6, మార్చి 2017, సోమవారం

సమస్య - 2301 (అరయఁగ రాముని కుమారులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"అరయఁగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్" 
లేదా...
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో 🌻)

65 కామెంట్‌లు:



  1. సల్లాపంబసలేలరా వినయ, వాసంతీ కుమారా గన
    న్నుల్లంబెల్లర జూడగాను తెలియున్నూత్నంబు గాదేదియున్
    మల్లాటంబులు గూడదయ్య, మనమున్, మాన్యుల్, సుబుధ్ధల్ గన
    న్నల్లా క్రీస్తులు రామచంద్రు, సుతులే యాశ్చర్య మే మిందులో
    ?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  2. సరిసరి లవకుశ లిరువురు
    నరయఁగ రాముని కుమారు, లల్లా క్రీస్తు
    ల్లరయ యమీనా, మేరి కొ
    మరులు గదా! కందివర్య! మాబదులిదియే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు: మనలో మాట. అమినా "ప్రవక్త మొహమ్మద్" తల్లి. అల్లా అనగా God Himself.

      తొలగించండి

    2. வாம்மோ பெரிய தவரு :)
      எட்லாகோ ராசெசாம் காபட்டி அம் அஹ :)

      ஜிலேபி

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. (శాస్త్రి గారి అభ్యంతరం మినహాయిస్తే)!

      తొలగించండి
  3. హరిహర పుత్రులు కారుర!
    నరులకు జన్మించ కున్న నౌరా యనగా
    పరమాత్మ మౌనమున వీ
    రరయఁగరా! ముని కుమారు లల్లా క్రీస్తుల్!


    గమనిక: క్రీస్తునకు, అల్లాకు, నరులైన తండ్రులు లేరు. స్వయంభువులు.

    muni. [Skt.] n. Lit: a man of silence

    http://telugudictionary.telugupedia.com/telugu_english.php?id=13934

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జీ పీ యెస్ వారికి నెనరులతో


      సరసీ ! లవకుశ లెవరే ?
      మరి యిస్లామీయులకటు మాన్యుండెవరే ?
      మరియమ్మ తనయు డెవరే ?
      అరయఁగ రాముని కుమారు, లల్లా, క్రీస్తుల్ !

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      ప్రశ్నోత్తర మాలికగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
      "లవకుశు లెవరే" అనండి.

      తొలగించండి
  5. పరమత సహనము జూపుచు
    సరసుండై జీవనంబు సాగించెడి యా
    కరినగర వాసి నాతని
    నరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  6. కల్లల్ బల్కడు, స్వార్థ హీనుడు కనన్ కాపట్యమే లేని కో
    కొల్లల్ సద్గుణ రాశులంది సమతన్ కూర్మిన్ సదా దాల్చి తా
    నుల్లాసప్రియుడై వెలుంగు ఘను డా యూరన్ శుభాకాంక్షి వా
    రల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    సురదీర్ఘిక జలములవలె
    నెర సగుణము నిర్గుణంపు నీతి నయోధ్యా
    నరవరు నెరిగే క్రమమది
    అరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    (సురదీర్ఘిక॥ఆకాశగంగ)
    "చెల్లీ! చెల్లును మూర్తి పూజలవియుం చేరున్ గదా రామునిన్
    'అల్లా!'యంచరవంగ జూడు మతనిన్ హాయిన్;విభాషాళినిన్
    చెల్లం బట్టు 'కుమారు'(The son of God) స్తోత్రములతో జేయున్ బ్రచారమ్ము లీ
    అల్లా,క్రీస్తులు రామచంద్రు సుతులే!యాశ్చర్య మేమిందులో(న్)!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నరవరు నెరిగెడు...' అనండి.

      తొలగించండి
  9. మరువక తెలియుము నేస్తమ
    అరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్
    విరిసిన సృష్టికి మూలము
    పరమే శుడుగాదె వినుము పరులెవ రయ్యా ?

    రిప్లయితొలగించండి
  10. కల్లోలంబయి,భీకరంబయి,మహా కాఠిన్యమై,శూన్యమై
    తల్లీనంపు భవాబ్ధి మున్గి జగతిన్ ధైర్యంబుఁగోల్పోవ,సం
    ఫుల్లానందద మీశ తత్త్వమగు ప్రాపుఁజేర్చు వారెల్లరున్
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్యమేమిందులో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
      'ప్రాపుం జేర్చు' అన్నది 'ప్రాపుఁ జేర్చు' అని టైపయింది.

      తొలగించండి
  11. ఎల్లైశ్వర్యము లిచ్చువాడు జగమం దీశుండు సర్వాత్ముడై
    ముల్లోకంబుల కాత్మసంతతి కటుల్ మోదంబు చేకూర్చగా
    నుల్లంబందు సమత్వదృష్టి కలవా డుద్ధారకుం డౌట నా
    యల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. భరమగు బ్రహ్మాండమ్మును
    సురలను తారల,గ్రహముల,క్షోణి సృజించెన్
    పరమాత్ము౦డెవ్వ౦డన
    నరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. తల్లీ తండ్రులు భార్య భర్తలును తాతా యవ్వ ముత్తాతలున్
    చెల్లా యన్నలు మామలత్తలును దాసీ దాసులున్ జూడగ
    న్నిల్లూ వాకిలి భూమి బంగరులు మాయే యన్ననీ భూమిలో
    నల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మేమిందులో?

    ....ప్రభాకర శాస్త్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జీపీయెస్సుల పాదపంక్తులు భళా జివ్వాడె శార్దూలమై !

      జిలేబి

      తొలగించండి


    2. హ్యాపీగా నిట పద్యమాలికల యాహాయాహు యాహూ యనన్
      జీపీయెస్సుల పాదపంక్తులు భళా జివ్వాడె శార్దూలమై ,
      మా పీఠమ్మున కొత్తగా ఖరగపూర్ మాష్టారు యేతెంచినా
      రౌ! పట్టారిట మేలుగాను విధమౌ రయ్యంచు రీతిన్ సుమా

      జిలేబి

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కానీ... తల్లీ తండ్రులు (తల్లిదండ్రులు), తాతా (తాతయు), ఇల్లూ వాకిలి (ఇల్లు వాకిలి) అని వ్యావహారికాలను ప్రయోగించారు.
      *****
      జిలేబీ గారూ,
      🙏

      తొలగించండి
  14. తరుణీ !లవకుశు లెవ్వరు?
    తురకలు మరి క్రైస్తవులిల దొడ్డగ గొలిచే
    పరమాత్మ లెవరు జెపుమా?
    నరయఁగ రాముని కుమారు, లల్లా క్రీస్తుల్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొలిచే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'దొడ్డగ గొలువన్' అందామా?

      తొలగించండి
  15. తరిమిరి యాగాశ్వమ్మును
    నరయగ రాముని కుమారు, లల్లాక్రీస్తుల్
    పరమత సహనము బెంచుచు
    నరులుగ ధరపైవెలసిన నాక నివాసుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. చరితము లవి చదివి చదివి
    కర మలసి సొలసియు మూసి కన్నులు నిదురిం
    చ రయమునఁ బల్కెఁ దా కల
    నరయఁగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్


    కొల్లంగొట్టగఁ గాక దుడ్డులను సంకోచమ్ము లేదిందునం
    దల్లీ దూరసుదర్శినీ తగునె వింతల్గొల్పు మేథో మహా
    వల్లీమంథన భీమ యజ్ఞములు సంభావ్యంబు లయ్యెం గదా
    యల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోరంజకంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  17. వరపుత్రులగు కుశలవులె
    యరయగ రాముని కుమారు, లల్లా క్రీస్తుల్
    పరిపరివిధముల బోధలు
    నిరతము చేసిరి ప్రజలకు నిశ్చలమదితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      విరుపుతో మీ పూరణ ఉదాత్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. ధర్మమది సనాతనమన
    పరమతములు నూతనములు పాఱగ జూడన్
    భరతుని దేశమున వరుస
    లరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్!

    ముందు యున్న మతంలో వారు పితరులౌతారు గదా! తరువాతి వారు తనయులు!



    ప్రాసలో సంయుక్తాక్షరం యుండరాదేమోనన్న సందేహంతో రెండవ పూరణ


    పురుషులు వ్రాయని ధర్మము
    వరలగ వైదిక మనుచును భారత మందున్
    పరమతములు నూతనములు
    యరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్!

    రిప్లయితొలగించండి
  19. పరగడుపు మాటలివ్వియ
    యరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్
    పరమాత్ము లెయా మువ్వురు
    వరముల నేనీ యుప్రభు లు వారలు మనకున్

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. విరిసిన మల్లెలగంధము
    పరిమళ మందించు నట్లు|పాఠ్యాంశములో
    తరచుగ నీతికి మూలము
    అరయగరామునికుమారు,లల్లా,క్రీస్తుల్|
    2.కల్లోలంబులు మాన్ప?ధర్మమును సంకల్పాన సూచించగా?
    తల్లీభారతి,సంఘమందు గురువాత్సల్యంబు లాశీస్సులున్
    అల్లా,క్రీస్తులు,రామచంద్ర సుతులే|యాశ్చర్యమేమిందులో?
    ఉల్లాసంబును బెంచుభక్తి” మన నిత్యోత్సాహ నిర్మాణమే”|





