1, మార్చి 2017, బుధవారం

సమస్య - 2296 (వదినా నీ కందఁ జేతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"వదినా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్"
లేదా...
"వదినా కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్"
(ఒకానొక అవధానంలో గరికపాటి పూరించిన సమస్య)

86 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇదినా రేఖను దాటకు
      పదివేల రిపులను మాపి వలపుల రామున్
      పదిలముగ నీదు హృదినిడి
      వదినా! నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్!

      తొలగించండి
    2. లక్ష్మణ రేఖా ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  2. పదిలము గా దాచుకొనుము
    వదినా, నీ కందఁ జేతు, స్వర్గసుఖమ్ముల్
    కుదురును, భాగవ తమిదీ,
    చదువదగిన పొత్తమమ్మ సమరసముగనన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సదనము నందున ముదముగ
    వదినా నీకందఁ జేతు స్వర్గసుఖమ్ముల్
    వదలక వీనుల విందుగ
    పదిలముగా వినుమటంచు భాగవత కధల్

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    చదరంబున వృత్తమునా
    ఒదుగందగు వినుము కోడలొక పుత్రికయే
    సదనంబున శాంతి గనన్
    వదినా! నీకందజేతు స్వర్గ సుఖమ్ముల్

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    సదనంబందున నన్నలేడు మనినిన్ సర్వస్వముంబోయె ప
    ర్వది గాపాడగ కోడలున్ సుతనుగా బాటించు తత్శాంతి కి
    ర్వది సూత్రాలవియేల లక్ష్మి కృపయే భాసిల్లు నింటన్ననున్
    వదనా!"కౌగిట జేర్చుకొందు నినునే స్వర్గంబు జూపించెదన్!"
    (కలకంటి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు)

    రిప్లయితొలగించండి
  6. సమస్యా పాదంలో టైపాటు "వదనా"దీనిని "వదినా"గా సరిచేయ ప్రార్థన.Age factor.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      కాని భావం స్పష్టంగా ఆవిష్కరింపబడినట్లు తోచదు. వివరించండి.
      రెండవ పూరణలో 'మనికిన్' అని ఉండాలనుకుంటాను. 'తత్+శాంతి = తచ్ఛాంతి' అవుతుంది.

      తొలగించండి
  7. సుదతీ! విను తన్వంగీ!
    హృదయేశ్వరి! చారుశీల! హే కల్యాణీ!
    ముదమారగ నా తమ్ముని
    వదినా! నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.

    సుదతీ! రాగదె చారుశీల! వినవే! సూక్తిం బ్రసాదించవే
    మదిలో నాగ్రహ మేలనే! తెలుపవే మచ్చిత్త సంచారిణీ!
    యిదిగో తమ్ముని నూరికిం బనుతునే యీవేళ నివ్వానికిన్
    వదినా! కౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గంబు జూపించెదన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఆర్యా,"కలకంఠి"(.)లో సవరించి చదువగలరు

    రిప్లయితొలగించండి
  9. సదమల మతితో ప్రణతులు
    వదినా నీకంద జేతు, స్వర్గసుఖమ్ముల్
    వదలుచు ననునీ పుత్రుని
    గదలచి పెంచితివి గాదె నీరజ నేత్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      చివరిపాదంలో యతి తప్పింది. "గ దలచి పెంచితివి గాదె కంజదళాక్షీ" అందామా?

      తొలగించండి
  10. (1)
    "సుదతీ! వికసిత పంకజ
    వదినా! నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్
    పద!" యనుచో టైపాటుర!
    'వదనా!' యని యుండవలెను, వడి దిద్దుమురా!
    (2)
    ఎద రంజిల్లఁగ నింతకాలమున కీ యేకాంతమే చిక్కె, మ్రొ
    క్కెద నల్కన్ విడి చెంతఁ జేరఁ గదవే, కేళీవిలాసప్రభా
    సదన మ్మందున పుష్పశయ్యఁ గనుమా సారస్యభావంపుఁ బ్రో
    వది, నా కౌఁగిటఁ జేర్చుకొందు నిను, నే స్వర్గమ్ముఁ జూపించెదన్.

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. సరసమైన హాస్యం, సుభగమైన శృంగారం మనోజ్ఞంగా ఉట్టిపడుతున్న మీ పద్యరచన విద్యార్థి, విద్యాధిక పూరయితలకు మార్గదీపకంగా అలరారుతున్నది. మీ ముఖతః ప్రకాశిస్తున్న వాఙ్మయీ దివ్యరూపానికి ఇదే హృదయాంజలి!

      తొలగించండి
    2. ఏల్చూరి వారూ,
      ధన్యవాద పూరక నమశ్శతములు!

      తొలగించండి
  12. ఎదలో నీ రూపమ్మె మ
    రదలా! మన పెండ్లిరోజు రానున్నది, స
    మ్మదమును గూర్తును, తమ్ముని
    వదినా! నీ కందఁజేతు స్వర్గసుఖమ్ముల్

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    (1)
    [ఒక యువకుఁడు తన ప్రేయసిని నాహ్వానించు సందర్భము]

    "మదిలోఁ గోర్కెలు రేఁగె నాకు నిపుడున్ మన్నించి నన్నిప్డు నీ
    యెదపైఁ జేర్చియుఁ గోర్కెఁ దీర్చుము సఖీ! హేమాద్రిశృంగస్తనీ!
    యిదె నాా ప్రాయము నిర్వదైదు చనె; నీ కీయేఁడె యేతెంచె ని
    ర్వది; నా కౌఁగిటఁ జేర్చుకొందు నిను, నే స్వర్గమ్ముఁ జూపించెదన్!"

    ఇదియే కొంత సవరణతో...

    (2)
    [భీముఁడు ద్రౌపదితోఁ బలికిన సందర్భము]

    "మదిలోఁ గోర్కెలు రేఁగె నాకు నిపుడున్ మన్నించి నన్నిప్డు నీ
    యెదపైఁ జేర్చియుఁ గోర్కెఁ దీర్చుము సఖీ! హేమాద్రిశృంగస్తనీ!
    యిదె నాా శయ్యనుఁ జేరరావె యిపుడే; యీ వేళ నీరీతి ద్రో
    వది! నా కౌఁగిటఁ జేర్చుకొందు నిను, నే స్వర్గమ్ముఁ జూపించెదన్!"

    రిప్లయితొలగించండి
  14. …………………………………………………

    గు రు మూ ర్తి ఆ చా రి

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    { పా౦డవులు అరణ్యవాసములో నున్న వేళ

    ఏకా౦తముగ కనిపి౦చిన ద్రౌపదిని జూచి

    సై౦ధవుడు కామి౦చి అన్న మాటలు }



    సుదతీ ! నీ విటు పా౦డుపుత్రకులతో

    ……………… శోకి౦ప నేలా వనిన్ |

    మది c గామి౦చితి | నెక్కుమా రథము ,

    ……… రమ్మా జ౦కు నీ కేల | ద్రో


    వది ! నా కౌగిట జేర్చుకొ౦దు నిను నే

    స్వర్గ౦బు జూపి౦చెదన్


    మదనాస్త్రానల కీల దహ్య మగు స్వా౦త౦

    ……………… బేను చల్లార్చెదన్



    ( 4 వ పాద౦ యతి = పైన " న్ "

    ఉన్న౦దున " ౦ త " కు సరిపోయినది )

    రిప్లయితొలగించండి




  15. మదిలోనన్నే దలచుచు
    పదిలముగా పడకజేర వచ్చిన వనితా
    సుదినమ్మిది తోషపు త్రో
    వది, నా నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోషపు త్రోవలో సాగిన మీ పూరణ సంతోషాన్నే ఇచ్చింది. అభినందనలు.

      తొలగించండి
  16. ఇదినా మాటగ వినుమిక
    వదినా! నీకేమి బెంగ వలదికపై, రా
    వదినా! మమ్ముల గనినా
    వది, "నానీ" కందజేతు స్వర్గ సుఖమ్ముల్!

    రిప్లయితొలగించండి
  17. నిన్నటి పద్యమును పరిశీలించ మనవి.

    బానిసవ్వగ భర్త దుర్వ్యసనముల

    కొంటిగా సంతు బోషించి గొప్పగాను

    వారి భవితకు బంగారు బాట వేసి

    మాన్యమయ్యె బతివ్రత మగని రోసి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "బానిసవ్వగ భర్త దుర్వ్యసనములకు। నొంటిగా..." అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ !
      ధన్యవాదములు ! ముందు అలాగే వ్రాసి
      అక్షరం ఎక్కువైనదనుకొని( దృష్టిదోషం)
      మార్చాను.

      తొలగించండి
  18. మదిలో చింతను వీడు
    మ్మిదిలే మాయా బజారు; మీశశి రేఖ
    న్నిదిగో జూపెద రేవతి
    వదినా! నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్!

    రిప్లయితొలగించండి
  19. ఎద వాలు మీ క్షణమ ద్రో
    వది నా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్
    పద కీచక యనె భీముడు
    సదమల మాలిని కపట వచనముల నంతన్

    [నా=అనన్]


    సుదతుల్ నీకు విలాస వస్తువులె దాసుల్ భంగి కన్గొందువా
    వదరుల్ చాలును గీచకాధమ మదభ్యాసంబు నీ మృత్యువే
    వదలించం దగ దుక్కు కౌగిలినిఁ దల్పన్ భీకరంబౌను జా
    వది నా కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్

    రిప్లయితొలగించండి
  20. ఇదిగోయోయత్తదుహిత,
    వదినా!నీకందజేతుస్వర్గసుఖమ్ముల్
    మదినిన్నేనేవలచితి
    నోదమయంతీ!రాయనినుదయుడుపిలిచెన్

    రిప్లయితొలగించండి
  21. …………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ( సిక్కుల లో అన్న మరణిస్తే వదినను

    మరది పె౦డ్లాడి స౦తతి నభివృధ్ధి చేయు

    ఆచారము కలదు . )



    వదినను గని " రణ సి౦ " గనె ,

    " వదినా నీ క౦ద జేతు స్వర్గ సుఖమ్మున్ "


    వదిన మనకు మాతృ సమము |

    వదిన౦ గూడుదురు " సి౦గ్ " లు

    ……………………… పడయగ స౦తున్

    రిప్లయితొలగించండి
  22. చదువును వదలకు నెన్నడు
    యెదయెద లో వెలుగు దివ్వె వెలిగించునదే
    మది మది కిముదము నిడు చదు
    వది, నానీ, కందజేతు స్వర్గ సుఖమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలకు మెన్నం। డెదయెదలో..' అనండి.

      తొలగించండి
  23. వదినాకౌగిటజేర్చుకొందునినునేస్వర్గంబుజూపించెదన్
    మదికొవ్వెక్కియుపల్కుచుంటివిటయోమాతామహుండా!దగన్
    హృదిలోభీతియులేదనీకుమరియాహైమావతిన్గోరగా
    పదికిన్దొమ్మిదిరెట్లుగావయసుదాభారంబుగాదాయికన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పదాల మధ్య వ్యవధానం ఇవ్వండి.

      తొలగించండి
  24. అప్సరస భులోకవాసితో
    సదమలమదితో నిత్యము
    మధుసూదనుని భజియించి మక్కువతోడన్
    కదలు దివికి పదిలపు చా
    వది, నా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్
    నాః నేను

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికి పాద నమస్కారాలు

    వరూధిని ప్రవరాఖ్యుని తో ఇలా అంటున్నది

    ఇదిగో చూడుమ నవ్యలోకమిదియే ఈ ప్రాంత ముందున్న నా
    సదనంబుల్ లవలీ నికుంజములకున్ సాటైన రావందువే
    మదనా కాలును నిల్పలేక చనగా మార్గంబు లేదింక నీ
    వది, నా కౌగిట చేర్చుకొందు నిను నే స్వర్గంబు చూపించెదన్

    తప్పులుంటే మన్నించ ప్రార్ధన


    రిప్లయితొలగించండి
  26. పదవిన్ బొందుము యెట్టులైన, కొనుమా ప్రాముఖ్యమౌ శాఖలన్
    సదయుండంచు మనుష్యులందరు సదా శ్లాఘించ, దేశమ్ము సం
    పదలన్ శీఘ్రముగా హరించు కడు నభ్యాసమ్ముతో, మంచి త్రో
    వది, నా కౌఁగిటఁ జేర్చుకొందు నిను, నే స్వర్గమ్ముఁ జూపించెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పొందుము+ఎట్టులైన' అన్నపుడు యడాగమం రాదు. "పదవిన్ బొందెద వెట్టులైన..." అందామా?

      తొలగించండి
  27. మధురాపాన విశేష మత్తుడగుచున్ మైకమ్ము కమ్మంగ నో
    ముదితా ఆగుము ఆగుమింక యనుచున్ మొహాధి రేకమ్ముతో
    మద నాగమంబును పోలె కీచకుడు తా మాటాడే దుష్టుండు ద్రో
    వది, నా కౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గంబు జూపించె దన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది.
      'మదిరాపాన... ముదితా యాగవె యాగుమింక.. మోహాతిరేకమ్ముతో' అనండి.
      'ఆగుము+ఆగు' అన్నచోట సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
    2. క్షమించాలి అది టైపు చేయడములో ఇబ్బంది అందువలన అలా చేశాను.

      తొలగించండి
  28. పదిలముగ కోట నిలుపుచు
    వదినా నీ కందఁ జేతు ; స్వర్గసుఖమ్ముల్
    కుదురుగ రంగా రాయడు
    పదికాలము లిడగ నీకు పతి దేవుడనన్

    రిప్లయితొలగించండి
  29. ఎద 'నా నీవ'ని పలుకఁగ
    సుదతీ! 'నీ నేన'టంచు చుట్టితె సతివై
    మొదలిడదమె జీవన క్రతు
    వది 'నా నీకం'ద జేతు స్వర్గ సుఖమ్ముల్

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా నుండి
    ఒకచతురస్రములో సర్కిల్ (వృత్తము యిమిడినట్లు ఓ వదినా కోడలును హింస పెట్టుకొనవద్దు.ఆమె నీబిడ్డలాంటిదే.శాంతి లక్ష్మి తో. మనికిని నడుపుకో.స్వర్గం అందులోనే ఉన్నది,ఆర్యా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వివరణ అందించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      అన్నచనిపోయె.పరువు కాపాడుకో. తచ్చాంతికి వేరే సూత్రాల వసరంలేవు.కొరకొర పెట్టక కోడలును చూచుకుంటే ఇంట ఉంటుంది.వదినా ఆలక్ష్మి.ఆమె అంటుంది"నేను స్వర్గం చూపుతాను".తల్లి కోడలిని బాధ పెట్టడం, కొడుకు తల్లిని ఏమీ మందలించక పోవడం,లక్ష్మి తొలగి పోవడం.ఈ బాధలు సంపన్నులకు తెలియవు."మని ఉండంగా మంచినీళ్ళైనా పోయడుగాని చచ్చినాక సమాధిమీద బర్రెను కట్టేశిండట"అనే TSసామెతలో మని అంటే ప్రాణం. మనికి, జీవనం.మనికిన్ అని మార్చాను,ఆర్యా.

      తొలగించండి
  31. గరికపాటివారికమ్మనిపూరణ
    తెలియజేయమిమ్ముగోరుచుంటి
    వారిపూరణంపుపధ్ధతినాదర్శ
    ముగనుజేసికొందుముందుముందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదంలో యతి తప్పింది. 'తెలుప మిమ్ము గోరితిని ముదమున' అనండి.
      గరికిపాటి వారి పూరణ కోసం ప్రయత్నిస్తాను.

      తొలగించండి

  32. పిన్నక నాగేశ్వరరావు.

    ఇది మన తొలి రాతిరి గద

    మది గెల్చిన సన్నుతాంగి మమతలుబంచన్

    కదలవె వడి నా తమ్ముని

    వదినా ! నీకందజేతు స్వర్గ సుఖమ్ముల్.

