17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2285 (కుందేటికిఁ గొమ్ము మొలిచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్"
లేదా...
"కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్"

70 కామెంట్‌లు:

  1. పందెంబున గెలిచిన యా
    నందంబున నొరుల తోడ నా కేమనుచున్
    డెందము గర్వము బర్వగ
    కుందేటికి గొమ్ము మొలచి కులుకుచు నడచెన్!

    రిప్లయితొలగించండి
  2. పందెము వేసెను కమఠము
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్
    తొందర బోవగ తరుణము
    సందియమే లేదుమనకు సరగున గెలువన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      చివరి రెండు పాదాల అన్వయం కొంత సందిగ్ధంగా ఉన్నా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. "తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు"



    సందేహము లేదు, భువిని
    నందిని పంది యని నుడివి నాట్యమ్మాడే
    పొందిక దెలియని మూర్ఖుని
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
      'ఆడే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి


  4. కందివరదుల సదనమున
    సంధి సమాసము తెలియని సఖియ జిలేబిన్
    డెందపు రీతిని పద్యపు
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్ !

    జిలేబి
    (ఏదో కవివరుల పుణ్యమా అని " కాలం" గడిచిపోతోంది ) ;)

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    పందేరమ్మున గెలువగ
    సందేహాస్పదము "ట్రంపు"చాలగ నిల్చెన్
    "వందే మాతరమే"ధృతి
    కుందేటికి గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    కొమ్ముముల్ గాచుటె భారతీయజనమే కోరెన్ ప్రధానా!?యిసీ!
    వమ్మున్ జేయగ నన్య కూటముల మీ వాంఛన్ బ్రచారాదులన్;
    నెమ్మిన్ దర్శన భాగ్యమివ్వని కథల్ నిక్కంబెయై మన్నుచో
    "కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్!"

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    కొమ్ముల్..మొదటి పాదంలో టైతృటిని సరిచేసి చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మొదటి పూరణలో కొమ్ములు మొలిచిన కుందే లెవరు? కొంత అన్వయక్లిష్టత ఉన్నట్టుంది.
      రెండవ పూరణ బాగున్నది. 'ప్రధానా!'..?

      తొలగించండి

  8. అమ్మల్ పోయిరి పైకి, జైలుకు భళా, తమ్ముండ్లు పాలింతురౌ,
    మిమ్ముల్ నేలుట కై నిటన్ పళని సామీరుల్, వినండర్ర మేల్
    రొమ్ముల్ జీల్చెదరోయి వారు ఘనులై రోసమ్ము మీసమ్ము లన్,
    కొమ్ముల్ మొల్వగ గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్!

    జిలేబి
    పరార్ :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగుంది మీ పూరణ.
      'మిమ్ముల్ నేలుట'...? "మిమ్మేలంగను మీ కిటన్...' అనండి. 'వినండర్ర' అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  9. మందుడు పరుగిడ డని నీ
    నందనునిం దలచుచుండి నానా గతులన్
    సుందరి! ధేనువ! జూడుము
    కుం దేటికి గొమ్ము మొలిచి కులుచు నడిచెన్.
    (కుందు+ఏటికి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలు అలరించు చున్నవి !

    కుందేటికి కొమ్ములా ? ఎక్కడ ?

    01)
    ________________________________

    వందేళ్ళైనను గానీ
    కుందేళ్లకు రావు నిజము - కొమ్ముల్ మహిలో
    సందేహము దీర్చు మెచట
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ ???
    ________________________________

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.

    కృష్ణ పరమాత్మతో రాస క్రీడ లాడె
    రాధ! నుద్వాహమాడెను రామ విభుడు
    చైత్ర శుద్ధ నవమి నాడు జనక సుతను!
    ఏక పత్ని వ్రతుడగుచు నిలను మించె!
    ద్వాపరము వోలె కాదు త్రేతా యుగమున!
    (మించు = ప్రకాశించు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      బాగుంది మీ పూరణ. కాని 'రాధను' అన్నది మొదటి వాక్యానికి అన్వయించడం లేదు.అక్కడ రాధ అంటేనే అన్వయం కుదురుతుంది మది!

