1, మే 2017, సోమవారం

దత్తపది - 111 (నేల-నీరు-అగ్గి-గాలి)

నేల - నీరు - అగ్గి - గాలి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

97 కామెంట్‌లు:


  1. సుయోధనుని మనోవ్యధ

    పోనేల రాజసూయము
    నౌ? నీ రుచిరపు భవనము నన్ నగు బాటే
    లా? నే యగ్గించుల పర
    వౌ నేలన జారగా లివలివల నగవుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. భీమ సేనుడు మడుగులో దాగిన సుయోధనుని తో పలుకు మాటలు

    నీరువామిలోనున్నను , నేనువదల
    బోను, ఆనేలతాలుపుపైన దాగి
    ఉన్ననూ అగ్గికంటినై ఓయి రాజ
    రాజ గాలించి కాల్చెద, రమ్ము మడుగు
    నుంచి త్వరిత గతిన నీవు, నురుము చేతు
    ఒక్క క్షణములోన నీవు చిక్కెనేని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      బాగుంది మీ పద్యం. అభినందనలు.
      కాని దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలి కదా! (మీరు కేవలం 'గాలి'ని అన్యార్థంలో ప్రయోగించారు)
      'బోను+ఆ' అన్నచోట సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. "బోనుగా నేలతాలుపు..." అనండి. 'ఉన్ననూ' అన్నది సాధువు కాదు. "ఉన్న నే నగ్గికంటినై.." అనండి. చివరిపాదంలో గణదోషం. "చేతు। నొక్క క్షణములోననె నీవు చిక్కగానె" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు అన్ని ఇతర అర్ధములు అనుకున్నాను మరల ప్రయత్నిస్తాను
      క్షమించండి

      తొలగించండి
  3. ఆర్యా నమస్కారములు నిన్నటి సమస్య పూరణము ఒక్క సారి చూచి
    తప్పులున్న దిద్దగలరు

    అయ్యా,పెండ్లాడను ఆ
    గయ్యాలిని, బెండ్లి యాడగా సుఖమబ్బున్
    నెయ్యము గల్గిన స్త్రీతో,
    వియ్యము నేకోరునట్టి వెలదుల తోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెండ్లాడను+ఆ' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. "పెండ్లాడను నే। గయ్యాళిని..." అనండి.

      తొలగించండి
  4. సుయోధనుని మాటలు

    ఓర్తు*నే ల*వలేశ మింకొక్క మాట
    భీమ!*నీ రు*జు వర్తన విధమదేమి?
    *అగ్గి* రాలగ నిన్నాజి నాధమ! చూడు
    లీల నోడింతు*గాలి*ప్త కాల మందు

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగ్గి'ని స్వార్థంలో వినియోగించారు.

      తొలగించండి
  5. మయసభాభవన స్తీ పరిహాసానంతరం
    మానసిక వేదన తట్టుకోలేక రారాజు స్వగతంలో

    నేవి నియుపరిహా సము నేల బ్రతికె ?
    రోష ముంజచ్చి పోవ నీ రుద్ర భూమి
    చేరి అగ్గించి దేవునిన్ వీరమడగి
    కడకు రారాజు మానము గాలి పోవ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      "పరిహాసము నేల సైతు" అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  6. విశ్వరూప దర్శనము తరువాత కృష్ణుడు పార్థునితో:

    అగ్గింపింతయు నేలర?
    తగ్గెన? నీరుగ్మత భళి! తామస మేలా?
    నెగ్గుట, గాలించంగన్,
    సిగ్గెందుల? నిశ్చయమ్ము సేనల తోడన్!


    అగ్గింపు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966   
    కొనియాడుట. స్తుతి.

    ...హమ్మయ్య!...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఓర్తు*నేల*వలేశ మింకొక్క మాట
    భీమ!*నీరు*జు వర్తన విధ మరేమి?
    సిగ్గు గా లేదె నీవిటు* లగ్గి*లింప?
    లీల నోడింతు *గాలి*ప్త కాల మందు.

