20, ఏప్రిల్ 2017, గురువారం

చమత్కార పద్యం - 251

సీతా రావణ సంవాద ఝరి
 3 (-క +న)
ఈ శ్లోకంలో ‘క’ ను తీసి వేసి ఆ స్థానంలో ‘న’ ఉంచాలి

సీతే! శ్రీశ్చ వికాశితా ఖలు వధూ కామప్రియాంగస్య మే
దారిద్ర్యం పురి క ర్తితం గుణ గణైః కాలోచితప్రస్థితేః,
హా మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః ప్రియః
పాపాత్మన్! కలయే నసంగత మిదం సర్వం త్వదుక్తం వచః।।
ఉన్నది ఉన్నట్లుగా.....
రావణోక్తి:
సీతే = ఓ సీతా
వధూ కామ ప్రియాంగస్య = స్త్రీలకు మన్మథుని వలె సుందరుడనైన
మే = నాకు
శ్రీః = సంపద
వికాశితా = విప్పారినది
కాలోచిత ప్రస్థితేః = కాలాను గుణ్య ప్రయాణ సన్నాహము గల
మే = నా యొక్క
గుణగణైః = గుణ సమూహములతో
పురి = పట్టణమందు
దారిద్ర్యం కర్తితం = దరిద్రము నరికి వేయబడినది...అని రావణ కృత స్వస్తుతి!
అట్లే
ప్రియః = నీ ప్రియుడు
మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః = మాయావి పరకాంతలందు మనసు నిలుపు వాడు.... అని రామనింద
సీతా ప్రత్యుక్తి...
సర్వం త్వదుక్తం వచః = నీ పలుకంతయు
సంగతం నకలయే = సరియైనదిగా తలచను... అని సమాన్యార్థం
కలయే = క కారము లోపింపగా
నసంగతం = న కారముతో కూడినది అని సంకేతార్థము
క తీసి వేసి న ప్రతిక్షేపించగా
వధూనామ ప్రియాంగస్య = స్త్రీల కప్రియమగు శరీరము గల
మే = నా యొక్క
శ్రీః = సంపద
వినాశితా = నశింపజేయ బడినది!
నాలోచిత ప్రస్థితే = అనాలోచితముగా ప్రయాణము చేయు
మే = నా యొక్క
పురి = పట్టణమందు
దారిద్ర్యం నర్తితం = దరిద్రము నర్తించును
అని రావణ నిందగా మారింది
అట్లే
మాయానర నామితాన్య లలనాంత రంగః = లీలా మానుష విగ్రహుడు,పర స్త్రీలందు మనసు చేర్చని వాడు
ప్రియః = ప్రేమ పాత్రుడు... అని రామ స్తుతిగా పరిణమించింది.

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

2 కామెంట్‌లు:

  1. గడ్డిపోచకె గడ్డిపోచవు,కావరమ్మున రావణా
    గుడ్డిగానను తెచ్ఛినావన, కొమ్క,!రాముని రాకకున్
    అడ్డు నీరథి, నన్నుచేకొనుమన్నజానకీ,ప్రాణముల్
    యొడ్డి రాముడు నిన్నుచంపును, ఊరుకొమ్మనేరావణున్
    చమత్కార పద్యం వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి