11, మార్చి 2017, శనివారం

సమస్య - 2305 (భామయు భామయుఁ గలియఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్"
లేదా...
"భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

43 కామెంట్‌లు:

  1. భామా కలాప భామా
    నామమె వేదాంత సత్య నారాయణగా
    నీమహి వెలసిన కృత్రిమ
    భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ ముని యొసగిన మంత్రము
      నీముగ వల్లించ వచ్చి నిమిషము లోనన్
      భామా! నీకిదె వరమను
      భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్


      భామ = సూర్యుడు (శబ్దరత్నాకరము)

      భామ = కుంతి

      తొలగించండి
    2. శాస్త్రి గారు సూర్యుడన్న యర్థములో భాముడు అనాలి. (రామ:రాముడు; సోమ:సోముడు) లేదా సమాసయుక్తముగా వాడవలసి యుంటుంది. "భామవిభుడు" వలె.
      భామయు (భామ కూడా) సాధువు. భాముడున్ (సూర్యుడు కూడా) సాధువు.

      తొలగించండి
    3. కవివర్యులు కామేశ్వర రావు గారు: చాలా రోజుల తరువాత మీ శస్త్ర చికిత్సకు గురియైన నా పూరణలు మురిసి పోయినవి. ధన్యోస్మి!

      తొలగించండి
  2. సోముని వెన్నెల వెలుగుల
    కాముని పండుగ యటంచు కలవర పడగన్
    నీమము దప్పిన చెంగల్వ
    భామయు,భామయుఁ గలియఁగ బాలుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి


  3. రామయ్యా వస్తావ
    య్యా! మగ డా రమ్మయనుచు యాకటి గావన్
    గోముగ బావను బిల్వన్
    భామయు, భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్ !

    *భామ -> బావ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    ప్రేమయె ముఖ్యము లింగపు
    సామాన్యపు మేళవంబు చాలు నటన్నన్
    బాము(జన్మము)కు వీర్యము పరులదె
    భామయు భామయు గలియగ బాలుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    భామకు భర్త పోరనుచు భావన జేసిన"గై"వివాహమే
    క్షేమమటంచు కోరుకొని జేసిరి యుగ్మపు జీవనమ్ము;వే
    క్షామమె వీర్యపున్నిధులు కావలెనన్న లభించె గావునన్
    భామయు భామయున్ గలియ బాలుడు పుట్టెను సత్యభామకున్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    "ఏమిది తాత?యా మనము నిల్పిన బ్రహ్మకు పుత్ర సంతు, యే
    నీమములేదు భారతిని నిండుగ బ్రహ్మయె గోరె పుత్రికన్
    క్షేమమె యీ కథల్!"యనగ"క్షీరమె వీర్యము నేడు పౌత్రుడా!
    భామయు భామయున్గలియ బాలుడు పుట్టెను సత్యభామకున్!!"

    రిప్లయితొలగించండి

  7. A mother in need - A carrier in service 3 days event meet greet and get


    గోమతిగర్భ ధారణల గోము జిలేబుల " సంత" యందునన్
    భామయు, భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్,
    సోమరిపోతు లయ్యిరి యశోమతులెల్లరు నేటి రోజులన్
    తామసులయ్యిరయ్య మగతాలము జేసుకొనంగ మాలినుల్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. రామాపురమున బలికెను
    కామేశుడు బొంకులాడు క్రమమున స్పర్ధన్
    ధీమతులారా వినుడని
    భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.

    నాములపాడులో నొకదినాన నసత్యము బల్కు వారికై
    ధీమతు లొక్కస్పర్ధ నట దెల్పగ బొంకుల నాడువారిలో
    కాముడు హర్షపూర్ణుడయి గమ్మున నిట్లనె సత్య మయ్యరో
    భామయు, భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  9. ఏ మహనీయవాక్కుననొ యిన్నిదినమ్ముల కాడుబిడ్డ మా
    భామకు బిడ్డ పుట్టెను వివాహము పిమ్మట పాతికేళ్ళకున్
    గ్రామములోని వారలకు గాటపు వేడుక లిట్టి యూసులే
    భామయు భామయున్ గలియ "బాలుఁడు పుట్టెను సత్యభామకున్"

    రిప్లయితొలగించండి
  10. ఈ మాకూడలి నడచుచు
    కామేశ్వరి నొప్పులనుచు కడుపును బట్టన్
    ధీమాగ చాటు జేయుచు
    భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి
  11. హేమకు ప్రసవముఁ జేయగ
    హైమవతియె వైద్యురాలు నమలయె నర్సున్
    సేమఁపు సిజేరియనుకై
    భామయు భామయుఁ గలియఁగ బాలుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సేమపు కానుపు కొరకై! యనిన యింకను బాగుండెడిది!

      తొలగించండి
    2. సీతా దేవి గారికి ధన్యవాదములు. మొదటి పాదములోవే ప్రసవము గురించి వ్రాశాను.సిజేరియన్ చేయవలసిన ప్రసవమును భామలిద్దరు కలిసి సేమము కూరగ చేసినారను భావము. స్వస్తి.

      తొలగించండి
  12. రామా యేమీ వింతలు
    భామయు భామయు గలియగ బాలుడు పుట్టె
    న్నీమా వైద్యులు మార్చిరి
    భామల లింగాల నొకటి భవ్యత కొరకై

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    "ఏమిది తాత?యా మనము నిల్పిన బ్రహ్మకు పుత్ర సంతు, యే
    నీమములేదు భారతిని నిండుగ బ్రహ్మయె గోరె పుత్రికన్
    క్షేమమె యీ కథల్!"యనగ"క్షీరమె వీర్యము నేడు పౌత్రుడా!
    భామయు భామయున్గలియ బాలుడు పుట్టెను సత్యభామకున్!!"

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    భామకు భర్త పోరనుచు భావన జేసిన"గై"వివాహమే
    క్షేమమటంచు కోరుకొని జేసిరి యుగ్మపు జీవనమ్ము;వే
    క్షామమె వీర్యపున్నిధులు కావలెనన్న లభించె గావునన్
    భామయు భామయున్ గలియ బాలుడు పుట్టెను సత్యభామకున్

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    ప్రేమయె ముఖ్యము లింగపు
    సామాన్యపు మేళవంబు చాలు నటన్నన్
    బాము(జన్మము)కు వీర్యము పరులదె
    భామయు భామయు గలియగ బాలుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  16. రామయ శెట్టియున్బలికె రాక్షస కృత్యము గాదలం చుమా
    భామయు భామయున్గ లియ .బాలుడు పుట్టెను సత్య భామకు
    న్నామని బాధ లొందినను హాయిని నీయగ గాన్పు నొందగా
    రాముని దీవనల్గలుగ రమ్యమ యౌనుగ జీవితంబుసూ

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. గోముగ నత్తయె పాపన
      నేమైనను మేనయల్లుఁడే నిక్కంబం
      చా మగని సోదరి యనియె
      భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్
      [కలియు = కలియఁబడు]


      ఏమని చెప్ప వచ్చు నిల నింపుగ నద్భుత కృష్ణ లీలలం
      గోమలు లెల్లరం దమినిఁ గోర్కిలు తీర్చుచు నాదరింపగం
      బ్రేమగఁ జేర చేర దరి పేర్మిని నంతఁ బదారు వేలవన్
      భామయు భామయున్ గలియ, బాలుఁడు పుట్టెను సత్యభామకున్

      తొలగించండి
  19. భామకలాపమందొకడు భామగ జవ్వని సత్య భామతో
    గ్రామము గ్రామమున్ దిరిగి గానము నృత్యము జేసి యామెనే
    శ్రీమతి గాగ జేసి గన చిన్ని కుమారుని , బల్కి రెందరో
    భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    సారము గల రామాయణ
    మారయ భాగవత భారతాదుల గనకన్
    జారుల కథలనె మెచ్చగ
    భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్

    రిప్లయితొలగించండి
  20. మామయ్యను పెండ్లాడిన
    కామయ భార్యలిరువురికి గర్భము రాకన్
    కోమలితో పెండ్లిజరిప
    భామయు భామయు గలియగ, బాలుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  21. కామితము దీర నెంతయు
    ప్రేమను మున్యాశ్రమమున పెండిలి యాడన్
    రామకుల రాజు నాప్రతి
    భామయు, భామయు గలియగ బాలుడు పుట్టెన్!


    రామకుల రాజు= రఘువంశ రాజు, దుష్యంతుడు!

    రిప్లయితొలగించండి
  22. భామల పాత్రలు వేసెడి
    భీముని కే కొడుకు పుట్టె, వేడుక లందున్
    కోమలి యొక్కతి పలికెను
    భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్


    కోమలిగా నటించి జన కోటియె భేషని మెప్పుపొందు వా
    డామెను పెండ్లియాడెనట యాలికి పుత్రుడొకండు గల్గగన్
    గ్రామము లోనికొమ్మలు పరాచికమాడుచు పల్కిరిట్టులన్
    భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

    రిప్లయితొలగించండి
  23. భామగ మారె దత్తు డొక వత్సర కాలము యక్షు నిందచే
    ఆముగ జొచ్చె నంతి పురమందున,భోజుని పుత్రి స్నేహమై
    శ్రామము దీరగా కలియ సర్వ జనావళి పల్కిరీగతిన్
    భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

    రిప్లయితొలగించండి

  24. పిన్నక నాగేశ్వరరావు.

    భామయె నటించి మగనిగ

    ప్రేమగ సరసోక్తులాడి ప్రియసతి తోడన్

    గోముగ నాటకమందున

    భామయు భామయు గలియగ బాలుడు
    పుట్టెన్.

    **********************************

    రిప్లయితొలగించండి
  25. ఈమహి మానవుడున్ దన
    నామము, వంశోన్నతికిని నందను కోరున్
    ప్రేమించె యువతి నొకతెను
    భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  26. భామగ నటించు నాతడు
    భామగనె జన హృదయముల భాసిల దొడగెన్!
    హేమను పరిణయమాడన్
    భామయు భామయు గలియగ బాలుడు పుట్టెన్!

    రిప్లయితొలగించండి

  27. భామాకలాపమందున
    భామగ నటియించెను మగవాడచ్చోటన్
    సామంబున మాటలతో
    భామయు భామయు కలియగ బాలుడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి
  28. ఆ ముని మాట యసత్య
    మ్మేమో యని శంక గలిగి యినునే బిల్చెన్
    ప్రేమగ ., మనమున కుంతీ
    భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్ !!

    ( భా మయున్... కాంతి మయున్ సూర్యుని..)

    ఏమవి ముచ్చటల్!విసుగునెంతయు జెందక నమ్మలక్కలున్
    భామయు భామయున్ గలియ.,"బాలుఁడు పుట్టెను సత్యభామకున్
    రామునికాడపిల్ల యట , రంగనికేవురు బిడ్డలంచు" నే
    మేమొ వచించి నవ్వుకొని యింటికి జేరెదరంత హాయిగా !!

    మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    [కళాపూర్ణోదయంలో కథలరాజు పింగళి సూరన, సతిని పతిగాను, పతిని సతిగాను జేయగా, జరిగిన యద్బుతము...కళాపూర్ణుఁడు జన్మించుటకు దారితీసెనని తలుపుట]

    నేమమ్ముఁ బూని పింగళి,
    యా మగువను మగనిఁగాను, నా పతి సతిఁ గాన్
    దా మలచఁగఁ, గథలోపలి
    భామయు, భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్!

    రిప్లయితొలగించండి
  30. నోములు పండగా కడకు నొప్పులు రాగనె సత్యభామనున్
    "కోమల-ద్రౌపదీ క్లినికు" కొండొక రీతిని జేర్చి వేచగా
    గోముగ లేడి డాక్టరులు కోమల ద్రౌపది వచ్చి చేరగా
    భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

    (శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి స్ఫూర్తితో)

    రిప్లయితొలగించండి