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి


  8. క గ శా వి

    ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్ యేలన్ భళారే యనన్
    గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
    నేలన్ కాలటు జారనౌర పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
    బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా

    ---

    ఏలన్ బో రుచిరమ్ముల
    లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
    నేలన్ కాలటు జారన
    లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ కంద గర్భ శార్దూలవిక్రీడితం బాగున్నది. సమస్యాపూరణలలో గర్భకవిత్వాన్ని చొప్పించడం మీకే చెల్లింది. అభినందనలు. (గతంలో ఎవరో అవధానాలలో ఆశువుగా గర్భకవిత్వం చెప్పేవారని విన్నాను).
      'పురమునన్+ఏల' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి


    2. ధన్యవాదాలండి కంది వారు !

      మీ ప్రోత్సాహమే మాకు పూర్తి బలము !

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీగారూ, మీరే ఊర్లో ఉంటారు? మీ timezone బట్టి USA అనిపిస్తోంది. నేను Atlanta లో ఉంటాను.

      తొలగించండి


    4. సరి సరి :)


      ఇందుగల దందు లేదని
      సందేహంబేల సోమ ! సరసి జిలేబి
      న్నెందెందైన గనదగున్
      కందము నందున సుమముల కౌసుమ మందున్ !

      జిలేబి

      తొలగించండి
  9. చేయగ నేల కర్మలను చిక్కుట నేల భవాబ్ధి నందనన్
    కాయము కల్గ జంతువుల కైననుబో యవనీరుహంబులున్
    మోయుట కర్మభారఫలమున్ విడనాడునె యగ్గిరీశుకున్?
    మాయయె యిజ్జగమ్ము వినుమా తిరగాలిట తప్ప దెన్నడున్
    (సోమ గీత)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చిక్కుట యేల భవాబ్ధినందునన్..." ఆనండి. 'తిరగాలి' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
    2. చేయగ నేల కర్మలను చిక్కుట నేల భవాబ్ధి నందునన్
      కాయము గల్గ జంతువుల కైననుబో యవనీరుహంబులున్
      మోయుట కర్మభారఫలమున్ విడనాడునె యగ్గిరీశుకున్?
      మాయయె యిజ్జగమ్ము వినుమా విధిగా లిసురుల్ జనుల్ గదా ||
      (లిసురు = ఎద్దులబంతిలో చివరి ఎద్దు)

      తొలగించండి
  10. (జూదమున నోడి వనవాసానికి వెళ్తున్న పాండవులతో విదురుని మాటలు...)

    నే *నేల* మిన్నకుంటిని
    యీ నీతివిదూర చర్య *నీరు* వెతల నా
    కాననముల *నగ్గి*రులకు
    గానైతిరి గష్టదశలు *గాలి* నుసి యగున్.
    (చర్యన్+ ఈరు=మీరు)

    రిప్లయితొలగించండి
  11. పార్థ చింతించగా నేల బవరమందు
    వైరిమూకల సతులుక న్నీరుఁ గార్చ
    చదలు దేవత లగ్గించ ముదముతోడ
    నిజముగా లిఖించెజయము నీకు నలువ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      'నీరు'ను స్వార్థంలో ప్రయోగించారు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. వైరి తతుల(సతుల) కన్నీరు మున్నీరుకాగ - అంటే సరిపోతుందా. దయతో తెలియజేయ ప్రార్థన. (మున్నీరు ఆంతే సముద్రం కదా)

      తొలగించండి
    3. మున్నీరు (మును+నీరు) = మొదటి నీరు = సముద్రం.... ఇందులోను నీరు ఉంది.