      తొలగించండి
  12. రమ్మీరోజున రచ్చబండకడ కోరమ్యాత్మ! సన్మిత్రమా!
    నెమ్మిం గాంచగ మాంత్రికున్ ఘనుడురా, నిన్నన్ భళా! వాడటన్
    సమ్మోదం బొదవంగ దండము పయిన్ సారించగా నప్పుడే
    కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  13. సందడి జేయ బుడతలా
    నందమ్ముననోలలాడ ననిమేషనునన్
    పందికి రెక్కలు గూరెను
    కుందేటికిఁ గొమ్ము మొలచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
  14. మందులతో కోలుకొనెను
    కుందేటికి? గొమ్ము మొలిచి కులుకుచు నడిచెన్
    మందమునువీడి మిక్కిలి
    సుందరమగు కోడెదూడ సొక్కుచు వీధిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. వాట్సప‌లో నా సూచన గమనించారు కదా!

      తొలగించండి
  15. అందముగలయొకభామిని
    విందునకున్వచ్చియచటవేవురియెదుటన్
    చిందులువేయుటజూడగ
    కుందేటికికొమ్ముమొలిచికులుకుచునడచెన్

    రిప్లయితొలగించండి
  16. అందమైన నొక కలలో :

    02)
    ________________________________

    అందమయిన కల నందున
    నందనమున నర్తనమును - నడుపుచు నుండన్
    చెందొవచెలి కరము దిగిన
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్
    ________________________________

    *****

    కీలుబొమ్మకు కీ యిస్తే :

    03)
    ________________________________

    నందునికై కొంగ్రొత్తగ
    సుందర్రావంత నిడగ - శోయగ మొలక
    న్నందరి మధ్యన "కీ" నిడ
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    ________________________________

    *****

    కొమ్మూ , తాడూ కట్టి లాగితే :

    04)
    ________________________________

    చందనపు బొమ్మ దానికి
    యందముగా నొక్క కొమ్ము - నతికిన త్రాటన్
    వందన తా చే లాగిన
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    ________________________________

    *****

    కీలుబొమ్మకు కీ యిస్తే :

    03అ)
    ________________________________

    నందునికై కొంగ్రొత్తగ
    సుందర్రావంత నిడగ - సోయగ మొలక
    న్నందరి మధ్యన "కీ" నిడ
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    ________________________________

    *****

    పాతాళభైరవి లాంటి చిత్రాలలో
    రాజకుమారి నలరించడానికి మాంత్రికుడు :

    05)
    _______________________

    నందనవనమందు, కనుల
    విందొనగూర్చగ నిలిపెను - వింతగు మృగముల్ !
    అందొక దానిని ముట్టిన
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _______________________

    *****

    నేటి పరిశోధన :

    06)
    _______________________

    సందేహము నేడు వలదు
    వందల సంకర మృగముల - పరిశోధనమున్
    విందొన గూర్చుచు గనులకు
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _______________________

    *****

    కనుకట్టు :

    07)
    _______________________

    సందుల గొందుల జనులకు
    నందముగా కనుల కట్టు - నహితుండికుడే
    సుందరముగ సృష్టించిన
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _______________________

    *****

    నింద్యపు కలయిక :

    08)
    _______________________

    సందియ మేలయ్య నుదిత
    సుందరమౌ నంది పంది - శుండాలములన్
    నిందితమౌ కలయికనన్
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _______________________

    *****

    కుంభసంభవము (test tube baby) :

    09)
    _______________________

    సుందరమౌ దుప్పి జలము
    కుందము నందుంచి, మదము - కుందేలుదియున్
    సంధానించగ బుట్టిన
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _______________________
    జలము = వీర్యము
    కుందము = కుండ
    మదము = వీర్యము

    *****

    రిప్లయితొలగించండి
  17. పందెమున గెలిచినానని
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్
    ముందుగ చేరిన కమఠము
    పందెము తానోడెనంచు పకపక నవ్వెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'పందెమ్మున గెలిచితినని' అనండి.

