22, మార్చి 2017, బుధవారం

సమస్య - 2315 (పరుల మేలుఁ గోరు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద"
లేదా...
"పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

47 కామెంట్‌లు:

  1. ఎవరి మేలుగోరి కడలి లవణ మొసగె?
    నెవరి మేలుగోరి ప్రకృతి పవన మొసగె?
    నెవరి మేలుగోరి కవియు కవిత నొసగె?
    పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ద్యుమణి పద్మాకరము..." సుభాషితమును అనుకరించబోయి బోల్తా కొట్టాను...

      తొలగించండి
    2. ఎవరి కోసము జీససు డెక్కె శిలువ?
      ఎవరి కోసము గాంధీజి యిచ్చె తనువు?
      ఎవరి కోసము శ్రీకృష్ణుడవతరించె?
      పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద...


      "పరిత్రాణాయ సాధూనాం..."

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలలో సంధిగ్ధత గోచరిస్తున్నది. పరహితం కోరినవాళ్ళు పతితు లెలా అయ్యారు?

      తొలగించండి
    4. ఏసు క్రీస్తు, గాంధీ గారూ స్వార్ధం కోసం తమ ప్రాణాలివ్వలేదు గదా. శ్రీ కృష్ణుడు స్వర్గం వీడి భూమికి దిగినది సాధువులను రక్షించుట కొరకేనని చెప్పినాడు కదా...అని...__/\__

      తొలగించండి
  2. అన్యు లెట్లున్న నాకేమి యని దలంచి
    స్వార్థ భావైక చిత్తులై సకల జనులు
    సంచరించుచు నున్నట్టి సమయమందు
    పరుల మేలు గోరు నతడు పతితుడు గద.

    నిరతము స్వార్థ మేగతిని నిష్ఠగ బూనుచు విశ్వమంతటన్
    తిరుగుచు నుండు వారలకు దేవుని నందరిలోన జూచుచున్
    స్థిరమతియౌచు సంఘమున సేవలు చేయు మహచ్ఛుభేచ్ఛతో
    పరుల హితంబు గోరెడి కృపామయుడే పతితుండు నా దగున్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      గంజాయి వనంలో తులసిమొక్క... అందరు స్వార్థపరులలో ఒక్కడు పరహితైషి అయితే వారి దృష్టిలో పతితుడే... బాగున్నవి మీ పూరణలు. అభినందనలు.

      తొలగించండి
  3. డా.పిట్టా
    ఒరులు నీ మేలు గోరరీ యుర్వివియందు
    రంతి దేవుని కీనాడు రథము రాదు
    కొంత తన నుద్ధరించక గొడవ పడుచు
    పరుల మేలు గోరెడునతడు పతితుడుగద!

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    హరియె స్థిరీకరించె నిటు హైందవ ధర్మము కలిని నెంచగా
    చెరిసగ మన్నరీతి నిటు జేయుము దానము త్యాగమేర్పడన్
    "నెరి నను గావరా",యనుచు నెమ్మిని నాత్మను(ను)యుద్ధరించకే
    పరుల హితంబు గోరెడికృపామయుడే పతితుండు నాదగున్(పతితుండనందగున్)

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    మొదటి పూరణలో టై పాటు యుర్వి గాచదువ ప్రార్థన."వి"అదనంగా పడినది,ఆర్యా,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటి పాదం చివర గణదోషం. సవరించండి.

      తొలగించండి


  6. సంఘ జీవియై మనుజుడు చక్క గాను
    పరుల మేలుఁ గోరు నతఁడు ; పతితుఁడు గద
    కొంత యైన కనికరము, కూర్మి యసలు
    లేక నడచుకొను నరుడు లెక్క జూడ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    2వ పూరణంలో 2వ పాదములో"నిటు"కుబదులు"నిక"ను వేసి పునరుక్తిని గాదన్నాను,ఆర్యా,

    రిప్లయితొలగించండి
  8. నిరతము దుష్టలోక ధరణీపతిగా వెలుగొందు నీచుడున్
    పరుల సుఖమ్ము చూడగనె బాధను పొందెడి కల్మషాత్ముడున్
    పరులకు పూని నిత్యమును బాధలు పెట్టెడి దుష్టజీవియున్
    పరుల హితంబు గోరెడి కృపామయుడే? పతితుండు నా దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని సోం (సోము?) గారూ,
      అద్భుతం! విలక్షణమైన విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. పరుల పైకమాశింపగ పరమ లోభి
    పరుల పడతుల పొందెడు పాతకుండు
    నరుల పీడించుచు ధరలోన నవినీతి
    పరులమేలు గోరునతడు పతితుడు గద!

    రిప్లయితొలగించండి
  10. తనకు పేరు రాదు ప్రజల దప్పి తీర
    లబ్ది పొందెదరుఁ దగ పాలకులటంచు
    నీచ బుద్ధి తోడఁదలచి నిలువరించ
    ప్రజల మేలు, గోరువాడు పతితుడు గద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      కొంత అన్వయక్లేశం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. స్వర్గమునకేగు నిజముగా సంతతమ్ము
    పరుల మేలుఁ గోరు నతఁడు, పతితుఁడు గద
    పరులసొమ్ముకై యారాట పడుచు సతము
    దుర్వ్యసనములతోడుత తూలువాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. రాజకీయము సేయగ రాటు దేలి
    కరుణ వీడి మానవతను కాల రాచి
    ధనము నార్జింప జూచుచుండు నవినీతి
    పరుల మేలు గోరు నతడు పతితుడు గద!