      తొలగించండి
  12. డా.పిట్టా
    (మహాభారతార్థమును ఆకలింపు జేసికొన్న నా పితామహుడు స్వప్నంలో కనిపించి నాకు చేసిన హిత(గీత)బోధ)
    దూరగ నేల దైవమును దోయిలినిన్ ఘటియింపనేలకో
    మీరగ నేల ధర్మమును మేలుగ నీ రుజలన్ని యెంచియున్
    గూరదె (అ)యగ్గికిన్ గ్రియను గూర్చి(అగ్గించి)భజించియు మానసంబునన్
    గోరిన కోర్కె దీర్చగ దగాలిని మెచ్చెడి కైతలల్లగా
    మారునె బ్రహ్మరాత యిది మాయజగంబగు పిట్ట డాక్టరో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగ్గి'ని స్వార్థంలో ప్రయోగించారు. 'దగాలి'...? దగాల సమూహమని మీ భావమా? అప్పుడు దగ+ఆలి అని సంధి చేయడానికి అవకాశం లేదు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      దూరగనేల* దైవమును దోయిలినిన్ ఘటియింప నేలకో
      మీరగనేల ధర్మమును మేలుగ నీరు* జలన్ గణించియున్
      గూరిన "యగ్గి"శబ్దమున గొన్న నుపక్రియ(అగ్గిం*చు)నుగ్గడించి సిం
      గారపు గోర్కె గోర ,ముని గాలి*కి గాయము వంటి యాపదల్;
      మారునె బ్రహ్మ రాతయది,మాయ జగంబిది పిట్ట డాక్టరూ!
      ఆర్యా ,ఉత్పల మాలలో తగణమిముడక (..)లలో అగ్గించు లోని అన్యార్థమును గ్రహించినాను.

      తొలగించండి
    3. డా.పిట్టా
      దూరగానేల* దేవుని దోయిలించి
      తావకను నీ రు*జలనెన్ను ధార్మికతను
      చేరు మునిగాలి*కందు సుస్థిరపు శాంతి
      కోరి యగ్గిం*చు హరి కీర్తి గొణగకునికి!

      తొలగించండి
  13. (అగ్గి)రిశున కనె నర్జును
    డెగ్గును స్మరియించ(నేల) యీనీశక్తిన్
    దిగ్గన రా(నీ రు)ద్రా!
    నెగ్గం(గా లి)ప్త ననిని నీదయ నాకున్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  14. పలుకనేల వేయిరకాలు,భాగ మీయ
    కౌరవాగ్రజ నీ రుజాగ్రస్త చిత్త
    మందు నగ్గిలములు తగ్గ,నైన వారి
    లెక్క తప్పక చూడగా లిప్తపాటు

    రిప్లయితొలగించండి

  15. మయసభలో రారాజు స్వగతం
    తే.గీ:అచటి కేనేల నేగితి నమ్మగువయు
    నన్ను నగ్గింపకగనుచు నవ్వనేల
    నిప్పు డీయవమానము నెట్లు సైతు
    మానసికమగు నీరుజ మాను టెట్ల
    టంచును కుమిలె బాధతో నవని పతియు.

    కురుక్షేత్రమున కృష్ణుడు పార్థునితో
    చింత చెందగ నేలయ్య చేతబూను
    కదన రంగాన కన్నీరు కార్చ నేల
    నిప్పుడీవు పోరునుసల్ప నిక్కముగను
    సురలు నెల్లరగ్గింతురు సొబగు మీర.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారు కన్నీరు లో నీరుందేమోనని నా ఊహ సుమీ...

      తొలగించండి
    2. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో నీరును స్వార్థంలో వినియోగించారు.

      తొలగించండి
  16. అగ్గిర్వాణులు అన్నప్రాణమకటా అత్యంత ఘోరమ్ముగన్
    బుగ్గిన్ చేసిరిగా లిఖింపవిధితా,బుణ్యాత్ముడయ్యెన్గదా
    ఇగ్గీర్వాణుల పత్నినేల ఇటులన్ ఈరీతి కాపాడుటల్
    నిగ్గున్ దేల్చుడు అగ్నినంచు వెస కన్నీరుంచిరా కీచకుల్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మంచి అంశాన్ని ఎన్నుకున్నారు పూరణలు. 'అగ్గీర్వాణులు'ను అగ్గిర్వాణులు అన్నారు. కొంత అన్వయ దోషం ఉంది. 'ఇటులన్ ఈరీతి' అని పద్యం మధ్య అచ్చు రాకూడదు.

      తొలగించండి
  17. డా।। ఉమాదేవిగారూ! పొరపాటున మీరు గాలి బదులు నిప్పును వాడారు! గమనించగలరు!