      తొలగించండి
  18. శవం ప్రక్కనే - సభ్యుల సంధానం
    శశమునకు కొమ్ములు - మొలిచినంత ఆనందం !

    10)
    _______________________

    సందర్భ మమ్మ మరణము
    వందన మర్పించు వేళ - పదవుల కొఱకై
    సంధానించెను కసికళ !
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _______________________
    అమ్మ = జయలలిత
    కసికళ = శశికళ

    రిప్లయితొలగించండి
  19. నిందల పొందగ నేరరు
    ఎందుకు కొరఁగానివారలీ భువిలోనన్
    సందడి సేయుచు తిరుగరె
    కుందేటకి కొమ్ముమొలచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
  20. "ఎందున్నది నా శత్రువు?"
    "పొందికగా బావి జూపె",పోటుగ దూకెన్
    మందుడు భీరుక సింహము.
    కుందేటికి కొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగుంది. 'మందమతి సింహ మీల్గగ' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. గురుదేవులసూచనమేరకు సవరించిన పద్యము
      "ఎందున్నది నా శత్రువు?"
      "పొందికగా బావి జూపె",పోటుగ దూకెన్
      మందమతి సింహమీల్గగ.
      కుందేటికి కొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

      తొలగించండి
  21. అందిందెందెందును జని
    కందర్పుడు చందురుఁ గనఁ గన్యామణియే
    విందిమ్మందఱ కిందును
    గుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

    [కుందు = దుఃఖము; కుందు +ఏటికి = కుందేటికి: దుఃఖమెందులకు; కొమ్ము =పసుపు కొమ్ము]


    రెండు జడలల్లు కొని పువ్వులతో విలాసముగా తిరుగు నందమైన యమ్మాయి గూర్చి యొక స్నేహితురాలు పల్కిన పల్కులు:

    అమ్మీనాక్షినిఁ జూడు డందము తదాస్యాబ్జమ్ము కేశమ్ములున్
    సమ్మానంపుఁ గరేణు చారములు నా సౌభాగ్య భ్రూభంగముల్
    గమ్మత్తైన సువాసనల్ చెలగు నా కందర్ప బాణమ్ములన్
    గొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచె, రా కుం ,దేలు నల్దిక్కులన్
    [కుందు = తగ్గు; కుందు +ఏలు = కుందేలు; ఏలు = ఏలుతుంది (నల్దిక్కులు గర్వముతో )]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొరపాటున ఉత్పలమాల యనుకొని చేసిన పూరణ తదనుగుణముగా మార్చిన సమస్యా పాదముతో:


      అమ్మరొ చూడు డందము ముఖాంబుజ చందము కేశసంపదం
      బమ్మిన హంస చారములు పర్వదినమ్మున సంతసమ్మునం
      గమ్మని మొల్ల మల్లియలు కాంతకు నల్లిన కోరకొండెలం
      గొమ్ములు మొల్వగన్ శశము గుల్కుచుఁ బాఱెను నాల్గు దిక్కులున్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ బహుముఖ ప్రజ్ఞకు చేతులు జోడించి నమస్కరించడం కంటే నేనిప్పుడేమీ వ్యాఖ్యానించలేను. అభినందనలు, ధన్యవాదాలు!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      యీ విద్య నాకు మీ శిష్యరికమున నలవడినదే. యీ ఘనత ముమ్మాటికి మీదే.

      తొలగించండి
  22. కందాయ ఫలముఁజూడగ
    అందోళన విడెను-వేగమందెను లక్షల్
    పొందైన లాటరీ లో
    కుందేటికి కొమ్ము మొలచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
  23. సందడి జేయ బుడతలా
    నందమ్ముననోలలాడ ననిమేషనునన్
    పందికి రెక్కలు గూరెను
    కుందేటికిఁ గొమ్ము మొలచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
  24. ఐదు పది వందల నోట్ల రద్దు చేసిన మోడీకి - కొమ్ములొచ్చినంత ఆనందం :

    11)
    _________

    వందలయిదు , పది, నోట్లను
    సందోహమునకును మంచి - సమకూరుటకై
    వందఱలాడ్చెను మోడీ !
    కుందేటికి కొమ్ము మొల్చి- కులుకుచు నడచెన్ !
    _________
    వందఱలాడ్చు = ఖండించు (రద్దొనర్చు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      ఇంతకుముందే ఎన్నోసార్లు ప్రస్తావించిందే... మీది అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి.
      మీ పూరణలన్నీ బాగున్నవి. విడివిడిగా నా అభిప్రాయాలను 'శంకరాభరణం' వాట్సప్ గ్రూపులో పెట్టాను. చూసారు కదా!
      మేనల్లుడి పెళ్ళి (నేడు సత్యనారాయణ వ్రతం) పనుల్లో వ్యస్తుణ్ణై అలసి ఉన్నాను. అందువల్ల మళ్ళీ ఇక్కడ విడివిడిగా సమీక్షించలేను. మన్నించండి.

      తొలగించండి
  25. అమ్మన్ జేరి ముదమ్మునన్ బడసి తా నాప్యాయతన్ గేహమున్
    సొమ్ముల్గొంచు బినామిగా సతతమున్ చోటొంది హృద్పీఠి, పె
    ద్దమ్మన్ బంపి పరేశు సన్నిధికి చిన్నమ్మంచు కొల్వన్ జనుల్
    కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్

    రిప్లయితొలగించండి
  26. …………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { అత్త కోడలును తిట్టి , తన కొడుకును

    మ౦దలిస్తూ " ఒరేయ్ నీపె౦డ్లానికి

    భయపడెద వె౦దుకు అది సి౦హమా

    అది కొమ్ములు మొల్చిన కు౦దేలు మాత్రమె "

    అని అ౦టు౦ది }

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    అమ్మో ! కన్పడి న౦గనాచి వలె ము౦దు +

    …………… ఆడి౦చు చున్నావుగా !


    వమ్మై పోయెను నాదు పెద్దరికమే |

    …....... వాయెత్తి గా౦డ్రి౦తు | " వో

    లమ్మో " కొ౦గున గట్టుకొ౦టి విటు మా

    ………… యబ్బాయి నో " రాచ్చసీ "



    యిమ్మాడ్కిన్ బెదు రేల నీకు కొడుకా

    ……………… యేమైన సి౦గ౦ బొకో !


    కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడిచెరా

    ……………… కు౦దేలు నల్దిక్కులన్


    ( వాయి = నోరు )

    ……………

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      చక్కని పూరణ. పాత్రోచిత పదప్రయోగం. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  27. రిప్లయిలు
    1. చందురి మచ్చను జూపగ
      కుందేలని నమ్మిన పసికూనడు వగచెన్
      పొందుగ పాషాణమ్మన
      కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'చందురు మచ్చను...' అనండి.

      తొలగించండి
  28. పందెము కాచెను కూర్మము
    కుందేటికి కొమ్ము మొలచి కులుకుచు నడచెన్
    తొందర పడుటది యెందుకు
    సందియమే వలదుమనకు జయమది కల్గున్

    రిప్లయితొలగించండి
  29. అందమ్మగు గ్రుడ్డొక్కటి
    పందెమ్మున పక్షి ననుచు పలుకుచు దొర్లన్
    క్రిందను బడి తునియ లయెను
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
  30. 17.2.17.ఇందునమూర్ఖులు మారిన?
    కుందేటికి గొమ్ము మొలచి కులుకుచు నడచెన్
    అందరి కిది వింతని యా
    నందము నందు బలికె యజ్ఞానియటన్
    2.అమ్మో|బొమ్మయనంగ రాదు గడు నానందమ్ము జేకూర్చెడిన్
    సమ్మోదంబును సాకుచున్| తగిననాశ్చర్యంబు గావించుచున్
    అమ్మే|కీనిడ వెంటనే గదులు| విన్యాసాలనందించుచున్
    కొమ్ముల్ మొల్చియుగుల్కుచున్ నడచెరా|కుందేలు నల్దిక్కులున్| {కీబొమ్మకుందేలు}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వింత+అని' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. '...బలికె నజ్ఞాని యటన్' అనండి.
      'అమ్మ+ఏ = అమ్మయే' అవుతుంది. సంధి లేదు.

