17, మార్చి 2017, శుక్రవారం

సమస్య - 2310 (చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్"
లేదా...
"చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

33 కామెంట్‌లు:

  1. భువి నేలెడి జనులందున
    చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్
    దివినుంచి దిగిన వాడట
    శివుడిచ్చిన వరము వలన స్వేఛ్చా పరుడై

    రిప్లయితొలగించండి
  2. చవిగల మాటలు నుడువెడి
    భువిలో నాషాఢభూతి పుణ్యాత్ముండే
    శివునే బుట్టలొ వేయుచు
    చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భవనముల స్టాకు షేరుల
      హవనము గావించి తీవు హర్షదు మెహతా!
      చెవులను కొఱుకుచు నేతల
      చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

      తొలగించండి
    2. పవమాన వాహనములను
      ద్రవములు మద్యములు బీర్ల దాహము తీరన్
      హవలా ధనముల బ్యాంకుల
      చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

      తొలగించండి
    3. ధవళపు ధోతియు జిబ్బా
      ధవళపు టోపియు శిరమున ధార్మిక రీతిన్
      సవరించి వోటరు ప్రజల
      చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

      తొలగించండి
  3. డా.పిట్టా సత్యనారాయణ
    (తాయము॥అరుదగు వస్తువు)
    ఇవిగో తాయములిత్తును
    భువి నను గెలిపించ తమకు బువ్వుల వోలెన్
    ఛవిమీరగనని తప్పుచు
    చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్!

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    కవిగానే మను గోర్కె(కోర్కె)లెందుకిలలో గట్టెక్కగా నెంపికన్
    ఛవిమీరన్ బదజాలమున్ మలుపుచున్ ఛత్రంబు బట్టంగ నా
    రవి గాంచండటువంటి వర్ణన లనన్ రంజింపడే వోట్లకై
    చెవిలో బువ్వుల బెట్టువాడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    కవిగానే మను గోర్కె(కోర్కె)లెందుకిలలో గట్టెక్కగా నెంపికన్
    ఛవిమీరన్ బదజాలమున్ మలుపుచున్ ఛత్రంబు బట్టంగ నా
    రవి గాంచండటువంటి వర్ణన లనన్ రంజింపడే వోట్లకై
    చెవిలో బువ్వుల బెట్టువాడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  6. కవియై నిత్యము నీతికిన్ నిలచుచున్ కాంక్షించి దేశోన్నతిన్
    భువిపై మానవ జాతికిన్ సతతమున్ బోధించుచున్ యోగ్యముల్
    రవియైవెల్గుచు భార్యమానసమునన్ రాత్రిన్ రతిక్రీడలో
    చెవిలోఁ బువ్వులఁ బెట్టువాడె గుణ సౌశీల్యుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    అవికారుండు ననంతుడున్ సుభగుడున్నైనైశ్వర్య సంధాతగా
    సువిశాలార్ద్రత గల్గు తండ్రి వనుచున్ సూక్తుల్ బ్రవంచించు వే
    రువిచారాళియులేక మ్రొక్కగ హరిన్ రొక్కంపు నా కర్మకున్
    చెవిలో బువ్వుల బెట్టు వాడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  8. అవురా కలియుగ మందున
    నవిరళ మగు స్వార్థబుద్ధి యత్యాశలతో
    భువిలో దిరుగుచు జనముల
    చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్.

    అవురా యేస్థితి గల్గెనో జగతిలో నత్యంతమౌ స్వార్థమున్
    వివిధంబైన నవీన పద్ధతులలో విత్తార్జనం బేయెడన్
    భవసార్థక్యద మన్న భావనముతో పల్మారు సంఘంబునం
    జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  9. అవలీలన్ తనకిచ్చవచ్చినటు మర్యాదన్ మానువాడె, జ్ఞా
    తి,విరోధంబులుఁబూని,తప్పటడుగుద్రేకంబునన్ వేయు వా
    డె,వచింపంగను కార్యసాధకుడు-వాడే పెద్దవాడిద్ధరన్--
    చెవిలోఁబువ్వులుఁబెట్టువాడె గుణ సౌశీల్యుండు ముమ్మాటికిన్.

    రిప్లయితొలగించండి
  10. అవలంబించుచు సతము గు
    రువు చెప్పిన బోధనలను రూఢిగ కడు రూ
    పవతిన్ సుతగని, గురువుకు
    చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  11. భవసాగర మీఁదగ దే
    వ విభుండు నుమా ధవుండు పరమేశున కా
    శివుని కనురక్తిఁ, దాననె
    జెవిలోఁ, బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

    [పెట్టువాఁడు = సమర్పించువాఁడు]


    అవనీ నాథులు భూసురేంద్రులును విద్యాధిక్యు లౌగాక యీ
    భువిసంజాతులు దైవ భక్తులు సుమీ పుణ్యాత్ములే యెంచఁ గే
    శవ పాదార్చితముల్, త్యజించి మదిఁ దాత్సారమ్ము, సద్భక్తినిం
    జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  12. భువిలోన నెవడు నేర్పున
    సవినయముగ లేని పోని సంగతి జెపుచు
    న్నవివేకుల నిరుపేదల
    చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  13. భువిలోన నెవడు నేర్పున
    సవినయముగ లేని పోని సంగతి జెపుచు
    న్నవివేకుల నిరుపేదల
    చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  14. భువిలోన నెవడు నేర్పున
    సవినయముగ లేని పోని సంగతి జెపుచు
    న్నవివేకుల నిరుపేదల
    చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  15. భువిలోన నెవడు నేర్పున
    సవినయముగ లేని పోని సంగతి జెపుచు
    న్నవివేకుల నిరుపేదల
    చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  16. భువిలోన నెవడు నేర్పున
    సవినయముగ లేని పోని సంగతి జెపుచు
    న్నవివేకుల నిరుపేదల
    చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  17. నవనవ లాడెడి చర్మము
    యవయవ సౌందర్యములను యాడుల బెంచ
    న్నవగను జనమ్ము గొర్రెలు
    చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్!

    యాడులు= ప్రకటనలు
    ఈ రోజు ఆంగ్ల పదం ప్రాస కోసం తప్పలేదు!
    బుధులు క్షమింతురు గాక!

    రిప్లయితొలగించండి
  18. నిన్నటి పూరణ:

    కులవిభేదములవి కూడగా నున్నత
    విద్యగరపు చోట వింతగాను
    ఛాత్రు లెల్ల జేరి ఛయ్యన చెలగంగ
    రణము ప్రాంగణమది రణము గాదె!

    రిప్లయితొలగించండి
  19. భువిలో బ్రదుకును హాయిగ
    చెవిలో బువు బెట్టువాడె, శిష్టుడు జగతి
    న్నవమానము లెదురైనను
    భవములనే గోరుకొనెడు భవ్యుడె దలపన్

    రిప్లయితొలగించండి
  20. అవనిని గొలువగ నిత్యము
    శివుడే గద దానొకండు శ్రీమతి తోడన్
    చవితో నిర్మాల్యము గొని
    చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  21. భవభయ హరు ననవరత
    మ్మవిరళ భక్తిని భజించి యాననమందున్
    ధవళాంశువుల విబూదియు
    చెవిలో బువు బెట్టు వాడె శిష్టుడు జగతిన్!

    రిప్లయితొలగించండి
  22. నవదంపతు లాస్యంబున
    అవసరమగు సరసమందు యతివినయముగా
    నవవధువుకు వరుడుంచెను
    చెవిలోబువు బెట్టువాడె శిష్టుడుజగతిన్.
    2.కవితాశక్తినిమించి బల్కుచును సంకల్పంబు లక్ష్యంబుగా
    శ్రవణానందము నింపు బూటకము పంచన్ బూను పాండిత్యమున్
    అవమానంబని నెంచకన్ గురువు లత్యాసాన డబ్బాశచే
    చెవిలో బువ్వులు బెట్టువాడె గుణ సౌశీల్యుండు ముమ్మాటికిన్.




    రిప్లయితొలగించండి
  23. సవినయముగ ఛాత్రుండై
    ధవళకరుడు గురునిపత్ని తారను గూడెన్
    శివుని సిగ జేరె.గురువుకు
    చెవిలోబువు బెట్టువాడె శిష్టుడుజగతిన్.

    రిప్లయితొలగించండి
  24. సవరణతో ...
    సవినయ భక్తిని జేరుచు
    శివు నభిషేకించి చంద్రశేఖర శిరమున్
    భువి మంత్రమ్ములు బడగా
    చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  25. నవనీత చోరుడు,నరుఁడు
    చివరన వచ్చిన దొలుతనె జేయగ సాయ
    మ్మవిధేయ సుయోధనునికి
    చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె,శిష్టుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
  26. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    18, మార్చి 2017, శనివారం




    *"పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు"*

    లేదా...
    *"పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"*

    పురమున నాసుపత్రి నటుబోవపరీక్షలజేసివైద్యుడున్
    తరుణికి గర్భమందుకలదంచువచింపగనాడుబిడ్డయే
    పురుడమరంగఁదానడుగ బోయెనుగర్భిణిగారి భర్తయౌ

    *"పురుషుఁడు పూరుషుం గలియఁ !బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"*


    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  27. గురువు గారికిపాదాభివందనములు ధన్యురాలను

    🌺🌻🌺

    *శ్రీమతి సందిత బెంగుళూరు*

    చెవిపైపూవులనిడుకొని
    పవలున్ రేయి హరినామ భజనలతో పే
    లవమౌకలివాంఛ వినక
    చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్

    🌷🌷🌷

    కలి పురుషుడు పాపకూపములలోనికి కదిలించాలని విచలనాలను కలిగాంచాలని చెవులబడజేయు కలికిరూపకలిభావాలనువినకుండా వినబడకుండా హరినామసంకీర్తనలుచేస్తూ కలిపురుషుని చెవులలో పూవులుపెట్టినట్టు ప్రవర్తించిన విద్యాప్రకాశానందగిరిస్వాముల వంటి బ్రహ్మచారులను స్మరిస్తూ🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  28. కవినన్ కూయుచు కోత కోయుచును బాకాలూదు కాకమ్మకున్
    భువిలో నాకిక సాటి లేరనుచుచున్ భోగించు బాబాకునున్
    లవలేశమ్మును విద్యలేక నిధితో రాణించు మేధావికిన్
    చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి