18, మార్చి 2017, శనివారం

సమస్య - 2311 (పురుషు లిద్దఱు గలియఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు"
లేదా...
"పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

  1. పాల సంద్రపు మథనము వేళ లోన
    హరుడు ప్రేమించి కలియగ హరిని జేరి
    అప్ప కౌగిలి చెఱలోన నయ్య సొలసి
    పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కులము గోత్రము లిరివుర కుదురు కొనగ
      వధువు క్రీగంటి జూపులు వరుని గలియ
      వధువు తండ్రియు కడుగగ వరుని కాళ్ళు
      పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు

      తొలగించండి
    2. పూరణలో నా దురుద్దేశం: కాళ్ళు కడిగి కట్నం ఇస్తేనే పెళ్ళి జరిగి పిల్లలు పుడుతారని ;)

      తొలగించండి
    3. అంతరాళ మందున వింత లన్ని యెన్నొ
      తార లేరీతి నభమున జేరు కొనియె?
      మేఘ మొకటి మరొకటియు మేళ వించ...
      పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు



      "Proof That Stars Form When Stellar Clouds Collide"

      www.technologyreview.com/s/424442/proof-that-stars-form-when-clouds-collide/

      తొలగించండి
    4. ధూము ధాముగ వాద్యముల్ ధూప దీప
      హారతుల తోడ నేతుల ధార తోడ
      పంతు లిరువురు పోటీగ గొంతు చించ...
      పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు

      తొలగించండి
  2. డా.పిట్టా సత్యనారాయణ
    పురుష పూరుష ప్రేమలు బుద్ధి కొలది
    పరిఢవిల్లగ సంతుకై పరితపించ
    కృతక వీర్యము నొక సతికిచ్చి మనగ
    పురుషులిద్దరు గలియగ బుట్టె సుతుడు!

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    హరిహరులిద్దరొక్కటయి యప్పని నొక్కని నిచ్చిరిద్ధరిన్
    నెర పులి తోలు గట్టుకొను నింపగు జ్యోతిని నిల్చు కొండపై
    ఇరుముడి నేతి స్నానముల నెమ్మిగొనున్ శబరీషుడేలగన్
    పురుషుడు పూరుషుం గలియ బుత్రుడు పుట్టెనదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    పురుషుని నాభి బ్రహ్మ (న)యట బుట్టిరి మానస పుత్రులేర్పడన్
    పురుషుడె సృష్టికర్తయయె పుణ్యుడు శంభుని వీరభద్రుడే
    నెర నొక రోమమున్ జనన రీతిని దక్షుని నొంచె చూడగా
    పురుషుడు పూరుషుం గలియ పుత్రుడు పుట్టె నదేమి చోద్యమో!?

    రిప్లయితొలగించండి
  5. అతివ కల్యాణి సద్భక్తి ననవరతము
    చేయు పూజల నందువా రాయుగాది
    పురుషు లిద్దఱు, గలియఁగఁ బుట్టె సుతుఁడు
    వారి కృపచేత నాయమ చేరి మగని.

    నిరతము మ్రొక్క సాధ్వి కడు నిష్ఠను, మెచ్చెను దేవదేవు డా
    పురుషుడు, పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె, నదేమి చోద్యమో
    సురుచిర రూపధారి యగు సుందరు డప్పుడె యౌవనంబుతో
    నరయుచు నున్నవారి కతి హర్షము గూర్చెను నాడు వింటిరే.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  6. ఇంతి యొకతె పు రుషవేష మింపు గాను
    దాల్చి సంగమంబును గోరి దాను బోయి
    పురుషు నొద్దకు, బ్రీతితో పొర్లి యాడ
    పురుషు లిద్దరు గలియగ బుట్టె సుతుడు


    రిప్లయితొలగించండి
  7. ఆదిపురుషుని యర్ధాంగి యవగ మాయ
    పురుషుడనగ నెవడు పూబోడి గాదె
    సర్వజీవుల యందుదా సంచరించు
    పురుషులిద్దరు గలియగ బుట్టె సుతుడు!

