13, ఏప్రిల్ 2017, గురువారం

దత్తపది - 109 (తల)

నాలుగు పాదాల ప్రారంభంలో 'తల'ను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఇష్టదైవాన్ని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

82 కామెంట్‌లు:

  1. తలచిన పనులు నెరవేరు తపనతోడ
    తలచెదమదిని నిరతము ధరణి నారు
    తలల దేవుని పార్వతీ తనయు డనగ.
    తలకొనుచు మమ్ము దీవించు తాననయము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      షణ్ముఖుని స్తుతించిన మీ పూరణ బాగున్నది.
      కాని 'ఆరుతలల' అని తలను స్వార్థంలో ప్రయోగించారు.

      తొలగించండి
  2. తలవని దినమ్ము బహు చిం
    తలలో గడచును, చిరాకు, తాపత్రయముల్;
    తలపుల నీవుండగ భూ
    తలనాథా! హరి! తొలగవె! తామస గణముల్!

    రిప్లయితొలగించండి
  3. తలపగ నీదు నామమునుఁ దప్పక తీరు మనోరథమ్ము, నే
    తలకును నేతవైన యధిదైవత రూపుడ వీవె గాదె , రా
    తల నవలీల మార్చగల దక్షుడవైన మహాత్మ! నాదు చే
    తలను మనమ్మున్ గొనక తప్పిదముల్ క్షమియింపవేలొనో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      'వ్రాతల నవలీల...' అనండి.

      తొలగించండి
    2. తప్పకుండానండీ. ధన్యవాదములు.

      తొలగించండి
  4. తలచితిని ముందుగా పార్వతమ్మసుతుని,
    తలచితినిమదిలో నేక దంతుడనుచు,
    తలచితిని గణ పతికి వందనము చేసి
    తలవుటకొరకు విఘ్నముల్, దయను చూపి
    తలపడు పనులు తీర్పగ సులువు గాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణిగారూ! పద్యం బాగుంది. మొదటిపాదంలో అఖండయతి, వీలయితే మార్చండి. అది తీసినా నాలుగు పాదాలు వ్రాసారు గదా, సరిపోతుంది.

      తొలగించండి
    2. ధన్యవాములు సరిదిద్దుకుంటాను

      తొలగించండి
    3. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      సోమయాజులు గారూ,
      నేనూ అఖండయతికి వ్యతిరేకినే. నా పద్యాలలో ఎప్పుడూ అఖండయతిని ప్రయోగించను. కాని ఎవరైనా ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను. ఎంతైనా ఔత్సాహిక కవులు కదా! చూసి చూడనట్టు మిన్నకుంటాను.

      తొలగించండి


  5. తలమిది విభునిది కనులకు
    తలపులు తొలగన వెలుగుగ తరమగు క్షేత్రిన్
    తలచెద, కలయన కలయును
    తలరులు, మనము వికసింప తరుణంబిపుడే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పద్యం బాగుంది. కాని భావమే కొంత అస్పష్టంగా ఉన్నట్టుంది.

      తొలగించండి
  6. తలచిన తనభక్తుల చే
    తలలో విఘ్నములు ద్రుంచి ధరణిని వరదా
    తలలో నగ్రగు డయి వం
    తలగమి బోకార్చు నేకదంతునకు నతుల్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      వరదాతలలో మేటి అంటూ మీరు చేసిన వినాయక స్తుతి చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. తలచిన బల్కునట్టి కలిదైవమ! సుందర వక్షసీమఁ గాం..
    తల ధరణీ రమాభిధల దాల్చియు, కోర్కెలు దీర్చునట్టి భూ..
    తల సురవాటి కొండపయి దర్శనమిచ్చుచు భక్తకోటి చిం..
    తలఁ దొలగించు వాడవు గదా! జగదీశ్వర! వేంకటేశ్వరా !!

    రిప్లయితొలగించండి
  8. తలపు చూలిని చంపిన శూలి నెపుడు
    తలతు, వాని ప్రియసుతుని తలికె గాను
    తలతు,అతని తమ్ముడు పుంజు దాల్పునిపుడు
    తలచెద,నతని మాతఔ దక్ష సుతను
    తలతు, నామెసోదరు డైన తమ్మి గంటి
    తలతు, ఆతని సతి తల్లి తల్లి నెపుడు
    తలతు, ఆమె సుతుండా విధాత నేను
    తలతు,అతని సతి వాక్కు తల్లి నిపుడు
    తలతు, ఆమె కృప గలిగి ధరణి పైన
    తలరు చున్న కవివరుల తలతు నెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణిగారూ! పద్యం బాగుంది. మొదటిపాదంలో యతి తప్పింది, వీలయితే మార్చండి. ప్రాసయతి అయితే ప్రాసాక్షరానికి ముందు అక్షరాలు గురు లఘువులు కలియాలి. మళ్లీ చెబునున్నందుకు మన్నించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు ప్రాస యతి గురించి నాకు అవగాహన లేడు. . ఇకనుంచి మార్చుకుంటాను. సర్వదా నా ప్రాధమిక విద్యలో దోషములున్న చూపించండి కవి వరులెవరైనా నా పద్య దోషములు చూపించి నన్ను సరిఐన కావ్య పధములో మార్చుటకు నేను ఆహ్వానము పలుకుచున్నాను.

      తొలగించండి
    3. తలపు చూలిని చంపిన త్ర్యంబకుడిని
      తలతు, వాని ప్రియ సుతుని తలికె గాను
      తలతు,అతని తమ్ముడు పుంజు దాల్పునిపుడు
      తలచెద,నతని మాతఔ దక్ష సుతను
      తలతు, నామెసోదరు డైన తమ్మి గంటి
      తలతు, ఆతని సతి తల్లి తల్లి నెపుడు
      తలతు, ఆమెసుతుండా విధాత నేను
      తలతు,అతని సతి వాక్కు తల్లి నిపుడు
      తలతు, ఆమె కృప గలిగి ధరణి పైన
      తలరు చున్నకవి వరుల తలతు నెపుడు

      తొలగించండి
    4. మొదటి పాదము మార్చాను వీక్షించగలరు

      తొలగించండి
    5. నాగమణి గారూ,
      మీరు తలచుకొనడానికి ఇందరు దేవుళ్ళా? కవులనూ వదలలేదు. బాగుంది మీ పూరణ అభినందనలు.
      'త్ర్యంబకుడిని' ఎందుకో కర్ణపేయంగా లేదు.అక్కడ "త్ర్యంబకు నిదె। తలతు...' అందామా?

      తొలగించండి
    6. "త్ర్యంబకుని / త్ర్యంబకునిని"సాధువులు. మళ్ళీ అఖండ యతియే. అయినా తప్పు లేదు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    తలతున్ భారత సంస్కృతీ ఛయమునున్ తద్ధర్మ సంస్థాపనా
    తుల కీర్తిన్ ఘన సంస్కృతాచార్య గమినిన్ తద్వాణినిన్ పేరునన్
    తలతున్ నాలుగు నర్వదౌ కళల సంధాయాళి విద్యార్జనన్
    తలతున్ కశ్యప విశ్వకర్మ తతినిన్ తద్దివ్య శిల్పాళినిన్
    తలతున్ యక్షర బ్రహ్మపింగళు నిలన్ దైవాంశ సంభూతులన్

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది.
      'సంస్కృతాచార్య' అన్నచోట గణదోషం. 'సంధాయాళి'...? 'తలతున్+అక్షర = తలతు నక్షర'..ఇక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
    2. ఆర్యా ,డాపిట్టానుండి
      సం...తార్య గమినిన్
      తలతున్నక్షర యని ‌సరి చూచుకొన్నాను.కృతజ్ఞతలు

      తొలగించండి

  11. తలచితి నేలలితాంబను
    తలచితి నేపద్మముఖిని తలచిన పనిగా
    తలచితి నేశ్రీమాతను
    తలచితి నాకోర్కెలెల్ల తలవంచగనే!


    తలచితి నేగణనాధుని ప్రేరణతో!🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. 'తలవంచిన కోర్కెలు' మంచి ప్రయోగం.అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారికి శతథా నమస్సులు, ధన్యవాదములు!

      తొలగించండి
  12. తలపై జాబిలి, మదిశీ
    తలనగరాజసుత, జహ్నుతనయే జటి కుం
    తలముల దాగిన శివుడే
    తలపుల నిండిమనుజులసదా కాపాడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తనయ+ఏ' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "తనయయె" అనండి. 'జటి' శబ్దానికి అన్వయం?

      తొలగించండి
  13. తలవని తలంపు గాదె వె
    తల దీర్చెడి వేల్పు దలచ దలపోయంగన్
    తలచెద రాముని నిరతము
    తలగునులే చింతలెల్ల ధరణిని సుమ్మీ ౹౹

    రిప్లయితొలగించండి

  14. భూతల మందు శేషగిరి భూమిపయిన్ గల నందనమ్ముగన్
    శ్వేతలతాంతమై తనర శ్రీకరుడౌ సిరి వెంకటేశ్వరున్
    నాతలపందు నిల్పుకొని నమ్రతతోడ నమస్కరించెదన్
    చేతలదైవమాతడని చిత్తమునందున పొంగిపోవుదున్
    వీటూరి భాస్కరమ్మ


    తలమందు శేషగిరి భూమిపయిన్ గల నందనమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      నిజానికి మీ పద్యం చాలా బాగున్నది. కాని పాదాలను 'తల'తో ప్రారంభించాలి కదా!