    *********************************

    రిప్లయితొలగించండి
  33. మది యందున్ మదనుండు పుష్ప శర సన్మానంబు గావించగా
    తుదియే లేని రతీ సుఖంబులను పొందున్మాదతన్ యో సఖీ
    నదుపున్ దప్పుదమో విహార విల సన్మందార కేళీమహావది, నాకౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గమ్ము జూపించెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉన్మాదతన్ + ఓ = ఉన్మాదత నో' అవుతుంది. అక్కడ యడాగమం రాదు. 'ఉన్మాదతన్ ప్రేయసీ యదుపున్...' అనండి. మహా అవధి కదా! సమస్యలో ది ఉంది.

      తొలగించండి
  34. ఇదె గొనుమనె నా మరదలు
    వదినా నీకంద జేతు స్వర్గ సుఖమ్ముల్
    యెద సంతసింప గనుమన
    హృదిలో టీవీ కదలుచు హితముగ దోచెన్!

    గురువు గారికి నమస్కారములు. సవరించిన నిన్నటి నా పూరణ కూడా చూడ గోరుతాను.. ధన్యవాదములు.
    భర్త ననుసరించి నడచు భార్య భువిని
    మాన్య యయ్యె! బతివ్రత మగని రోసి
    కించ బఱచగనిట సాహసించ బోదు!
    భేదముల వీడు దారుల వెదకు నెపుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      'సుఖమ్ముల్+ఎద' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  35. కామకేళియందుకసితీరవలెనన్న
    మీరుచెప్పినట్లుమెత్తదనపు
    పూలపాన్పుమరియుపూగుబాళింపులు
    వలయుసామి!మీకువందనమ్ము

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. పదునారేండ్లవినూతనంపు వయసున్ ప్రాప్తించు స్వప్నాలకున్
    పదిలంగాముడి వైచినీకు,వెడలెన్ స్వర్గమ్ము లో సౌఖ్యముల్
    ముద మొప్పంగను పొంద నీ పతి, యికన్ మూఢత్వమున్ వీడుమా
    వదినా! కౌఁగిటఁ జేర్చుకొందు నిను, నే స్వర్గమ్ముఁ జూపించెదన్

    రిప్లయితొలగించండి
  38. సదమల మతితో ప్రణతులు
    వదినా నీకంద జేతు, స్వర్గసుఖమ్ముల్
    వదలుచు ననునీ పుత్రుని
    గదలచి పెంచితివి గాదె కంజదళాక్షీ!

    మదిలో నాగ్రహమెంతయో కలిగెకొమ్మంజూడగా, యామెనీ
    వదినా? కౌగిట జేర్చుకొందునిను నే స్వర్గంబు జూపించెదన్
    సుదతీ యంచు చెప్పివచ్చితినిగా చోద్యమ్ముగాతానుండగన్
    వ్యధనే జెందితి భామరో మరలితిన్ వ్యర్థమ్మయే రాక యే

    రిప్లయితొలగించండి
  39. శ్రీకృష్ణుడు సత్యభామను బ్రతిమాలుచున్న సందర్భము...

    ఎదుటన్ నీవె !హృదంతరాళములలో నీవే గదా!నెచ్చెలీ !
    ఇదె నామాటను నమ్ము,నీ చెలియ నీకేమేమొ బోధించె,నా
    హృదయాబ్జమ్మిది నీది !రుక్మిణికి నేనేమిచ్చితిన్? వట్టి పూ..
    వది ! నా కౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గమ్ము జూపించెదన్ !!


    "ఇదిగో తాంబూలమ్మిదె"
    వదినా ! నీకందజేతు., స్వర్గసుఖంబుల్
    పదిలముగ పొంది మేమిల
    పదికాలములుండునట్లు పలుకవె శుభముల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  40. మదినిన్ చింతలు మానుమింక మనసే మందార పూవంచుచున్
    గదిలో తల్పులు మూసి వేయుదును కంగారేల? "నా తంబికిన్
    వదినా!" కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్
    తుదకున్ నిద్దుర లక్ష్యమే మనలకున్ ధూంధాములై పోవగన్ :)

    రిప్లయితొలగించండి