    రిప్లయితొలగించండి
  23. ఉల్లంబందున శాంతమొంద కలహంబుల్లేక సౌజన్యమౌ
    సల్లాపంబుల సామదానములచే సంతోష సంరంభమున్
    యుల్లాసంబుగ క్రిస్మసున్, నవమితో యుక్తంబు రంజానులన్
    కొల్లంగొట్టగ కోశమున్ జరుపగా కోలాహలం బెల్లెడల్
    యల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే యాశ్చర్య మేమిందులో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'సంరంభమున్+ఉల్లాసంబుగ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  24. డా.పిట్టా
    (సురదీర్ఘిక॥ఆకాశగంగ)
    "చెల్లీ! చెల్లును మూర్తి పూజలవియుం చేరున్ గదా రామునిన్
    'అల్లా!'యంచరవంగ జూడు మతనిన్ హాయిన్;విభాషాళినిన్
    చెల్లం బట్టు 'కుమారు'(The son of God) స్తోత్రములతో జేయున్ బ్రచారమ్ము లీ
    అల్లా,క్రీస్తులు రామచంద్రు సుతులే!యాశ్చర్య మేమిందులో(న్)!"

    రిప్లయితొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    సురదీర్ఘిక జలములవలె
    నెర సగుణము నిర్గుణంపు నీతి నయోధ్యా
    నరవరు నెరిగే క్రమమది
    అరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్!

    రిప్లయితొలగించండి
  26. పరమత సహనముఁ దెలిపెడు
    సరళమ్మౌ నాటకమున చక్కని బోధల్
    గురుతుగ జెప్పిన పాత్రల
    నరయఁగ రాముని కుమారులల్లా క్రీస్తుల్

    రిప్లయితొలగించండి
  27. తరుణీ! లవకుశు లెవరే?
    మరి యిస్లాముమతమందు మాన్యుండెవరో?
    మరియ తనయుండెవరనగ
    నరయగ రాముని కుమారు డల్లాక్రీస్తుల్ .


    చెల్లీ! ప్రశ్నలు వేసెదన్ బదులునే చెప్పంగ రావేలనే
    తల్లిన్ గాంచిరి తండ్రిసాయమది పొందన్ లేకనే లోకమున్
    కల్లోలమ్ముల దీర్చినట్టి ఘనులీ కల్పమ్ములో నెవ్వరో?
    యల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మేమిందులో

    రిప్లయితొలగించండి

  28. వెరవక పోరిరి తండ్రి
    న్నరయగ రాముని కుమారు; లల్లా క్రీస్తుల్
    ధరపై ముస్లిం క్రైస్తవ
    వర దైవంబై చెలంగు ప్రకటంబవగన్!

    రిప్లయితొలగించండి
  29. సరుగునతెల్పుము పుత్రా
    ధరలో లవకుశు లెవరని దరహాసముతో
    నరుహుము ముస్లిము క్రైస్తవు
    లరయగ రాముని కుమారులల్లా క్రీస్తుల్.

    సరిగా వింటిరి లవకుశు
    లరయగ రాముని కుమారులల్లాక్రీస్తుల్
    నరసిన ముస్లిము క్రైస్తవు
    లురుతర మతపెద్దలనగ నుర్విని వీరే.

    రిప్లయితొలగించండి
  30. పందిరల్లెను కృష్ణపక్షము పండు వెన్నెల శోభతో
    ఈ సమస్య బాగుంటే మీరు దీన్ని వుపయోగించండి
    ఇట్లు
    అవధాని
    ఇలాపావులూరి శేష శ్రీధర్
    అద్దంకి

    రిప్లయితొలగించండి
  31. పందిరల్లెను కృష్ణపక్షము పండు వెన్నెల శోభతో
    ఈ సమస్య బాగుంటే మీరు దీన్ని వుపయోగించండి
    ఇట్లు
    అవధాని
    ఇలాపావులూరి శేష శ్రీధర్
    అద్దంకి

    రిప్లయితొలగించండి
  32. కల్లోలంబులులేక మానవాళెంతొ కారుణ్య సౌజన్యమౌ
    సల్లాపంబుల సామదానములచే సంతోష సంరంభము
    న్నుల్లాసంబుగ క్రిస్మసున్, నవమితో నుక్తంబు రంజానులన్
    కొల్లంగొట్టగ కోశమున్ జరుపగా కోలాహలం బెల్లెడల్
    యల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే యాశ్చర్యమేమిందులో!

    రిప్లయితొలగించండి
  33. కల్లోలమ్మును సృష్టి జేయు పనిలో కాలేజి పోటీలలో
    డిల్లీలో పలు కమ్యునిస్టు సుడిలో ఢింఢిమ్ము కొట్టించుచున్
    బల్లన్ గుద్దియు విశ్వ హిందు పరిషత్ వారల్ దబాయించిరే:
    "అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో"

    రిప్లయితొలగించండి