    రిప్లయితొలగించండి
  18. మనసింక గాలిపోయెను
    కన నగ్గించెడు నొకండు కర్ణుడు తోడై
    మననీరు ధార్త రాష్ట్రులు
    వనమందున మనల నేల? వారొక వెధవల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  19. ………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    దుర్యోధనునికి శకుని " హితోపదేశము "
    --------------- ----- ---------------

    రాజరాజ ! యీ నేల వారలకు పాల ( న్ ) |

    నెపుడు , దాసులై నిన్ను నగ్గి౦చుచు ,పడి >

    యు౦డ వలె | వారి నోడి౦చి జ్యూద మ౦దు ,

    గాలిచూలి పె౦డ్లాము నగౌరవి౦చ >

    వలయు | నినుగని నగిన ద్రౌపది మదమ్ము

    నీరుగార చేయవలయు , ని౦డు సభను |

    ( యీ నేల = ఇచ్చు టె౦దులకు :

    అగ్గి౦చు = పొగడు : గాలిచూలి = భీముడు : )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నేల, గాలి, నీరు... వీనిని స్వార్తంలో వినియోగించారు.

      తొలగించండి
  20. ఊర్వశి అర్జునుని తో

    కాదన నేల? సరసమున్
    నాదగు నీ రుచిర దేహ నటనల్ మోహా
    స్వాదనమున నగ్గించుచు
    జోదులు గాలించరె! నిను సోకవె సోకుల్?

    రిప్లయితొలగించండి
  21. నిన్నటి సమస్య కు మరో పూరణ

    చయ్యన తులాభారము
    మొయ్యఁగ కృష్ణయ్యఁ దూచి పొందఁగఁ జూడ
    న్నొయ్యారి సత్యఁ బోలిన
    గయ్యాలిఁ బెండ్లియాడఁగా సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. వాట్సప్‍లో సవరించారు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పద్యం

      కయ్యమున తులాభారము
      మొయ్యఁగ కృష్ణయ్యఁ దూచి పొందఁగఁ జూడ
      న్నొయ్యారి సత్యఁ బోలిన
      గయ్యాలిఁ బెండ్లియాడఁగా సుఖమబ్బున్

      తొలగించండి
  22. అగ్గిరివ్రజాధిపతి మహాభుజుండు
    ఘన ధనేలబిలాత్మజ కాంతి దనరి
    నీరు బలుడు మురారియని తలచి మదిఁ
    దఱచు గాలి పోరాడెను ధరణి నతఁడు

    [నీరు = అల్పము; కాలు = మండు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ చాలా గొప్పగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. క్రింది గాదిరాజు (సందిత) గారి పూరణలో 'వనీరుహము' సాధువు కాదని నా అబిప్రాయం. ఏమంటారు?

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      వనరుహము లేక వనేరుహము లు రెండు సాధువులని నా యభిప్రాయము. “వనేరుహము” సప్తమీ తత్పురుషలో అలుక్సమాసముగా పరిగణించ వచ్చును. “జలేచరత్వము” నన్నయామాత్యుని ప్రయోగముంది కదా. వనేచరము, అల్పాన్ముక్తః ; దగ్ధలోకాదభ్రమము అలుక్సమాసములకుదాహరణలు.

      తొలగించండి
    4. “వనీరుహ” అడవిలో పుట్టినదని అర్థము చెప్పుకో వచ్చును. (“వని” యీకారంత స్త్రీలింగ పదము) కానీ ఇక్కడ యీ అర్థములో “వనీరుహోపమ” అని ధర్మరాజుని సంబోధించుట కవయిత్రి యభిప్రాయము కాదనుకుంటాను.

      తొలగించండి
  23. పార్థ చింతించగా నేల బవరమందు
    వైరి వాహినీ రుధిరముల్ బారునవని
    చదలు దేవత లగ్గించ ముదముతోడ
    నిజముగా లిఖించెజయము నీకు నలువ

    రిప్లయితొలగించండి
  24. *దత్తపది*

    *నేల - నీరు - అగ్గి - గాలి*

    *పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ*

    *మహాభారతార్థంలో*


    *అగ్గిరిధరుడనిలోనన్*
    *పగ్గముగొనగాలిఖింతుపాండవజయమున్*
    *దిగ్గురనచరితనేలత*
    *లొగ్గుట సంధికి?వనీరుహోపమ!సహజా?*

    ధర్మజునితో అర్జునుడు సంధి వలదంటూ పలికిన సందర్భంలో

    రిప్లయితొలగించండి
  25. రాయభారమున శ్రీకృష్ణునిపలుకులు
    చేయురగ్గింతు రెప్పుడూ చిన్నవారు
    నేలయొకిమీడు తీర్పును నెరుపరేల?
    మంచి సాగాలి రాజ్యంబు పంచుమనిరి
    నీ రుదిత మేల?దృతరాష్ట్ర| నీతి నిలుపు
    మనుచు కృష్ణుడు సభయందు వినగ దెలిపె {అగ్గించు=పొగడు,నేలయొకిమీడు=భూపతి,రుదితము=రోదనము}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'ఎప్పుడూ, సాగాలి' అని వ్యావహారికాలను ప్రయోగించారు. 'నేల' స్వార్థంలోనే ఉంది.

      తొలగించండి
  26. ధర్మరాజు మనోగతము

    నాడు జూదమ్ము నేనేల అడ వలెను,
    అడి నేనేల జూదము నోడవలెను,
    ఓడితిని గానీ రుత్త కూడినట్టి
    వ్యసనమని మది తెలుపగా లిప్సతిరిగి
    ఏల గలుగవలె, మరల ఏల నేను
    ఓడి అనుజల నెల్లర నూడిగమ్ము
    చేయ మనుచు హీనమ్ముగా చెప్పవలయె,
    తరచి చూడ అగ్గిరీశు శరణు లేక
    పాండు సుతులము పడితిమి బాధలపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. నాల్గవ పాదంలో యతి తప్పింది. 'చెప్పవలసె' అనండి.

      తొలగించండి
    2. క్షమించండి తప్పులు దొర్లాయి సరిదిద్దుకుంటాను.

      తొలగించండి
  27. నేలపై కూలియు నేల సుయోధనా
    .....వీడ వహమ్మును వింత యగును
    నీరుకాయ బ్రతుకు నిల్చు క్షణా లింక
    .....చేరనీరు నిన్ను చెలియ లైన
    నగ్గి వంటిది యీర్ష్య యగ్గింప నీ జనుల్
    .....కాలిపోతివి దాన కాన బోక
    గాలి దూరని చోటు గాలించ లేరని
    .....హ్రదమున దాగితి వాగునె పొలి

    ధర్మపరులైన పాండవు లర్మిలి నిను
    సోదరుడవని యెంచినన్ చోద్య మీవు
    కక్ష గట్టితి వీర్ష్యతో కలహ మెంచి
    నాశనము పొందితివి కటా నయము మాసి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      ఏమని ప్రశంసింపను? దత్తపదాలను స్వార్థంలోను, అన్యార్థంలోను ప్రయోగిస్తూ మనోహరమైన పూరణ చెప్పారు. మీ ప్రతిభకు నమోవాకాలు!

      తొలగించండి
    2. మిస్సన్న గారికి నమశ్శతములు..
      చక్కని శైలి.. మంచి భావం.. పదాలతో విన్యాసం.. అలవోకగా సాగిన ధార.. వెరసి పద్యం
      నిరుపమానమైనది... అభినందన పురస్సర అభివాదమంజరులు.... నమోనమః.
      ...

      తొలగించండి
    3. మిస్సన్న గారూ! అత్యద్భుతం మీ సీసం!!!

      తొలగించండి
    4. గురువుగారూ నమశ్శతములు.
      మురళీకృష్ణ గారూ, సహదేవుడు గారూ, విజయకుమార్ గారూ ధన్యవాదములు.
      మీ మీ పూరణలు కూడా శంకరాభరణములో మణులై ప్రకాశిస్తున్నాయి.

      తొలగించండి
  28. (కురుక్షేత్ర సంగ్రామమున శ్రీకృష్ణుడు పార్థునితో)
    భీకరమగు నీ రుతమున బీర మణగ
    శరముల రిపుల నగ్గించు సమర మందు
    తాతలు గురు బంధువులని తలచ నేల
    దుష్ట శిక్షణ జరగాలి దురిత దమన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జరగాలి' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  29. ద్రౌపది భీమసేనునితో...

    అగ్గిరలు నాదు గుండెలో నగ్నులయ్యె !
    నీ రుధిరము మరగదె కన్నీరు జూడ ?
    నేల చూపులు చూడగానేల ? నీకు
    లెమ్ము వానిని జంపగా లిప్త చాలు!!

