16, ఫిబ్రవరి 2017, గురువారం

సమస్య - 2284 (రాధనుఁ బెండ్లియాడె...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్"
లేదా...
"రాధ నుద్వాహమాడెను రామవిభుఁడు"

41 కామెంట్‌లు:

  1. విష్ణుమూర్తి రాముడుగ నావిర్భవించె
    ఆదిశేషు లక్ష్మణుడుగ నవతరించె
    శంఖ చక్రములు భరత శతృఘునులుగ
    లక్ష్మిదేవి సీతామాత లాగ; యట్టి
    రాధ నుద్వాహమాడెను రామవిభుఁడు


    రాధ = మహాలక్ష్మి

    http://www.andhrabharati.com/dictionary/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కిట్టించితినయ్యా రే
      రాట్టు గగనమణిని శంకరాభరణమునన్
      పట్టువిడువను సుమా స
      మ్రాట్టును విదురుల సదనపు మణికారుడనౌ !

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      కిట్టించానని మీరే అన్నారు.
      'ఆదిశేషు' అని వు లేదా డు ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. 'ఆదిశేషుడు లక్ష్మణాఖ్యను ధరించె' అనవచ్చు. 'శత్రుఘ్న' పదాన్ని ముక్కలు చేశారు. సమాసంలో 'లక్ష్మీదేవి' అవుతుంది. 'లాగ' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    3. సారు లీవులో ఉన్నారు గదా అని తోక విప్పితిని...శాస్త్రి గారికి తగిన శాస్తి!!!

      తొలగించండి
  2. మనసు పడెనట మాధవు డవని యందు
    రాధ,ను ద్వాహ మాడెను రామ విభుఁడు
    శివుని ధనువును విరిచియె సీత చెంత
    చేరి మురిసెను ఠీవిగా పేర్మి తోన.


    రిప్లయితొలగించండి
  3. మాదవు డేటికిన్ వలచె మానస మందున ప్రేమ మీరగన్
    సాధన జేయగోరి సరసాల విలాసపు రాసక్రీ డలన్
    రాధనుఁ , బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చగన్
    శొధన జేయకుం డగనె సోముని విల్లును ద్రుంచివై చగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణ మొదటి, నాల్గవ పాదాలలో యతి తప్పింది.

      తొలగించండి
    2. మనసు పడెనట కృష్ణుడు మరులు గొనుచు
      రాధ, ను ద్వాహ మాడెను రామ విభుడు
      శివుని ధనువును విరిచెను సీత కొఱకు
      చేరి మురియుచు ఠీవిగా చెంత నిలచె

      తొలగించండి


  4. రాధ! నుద్వాహమాడెను రామవిభుఁడు
    జానకిని మిథిలాపురి జగతి మెచ్చె
    కాకపక్షధరందేవ కౌస లేయ
    దాశరథి రఘుపతి యని తనివి తీర !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      రాధను సంబోధన చేస్తే 'రాధ! యుద్వాహ..' అని యడాగమం వస్తుంది.

      తొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    రాధ యుద్వాహమనగ సురాగ రాశి
    స్వామి(న్)జేరుట సో.హం.పు సాధనలను
    రా.మ. బీజాక్షరముల పారాయణమున
    రాధనుద్వాహ మాడెను రామ విభుడు!

    బోధన నెన్నగా నొకడె పూర్ణుడు సర్వ జగత్తునందు వే
    సాధనలందు సత్కృతియె చల్లని తల్లియ వీరి మేళనన్
    గాధము సృష్టి; కాలపుటగాధములో సరి పేర్లు;భూమికన్
    రాధను బెండ్లియాడె రఘురాముడు భూజనులెల్ల మెచ్చగన్
    (గాధము॥కోరిక,.భూమిక॥మారువేశము.శ.ర.)అరసున్న దొరుకలేదు.(న్)వాడితిని.

    రిప్లయితొలగించండి
  6. సాధనఁజేసి భూమిజ ప్రసన్న మనస్కుని దివ్యపూరుషున్
    నాధునిగా వరించుట వినా తనకన్యులు వద్దు వద్దటం
    చా ధరణీపతిన్ రఘుకులాన్వయు రాముని పొందె--నట్టిదౌ
    రాదనుఁబెండ్లియాడె రఘురాముడు భూజనులెల్ల మెచ్చగన్

    రాద = స్త్ర్రీ

    రిప్లయితొలగించండి
  7. *******************************
    తే. శివధనస్సును విరియంగ సిగ్గు పడుచు
    ఓర చూపుల చిరునవ్వు లొదుగు చున్న
    సీతగ, దివినుండి దిగివచ్చి మెరయు నను
    రాధ నుద్వాహమాడెను రామవిభుఁడు
    *******************************

