25, ఫిబ్రవరి 2017, శనివారం

సమస్య - 2293 (భక్తుని దైవమ్మె కొలిచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్"
లేదా...
"భక్తుని దైవమే కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో"

70 కామెంట్‌లు:

  1. "యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం"

    ...భగవద్గీత 5.11


    యుక్తిగ కోరిన విధముగ
    శక్తి కొలది శంఖ చక్ర శార్ఙ్గము తోడన్
    ముక్తిన్నిమ్మనెడు పరా
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్ ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భక్తుఁ డెందు జనినఁ బఱతెంతు వెను వెంట
      గోవు వెంటఁ దగులు కోడె భంగి

      ...పోతన...అంబరీషోపాఖ్యానము

      తొలగించండి
    2. శాస్త్రి గారు మీరు "పరాభక్తుఁడ"ని యేయర్థమున వాడారో వివరించ గలరా? ఇందొక విశేషమున్నది.

      తొలగించండి
    3. అంతగా తెలియదు సార్! "పరా భక్తి" యను మాట రమణ మహర్షి వాడగా చదివితిని. తప్పైనచో క్షంతవ్యుడను.

      తొలగించండి
    4. యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ |
      తస్యైతే కథితా హ్యర్థా: ప్రకాశన్తే మహాత్మన: ||

      “భగవానుని యందు మరియు గురువు యందు సంపూర్ణ విశ్వాసమును కలిగియున్న మహాత్ములకు మాత్రమే వేదజ్ఞానపు మర్మము అప్రయత్నముగా విదితము కాగలదు”. (శ్వేతాశ్వతరోపనిషత్తు 6.23).

      తొలగించండి
    5. ఎక్కడెక్కడి శ్లోకాలను వెలికి తీయడములో మీకు మీరే సాటి. శతాధికవందనములు.
      నాకు తెలిసిన విశేషము చూడండి.
      పరాశక్తి , పరాభక్తి ప్రయోగాలు సాధువులు. పరాభక్తుడు అన్న భావములో మాత్రము సాధువు కాక పోవచ్చు. ఎందుకనగా పరా ఆ కారాంత స్త్రీలింగము భక్తుడు పుంలింగము.
      కానీ పర + అభక్తుడు = పరాభక్తుడు అనగా భక్తుడు కాని వానికి నన్యుడు. అంటే భక్తుడే.! సాధువే.

      తొలగించండి
    6. పొచిరాజు వారూ, దేవీభక్తుడు అన్నది కూడా మీరన్నట్లే అసాధువా?

      తొలగించండి
    7. శ్యామల రావు గారు దేవి యొక్క భక్తుడు తత్పురుష సమాసముగా దేవీ భక్తుడు సాధువనే భావిస్తాను.

      తొలగించండి
  2. భక్తిగ కొలిచిన వారిని
    యుక్తిగ వెన్నంటి యుండి యుద్ధతి నిడగన్
    శక్తికి మించిన సాధన
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్

    రిప్లయితొలగించండి


  3. రక్తుడు విరక్తుడాయెన్
    శక్తియు శివమును గురువును సాంఖ్యంబవగన్
    భోక్తయు భుక్తము నొకటై
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    రక్తిని వరములనిడగా
    యుక్తిని గోల్పోవు శివుడయోమయ గతినిన్
    భక్తిని భస్మాసురు వర
    భక్తుని దైవమ్మె గొలిచి వరముల నందెన్
    భుక్తికి లేనివానివలె భోజనమెన్ననివాని కైవడిన్
    ముక్తిని యిత్తు గొల్వుమని, మ్రొక్కుమటన్న ప్రబోధ వ్యాప్తినిన్
    శుక్తిని ముత్యపుం బగిది జొప్పడు దాత గ్రహీత పంపునన్
    భక్తుని దైవమే కొలుచువాడయి పొందె వరమ్ములగన్నియో!