    ఆ+గిరలు... ఆ మాటలు

    అగ్గిరిజాపతిన్ గెలిచి యస్త్రములందిన పార్థుడుండగా
    మ్రగ్గగనేల కారడవి ? రాచరికమ్మగునే ? రణ స్థలిన్
    నెగ్గిన వాడెపో ఘనుడు! నీ రుధిరాన్నపు మాటలేల ? మే..
    నగ్గి దహింపగా లిఖితమంచును గాలికి బుద్ధి జెప్పెదో !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. దుర్యోధనుని స్వగతం:

    అగ్గిరి సముడ న్నేనిట నెగ్గు వడగ
    రయముగా నేల నేగితి మయసభకును?
    నాత్రముగ నీ రుచిర చిత్ర మరయ బోతి?
    వడిని నడతుగా లిప్తలో పాండవులను!

    రిప్లయితొలగించండి
  31. కానవాసమ్ము గానేల కాకటంచు
    అగ్గిరీశుని కై తపమాచరించి
    పాశుపతమును బడసెను ఫల్గునుండు
    గాలిబోనీరు ప్రాజ్ఞులు కాలమెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గానేల కాకటంచు'...? '...గాలి పోనీరు' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. -సూచనతో సవరించిన పద్యము




      గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
      విపిన వాసము యవనేల వృథ యటంచు
      అగ్గిరీశునకై తపమాచరించి
      పాశుపతమును పొందెను ఫల్గునుండు
      గాలిపోనీరు ప్రాజ్ఞులు కాలమెపుడు

      తొలగించండి
  32. సంగరమున కృష్ణుడు అర్జునునితో......

    అగ్గి కంటిని మెప్పించు యర్జునుండ
    కూడునీరును దోచెడు గొంగల గని
    చుట్టములనుచు కన్నీరు బెట్ట నేల?
    ఆలమందున నీరీతి గాలిబోవ
    వీరవరులకు సరిగాదు విడుముచింత!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగుంది. కాని గాలి తప్ప మిగిలిన దత్త పదాలను స్వార్థంలో వినియోగించారు.

      తొలగించండి
  33. దుర్యోధనుడు తన సేనలో స్ఫూర్తినింపు మాటలుగా నూహించి

    అగ్గిరితనయ నాథుడె యర్జునునకు
    పాశుపతమొసగిననేమి పార్థు జూచి
    కర్ణుడుండ భీతిలనేల, కదన వీరు
    లెల్ల చావనీ, రుధిరమ్మె వెల్లువెత్తి
    పారనీ, చెలరేగాలి భండనమున.
    .

    రిప్లయితొలగించండి

  34. కీచకునితో ద్రౌపది సంభాషణము
    ఏమి నీ రుజ, నన్నేల ఇట్లు బాధ
    పెట్టు చున్నావు, కీచకా, ముట్ట వలదు,
    మంచి వినవుగా, లిప్సను త్రుంచు మిపుడె,
    అగ్గిరితనయ కరుణతో ఆదు కొనగ
    నాదు పతులు గంధర్వులు నన్ను కాచు,
    వెడలి పొమ్ము నన్ను విడచి వేగిరముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  35. అగ్గిరిని దాగినన్ కానలందునున్న
    బ్రతుకనీరు గాలించుచున్ పట్టుకొనెద
    రనుచు నజ్ఞాత వాసము కరగినారు
    భరత ఖండంబు నేలగా పాండుసుతులు

    రిప్లయితొలగించండి
  36. హిడింబి భీమసేనునితో..
    అగ్గిరి బల భీమా నీ
    బుగ్గల సోయగము నేల ముందుంటినిరా
    తగ్గను నీ రుంజువదలి
    దిగ్గున గాలించు నన్ను దిచ్చరిఁ గానే?

    రిప్లయితొలగించండి
  37. నేల నంచులదాక తా*నేల* దలచి
    బంధు,వాహి*నీ రు*ధిరమ్ము పారు నీరు
    జేసెనని *యగ్గి*రి సముడై మేసి యగ్గిఁ
    గాలి*తో తన్నె కురుపతి గాలి సుతుడు

    రిప్లయితొలగించండి