      తొలగించండి
  15. దేవా!
    తలచెద నీనామమ్మది
    తలచెద నీ భక్త కృపయు దాక్షిణ్య గుణా
    తలపుల నీవుండుచు చిం
    తలతో పోరాడి గెల్చు తాళిమినిమ్మా

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. తలమానికమౌ వేలుపు
      తలమంచి పుర న్నివాస తల్పగిరీశా!
      తలచెద నిరతము నాదువె
      తలన్ద్వరితముప శమింపు తాపముదీరన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      తలమంచి క్షేత్ర నివాసుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. తలతును లోక బాంధవుని
    ధారుణియంతట నిండువాని భూ
    తలమున సర్వ జీవుల వి
    తానముకున్ దరి నుండి రక్షయై
    తలకొన జేయ సౌఖ్యముల
    దానెవసించుచు విశ్వవేదికన్
    తలపున ప్రస్తుతింతు విధి
    ధారుని భానుని నాదు చిత్తమున్!

    తలకొనజేయు=కలుగజేయు
    విధి=కాలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వితానమునకు' అనడం సాధువు. చివర 'నా మనమ్మునన్' అనండి.

      తొలగించండి
  18. తలవాస ముని జనాభయ
    తల సంచర! దురిత జలధి తారక! ధరణీ
    తల జాత హృదయ చర! కర
    తలాభయప్రద! రఘువర! దయఁ జూపుమయా !!!

    [తలము = 1. అడవి, 2. కారణము, 3. చోటు, 4. అఱచేయి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పద్యాలలో ఏదో ఒక విశేషం తప్పక ఉంటుంది. తల స్థానంలో తలమును గ్రహించి దాని నానార్థాలతో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  19. తలచెద రఘు రామా! నే
    తలచెద నీ నామ మహిమ తలచచు నిను నా
    తలపున నిలుపుదు నెపుడు వె
    తలను దొలగించి బ్రోవు దశరథ రామా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తలచచు.. 'తలచుచు'కు టైపాటు.

      తొలగించండి
  20. తలచెడి వారి చిత్తమున
    ధైర్యము నింపుచు జీవనమ్ము చిం
    తల నెడబాయజేయ, నిట
    ధారుణి జేరితివో మహాత్మ! నీ
    తలపుల సంచరించు నిట
    తత్వమెరుంగుచు మానవాళి, నిన్
    తలచగనిచ్చి దీవెనలు
    ధన్యుల జేతువు వేంకటేశ్వరా!

    రిప్లయితొలగించండి
  21. తలపుల మునుగుచు జీవులు
    తలచరు నిన్నెపుడుతాము తారకరామా
    తలపగ నీవంటి హితుడు
    తలపడునె మహిని వెదుకగ తాపమునడచన్!

    రిప్లయితొలగించండి
  22. తలచిన పనులను జరుపగ?
    తలపున యేమరువ నౌన ధర్మాత్మా|నే
    తల వలె గాకను రక్షగ
    తలచూపు నొసగ? తరలదు దయగలరామా {తలచూపు=గౌరవంగాప్రవర్తించు}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తలపున నేమరువ' అనండి.

      తొలగించండి
  23. తలచెద సదా జగన్మా
    త లలిత నామము ననవరతము విడువక నా
    తలపులలోన నిలిపితి వె
    తల దీర్చెడు తల్లియనుచు దయగల మాతన్

    నా రెండవ దత్తపది పద్యము

    తలడిల్లితినీ రూపము
    తలచావిడి లోననిలుప ద్రవ్యము లేకన్
    తలపుల దాచితి భారతి
    తలపెట్టుము నాదు మేలు ధన్యుడ నగుదున్


    నా మూడవ దత్తపది పద్యము

    తలచెద భారతీ! నిను సదా మదినే యొక మందిరమ్ముగా
    తలచి ప్రతిష్ఠ జేసితిని తామసహారిని యందు నిండుగా
    తలపులె పూలుగాదలచి తల్లిగళమ్మున నిండుగా వేయ గై
    తలనిక యల్లినాను వర దాయిని బ్రోవవె నీదు దాసుడన్

    రిప్లయితొలగించండి
  24. తలఁచెద నా మదిన్ గుటిలదైత్యవిదారకు, రామచంద్రు, శాం
    త లలిత సద్గుణున్, సకల ధర్మరతున్, సుజనావనున్, వియ
    త్తల ఖగరాడ్రథున్, నుత పదద్వయు, మాధవు, నమ్మువారి వం
    తలఁ దొలఁగించు మద్విభు, నుదాత్తు, ననంతదయాసముద్రునిన్.