    రిప్లయితొలగించండి
  5. డాపిట్టా
    పొందెవరమ్ములెన్నియో..చివరి పదపు టైపాటుకు సవరణ,ఆర్యా,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ముక్తిని నిత్తు' అనండి.

      తొలగించండి
  6. మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ....

    (వామనుడు భక్తుడైన బలిని పాతాళమునకు పంపగా అతడు పాదార్చన కోరి విష్ణువును అక్కడే బంధించాడు. విష్ణు దర్శనం కోరి ద్వారకమౌని తపస్సు చేస్తే విష్ణువు బలి అనుమతితో పాదములను అక్కడే నిల్పి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం కొరకు భూలోకం వరకు పెరిగెను. అందుకే పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో శ్రీ స్వామి వారి రూపం నాభి వరకే ఉంటుందని స్థలపురాణం).

    భక్తికి దాసుడౌను భగవంతుడు, ద్వారకమౌని ప్రార్థనా
    సక్తిని గాంచి యా బలిఁ బ్రసన్నుని జేసి, వరమ్ము పొందియున్
    భక్తుల దర్శనార్థము శుభంకరుడయ్యెను వేంకటేశుడై
    భక్తుని దైవమే కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో!!

    రిప్లయితొలగించండి
  7. రక్తిగ నష్టపదుల్ తన
    ముక్తికి జయదేవుడెన్నె,మురిసెన్,కడు నా
    సక్తని దైవముఁజూపగ-
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్

    రిప్లయితొలగించండి
  8. శక్తియె తానై నడుపును
    భక్తుని దైవమ్మె , గొలిచి వరముల నందెన్
    యుక్తిగ రామునిదలచుచు
    ముక్తిని తా గోరె శబరి పొలుపగు భక్తిన్!!!

    రిప్లయితొలగించండి
  9. సూక్తులు జెప్పి పితరుఁడా
    సక్తిన్ తగ్గించమన్న, శౌరినె నమ్మన్
    శక్తిగ, ప్రహ్లాదుండౌ
    భక్తుని దైవమ్మె! కొలచి వరముల నందెన్

    రిప్లయితొలగించండి
  10. ముక్తేశ్వర ! వింటివ యిది
    భక్తునిదైవమ్మెకొలిచి వరముల నందెన్
    భక్తుని ఘనతయె యీయది
    భక్తికి మఱి మూలమ్ము గదర భరణిని రక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాల్గవ పాదంలో గణదోషం. 'భక్తికి మఱి మూలము గద...' అనండి.

      తొలగించండి
  11. గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
    క్రీస్తు గాధల కాణాచి క్రిస్మసనగ
    క్రైస్తవుల పండుగయె! శివరాత్రి యనగ
    హరుని పూజల భజనల పరమ భక్తి
    పారవశ్యమొప్పారెడి పర్వ దినము!

    రిప్లయితొలగించండి
  12. రక్తిని వేడగఁ గాచును
    భక్తుని దైవమ్మె, కొలిచి వరముల నందెన్
    భక్త వరదు నా శంభుని
    యుక్తిని రాక్షస గణము లనుచితము లైనన్


    ముక్తినిఁ గోరి తాపసులు పుష్కర నాభునిఁ గొల్తు రెల్లరున్
    భుక్తికి లేక మిత్రుని విమోహ విహీనుడె, కృష్ణునిం దయా
    సిక్త హృదంబుజంబునిఁ గుచేలుడు, దా నెరి గిట్లు కాచు స
    ద్భక్తుని దైవమే, కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో

    రిప్లయితొలగించండి
  13. శక్తినిడును, తా బ్రోచును
    భక్తుని దైవమ్మె! కొలిచి వరముల నందెన్
    భక్తిని ప్రహ్లాదుడిలను,
    రక్తము బంచిన జనకుడె రాక్షసు డయ్యున్!

    రిప్లయితొలగించండి
  14. భక్తి వినా జీవితమౌ
    భక్తునిదై వమ్మె! కొలిచి వరముల నందెన్
    వ్యక్తుల, నేదా జన్మకు
    ముక్తియె? వేరులు విడువడు భూరుహ రీతిన్||

    రిప్లయితొలగించండి
  15. భక్తిగ షష్టిన గొలిచె వి
    భక్తుని, దైవమ్మె! కొలిచి వరముల నందెన్
    శక్తిగొలదిని పరులకై
    యుక్తముగా వ్యయము జేయ యోగము కూడెన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కాని రెండింటిలోను కొంత అన్వయలోపం ఉంది. 'నేదా...విభక్తుని'..? 'షష్ఠిని' అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ, మొదటి పద్యంలో భక్తి లేని పూజ చేయువాని బ్రతుకు వ్యర్థము, దేవుని కాక మనిషిని, వ్యక్తిని కొలిచే వాడి జన్మకు ముక్తి లేదు, అట్టి జీవితం వేళ్ళు వేరైన చెట్టు వంటిది అని నా భావం. మరి ఇది ఈ రీతిగా వచ్చినట్టు లేదు. ఏదైనా సరైన మారుపులు ఉంటె సూచించగలరు.

      విభాక్తుడు = సుబ్రహ్మణ్య స్వామి అనే అర్థంలో వాడాను.

      తొలగించండి
    3. విభక్తుడు = సుబ్రహ్మణ్య స్వామి అనే అర్థంలో వాడాను.

      తొలగించండి
  16. భక్తుడ!దానమొసంగుము,
    ఫక్తుగ మూడడుగులున్న వాసుర జాలున్
    ముక్తి నిడెదననెను వటుడు
    భక్తుని దైవమ్మె, కొలిచి వరముల నందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'వాసుర జాలున్'..? 'ఫక్తు' అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
    2. గురుదేవులకుప్రణామములు.వాసుర,వసుధ,విపుల భూమికి పర్యాయ పదములు
      అన్యదేశ్యము వలదనిన సవరించిన పద్యము
      భక్తుడ!దానమొసంగుము,
      యుక్తమ్మగు మూడడుగుల యుర్వియె జాలున్
      ముక్తి నిడెదననెను వటుడు
      భక్తుని దైవమ్మె, కొలిచి వరముల నందెన్

      తొలగించండి
  17. యుక్తా యుక్తము దలుపక
    రక్తిగ దానములనొసగ రగులగ మద మా
    సక్తిగ మూడడుగు లనుచు
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్

    నిన్నటి సమస్యకు పూరణ

    ఇరువదైదు డిశంబరు క్రిస్ట్మసనగ
    క్రైస్తవుల పండుగయె; శివరాత్రి యనఁగ
    మాఘ బహుళ త్రయోదశి మహిమ గలది
    ముక్తి నొసగు కపర్థిని భక్తి గొలువ

    నేస్తులు మీరు మాకనుచు నెమ్మదిగా ప్రవచించి యేసు మీ
    యాస్తుల గాచు కాపరిగ నాతని బిల్వుడటంచు బల్కగా
    క్రైస్తవు లెల్ల, భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్
    పస్తులతోడ హిందువులు పల్వురు మేల్కొని రాత్రియంతయున్

    రిప్లయితొలగించండి
  18. శక్తిని మించి నే నడుగ శ్యామల సస్యము లిచ్చు భూములన్
    రక్తిని గూర్చు యంగనల రమ్య భవంతుల,రాశిగా మణుల్
    వ్యక్తము జేయు చుంటి నిడు వామనుడన్ తగు మూడడు౦గులే
    భక్తుని దైవమే కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో

    రిప్లయితొలగించండి
  19. సక్తిని చూపుచు కాచును
    భక్తుని దైవమ్మె, గొలిచి వరముల నందెన్
    నక్తంచర లంకేశుడు
    శక్తీశుని గొలిచి కరము సంరంభముతో

    రిప్లయితొలగించండి
  20. అక్తపు భక్తితో తలచి యంబికనాథునిఁ గొల్వ కాచునా
    భక్తుని దైవమే, కొలుచువాడయి పొందె వరమ్ములెన్నియో
    శక్తి విభుండిడన్ కరము సంతస మొందుచు రావణుండు తా
    శక్తికి మించు కార్యముల సాగుచు చచ్చెను రాము చేతిలో
    అక్తముః స్పష్టమైనది

    రిప్లయితొలగించండి
  21. భక్తుడుమిన్నయేయనుచుబాఠకలోకముదెల్సుకోవలెన్
    భక్తునిదైవమేకొలుచువాడయిపొందేవరమ్ములెన్నియో
    భక్తుడురక్తితోనిలనుబారమునొందునునిశ్చయంబుగన్
    భక్తునకెప్పుడున్నొసగుభాగ్యము,సౌఖ్యమునాయువున్సుమా

    రిప్లయితొలగించండి
  22. ముక్తియె దొరకదు నాకని
    రక్తిని శివ పూజ లేక, రాముడు దలచెన్
    యుక్తిని సైకత లింగము
    భక్తిని దైవమ్మె కొలచి వరముల నందెన్.

    రిప్లయితొలగించండి
  23. ముక్తి యొసంగు వాడగుచు మోదము గూర్చగ నీ భవాబ్ధి కా
    సక్తుల మిత్రుడై మనుచు సన్నుతి సేయగ పుత్రుడై మహ
    ద్భక్తిని సేవ చేసెడి కృపామయు నిట్లు వచింపగా దగున్
    భక్తుని దైవమే కొలుచువాడయి పొందె వరమ్ములెన్నియో.
    భక్త వశంకరు డగుటను
    సూక్తులతో సన్నుతించు సుజనాగ్రణియౌ
    ముక్తా మణి నిభుడగు స
    ద్భక్తుని దైవమ్మె గొలిచి వరముల నందెన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  24. డాపిట్టా
    పొందెవరమ్ములెన్నియో..చివరి పదపు టైపాటుకు సవరణ,ఆర్యా,

    రిప్లయితొలగించండి
  25. యుక్తమగునటు నిలిపె నా
    భక్తుని దైవమ్మె; కొలిచి వరముల నందెన్
    యుక్తిని దైవమ్మడిగిన
    భక్తికి వలసిన గుణములు బల్కిన యతఁడున్

    రిప్లయితొలగించండి
  26. భక్తికి శక్తిపరీక్షగ
    యుక్తిగ హరిహరులు వారియోచనగన యా
    సక్తియె రామహనుమలన?
    భక్తిని దైవమ్మె కొలిచి వరముల నందెన్|
    2.భక్తిగ రామనామ జప భావన గల్గిన యాంజనేయు డా
    సక్తిగవేల్పుగా నిలిచి సర్వుల కర్థముగాని నాటకం
    యుక్తిగ శ్రీ,హరుల్ గలసియోగముజూడగ వింత పంతమౌ|
    భక్తుని దైవమే కొలుచువాడయి పొందెవరమ్ములెన్నియో|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో '..గన నాసక్తియె' అనండి.
      రెండవ పూరణలో 'నాటకం'అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి

  27. ఫక్తుగ దైవంబనుచు
    శక్తిగనోటరుననుదురు సరినాయకులే
    భుక్తికి "పెన్షన్" కోసము
    భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్.

    రిప్లయితొలగించండి
  28. భుక్తిని మెండు కోరకయె భూరిగ సంతస మొండుచుండెనిన్
    శక్తిని మెండు కోరకయె జాస్తిగ సంతస మొందుచుండెడిన్
    ముక్తిని మెండు కోరకయె పూర్తిగ సంతస మొందుచుండెడిన్
    భక్తుని దైవమే కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో

    రిప్లయితొలగించండి