    రిప్లయితొలగించండి
  8. ఏమనగ వచ్చు నుచితమ్ము లెఱుగక యల
    పరిణయము కాక పూర్వము పాప మంతఁ
    గామ మోహితులై తమకమున నతివ
    పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు


    పరిణయ మన్నఁ జూడఁ దగుఁ బన్నుగ వంశపు సప్తకమ్ములన్
    ధరణిని లేని పక్షమునఁ దప్పవు బాధలు నిశ్చయంబుగం
    జరిత మొకింత జూడకయె సత్వర మెంచుచుఁ బెండ్లి కన్య కా
    పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో

    [కాపురుషుఁడు = దుష్టుఁడు]

    రిప్లయితొలగించండి
  9. పుణ్య గతులనొసంగెడు పుత్రుడున్న
    చాలునంచు దంపతులట సంచరించి
    పట్టు కల్గిన మూలికా వైద్యులనెడు
    పురుషులిద్దరిఁ గలియఁగఁ బుట్టె సుతుఁడు

    రిప్లయితొలగించండి
  10. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    18, మార్చి 2017, శనివారం




    *"పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు"*

    లేదా...
    *"పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"*

    పురమున నాసుపత్రి నటుబోవపరీక్షలజేసివైద్యుడున్
    తరుణికి గర్భమందుకలదంచువచింపగనాడుబిడ్డయే
    పురుడమరంగఁదానడుగ బోయెనుగర్భిణిగారి భర్తయౌ

    *"పురుషుఁడు పూరుషుం గలియఁ !బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"*


    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  11. పురుషుడు పూరుషుం గలియ బుత్రుడు బుట్టె నదేమి చిత్రమో
    యరయగ నిద్ది చిత్రమ యహాయనగా బ్రజలం దరప్పుడున్
    హరిహరు లిద్దరా విధపు నాకృతి దాల్చగ సంభవించెగా
    నిరవగు పుత్రజన్మ పు నహీన చరిత్ర ను గాంచుమా యికన్

    రిప్లయితొలగించండి
  12. చందురునివెల్గునందున సందెవేళ
    ప్రకృతియొడిలొన పవళించి పరవశించి
    మరులుగొలుపగ మదనుడు మరిమరి సతి
    పురుషులిద్దరు గలియగ బుట్టె సుతుడు

    రిప్లయితొలగించండి
  13. తరచసుదాబ్ది దేవతలు దైత్యసమూహము, పుట్టెనబ్దిలో
    సురభియు, లక్ష్మి, కల్పకము, సోముడు,వేల్పులభోజనమ్ములున్
    తరుణిగ మార మాధవుడు, త్ర్యక్షు మనస్సు చలించ, మోహమున్
    పురుషుడు పూరుషుం గలియ బుత్రుడు పుట్టెనదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  14. సంతు కొరకయి యాత్రలు సంచరించు
    దంపతుల చింతలను విని దారి జూప
    పురుషు లిద్దరు , గలియగ బుట్టె సుతుడు
    వారు తెలియ జేసినయట్టి దారి నడచి.

    రిప్లయితొలగించండి
  15. అతివ గర్భమందున పిండమడ్డు తిరగ
    కానుపిక కష్టమనుచును కలత జెంది
    పెద్ద చదువుల వైద్యునా వెజ్జు పిలువ
    పురుషులిద్దరు గలియగ బుట్టె సుతుడు

    సురలకు సుధనుపంచగ హరియె వచ్చె
    సుందరమగు మోహినిరూప మందు నటకు
    హరుడు కామింప పడతిని యబ్బురముగ
    పురుషులిద్దరు గలియగ బుట్టె సుతుడు.


    సురలకు పంచగా సుధను సుందరి రూపము దాల్చినట్టి శ్రీ
    హరిని హరుండుగాంచివిరహమ్మున జేరగ నాదిమూర్తులౌ
    పురుషుడు పూరుషుంగలియ బుత్రుడు పుట్టెనదేమి చిత్రమో
    హరిహర పుత్రుడై శరణమంచును వేడిన బ్రోచుచుండెనే

    రిప్లయితొలగించండి
  16. శివుడు,కేశవులిద్దఱు వివశులవగ
    హరిహరాత్మకుడై పుట్టె నయ్యపయును
    లోక కళ్యాణమయ్యె, కల్లోల మణగె
    పురుషులిద్దఱుఁగలియగఁబుట్టె సుతుడుఓ

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. సరసభర రాసకేళిని పురుష వరుడు
    పురుష రాగమౌ హిందోళమును మురళిని
    మ్రోయ జేయగ చంద్రుడు బుట్టెననగ
    పురుషు లిద్దరు కలియగ బుట్టె సుతుడు

    రిప్లయితొలగించండి
  19. హరియు హరుడును నొకచోట నవని లోన
    పురుషు లిద్దరు కలియగ పుట్టె సుతుడు
    నతడె నయ్యప్ప యను పేర నవతరించి
    అర్చనాదుల నెల్లను నందుకొనియె.

    రిప్లయితొలగించండి