20, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2288 (కులటం గని పిలిచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్"
లేదా...
"కులటను గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా"
(మొన్న టి.వి.లో వచ్చిన 'కథానాయిక మొల్ల' చిత్రంలో తెనాలి రామకృష్ణుడు మొల్లను అడిగిన సమస్య...)

54 కామెంట్‌లు:

  1. తలనీ లాల సవరములు
    పలువిధ పాపముల దీర్చు పన్నుగ నల్ల
    న్నిలలోనని దెలిసిన నొక
    కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      'ఇలలో నని దెలిసిన' అన్నదానికి కొంత అన్వయలోపం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. వలవేసి వెదకి నంతనె
    లలనా మణులకు సాటి లాలిత్యము నన్
    పలుచన జేయుట తగదని
    కులటం గనిపిలిచి సీత కురు లల్లమనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో 'మణులకును సాటి' అనండి.. గణదోషం తొలగిపోతుంది.

      తొలగించండి
    2. వలవేసి వెదకి నంతనె
      లలనా మణులకును సాటి లాలిత్యము నన్
      పలుచన జేయుట తగదని
      కులటం గనిపిలిచి సీత కురు లల్లమనెన్

      తొలగించండి


  3. కలజూచె మహా రాణి, స
    కల భోగముల కలహంసి కనుకొలకులన
    న్నెలవు చెలిని, చిలుక పలు
    కుల, టంగని పిలిచి సీత కురు లల్ల మనెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "చిలుకల పలు.." అనండి.

      తొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    కలవారలకడ దాసీ
    కులమునకగు తప్పు నరయకూడదు దండం
    బల సరియగు విబుధుల కా
    కులటంగని బిలిచి సీత కురులల్లమనెన్!

    "అలిగెనొ నాదు చర్యలకు నా యలసత్వపు సేవలామెకున్
    వలసెనొ లేదొ బిల్వదు,యవాక్కుల నాడితొ నాదు రాణినిన్
    గలయగ జేయు దాసిని(య),( న )కార్యమువాటిలె " నంచు జూపు జం
    కులటనుగాంచి భూమిసుత కోరికతో కురు లల్ల బిల్చెరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మొదటి పూరణలో కొంత అస్పష్టత ఉంది.
      రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
      'దాసిని నకార్యము' అనడమే సాధువు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, "దాసుల తప్పులు దండముతో సరి పెట్టుకోవలెగాని క్షమ జూపవలయునుగాని పట్టింపుల బడ వలదు.వారెంతటి వారు పాపం!తప్పులు క్షమించాలనినే సూక్తిని బట్టి అల్లిన పద్యమది.కృతజ్ఞతలు.

      తొలగించండి
    3. డా.పిట్టానుండి
      ఆర్యా, "దాసుల తప్పులు దండముతో సరి పెట్టుకోవలెగాని క్షమ జూపవలయునుగాని పట్టింపుల బడ వలదు.వారెంతటి వారు పాపం!తప్పులు క్షమించాలనినే సూక్తిని బట్టి అల్లిన పద్యమది.కృతజ్ఞతలు.

      తొలగించండి
  5. పలుకులలో మకరందము
    జిలుకుచు నొయ్యార మొలుక జేతను సవరా
    ల్వెలుగగ బట్టగ నా కలు
    కు లటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్.
    (కలికి+లు=కలుకులు)
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కలికియు భూమిజ వగచెను
    కులటంగని, పిలిచి సీత కురులల్లమనెన్
    కులకాంత,చెలియ,సలలిత
    విలసిత గార్హస్థ్యభావ ప్రీతమనస్విన్

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      మలయజశీతవాతముల మన్ననచే నొడలెల్ల హాయినిం
      జెలఁగెడుఁగాక యంచును నిజేశునితో నెలదోఁటకేఁగి, తాఁ
      గిలకిల నవ్వు వింత పులకింతల గేదఁగిపూవుఁబోండ్ల ఱే
      కు లటనుఁ గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. డా.పిట్టా
      కేతకి పూవులరేకులను చూచింది.కురుల ల్లమని నిజేశుని బిలిచెనా! లేదా పూబోడులక్కడ నుండిరా! అయినా చెలికత్తెలు కూడా వెంట ఉంటారేమో!వర్ణన బాగుంది,ఆర్యా

      తొలగించండి
    4. డా.పిట్టా
      కేతకి పూవులరేకులను చూచింది.కురుల ల్లమని నిజేశుని బిలిచెనా! లేదా పూబోడులక్కడ నుండిరా! అయినా చెలికత్తెలు కూడా వెంట ఉంటారేమో!వర్ణన బాగుంది,ఆర్యా

      తొలగించండి
  8. తొలగెను మీకీ చెర రఘు
    కుల రాముఁడు రావణు ననిఁ గూల్చెనటంచున్
    బులకలు రేపు త్రిజట పలు
    కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్

    రిప్లయితొలగించండి
  9. లలనా మణులకు శత్రువు
    లలనలలే యనెడు మాట రహితము జేయన్
    కులట య ?సాధ్వియ ?దల పక
    కులటంగని పిలిచి సీత కురు లల్ల మనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాట రట్టడి సేయన్' అనండి బాగుంటుంది.

      తొలగించండి
  10. అలమున్యాశ్రమమందున
    చెలికత్తెలు రాగ తావి చిందగ, చేతన్
    గలిగిన సొంపుమొగలి రే
    కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్.

    రిప్లయితొలగించండి
  11. అలివేణి మోము నడరుచు
    దలపై నిగనిగలుబొందు దనుకను గన, నా
    లలనయె, కేశములను చి
    క్కులటం గని, పిలిచి, సీత కురులల్ల మనెన్!

    (సీత కురులు నిగనిగలందే వరకు సవరించమని ఒక పరిచారిక మరో పరిచారికను కోరింది....అనే భావంలో)

    రిప్లయితొలగించండి
  12. కులటల ?సాధ్వు లా యనెడు కుంచితబు ధ్ధిని లేనిదౌ టనే
    కులటను గాంచి భూమి సుత కోరికతో గురు లల్ల బిల్చెరా
    లలనలు తోటి భామినుల రాక్షస భావము తోడ గాకయా
    లలనల బ్రేమ పూర్వకపు లాలన తోడ న జూడనొప్పు సూ

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. సీతాదేవి దండకావనములో నివసించు తరి:

      అల చిక్రోడ శశ హరిణ
      ములు నిజ బంధు జన ఘన సమూహముగను ద్యో
      తల చరములు సఖులవఁ గే
      కు లటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్


      సలలిత దేహ కాంతులును జారు శశాంక ముఖారవిందయున్
      నలినదళాయతాక్షిని సనమ్రతఁ బ్రీతిని జానకీ సతీ
      యలికుల వేణి యో ప్రియతమా యనెడిన్ సఖినిన్,హితైక వా
      క్కు ల టను,గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా

      [వాక్కులు +అటు+అను = వాక్కులటను; అటు = ఆప్రకారము]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  14. 1.(కందం)
    తలపుల లో రఘు రాముని
    నిలిపి వనవిహార మందు నెచ్చెలి నేతా
    జలకాలాడుచు విరిరే
    కులటం గని పిలిచి సీత కురులల్లమనెన్

    2.
    (సీత అనే అమ్మాయి గానూహించి)

    చెలికానితోడ సరస
    మ్ములనాడుచు నింతి యొకతి మురిపము తోడన్
    చెలియ సొబగుల కలువరే
    కులటం గని పిలిచి సీత కురులల్ల మనెన్

    (చంపకమాల)

    తలపుల లోన దాశరథి ధ్యానము జేయుచు వెంట కత్తెతో
    నలరిన మానసమ్మున వనాంతర సీమవిహార మేగగన్
    కలికిని తోటలోన తిరు గాడుచు నందము నొప్పు పుాలరే
    కులటను గాంచి భూమిసుత కోరికతో గురులల్ల బిల్చెరా!

    రిప్లయితొలగించండి
  15. చెలువముమీరగ నలుగుచు
    కులుకుల నలివేణి సీత కురులను వదలన్
    పిలుచుచు చెలికత్తెను జన
    కులటంగని,పిలిచి,సీత కురులల్లమనెన్

    రిప్లయితొలగించండి

  16. చిన్న సవరణతో:
    నా రెండవ పూరణము:

    తలిరుల నడుమను విరియుచు
    లలితంబయి శోభిలు వన రంజిత రాగా
    కలితంబగు నా పూ రే
    "కులటం గని, పిలిచి, సీత, కురులల్లమనెన్!"

    రిప్లయితొలగించండి
  17. చెలికత్తెలతో నాడుచు
    నలకలు కర్ణములఁ గప్ప నానందముతో
    లలితమగు పసిడి లోలా
    కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్
    లోలాకులుః కర్ణాభరణములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  18. చెలియలతోడ క్రీడలను చెన్నగు కేశము లాననమ్ముపై
    నలలను పోలిశీఘ్రముగ నాడుచు కప్పగ కర్ణరంధ్రముల్
    లలితమనోహరమ్ముగను రంజిలుచున్న పసిండి తమ్మె రే
    కులటనుగాంచి భూమిసుత కోరికతో కురు లల్ల బిల్చెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తమ్మె (తమ్మి)' ... టైపాటు.

      తొలగించండి
  19. అలుపెరుగక పతిరాకకు
    మెలికలు తిరుగంగ కురులు మెరయక గడలై
    నిలువగ నసురవనిత సా
    కు లటంగని పిలిచి సీత కురు లల్ల మనెన్

    సాకు = న్యాజము = కపటము /చెడ్డతనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      సాకులతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  20. లలితో ద్యానమ్ముననూ
    యలలూగెను మావికొమ్మ లందున పికముల్
    పలు రకముల పూవులు పె
    క్కు లట౦గని పిలిచి,సీత కురు లల్లమనెన్

    రిప్లయితొలగించండి
  21. చెలియలతో పూబంతులు
    కిలకిల నాడుచు పరుగెడు కేరింతలలో
    వలపు లొలుకు రఘుకుల తిల
    కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్


    మిథిలానగర నడివీధులలో విశ్వామిత్రుని చెంత నడిచెడి రామలక్ష్మణులను మేడమీదినుంచి చూసిన దృశ్యము (ఆర్.కే.నారాయణ్ "రామాయణ"):

    రిప్లయితొలగించండి
  22. అయోధ్య శయనాగారమున భార్యా భర్తల కలియుగ వేడుకలు: 👇

    వలపులు మీరగానచట భానుని వోలెడి భాసమానమై
    కలలను గాంచ జాలనిది కాంతులు జిమ్మెడి యాననమ్మునన్
    కలవర మౌచు గారమున కన్నుల విందుగ రామభద్రు షో
    కులటను గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా :)

    రిప్లయితొలగించండి