నలను జేతురు మేలుగ నలత బోవ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      నేత్రాలలో కుసుమరోగాలు...! బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి


  5. కమలము నాభియందున వికాసము నొందగ సూర్య కాంతియై
    విమల ముఖంబునందున వివేకము యార్ద్రత దైవ తేజమై
    న మనము చంద్రబింబితపు నాట్యము గాన లతాంగి, వారిజా
    సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించెఁ గాంచుమా

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. __/\__

      బ్లాగోహం బ్లాగకర్మాహం బ్లాగాత్మా బ్లాగసంభవః

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      పద్యం బాగుంది. కాని పూరణమే సుబోధకంగా లేదు.
      'వివేకము+ఆర్ద్రత' సంధి నిత్యం. అక్కడ 'వివేకము నార్ద్రత..' అనండి.

      తొలగించండి
  6. రణము దాగి యున్నదిర తోరణము లోన
    వనము దాగి యున్నదిర యవ్వనము లోన
    సుమము దాగి యున్నదిర కుసుమము లోన
    కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      శబ్దచమత్కార భరితమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. __/\__

      పూజ్యులు శ్రీ శంకరయ్య గారికి కొన్నాళ్ళ క్రితం వ్రాసిన విన్నపము:

      విన్నపాలు వినవలె!


      భారతీయ ప్రజలు బజ్జున్న వేళ
      మధుర స్వప్నాల మైమరచున్న వేళ

      మేలు కవిత వ్రాయ మేల్కొన్న నాకు
      "బాగున్న" దని దెల్ప బాధాకరమ్మౌ

      భారి హృదయమ్ముతో "బ్రహ్మాండ" మనురు
      కొసరి మార్కులు వేయ గోర్చున్న వాడ

      కవయిత్రులు కవులు కడుపుబ్బ గాను
      నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు

      తొలగించండి
  7. నిన్నటి సమస్యకు నా పూరణము:

    పోరు సేయకనే తన పౌరుషమును
    దెలుపు విక్రమ స్వాభావ దీధితులను
    జూచి వైరి వర్గము వెన్ను జూపుచు జని
    భయపడగ, వీరుడని జనుల్ ప్రస్తుతింత్రు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విక్రమపు స్వభావ... ' అనండి.

      తొలగించండి
  8. పుష్ప శోభితమై యొప్పు పొలఁతి మోము
    హసిత రాగము లొప్పు వికసనమున
    కనుల గాంచుచు నాయమ కళల నెన్న,
    "కుసుమమందున గుసుమముల్ బ్రసవమగును!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'స్వాభావ' అన్న పదం లేదు. 'విక్రమపు స్వభావ దీధితులను' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ...సవరిస్తాను.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువుగారూ...సవరిస్తాను.

      తొలగించండి
  9. రెండు శిరములు గలయట్టి బుడత వోలె
    కుసుమ మందున గుసుమముల్ బ్రసవ మగును
    వింత లెన్నియో జరుగును విశ్వమందు
    చూచు చుండుము సోదరా !చోద్య ములను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొన్న హైదరాబాదు వచ్చి మిమ్మల్ని కలువలేకపోయాను. మన్నించండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  10. కమలజుడు కమలనాభు కొమరుడయ్యె
    కమల,కమలమున్ పుట్టి కాంతయయ్యె
    కమలమందున కమలముఁగల్గు నిట్లు
    కుసుమమందున కుసుమమల్ ప్రసవమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ అర్థం కాలేదు. మొదటి రెండవ పాదాలలో గణదోషం. "కమలనాభుని... కమలమందున పుట్టి..." అనండి.

      తొలగించండి
  11. ………………………………………………………

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    సుమమున రె౦డు సూనములు శోభిలుచున్

    …………… జనియి౦చె , గా౦చుమా !

    ి
    ప్రమద ! యిదె౦త వి౦తయొ ! భవద్విక

    ………………… చానన పద్మ మ౦దు నా

    హ ! మెరయు చు౦డె ఫుల్ల నయనా౦బుజ

    ……… యుగ్మము | కోమలా౦గి ! వి
    ి
    ి
    శ్వమున గలట్టి విస్మయపు వస్తువు

    ………… ల౦ దిది గూడ నొక్క టౌ ! !

    రిప్లయితొలగించండి
  12. అయ్యొ! యంతమాటనగరాదార్య!మీరు
    నేనుగలువవలెనుమిమ్ముగాని.మీరు
    కలియుటయనన్ను?చేవాపుకలుగుకతన
    నేనురాలేకపోతినినిజముగాను
    మన్ననలనీయగోరుదుమాన్య!మిమ్ము

    రిప్లయితొలగించండి
  13. కాయలవి గాచు సర్వత్ర ఘనతరముగ
    కుసుమమందున, కుసుమముల్ ప్రసవ మగును
    పండి యాకాయ క్రమముగ నెండి రాల
    బీజ మవనిని మొక్కయై పెరిగెనేని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. కలుష పూరిత మయి విష వలయ మవని
    కాల మహిమ దీనిని చెప్ప నేల నేడు
    బాల బాలికలకుఁ గల్గు బాధ! నేత్ర
    కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును

    [కుసుమము = 1. పువ్వు; 2. కంటి పువ్వు]


    విమలపు టంబరమ్మునను వింతగఁ దారలు వెల్గు చుండగం
    గమల సుమిత్రు డా కువల కాంతుడు పశ్చిమ పూర్వ దిక్కులం
    దమరిరి సూర్య చంద్రులట నంచిత కాంతుల సంధ్యవేళ నా
    సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించెఁ గాంచుమా

    [సుమము = ఆకాశము; సూనము =మొగ్గ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. వింత యౌనె కుసుమ మందు వెల్లి విఱియ
    కుసుమములు మఱియు రెండు కుదురు గాను
    నల్ల కలువ ద్వయము వెల్గె నళిని మోము
    "కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును"

    రిప్లయితొలగించండి
  16. శ్లో. కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే న చ దృశ్యతే !
    బాలే ! తవ ముఖాంబోజే దృష్ట మిందీవర ద్వయం !!
    అన్న శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చారు.

    రిప్లయితొలగించండి
  17. సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించె గాంచుమా
    సుమమున సూనముల్దగ సుశోభిత మై జనియించు టు o డునా
    విమల మనంబు తోడనవివేకము జూపుచు బల్కె యీయది న్
    వరమది నాదు మాటనున వారిత రక్తిని జూడ గోరెదన్

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారికి నమస్కారములు. క్రింది పూరణలను పరిశీలించగలరు.

    12-02-2017:

    సవయస్కుడు కర్ణుని యా
    యువు చెల్లగ గెలిచెనట సుయోధనుడనిలోన్
    కవుడగు విధముల నెంచెడి
    నవినీతిని నడపుటందునని బల్కుసుమా!

    13-02-2017:

    పందతనము గూడి బెదరు పాఱుబోతు
    భయపడగ, వీరుడని జనుల్ ప్రస్తుతింత్రు
    చేవ మించి పోరెడి సాహసికుని సతము
    వీక లేక యుండెడి వాడు విజ్ఞు డవడు

    14-02-2017:

    బిడ్డ కడుపున బిడ్డడు పెరుగునట్టి
    శిరములవి రెండు నొకనికి చేరునట్టి
    వింతలిప్పుడు వెలిగెడి విశ్వమందు
    కుసుమమందున గుసుమముల్ బ్రసవ మగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. పద్మములబోలు కనులతో వరలుచున్న
    ముద్దుల కుమార్తె, కన్నట్టి పుత్రికలను
    కాంచి యనుకొంటి మనసులో కరము తృప్తి
    కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. తల్లి వెదకు బిడ్డనుగను తరుణి కొరకు
    వింత గాదిది వైద్యుల విజయ గాధ
    విత్తు వలదు చెట్టు వలదు విపణి యందు
    కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును

    రిప్లయితొలగించండి
  21. నీతి లేని వానికిజాతి నిలుచునండ
    వింతయేమియిందు జనులు విలువ లిడువ
    పిచ్చి వానిచేతిలొ రాతి పిడిని చూచి
    భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు

    రిప్లయితొలగించండి
  22. సత్య పాలన జరుపగ సమత మమత
    కవల లట్టుల జనియించ కలుగు శాంతి
    స్వర్ణమును సుగంధము జతను కట్ట
    కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును

    రిప్లయితొలగించండి
  23. కమలము బోలు చక్కని ముఖమ్మును పొక్కిలిసోయగమ్ము తో
    సుమధురమైన వాతెఱల జొబ్బిలు కంజము మత్తునివ్వగా
    నమలినమైన గాత్రమున నంబుజలోచన గాంచి పల్కితిన్
    సుమమున రెండు సూ నములు శోభిలుచున్ జనియించె గాంచుమా

    రిప్లయితొలగించండి
  24. .అమరెను తేట గీతిక సహాయము లేకను పద్య పుష్పమై|
    సమతల సుక్ష్మతా పటిమసాగగ నుత్పల మాలయన్న దౌ
    సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించె గాంచుమా|
    క్రమముగ జూడ కల్పన వికాశమె భావసుగంధ మాయెగా| {ఉత్పల మాలలోయిమిడిన తేట గీతక ఒకపద్యములోరెండుపద్యములుఅన్నకుసుమాలు}
    2.కలువరేకులకళ్ళున్న కాంతనొకతె
    కుసుమ|మందున గుసుమముల్ బ్రసవ మగును
    వరుడు వేంకట నాథునివలపు లన్ని
    కుసుమ”కనులలొ వికసించె కునుకు నందు|

    రిప్లయితొలగించండి
  25. మధుర మకరందముల గ్రోల మధులిహములు
    కుసుమమందున, గుసుమముల్ బ్రసవమగును
    చిత్రమౌ ఫలములుగ వైచిత్రి గొలుప
    నరుని కిష్ట సఖులన సూనములె తగును!

    రిప్లయితొలగించండి
  26. కేంద్ర నిర్ణయమై విడి కీర్తి బడయ
    తేనియలొలుకు రసమయ తేట తెలుఁగు
    కుసుమమందున గుసుమముల్ ప్రసవమగును
    ప్రభల నాంధ్ర, తెలంగాణ రాష్ట్రములుగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      సవరించిన మీ పూరణ (ముఖ్యంగా సమైక్య రాష్ట్రం అనే పుష్పం నుండి ఆంధ్ర, తెలంగాణ అనే పువ్వులు ప్రభవించాయనడం) బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  27. పులి కడుపు నుండి మేకలు పుట్ట బోవు
    జంబుకములకు గోవులు జన్మ నిడవు
    కుసుమమందున గుసుమముల్ బ్రసవ మగును!
    జన్యువుల పరికించుచు జగతి నఱయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      కుసుమాల జననానికి కుసుమమే కారణమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  28. కారు చీకటుల్ క్రమ్మిన కాళరాత్రి
    పురుటి నొప్పుల బాధతో పొటకరిల్లి
    సవితృడుదయించు ప్రాభాత సంధ్య వేళ
    కుసుమమందున కుసుమముల్ ప్రసవ మగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      పువ్వువంటి తల్లికి కవలపిల్లలు అనే రెండు పువ్వులు జన్మించాయి అంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారికి ధన్యవాదములు

      తొలగించండి
  29. డా.పిట్టా సత్యనారాయణ
    ముద్దు చిట్టెమ్మ పట్టము మోయునెన్నొ
    మెట్టు మెట్టుగ కుచ్చులు మేని చుట్టు
    ఒక్క తొడుగున సుమముల నూర్చు కొనగ
    కుసుమ మందున గుసుమముల్ బ్రసవ మగును!

    సుమసమ శైలి పుట్టమది సోకగు హైందవ బాణి,నారికిన్
    సమసమ పేలికల్ వెలసె చాలగ జూప నితంబ యుగ్మమున్
    క్రమమది కాదు యూరువులు గన్పడ లోదొడ జెల్ల కాదనన్
    సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించె గాంచుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. కుసుమమందున కుసుమముల్ ప్రసవమగును
    ననెడి వార్తయు వినినంత నవనియందు
    నుత్సుకతతోడ నేగిన యువిద లెల్ల
    ముదముతోడను గాంచుచు ముగ్ధు లైరి.

    రిప్లయితొలగించండి
  31. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    (మొన్న బషీర్‍బాగ్ సభలో మీతో మాట్లాడడానికి అవకాశం చిక్కలేదు. మిత్రుల మధ్య చిక్కుకొని మీతో మాట్లాడలేకపోయాను).

    రిప్లయితొలగించండి
  32. కమలమదయ్య పూసెనిట కమ్మగ కూయుచు రష్యయంచుచున్
    కమలమదయ్య పూసెనిట కమ్మగ కూయుచు చైనయంచుచున్
    కమలపుజంట పూసినవి కమ్మగ నొక్కటె కమ్యునిస్టునన్:
    "సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించెఁ గాంచుమా"

    రిప్లయితొలగించండి