    రిప్లయితొలగించండి
  13. పుణ్య లోకంబులకు నేగు బోధ గురువ !
    పరులకు మేలు గోరునతడు ,పతితుడు గద
    గొడ్డు మాంసాలు దినుచును గొదవ యైన
    పాప భీతిని లేనట్టి బడుగు వాడు

    రిప్లయితొలగించండి
  14. నిరతము సత్యమార్గమున నిశ్చలమైన మనస్సుతోడుతన్
    తిరుగుచు, భక్తిఁ గొల్చుచును తీర్థకరున్ వసియించు నిత్యమున్
    పరుల హితంబు గోరెడికృపామయుడే, పతితుండు నాఁ దగున్
    స్థిరమగు స్వార్థబుద్ధికల చెడ్డమనస్కుడు సంతతమ్మిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీర్థకరున్ వసియించు'...?

      తొలగించండి
  15. నిరతము పూజ్యుడౌఁగద వినిర్మలభావ హితప్రయుక్తుడన్,
    పరుల హితంబుఁగోరెడు కృపామయుఁడే,---పతితుండు నాఁదగున్
    దురితము లాశతో సలుపు దుర్జను డొక్క నిమేషమేనియున్
    ధర పరిపూర్ణమౌ మహిత ధర్మపథంబునుఁగాంచడించుకన్.

    రిప్లయితొలగించండి
  16. స్వార్థ చిత్తుఁడు దుష్టస్వభావుఁ డన్య
    జన ధనాపహరుఁడు క్రూర జనుఁడు విభుఁడు
    రాజ నీతి నంతను వీడి రాజ భజన
    పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద


    తరతమ భేదముల్ విడిచి ధర్మయుతమ్ముగ సంచరించుచుం
    గర మనురక్తి నర్హులకు గౌరవ మిచ్చిన మంచివాఁ డగున్
    నిరతము విత్త లాభమున నిశ్చిత బుద్ధులు స్వార్థ భావ త
    త్పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      భజనపరులతో మొదటి పూరణ, స్వార్థతత్పరతతో రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  17. నిరయము బోవు సద్గతి కనేకుల యాశిసు లొందుచున్భువిన్
    బరుల హితంబు గోరెడి కృపామయుడే ,పతితుండునా దగున్
    కరంబు మదంబు తోడన నెకాయెకి దుష్కృత కార్య మెంతయు
    న్నెరవది లేక జేసిన ననేకము గాగను నాతడేధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో 'నిరయము (నరకము) పోవు సద్గతికి'... అన్వయం కుదరడం లేదు.

      తొలగించండి
  18. ధన్యజీవి యగునుగాదె తధ్యముగను
    పరులమేలు గోరు నతడు, పతితుడుగద
    మానవత్వము లేకుండ మహిని జనుల
    నరక బాధలు బెట్టుచు నవ్వువాడు!!!

    రిప్లయితొలగించండి
  19. పంచ వర్షములు ప్రజల ప్రగతి దోసి
    మాట తప్పిన నేతయే మరల వచ్చి
    యోటు వేయుడని యడుగు బూటకులగు
    పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. భరతదేశపు ఖ్యాతిని భంగ పఱచి
    ప్రగతి పథమున కవరోధపరచునట్టి
    ఖరులు హంతకుల్ విద్రోహకరుల ధర్మ
    పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఖరులు... ఖలులు కావచ్చు.

      తొలగించండి
  21. . కరువున,కాటకంబున సకాలమునందున రక్షగూర్చుగా
    పరుల హితంబుగోరెడి కృపామయుడే|”పతితుండు నాదగున్
    మరచిన మానవత్వమున మంచిని వీడుచు వంచనంబులే
    వరము లటంచు నెంచగల పాపపు కోపియు నెప్పుడేనియున్|”
    2.మంచి మానవతలు నెంచి మసలగలిగి
    పరుల మేలుగోరునతడు|”పతితుడుగద
    ముఢతత్వము నందున మూర్ఖ తనము
    గలిగి మెలగుచు యవినీతిదలచువాడు”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. తీర్థయాత్రలు క్షేమంగా ముగించుకొని వచ్చినందుకు మా బావమరది మమ్మల్ని భోజనానికి పిలిచాడు. అందువల్ల రోజంతా బ్లాగును చూడలేకపోయాను. స్పందించడం ఆలస్యమయింది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  23. 22/3/17
    9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
    సమస్యాపూరణం

    తే.గీ:ఆపదలొడమ కాపాడి యాదుకొనును
    పరుల మేలు కోరునతడు;పతితుడు గద
    సతతము పరులకిలలోన సంకటముల
    కలుగ చేసి బాధించును కలియుగాన.

    రిప్లయితొలగించండి
  24. అరువుల నిచ్చుచున్ వడిగ నర్వది శాతపు చక్రవడ్డికిన్
    కరువున కర్షకాదులను కావక నిండ్లను కొల్లగొట్టుచున్
    బరువుగ దోచి భాగ్యముల భారత వాసుల వల్లకాటి కా
    పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్

    రిప్లయితొలగించండి