    రిప్లయితొలగించండి
  8. మునివరు నియుక్తి మిథిలకు చని కరమగు
    వీకతోడ హరుని విల్లు విరిచి, తనరు
    ప్రేమతోడ జానకియను వెలుగెడి యను
    రాధనుద్వాహ మాడెను రామ విభుడు
    అనురాధః నక్షత్రము

    రిప్లయితొలగించండి
  9. యోధులమంచు పల్వురట పట్టి ధనుస్సును వీగిపారగా,
    యీధను వెంత నా కనుచు నెత్తగ రాముడు ముక్కలైపడ
    న్నాధరణీ తనూజ గని యచ్చె రు వొందెను ; భక్తి గొల్చునా
    రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  10. వేదన లెల్ల దీర్చగల విశ్వమనోహర మూర్తియైన యా
    మాధవుడేసదా నిలిపె మానసమందున ప్రేమమీరగన్
    రాధను, బెండ్లియాడె రఘు రాముడు భూజను లెల్లమెచ్చగన్
    శ్రీధరు జాపమున్ విరిచి సీతను సద్గుణ లోకపావనిన్

    శ్రీధరుడు=శ్రీ (విషము)ని ధరించిన వాడు శివుడు.

    ప్రాణప్రదమున ప్రేమించు వనిత గాన
    నిలిపె శిఖిపింఛ మౌళియె నిండు మదిని
    రాధను ద్వాహమాడెను రామవిభుడు
    హరుని చాపమ్ము నవలీల విరిచి గాదె.

    రిప్లయితొలగించండి
  11. గాధిజ యజ్ఞ రక్షకుడు గాధిజు నాజ్ఞను విల్లు నెత్తి భూ
    మేధ విరాజి తాధిపు డమేయ తపోనిధి భూపుఁ డావిదే
    హాధిపు ముద్దు పట్టి వసు ధాత్మజ సీతను సర్వమంగళా
    రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్


    నృత్య వాద్య ఘోషము లంట సత్య జగతి
    భృత్య లోకాను కంపియు నిత్య ధర్మ
    సత్య వచనుడు సీతను నిత్య నిరప
    రాధ నుద్వాహమాడెను రామవిభుఁడు

    రిప్లయితొలగించండి
  12. జగమునాడించుకృష్ణుడుసాధ్వియైన
    రాధనుద్వాహమాడెను,రామవిభుడు
    పెండ్లియాడెనుసీతనువిల్లువిరిచి
    రాజులందరుజయజయరావమిడగ

    రిప్లయితొలగించండి
  13. మాధవుడయ్యెడన్ దనదుమానసమందునబ్రేమమీరగన్
    రాధనుబెండ్లియాడె.రఘురాముడుభూజనులెల్లమెచ్చగన్
    భూధరరాజకన్యకగుభూసుత.సీతనుబెండ్లియాడెయా
    మాధవుకోలమున్ విరిచి మాన్యుడయయ్యెనులోకమంతకున్

    రిప్లయితొలగించండి
  14. మమత పంచుచు వలచెను మాధవుండు
    రాధనుద్వాహమాడెను రామవిభుడు
    శివుని ధనువును విరచుచు శీఘ్రముగను
    విరుల వర్షమ్మె కురిసెను విశ్వమందు.

    రిప్లయితొలగించండి
  15. సాధననివ్వ కౌశికుడు చక్కగ నేరిచి యస్త్రవిద్యలన్
    పాదపు ధూళితోడుతను పైదలి గాయొనరించి రాతినిన్
    గాధిజు పంపునన్ వెడలి క్రన్నన విల్లునుఁ ద్రుంపి చండికా
    రాధను బెండ్లియాడె రఘురాముడు, భూజనులెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  16. సీత చూపు తూపుల నెదుట శ్రీ రఘుపతి
    యతనువైరిచాపము నెత్త నది విరుగగ
    రమణి జానకిన్ ప్రేమాను రాగమయిని
    రాధ నుద్వాహ మాడెను రామవిభుడు

    రిప్లయితొలగించండి
  17. జనకు కొలువున ధనువును గనగ నపుడు
    విరచి వైచగ వైభవ భరిత మగుచు
    కళలు విరబూయు వేదిని, కలిత సుగుణ
    రాధ నుద్వాహ మాడెను రామ విభుడు!

    రాధ=మెఱుపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు. దయచేసి నా పూరణ పరశీలించగలరు.

      తొలగించండి
    2. శర్మ గారు "మెఱపు" అర్థమును గ్రహించి చేసిన మీ పూరణ నిజంగానే మెఱపు తీగ లా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. నాటకకంపేనియందుజరిగినసంఘటన
    సాధన సంపదల్ గలిగి సర్వులుగోరగ నాటకాలలో
    బాధల పర్వమున్ వదలి పండుగలా దినచర్య భాగమై
    వేధన లేని వేడుకలవిజ్ఞతనాపని నాట్యగత్తెయౌ
    రాధను బెండ్లి యాడె రఘురాముడు భూజను లెల్ల మెచ్చగన్{చూడడానికివచ్చు ప్రేక్షకులు=భూజనులు}
    2.మనసు నేలెడి రాధగా మరులు గొల్ప|
    రామవేషాననిల్చి పరాకుమాని
    ప్రేమ పెంపొంద జేయగ పెద్దలందు
    రాధను నుద్వాహ మాడెను రామవిభుడు|


    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. పూర్తిగా అలసి ఉన్నాను. ఇప్పుడు మీ పూరణలను సమీక్షించలేను. వీలైతే రేపు పరిశీలిస్తాను. (రేపు కూడా మా చెల్లెలి ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాల్సి ఉంది!)

    రిప్లయితొలగించండి
  20. భూధవు రాము జూడగను భూమిజ వైచెను చూపు తూపులన్
    వేధను బొందితా మరుని ద్వేషి ధనుస్సును రాము డెత్తగన్
    చేదననొందె నా ధనువు జేతగ నిల్చిన సీత మంగళా
    రాధను బెండ్లి యాడె రఘు రాముడు భూజను లెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  21. ����శ్రీ సీతారామాభ్యాం నమః����
    గాధిసుతానువర్తి , ఘన కార్ముకవేదవిశారదుండు , సం...
    బోధిత మందహాస గుణ పూర్ణ మనోహర ధర్మమూర్తి , బిం..
    బాధరఁ మైథిలిన్ వరశుభాంగి సదా గిరిజా పదాంబుజా..
    రాధను బెండ్లియాడె రఘురాముడు భూజనులెల్ల మెచ్చగాన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    శ్రీధరమానుషాపరవిశిష్టమహోన్నతమూర్తి, చంద్రసం
    శోధకదర్పణార్థి, ఘనశోషితరాక్షసదౌష్ట్యకారి, త
    ద్గాధిజయజ్ఞరక్షి, శివకార్ముకభి త్స్వహృదబ్జసత్సమా
    రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజనులెల్ల మెచ్చఁగన్!

    రిప్లయితొలగించండి
  23. శ్రీమతిసందిత బెంగుళూరు

    మాధవుడిట్లుపల్కె !తనమామకు పుట్టినకూతురంచు బిం
    బాధరఁసుందరాంగి యని బంధువులెల్లనుమెచ్చునట్టులా
    రాధనఁజేసినాడఁ! ప్రియురాలొక రైతునెనచ్చెనా యనూ
    రాధను బెండ్లియాడెరఘురాముడుభూజనులెల్లమెచ్చగన్

    శ్రీమతిసందిత బెంగుళూరు

    రిప్లయితొలగించండి
  24. మంంగళ+ఆరాధన సమ+ఆరాధన సముచితములు
    వర్తమానకాలము ననుసరింంచి నామవాచకములుగా మంంగళారాధ సమారాధ అని యువత పేర్లుపెట్టుకొన్నను
    సహింంపక తప్పదు. కాని పంండితులు ఇలా విమర్శనాత్మకమైైన పథంంలో పూరణలు చేయటంం సమర్థ
    నీయంంగా లేదు. పూర్వకవిప్రయోగాలు కనబడలేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళిన కారణంగా ఈనాటి సమస్యలను నేను సమీక్షించలేకపోయాను. (ఇప్పుడు కూడా మా చెల్లెలి ఇంటికి బయలుదేరుతున్నాము). శంకరాభరణం బ్లాగులో కాని, వాట్సప్ సమూహంలో కాని పద్యాలు వ్రాసే వాళ్ళలో అన్ని స్థాయిలవారూ ఉన్నారు. ఔత్సాహిక కవుల దోషాలను తెలియజేసి సవరణలు సూచిస్తూ ఉండాలి.
      మీరన్నట్లు మంగళారాధ, సమారాధ అని ఎవరైనా ప్రయోగించి ఉంటే అవి కచ్చితంగా దోషాలే!
      ధన్యవాదాలు.

      తొలగించండి
  25. మేధను గోలుపోవ ప్రజ మేకల వోలుచు మమ్మియంచుచున్
    సాధన జేసిజేసి కడు సైరభ రూపున డాడియంచుచున్
    బాధల నొందుచుండగను; పాతవి ముచ్చట పేర్లతో నహా!
    రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్!

    సైరిభము = దున్నపోతు

    రిప్లయితొలగించండి