      తొలగించండి
  31. విందుల దూరుతు వూరిన
    సందుల గొందుల తిరుగెడి చవటకి దొరకన్
    బంధువు పెండ్లిపిలుపు యిక
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సునీల్ గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని కొన్ని దోషాలు...
      'దూరుతు' అనడం దోషం. ఊరును వూరు అనరాదు. ఊరికి సప్తమ్యర్థంలో ద్వితీయ ని వచ్చి 'ఊరిని' అవుతుంది. "విందుల దూరుచు నూరిని" అనండి. 'పిలుపు+ఇక' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "బంధువుల పెండ్లి పిలుపిక" అనండి.

      తొలగించండి
  32. కవిమిత్రులకు నమస్కృతులు.
    మూడు నాలుగు రోజులుగా మా మేనల్లుడి పెళ్ళి పనుల్లో వ్యస్తుడనై మీ పద్యాలపై, వ్యాఖ్యలపై వెంట వెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
    కొద్ది రోజుల క్రితం 'శంకరాభరణం' వాట్సప్ సమూహాన్ని సృష్టించాను. నాకు అందుబాటులో టెలీఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళనందరినీ అందులో చేర్చాను. బ్లాగులో ఇచ్చే సమస్యలనే ఆ సమూహంలో ఇస్తున్నాను. అయితే ఎక్కడ ఉన్న ఏమాత్రం అవకాశం దొరికినా ఫోన్లో 'వాట్సప్' సమూహంలో వ్రాసిన పద్యాలపై వెంటనే స్పందిస్తున్నాను. కాని బ్లాగులోని మీ పద్యాలను సమీక్షించడానికి సెల్‍ఫోన్ సహకరించడం లేదు. అందువల్లనే మీ పద్యాలను సమీక్షించడంలో ఆలస్యం జరుగుతున్నది. ఒక్కొక్కసారి అసలు స్పందించలేకపోతున్నాను.
    ఎల్లుండి ఆదివారం కొంకపాక అనే ఊళ్ళో మా మిత్రుడి గృహప్రవేశం... అదేరోజు సిద్ధిపేటలో ఒక సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం! ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక పోతున్నాను. సోమవారం నుండి యఠాపూర్వం మీ పద్యాలపై వెంట వెంటనే స్పందిస్తానని మాట ఇస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  33. విందువినోదములు మరిగి
    సందుల గొందుల తిరుగెడి చవటకి దొరకన్
    బంధువుల పెండ్లి పిలుపిక
    కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్

    రిప్లయితొలగించండి
  34. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    క్రుమ్మన్ నేర్చెనుకోడెదూడయటులన్ గూల్చెన్ భయంబొందగన్
    గుమ్మంబుండగగొడ్లకొట్టమునకున్
    కూల్చెన్ గనన్ కుండలన్
    కుమ్మన్మానదటంచుకట్టిరొకచో గోల్పోయెస్వేచ్ఛన్ గనన్
    కొమ్ముల్ మొల్చియు! గుల్కుచున్
    నడచెరా కుందేలు నల్దిక్కులన్!

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    రిప్లయితొలగించండి
  35. నమ్మంజాలని రీతిగా భడవ డానందమ్ముగా జేరగా
    సమ్మోహమ్మున తానటన్ మురియుచున్ శార్దూల మత్తేభముల్
    రొమ్ముల్జాచుచు శంకరాభరణనున్ రూఢమ్ముగా పల్కగా...
    కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్

    రిప్లయితొలగించండి