21, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2343 (పాము కనుపించ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
" పాము కనుపించ గరుడుండు భయము నొందె"
లేదా...
"గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్"
ఈ సమస్యను పంపిన పూసపాటి నాగమణి గారికి ధన్యవాదాలు.

93 కామెంట్‌లు:

  1. పందెమున దనజనయిత్రి పరువుదీసి
    హయము దోకను జుట్టిన హరిగనరయ
    తల్లిదాస్యము దలపగ తల్లడిల్లి
    పాము కనిపించ గరుడుండు భయము నొందె!

    రిప్లయితొలగించండి
  2. సిరికి జెప్పక బిరబిర పరుగు లిడుచు
    శంఖ చక్రములు విడిచి శంక లేక
    ధరణి దిశ కేగినట్టి మాధవుడు లేని
    పాము కనుపించ గరుడుండు భయము నొందె

    పాము = ఆదిశేషుడు

    రిప్లయితొలగించండి
  3. నింగి పైనుంచి దుమికెను నేలపైకి
    పాము కనిపించ గరుడుడు, భయము నొందె
    సర్పము ఖగేశుడు దుముక, జారి పోయె
    రయముగా పుట్ట లోనికి రక్ష కోరి

    రిప్లయితొలగించండి
  4. ఖరణసుడగ్నిహోత్రుడిల ఖాండవ మందున ప్రజ్వరిల్లగన్
    వరుణుని యాయుధంబు గొని పార్థుడు రక్షణ తా వహించినన్
    వెరచి మహోగ్ర కీలల తపించు విమాతృ సుపుత్ర దీనతన్
    గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      తల్లి లేని గరుడ పక్షి పిల్ల పామును చూచి భయపడిందని అర్థం చేసుకున్నాను. అంతేనా?
      కొంత సందిగ్ధత ఉన్నా మీ పూరణ అమోఘంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      వెరచి మహోగ్ర కీలల తపించెడి కద్రువ సంతు దీనతన్

      ఇలా మార్పు చేస్తే సందిగ్ధత తొలగిందేమో పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
  5. హరుని దర్శించ కైలాస గిరికి శౌరి
    విహగ పతినెక్కి చేరిన వేళ నచట
    నీలలోహితు కంఠాన నిలిచి యున్న
    పాము, కనిపించ గరుడుడు భయము నొందె.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  6. పరుగున వచ్చెనమ్మ మన పాటల రాణి జిలేబి సాహితీ,
    గరుడుఁడు భీతినొందె, నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్
    పరుగిడె పాకుచున్నటను, పద్య మహత్యము గానవే చెలీ
    వరమిది సారసత్వమగు వాణి శుభాంగి లతాంగి సర్వదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. అంతా చైనామయం :)


    ట్రంపు! వాహనమ్మిక మిక్కుటముగ చీని
    దేశము తయారు జేయును దిశల తిరుగ
    గాన "కోమేకు" డ్రాగను గాభరపడి
    పాము కనుపించ గరుడుండు భయము నొందె :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. వరదుడు భక్తవత్సలుడు ప్రాణుల సంస్థితి జూచు విష్ణుడున్
    సిరికిని చెప్పకుండ తన చేతిని యాయుధమున్ ధరింపకన్
    పరుగులు పెట్టి వేగముగ భక్తగజేంద్రుని బ్రోవ పోవగా
    గరుడుడు భీతి నొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్
    (విష్ణువు వేగముగ పోవుట చూచు గరుడుడు, శేషుడు ఇద్దరూ భీతిల్లిరి)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    అడుగు వాడెప్పుడైనను"అడుగు"(ప్రశ్నించు)వాడె
    బడుగు బ్రతుకుల సంఘపు బ్రతిఘటనను,
    రభస నొడ్డెడు ధృతి లేని రాజ్య సభను
    తట్టుకొనలేని పాలకు దరువు జూడ
    'పాము కనుపించ గరుడుడు భయమునొందె!'

    రిప్లయితొలగించండి
  10. హరి యొక యజ్ఞవాటికకు హర్షముతో విహాగాధి రూఢుడై
    యరిగిన వేళ నచ్చటకు నంతకు మున్నె హరుండు చేరగా
    నరసిన శౌరి కాంక్ష గని యచ్యుతునిం గొని ముందు కేగగా
    గరుడుఁడు, భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    ఇరవుగ రెండునౌ నవధు లిట్టటు పాలన జేయ నెన్నికల్
    బ(ప)రువుగ నుండె నాప్రభుత బట్టునొ పట్టము నిత్తరిన్ బరిన్
    చొరవయె లేని పాలనము చొ(జొ)క్కడె గావున వోటరోరగా
    ద్దరువును జూచి పాలకుడు దత్తర మందుట వింత గాదిదో
    "గరుడుడు భీతి నొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్!"

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    ఆర్యా "చొక్కిడె"కుబదులు టైపాటును యెంచక మన్నించ గలరు.చొక్కిడు.. మోసపూరితమగు అర్థంలో శ.ర

    రిప్లయితొలగించండి
  13. వైనతేయునికిన్ కద్రువ తన సంతు
    సేవలను చేయు మనుచును చెప్పిపంప
    విసుగు చెందుచు వారల వెర్రి పనుల
    పాము కనిపించ గరుడుడు భయము నొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      కొంత అన్వయలోపం ఉన్నా మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  14. మొరలిడ నాదిజుండునలుమోముల సోమకుద్రుంచ స్వామియే
    బిరబిరనేగి పర్వతముపెంపున మత్స్యమురూపుదాల్చి సా గరమునజొచ్చి త్రచ్చగను కర్వరునింగని పట్టియీడ్చగా
    గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణం బునన్.

    ఉరగము: పెద్దచేప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      ఉరగానికి ఉన్న అర్థభేదంతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  15. క్షీరసాగర మధనమ్ము చెలఁగు వేళ
    కవ్వమున్ జుట్టి వాసుకి కంది పోయె
    పూని పునరంకితంబౌచు బుసలు గొట్టు
    పాము కనుపించ గరుడుండు భయము నొందె

    రిప్లయితొలగించండి
  16. సిరిపతి నిర్ణయంబునను చేరి సురాసురు లెల్లగూడి,మం
    దరగిరి కవ్వమై నిలువ త్రాడుగ వాసుకి కందిపోవుచు
    న్నరఁగును వీడిపోక పునరంకితమై బుసలన్ విదుర్చగన్
    గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్

    రిప్లయితొలగించండి
  17. ఆకసమ్ము నయెగురుచు నవని వ్రాలె
    పాము కనుపించ గరుడుండు,భయమునొందె
    పన్నగారిని గనినంత పడగదారి
    బిలము లోనికి దూరెను వేగిరముగ!!!


    పెరటి దాపున దిరిగెడు బిలశయమును
    గాంచి బట్టబోయిన భుజగాశనమ్ము
    కర్రబట్టుకు నటదిరుగాడెడు గుడి
    పాము కనుపించ గరుడుడు భయమునొందె!!!

    గుడిపాము = ఇల్లువదలని వ్యక్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు ముఖ్యంంగా 'గుడిపాము'ను ప్రస్తావించిన రెండవ పూరణ అధ్బుతంగా ఉన్నవి. అభినందనలు.
      'ఆకసమ్మున నెగురుచు...' అనండి.

      తొలగించండి
  18. ఎందు కో నేడు తెలియద దేమి వింతొ
    పా ములను బట్టి చీల్చెడి పక్షి రాజు
    పా ము కనుపించ గరుడుండు భయము నొందె
    మార్పు జరిగెనొ ! ప్రకృతిలో మాయ హరిదొ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ వైష్ణవమాయా పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  19. స్కాములెన్నియొ యొనరించి కళ్ళుచెదర
    భూములును డబ్బు మేడల ప్రోగుచేయ
    నీతి విడనాడి అవినీతినే భుజించు
    పాముకనిపింప గరుడుండు భయమునొందె
    వీటూరి భాస్కరమ్మ


    రిప్లయితొలగించండి
  20. రోజు కొకపాము తినుచును మోజు తీర
    వ్రాలి రివ్వున కొండపై వచ్చి చూడ
    నచట జీమూత వాహనుం డనిన "నాగు
    పాము" కనుపించ గరుడుండు భయము నొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      జిమూతవాహనుడి ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  21. గ్రద్దముక్కువాఁ డడుగఁగఁ బెద్దమొత్త
    మ ప్పొసంగె భుజంగరా, వా యిరువురు
    గరుడ సర్ప వైరంబగుఁ గలియఁ, గాన
    పాము కనిపింప గరుడుండు భయమునొందె.

    రిప్లయితొలగించండి
  22. రోజు కొక సమస్య యను నురోగమనము
    నా గరుత్మంతు డనెడి యత్యద్భుతంపు
    పూరణము చేత మ్రింగెడి సారమతియె
    దుష్కరప్రాస వచ్చుటతో భయపడె;
    పాము కనిపింప గరుడుండు భయము నొందె.

    రిప్లయితొలగించండి
  23. నేలవాలి గభాలున నెమకి పట్టె
    పాముకనిపించ గరుడుడు ,భయము నొందె
    గరుడు రాకను గమనించి కాళమపుడు
    ప్రాణ భీతిని సర్పము బరగె నటుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      పద్యం ప్రథమార్ధంలో పామును పట్టింది నెమలియా, గరుడుడా? ద్వితీయార్థంలో కాళము, సర్పము అని పునరుక్తి వచ్చింది.

      తొలగించండి
  24. 21, ఏప్రిల్ 2017, శుక్రవారం
    ఈరోజు పూరించవలసిన సమస్య
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *" పాము కనుపించ గరుడుండు భయము నొందె"*

    గరుడరేఖ కలదు పేరు గరుడుడంచు
    పలికె డాంబికములు ధర్మపత్నితోడ
    పొలము నందునఁదిరుగాడ బోయెనంత
    *" పాము కనుపించ గరుడుండు భయము నొందె"*


    లేదా...
    కరమున జూపెభార్యకటుకాంచుమటంచునురేఖనొక్కటిన్
    గరుడునిరేఖయంచునురగంబులపాలిటిమృత్యువంచుఁతాన్
    హరుడనగాధరింతుగళహారముగానహినంచుబల్కుచున్
    *"గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్ క్షణంబునన్"*


    శ్రీమతి జి సందిత బెంగుళూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      పేరుకే గరుడుడు అన్న మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. 21, ఏప్రిల్ 2017, శుక్రవారం
    ఈరోజు పూరించవలసిన సమస్య
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *" పాము కనుపించ గరుడుండు భయము నొందె"*

    గరుడరేఖ కలదు పేరు గరుడుడంచు
    పలికె డాంబికములు ధర్మపత్నితోడ
    పొలము నందునఁదిరుగాడ బోయెనంత
    *" పాము కనుపించ గరుడుండు భయము నొందె"*


    లేదా...
    కరమున జూపెభార్యకటుకాంచుమటంచునురేఖనొక్కటిన్
    గరుడునిరేఖయంచునురగంబులపాలిటిమృత్యువంచుఁతాన్
    హరుడనగాధరింతుగళహారముగానహినంచుబల్కుచున్
    *"గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్ క్షణంబునన్"*

    *
    శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  26. భరమను బాధలేక నొక బాధ్యతగా తన తల్లి దాస్యపున్
    విరమణ కోసమై, కద్రువ పిల్లలుఁగోరగ వారు వీపుపై
    స్థిరముగ నుండ భాస్కరుని చెంతకు చేర నొకండు కూలగా
    గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్

    రిప్లయితొలగించండి
  27. వైనతేయునికిన్ కద్రువ తన సంతు
    సేవలను చేయు మనుచును చెప్పిపంప
    వెర్రి కోర్కెల దీర్చగ విసుగు చెంది
    పాము కనిపించ గరుడుడు భయము నొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'కద్రువ' భగణమే, నగణం కాదు. అది తెలుగు 'అద్రువ' వంటిది కాదు.

      తొలగించండి
    2. క్షమించాలి. ఇవాళ మనసు నిలవడంలేదెందుకో
      చంపకమాల 2 వపాదం:

      విరమణ కోసమై, కద్రువ పిల్లలుఁగోరగ వారు వీపుపై ×
      సవరణ:
      విరమణకై,నభమ్మునకు వీపున కద్రువ పిల్లలందరున్ √

      తొలగించండి
  28. పెరడుననున్న పుట్ట నొక భీకర సర్పము చుట్టుముట్ట , సూ
    కరమది గాంచి పర్విడుచు గంగను మున్గెను బావి దాటుచున్ ;
    గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్
    నిరతము నింగినే తిరిగి నీల్గెను గానక భుక్తినెచ్చటన్

    రిప్లయితొలగించండి
  29. అరయ సినీమ తీయునెడ అంబరవీథిని తాకు మేటియౌ
    నురగముగ్రాఫికున్ తనరెనుగ్రముగా విలయాగ్ని కీలలన్
    నురుగులు గ్రక్కుచున్ కనులనొప్పుగనార్పుచు నాల్కసాచగన్
    గరుడుడు భీతినొందె నురగమ్మును చూచిన తక్షణమ్మునన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  30. కోపమున రెచ్చిపోయెను కొంపలోన
    పాము కనిపించ గరుడుడు, భయము నొందె
    కాద్రవేయము, కాంచి యభద్రతచట
    తల్లి కద్రువ చెప్పెను ధైర్యమపుడు

    రిప్లయితొలగించండి
  31. పాము కనుపించ గరుడుండు భయము నొందె
    ననుటనోటమి గాదు, వ్యూహమ్ము సుమ్ము !
    అదనుకై వేచి చూచుట బెదురు కాదు !
    హనుమ బంధింపబడడె బ్రహ్మాస్త్రమునకు !!


    ధరణిని సర్పమున్ గొనగ దాను తటాలున నేల వ్రాలగా
    గరుడుడు ., భీతినొందె నురగమ్మును ., గాంచిన తత్క్షణంబునన్
    బొరియను దూరె ! రక్షణయె ముఖ్యము ! స్త్రీలును కష్టమందు స
    త్వర జన రక్షయైన చరవాణిని దాల్చి చరింపగావలెన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  32. హరిని భుజముల మోయుచు హాయి గాను
    గగనమున విహరించెడి ఘడియ లోన
    కనులు మూసియున్న తపస్వి కంఠ మందు
    పాము కనుపించ గరుడుండు భయము నొందె

    * పరీక్షిత్తు కథ

    రిప్లయితొలగించండి
  33. గరుడుడనే ప్రియునికీ సర్పము కనబడి భయపడ్డాడన్న యూహతో


    తరుణమిదేను పెద్దలటు దక్షిణ దేశపు యాత్రకేగిరే
    సరసములాడరమ్మనుచు జవ్వని పిల్వగ గంతులేయుచున్
    విరహిణి గూడ నేగె నిశి వేళన ధీరుడుసాహసుండెయౌ
    గరుడుడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్

    రిప్లయితొలగించండి
  34. గాలిమేపరి దొరతాను కదలి వచ్చె
    కొమ్మలందున గలపక్షి గూటిలోని
    నీడజముల గ్రుడ్లను మ్రింగనెంచి యచట
    పాము, కనుపించ గరుడుండు భయము నొందె.

    రిప్లయితొలగించండి
  35. రిప్లయిలు
    1. దేవలోకంబు సని వైనతేయుఁడు తగఁ
      జక్కబెట్టు తరి నమృత మొక్క క్షణము
      నుద్ధృతంబగు కావలి యున్న కతనఁ
      బాము కనిపించ గరుడుండు భయము నొందె

      [పాము = ప్రామిడి = క్రౌర్యం]


      సుర ముని యక్ష కిన్నర వచోనుతి వందిత భాసమానుఁడే
      సురుచిర రూప సంపదల శోభిలు శ్రీపతి పద్మనాభుఁ డా
      హరి భువి రక్షణార్థము మహా ఝష రూపము దాల్చ వేదనన్
      గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్

      [ఉరగము = పొడుగుచేఁప]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  36. రోగ బాధచే పొదలలో యేగుచుండ
    “బుసలు గొట్టుచు దరిజేరి పొంచియున్న
    పాముకనుపించ”? “గరుడుడు భయము నందె|
    వయసు మీరిన శక్తికి?జయము దరుగు”|
    2.మరిగెడి మండుటెండలకు మార్గము లేకను నీటిజాడకై
    తిరుగుచు చెట్టునీడ కడ తీరికయందున నిల్వబూనగా
    గరుడుడు|”భీతి నొందె నురగమ్మును గాంచిన తత్ క్షణంబునన్|
    తరిగెను శక్తి యుక్తి తన తంత్రము మార్చెగ గ్రీష్మ తాపమే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పొదలలో నేగుచుండ' అనండి.

      తొలగించండి
  37. గరుడుడు భీతినొందెను రగమ్మును జూచు తక్షణంబునన్
    గరుడుడు భీతినొందుటకు గారణ మయ్యది కాదుగాసుమా
    యురగము పారిపోయెను గ వ్యోమతలంబున గ్రద్దను జూచిదా
    యరయగ రెండును న్గదిల నాయెను శత్రులుగాగనిధ్ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది.
      'గ్రద్దఁ జూచి తా। నరయగ...' అనండి.

      తొలగించండి
  38. పా.ము. యన బాలకృష్ణుని పాద.ముద్ర.
    నటన మాడగ ఫణముపై స్ఫుటిత మవగ
    వైనతేయుడు చంపంగ బూనువేళ
    పా.ము. కనుపింప గరుడుండు భయము నొందె

    రిప్లయితొలగించండి
  39. హరిహరులు కలియగ వేడ్క నంబరమున
    పలుకరించగ హరిని కపర్ధి యపుడు
    పాము కనుపించ గరుడుండు భయము నొందె
    వదిలి పోవుచు వడి వడి పలికెనిటుల
    కాల మహిమను యిపుడైన గాంచు మయ్య !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహిమను+ఇపుడు' అన్నపుడు సంధి నిత్యం. "కాలమహిమ నిపుడయిన గాంచుమయ్య" అనండి.

      తొలగించండి
  40. నా మొదటి పద్య భావం

    గరుడుడు తన ఆహారము కొరకు భూమికి దిగి జీవులను నోట కరచుకొని
    పైకి యెగురును. అది ఆహారము కాగా పామును చూసి క్రిందకు దిగుటకు భయపడి ఆకాశము పైనే యెగురుచు ఆకలి భరించలేక మరణించెను.

    రిప్లయితొలగించండి
  41. నమస్కారం...

    ముడుంబ ప్రవీణ్ కుమార్...

    భక్తుడగు గరుడుడు దేవి భజన చేసి
    తనదు పల్లెకొంటరిగను తరలుచుండ
    మార్గ మధ్యమున పొదల మాటునుంచి
    పాము కనిపించ గరుడుడు భయము నొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముడుంబ ప్రవీణ్ కుమార్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  42. పార్వతీపతి దర్శన భాగ్యమంద
    వెండి కొండకు ఖగపతి వేగామేగె
    యోగ భర్త కంఠమునట నొప్పునున్న
    పాము కనిపించ గరుడుండు భయము నొందె

    రిప్లయితొలగించండి
  43. సరదా పూరణ: 👇

    పరుగులు బెట్ట మాధవుడు ప్రార్థన జేరగ కుంజరమ్ముదౌ
    తరుణిని శంఖ చక్రముల దాపున వీడుచు భూతలమ్ముకు...
    న్నెరుగక వార్త లెవ్వియును నివ్వెర వోవుచు తొంగిచూడగా
    గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్ :)

    రిప్లయితొలగించండి