    రిప్లయితొలగించండి
  25. తలతును మదిలోనిరతము
    తలతునునేసాంబశివుని దలతును రామున్
    దలచిన లీలగ నిత్తురు
    తలపులలో వారి రూపు తన్మయమొందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలోని తలతును, రెండవపాదంలోని తలతును ఒకే వాక్యంలో పునరుక్తమయ్యాయి."తలతును నే గజవదనుని..." ఆనండి.

      తొలగించండి
  26. తలచెద ననవరతము కల
    తలఁ బాపి కరమగు ప్రీతి దయఁజూపుము భూ
    తలమున మనలేనిక చిం
    తల తొలగించి గొనిపొమ్ము దైత్యనిషూదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ మిక్కిలి బాగుగా ఉన్నది. అభినందనలు.
      అయినా అప్పుడే విరక్తియా? ఇంకా మీకు బాధ్యతలున్నాయి.

      తొలగించండి
  27. తలపడ శుభ కార్యమునకు
    తలవని సంపదలు గూర్చు, తథ్యంబిది, చిం
    తలతో పని లేదిక వని
    తల హారతులు గణపతికి తప్పగ జరుగున్

    రిప్లయితొలగించండి
  28. తలచినంతనతని తొలగు విఘ్నములన్ని
    తలపులందు తొలగు తామసంబు
    తలకుమించు పనుల తలకునెత్తు నపుడు
    తలచు తండ్రి యతడె తొలుత మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హర్షశ్రీ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. తలచిన చాలదె యవనీ
    తలమున వెలుగొందు చుండు తమ్మిదొర నెదన్
    తలపుల దరి జేరవు చిం
    తలనెడి నరి సంచయములు!దండము రవికిన్!

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా నుండి
    తలపుల్ నా వనలేను శారద! ననున్ దాక్షిణ్యతన్ జూడు భూ
    తలమందీ భవ బాధ నీడ్చగ వచో దైన్యత్వమున్ బాపు వ్రా
    తల నెన్నం సరి వైభవంబు గన, సత్తా హీనుడన్, గాని కై
    తల నల్లన్ బ్రముఖాళి మైత్రి పొసగన్ దౌష్ట్యమ్ములన్ మాన్పవే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నావి+అనలేను' అన్నపుడు సంధి లేదు.యడాగమం వస్తుంది.

      తొలగించండి
  31. తలచిన బలుకుచు మాచిం
    తల నిల నెడబాపు నట్టి దండ్రివి యనుచున్
    దలచెద వేంకటనాధుని
    తలపులలో నిలిపి సతము తన్మయమగుచున్ !!!


    తలచెదనే కలిమిచెలిని
    తలచెదనే మరునియంబ దాక్షాయణినే
    తలచుతు శ్రీ చరణమ్ముల
    తలవంచి నమస్కరింతు తద్దయు భక్తిన్!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తలచుచు' అనండి.

      తొలగించండి
  32. తలచెడిది పద హరణమట
    తలపించెడి వాడు ప్రభవ తారకుడట నే
    తలచిన భవహర మగునట
    తలచెద వేరొండు మూర్తి దలవగ నేలా?


    పదము = 1. పద్య పాదము 2. పాదము
    హరణము = 1. చౌర్యము 2. గ్రహణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకో "తల" "తల" "తల" "తల" అనుకోగానే 60 ఏళ్ళ క్రితం చదివిన ఈ పద్యం జ్ఞప్తికి వచ్చింది. కొంచెం భయం వేసింది. కానీ ఆంగ్లం లో ఉన్న ఈ వాక్యం గుర్తుకు వచ్చింది:

      "Imitation is the best tribute which the small pay to the great"

      __/\__

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      మీ చమత్కారానికి ఓ దండం!

      తొలగించండి
  33. తలచెద నే శ్రీరాముని
    తలచెద సీతమ్మ పతిని దశరథ సుతునే
    తలచెద రవికుల సోముని
    తలచెద మాహనుమ యెపుడు తలచెడు స్వామిన్.

    రిప్లయితొలగించండి
  34. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
    కం:తలతును శ్రీహరి నిలచిం
    తల బాపుమనుచును వేడెదసతముకూర్మిన్
    తలచిన తొలంగునట కల
    తలనెడిపలుకులననవరతమునిజము సుమా

    రిప్లయితొలగించండి
  35. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *తలతుహరిహరాదులచిం*
    *తలతొలగింపగ!నొసంగ తగ ధనముల భూ*
    *తలముననిశ్చలముగ! దా*
    *తలనగయశమందనాదు తనయుల్ ఘనులై*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి