14, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2337 (భుక్తియె లేనట్టి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భుక్తియె లేనట్టి  పరమభోగి యతండే"
(లేదా...)
"భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

69 కామెంట్‌లు:



  1. ముక్తిని కోరుచు కర్మను
    రక్తియు గాంచక మనుజుడు రంజిల జేయన్
    శాక్తము నటు, కర్మ ఫలపు
    భుక్తియె లేనట్టి  పరమభోగి యతండే!

    ஜிலேபி
    தமிழ் புத்தான்டு வாழ்த்துக்கள்

    రిప్లయితొలగించండి
  2. భక్తిని గొలువగ బుట్టిన
    శక్తిధరుడను పసివాని సాకగ యుండన్
    రక్తిని క్షీరమె త్రాగెడి
    "భుక్తియె లేనట్టి పరమభోగి యతండే"

    రిప్లయితొలగించండి
  3. శక్తికిమించి మంగలి విచారము చేయక ఖర్చులెన్నొ యా
    సక్తిగఁ జేయగా ఋణపు జాబిత హెచ్చు విశేషరీతిగన్
    వ్యక్తులు రాక బేరములు వచ్చుట పూర్తిగ సన్నగిల్లగా
    భుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలమ్మునన్
    (భోగి = మంగలి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      భోగి శబ్దానికి ఉన్న అర్థాంతరంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  4. సుర మందిర తరు మూల నివాసః 
    శయ్యా భూతల మజినం వాసః|
    సర్వ పరిగ్రహ భోగ త్యాగః
    కస్య సుఖం న కరోతి విరాగః||



    ముక్తి కొరగచాట్లు పడక
    భక్తి భజన లేక సిధ్ధి బడసిన రీతిన్
    రక్తి పరమాత్మ పరమై
    భుక్తియె లేనట్టి  పరమభోగి యతండే


    ...రమణ మహర్షి నుద్దేశ్యించి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      ప్రశస్తమైన శ్లోకం ప్రాదిపదికగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  5. శక్తియొకింతలేమి, యనుషక్తియు నన్యులతోడ శూన్యమున్
    భక్తిని చూపి కాంగ్రెసుకు భావిప్రధానియె రాహులుండనిన్
    రక్తిని జూపుచున్ భజన రంజుగ జేసెడి వారలుండగన్
    "భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్"

    అనుషక్తి= సంబంధము
    భుక్తి = అనుభవం
    హుళక్కి = శూన్యము
    పరమ =ప్రధానము
    ధరా = మెదడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      సమకాలీనమైన అంశంతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
      'అనిన్' అంటే యుద్ధంలో అనే అర్థం వస్తుంది. అక్కడ "రాహులుం డనన్" అనండి.

      తొలగించండి
  6. ప్రాక్తన కాలంబున నా
    సక్తుండై ధార పోసె సర్వము రాజౌ
    భక్తుండు రంతిదేవుడు
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే.

    ముక్తిని గోరి యాత డతి మోదము నందుచు రంతిదేవు డా
    వ్యక్తులు వారు వీరనెడి వ్యత్యయ మెంచక విశ్వరక్షకున్
    భక్తి స్మరించువా డగుచు వస్తువు లన్నియు ధారపోయడే
    భుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. భక్తిన నిరతము నిహసుఖ
    రక్తిమరచి దేవుని స్మరణన గడుపునా
    సక్తిన్సర్వముమరచిన
    భుక్తియెలేనట్టి పరమభోగి యతండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భక్తిని' అనండి. రెండవ పాదంలో గణదోషం. "రక్తి మరచి యా ప్రభువు స్మరణను..." అనండి.

      తొలగించండి
  8. డా.పిట్టా
    రక్తికి సాధువు వేషము
    ముక్తికి సాధనను దేలు మోసము స్పర్ధా
    సక్తికి (నా)యాశ్రమ భూముల్
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే?! (నేటి కుహనా సాధువులనుద్దేశించి)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    శక్తిని నించి యాయువును స్తంభన జేసి సుఖించు ధ్యాన మ
    వ్యక్తము ప్రాణ వాయువు సుభక్షణ దేలెడు యోగ శా స్త్ర సం
    సక్తి రచించు భోజనము, శాంతియు లభ్యము దీర్ఘ జీవికిన్
    భుక్తి.....................................
    Wuthering Heights నవల టిబెట్, హిమాలయాలలో ని ఉదంతాల ఆధారంగా

    రిప్లయితొలగించండి
  10. భక్తిని ముమ్మిడి వరమున
    మౌక్తికమౌ బాలయోగి మహదానందా
    సక్తుండై ధ్యానమొదగ
    భుక్తియె లేనట్టి పరమభోగి యతండే

    రిప్లయితొలగించండి
  11. శక్తికి మించిన ఖర్చులు
    భక్తుడు త్యాగయ్య చేయ, ఫణిశయనుండే
    ముక్తి నొసగ, ప్రజలనెనట
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే

    రిప్లయితొలగించండి
  12. రిక్తము జీతము! వెన్నుని
    భక్తిగ తలపై భరించు ! పాపము! దినెడిన్
    శక్తికి గాలిని ! ద్రవ ఘన
    భుక్తియె లేనట్టి *పరమభోగి* యతండే !!

    భోగి =ఆదిశేషువు


    ఆధునిక భోగి..

    వ్యక్తి విలాసజీవనమహార్ణవమందున మున్గి , రేబవల్
    రక్తము ధారపోసి,పలు లక్షలు దెచ్చియు, మద్యసేవనా..
    సక్తి సతీసుతాదులను సాఁకడు , వేళకు నింటిపట్టునన్
    భుక్తి హుళక్కియౌ!*పరమభోగి*యతండు ధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  13. శక్తియుతుండై పెనునా
    సక్తి గ్రసించును సకలము సమయము పేరున్
    వ్యక్తివలె జాతక దశా
    భుక్తియె లేనట్టి పరమ భోగియతండే!

    కాలాన్ని సర్పంతో పోల్చడం సాధారణం కదా!

    రిప్లయితొలగించండి
  14. సీతాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెను + ఆసక్తి = “పెన్నాసక్తి” అవుతుందనుకుంటాను.

      తొలగించండి
    2. నిజమే నండీ... నేను గమనించలేదు. అలాగే 'పేరాసక్తి' అని కూడా అనవచ్చు ననుకుంటాను.

      తొలగించండి
    3. పూజ్యులు కామేశ్వరరావు గారికి, గురువర్యులు శంకరయ్యగారికి నమస్సులు! పెన్నాసక్తి లేదా పేరాసక్తి యేది యైనా గణాలు సరిపోతాయి కనుక చిన్న సవరణతో పద్యం మార్చవచ్చు!

      మీ ఇరువురి మార్గదర్శకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు!🙏🙏🙏

      తొలగించండి
  15. రిక్తకరాలజూపి యెదురేగెడి లుబ్ధుడు లోకమందునన్
    ముక్తిని పొందలేడు,ధనమున్ నిరుపేదలకందజేయుచున్
    శక్తికి మించునట్లుగను సాయమొనర్చెడి మేటి దాతయే
    భుక్తి హుళక్కియౌ పరమ భోగియతండె ధరాతలంబునన్

    - వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  16. ముక్తికి తాపసియయి యా
    సక్తిని, చేరగ ననంతు సాధన జేయన్
    భక్తుడు మోక్షము నందగ
    భుక్తియె లేనట్టి పరమభోగి యతండే

    రిప్లయితొలగించండి
  17. రిక్త కరద్వయ భజనుఁడు
    ముక్తి సతీ కాముకుండు మురరిపు భజనా
    సక్తుఁడు జితేంద్రియుండును
    భుక్తియె లేనట్టి పరమభోగి యతండే


    రక్తము ధార వోయ నది లబ్దము రమ్యపు టాస్తి యంత బి
    త్రక్తము సంపదెల్ల పర దారల పాలయినన్ వరాంగనా
    సక్త వికార చిత్త కృత సంకట సంచయ కారణమ్మునన్
    భుక్తి యుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్

    [పితృ+అక్తము = పిత్రక్తము: తండ్రి నుండి చేరినది]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  18. భక్తిని దేవుని దలచుచు
    శక్తిని బడసిన బహువిధ సంపద బలముల్
    ముక్తి నొసగవని యనుభవ
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే!

    రిప్లయితొలగించండి
  19. భక్తిని ఫలమును నీయగ
    భుక్తికి లేనట్టి పరమ భోగి యతండే
    రక్తిని.సిరులను నింకను
    భుక్తిని మనకి చ్చునతడు భువనమునందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      కొంత స్పష్టత కొరవడ్డా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ముక్తినొసంగెడు వాడై
    భక్త సులభు డాదిభిక్షు వాతడె శివుడై
    శక్తియె యిల్లాలైనను
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే

    రిప్లయితొలగించండి
  21. భక్తిన్ గొలిచెడి జనులకు
    ముక్తికి మార్గమును జూపు ముక్కంటి యనన్
    ' శక్తి ' ని కూడుక యున్నను
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే!

    రిప్లయితొలగించండి
  22. ముక్తిని గోరువారుభువి మోదము నొందుచు జింతనొందరే
    భుక్తి హుళక్కియౌ .పరమ భోగి యతండు ధరాతలంబునన్
    రక్తిని గామభోగముల రాటునుదేలుచు వన్నెకెక్కెగా
    ముక్తియు భక్తియున్నికను మోదము గూర్చునురక్తిగల్గుచో

    రిప్లయితొలగించండి
  23. భక్తుల బ్రోచుచు సతమను
    రక్తినొసంగి గిరిజకు కరమగు ముదముతో
    శక్తిని సతిగా బడచియు
    భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బడసియు' అనండి.

      తొలగించండి
  24. పెను+ ఆసక్తి=పెనునాాసక్తి--నుగాగమసంధి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్య ను గాగమంమునకు ఇది
      1. తద్ధర్మార్థవిశేషణము కాదు.
      2. షష్ఠీసమాసము కాదు.

      అసలు రూపము పెనుపు – విశేష్యము.
      సమాసమున పెనుపు నాటకము
      మీది వర్ణము లోపించి పెను నాటకము
      స్థిర వర్ణము పరమైన ఉత్వ లోపము.
      పెన్ నాటకము = పెన్నాటకము
      అచ్చు పరమైన ద్విత్వము.
      పెను ఊత = పెన్నూత. (పెన్ ఊత : పెన్నూత)
      అట్లే పెన్నాశక్తి.

      తొలగించండి
  25. .త్యక్త విచారుడై తులసిదాసల నాడట భార్యకామితా
    సక్తత వాగుదాటి నొకసర్పము చేగొని రాత్రివేళలో
    యుక్తిగవెళ్ళ?”భార్యయనె-యూహలు భక్తికినుంచుమాయికన్
    భుక్తిహుళక్కియౌ”|పరమభోగి యతండు ధరాతలంబునన్|
    2.భుక్తికి కిరాతకంబే
    రక్తిగ గనుపించ?బోయ రచనలు మారెన్
    భక్తిగ వాల్మీకుండై
    భుక్తియు లేనట్టి పరమ భోగి యతండే| {నారద హితబోధచేమార్పునబోయవాల్మీకిగామారుటజరిగినది}

    రిప్లయితొలగించండి
  26. భక్తిగ గొలిచెడు వారికి
    ముక్తినొసగు సిద్ధయోగి బూచులదొరయే
    శక్తిని మేనున గొని యను
    భుక్తియె లేనట్టి పరమ భోగియతండే!!!


    శక్తిని మేనున గొని యా
    సక్తిగ తలపైనదాల్చి శైలేంద్రజనే
    ముక్తినొసంగుచు నలయుచు
    భుక్తియె లేనట్టి పరమ భోగియతండే!!!

    రిప్లయితొలగించండి
  27. భుక్తిని గోరి క్షౌరికుడు పూటకు లేదని క్షౌరశాలనే
    భుక్తి హుళక్కియౌ పరమ భోగి ధరాతలంబునన్
    శక్తికి మించిఖర్చిడుచు స్థాపన జేయగ నట్టి యూరిలో
    వ్యక్తులు జూడనెల్లరులు బభ్రువులేనట కాసురాలదే.

    రిప్లయితొలగించండి
  28. భక్తులఁ బ్రోచుచున్ రహిని భర్గుడు, నిత్యము సేవచేయగన్
    రక్తినొసంగ పార్వతికి రమ్య మనంబున పెండ్లియాడి యా
    శక్తిగృహమ్మునన్ కలిగి చక్కగ వర్తిలుచుండ కాటిలో
    భుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్

    రిప్లయితొలగించండి
  29. భక్తిగ క్రైస్తుని మోసిన
    శక్తి యుతుండకట! నేడు చాకలి కఱవై
    ముక్తిగ వాషింగు లలర
    భుక్తియె లేనట్టి  పరమభోగి యతండే!


    1. "గుడ్ ఫ్రైడే" ముందు వచ్చు "పాం సండే" జీససు గార్దభ వాహనుడై కోలాహలముగ జెరుసలేం చేరిన శుభతిథి.

    2. పరమ భోగి = బ్రాండ్ ఎంబాసడర్ అమితాభ్ బచన్ ద్వారా ప్రఖ్యాతి జెందిన గుజరాత్ గాడిద.

    https://www.google.co.in/url?sa=t&source=web&rct=j&url=https://m.youtube.com/watch%3Fv%3DoQgDz3B1ndY&ved=0ahUKEwiv3P6r0KPTAhVLKo8KHRCIDL84ChC3AggiMAA&usg=AFQjCNG83hOTwcdwRmmw7g-4ph54A29Vww&sig2=iSuKqYsJkw7V-1GIR2RbAA

    3. వాషింగు = Washing Machine

    రిప్లయితొలగించండి
  30. అనాధగా యుండే పిచ్చివాడు...
    వ్యక్తము గావు కోరికలు, నట్టలు గట్టిన జుట్టుతో ననా
    సక్తపు వస్త్రధారణము, చాచడు చేతిని పొట్టనింపగన్
    సూక్తులఁ జెప్పురీతి తన చూడ్కులఁ జేతులఁ ద్రిప్పుచుండుచున్
    భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్

    రిప్లయితొలగించండి
  31. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.

    శక్తిని భక్తిని రక్తిని
    ముక్తినిసతమొసగుమనుచు ముదమున కోరన్
    రక్తితొ మిత్రుండనియెను
    భుక్తికి లేనట్టి పరమభోగి యతండే

    రిప్లయితొలగించండి
  32. శక్తికి మించగా ఋణము శౌర్యము మీరుచు జేసి జేసియున్
    ముక్తిని గోరి లండనున మోడియె నీరవు దాగుచుండగా
    రక్తియె లేదు లేదుగద రమ్యపు రీతిని మాతృభూమినిన్
    భుక్తిహుళక్కియౌ...పరమభోగి యతండు ధరాతలంబునన్ :)

    రిప్లయితొలగించండి