11, మే 2017, గురువారం

సమస్య - 2358 (సారంగధరుండు వలచె...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"
(లేదా...)
"అదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై"

69 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. శ్రీరాము సీతను విడిచె
      నారోపణ కాగ లేక నదియెట్లన్నన్
      రారాజే శంకించెను:
      "సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"

      * శిక్ష విధించిన వారిద్దరూ రాజులే. శిక్ష ననుభవించిన వారిద్దరూ నిర్దోషులే. ఉపమానం అంతటితో సరి...

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      బింబ ప్రతిబింబ భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రీరాము' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "శ్రీరాముడు సతిని విడిచె" అనండి.

      తొలగించండి
  2. కం।।
    ఆరాజరాజుతమితో
    సారంగముమీటికొనుచుసతిమతిదొలువన్
    దోరపుమోహమ్మున నా
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నారాయణ పాత్రుడు గారూ,
      పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.

      తొలగించండి
  3. ఊరెంతఁబల్క చలింపడు
    సారంగధరుడు;వలచె సతి చిత్రాంగిన్
    గోరంత జారని వానిన్
    పారంగతు పితృపూజ్య భావగరిష్ఠున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. "ఊరేమన్న జలింపడు" అందామా?

      తొలగించండి
  4. ఆ రాజరాజు తనయుని
    పేరేమిటి,వేంగిరాజు పెండిలి యాడెన్
    ఏ రమణీతిలకంబున్,
    సారంగధరుడు, వలచె సతి చిత్రాoగిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆడెన్+ఏ' అని విసంధిగా వ్రాయరాదు. పద్యం మధ్య అచ్చులు రాకూడదు."పెండ్లాడెను తా। నే రమణీ..." అందామా?

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు. ఇవాళ క్రొత్త విషయము నేర్చుకున్నాను. పద్యం మధ్యలో అచ్చులు రాకూడదని. ధన్యవాదములు భవిష్యత్తు లో ఆ పొరబాట్లు దొర్లకుండా చూస్తాను .
      ప్రణామములు

      తొలగించండి

  5. హీరా! యిదియ! సమస్యా !
    "సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"
    ఔరా! సమస్య యేమిటి ?
    పోరడు పోరిని వలచని పోకడ గలదే ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చారిత్రక నేపథ్యం కాకుండా సారంగధరుడనే పోరడు చిత్రాంగి అనే పోరిని వలచాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    కోరన్ దాను సుతుడనను
    బోరున్ చిత్రాంగి తనకు"మారుండ"నుచున్
    మీరండాతడు నీతిన్
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్?!!(అవ్వ! ఇదేం పోయే కాలమయ్యా మీకు?అని గ్రామీణ స్త్రీ ఆశ్చర్యం)

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    కదిలించన్ యిల గొప్పవైన విషపున్ గాధావళుల్ పేరుకౌ
    మది రామాయణమైన గూల్చరెబుధుల్ మర్మంబులన్ గానరో
    పదిలంగా తమ కీర్తి చంద్రికలవౌ బాగేమి తద్వ్రాతలన్
    చదువంగా విపరీత ధోరణులవౌ సత్శీలతల్ మాయమౌ
    అది;సారంగధరుండు దా వలచెనే?చి త్రాం గి న్,మనోజార్తుడై!!(ముమ్మాటికి అది అసంభవమన్న తీర్పుతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      తన-కుమారుండు; తనకు-మారుండు... మంచి చమత్కారం.
      రెండవ పూరణలో 'కదిలించన్+ఇల' అన్నపుడు యడాగమం రాదు."కదిలించంగను" అందామా? 'తద్వ్రాతలన్' అనడం దోషమే. "తద్గాథలన్" అందామా?

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా, గాథ ఇదివరకే వచ్చింది కాన తల్లేఖనాల్ అననీయండి.లేఖనం సంస్కృతమే కదా
      కన్. చన్ లను తప్పించ సవరించు కున్నాను.కృతజ్ఞతలు.మీ మెప్పుకై ధన్యవాదాలు.

      తొలగించండి
    3. డా.పిట్టా
      ఆర్యా, గాథ ఇదివరకే వచ్చింది కాన తల్లేఖనాల్ అననీయండి.లేఖనం సంస్కృతమే కదా
      కన్. చన్ లను తప్పించ సవరించు కున్నాను.కృతజ్ఞతలు.మీ మెప్పుకై ధన్యవాదాలు.

      తొలగించండి
  8. ముదమొప్పన్ కనకాంగి చంద్రవదనన్ఁ బ్రోయాలి గాఢమ్ముగా
    అదె సారంగధరుండు దా వలచెఁ, జిత్రాంగిన్ మనోజార్తుఁడై
    ముదితల్ మెచ్చెడి రాజరాజనృపతీముఖ్యుండు పెండ్లాడెగా
    సుదతీమోహమునందు వృద్ధులయినన్ చోద్యమ్ముగా చిక్కరే ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నృపతీముఖ్యుండు' అనడం దోషం. పతి పుంలింగ శబ్దం. దీర్ఘం రాదు. అక్కడ "రాజరాజనెడు రాణ్ముఖ్యుండు..." అందామా?

      తొలగించండి
    2. ఆర్యా! సవరణకి ధన్యవాదములు.
      __/\__

      తొలగించండి
  9. తోరపు జననీ భావము
    చేరగ నత డామె కచట జేజే లనియెన్
    నేరం డన్యము గద, యే
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్?

    మదిలో యుక్త మయుక్తముల్ దలప కేమాత్రంబు నిట్లాడె నా
    మదమత్తుం డొక డా సభాస్థలిని బల్మా రంద రౌరా యనన్
    ముదమారంగను సీత నాభరతుడే మోహించె నవ్వేళలో
    అదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. మీరఁగ ద్వేష మసూయలు
    వేరుగ కయ్యాలమారి విజయాదిత్యుం
    డా రాజుకుఁ జెప్పెనిటుల్
    "సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"

    రిప్లయితొలగించండి
  11. తోపల్లె బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పూరణ.....

    ఆరయ చిత్రాంగదనే
    సారంగ ధరుండు వలచె సతి చిత్రాంగిన్
    రారాజు, వలచెనో యని
    సారంగధరాశ్రయ కర చరణాల్ దున్మెన్

    రిప్లయితొలగించండి
  12. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    వైరాగ్య విరాజితుడా
    సారంగధరుండు; వలచె సతి చిత్రాంగిన్
    వీరుడు తన తండ్రి యనుచు ప్రేయసి యైనన్
    వారించెను పినతల్లిని
    కోరకు మారీతి యనుచు కోపము తోడన్

    రిప్లయితొలగించండి
  13. సదయుండౌ నృపసూనుడున్ గొన ప్రశంసల్ , గాంచి రాట్పుత్ర కీ...
    ర్తి , దయాహీనుడు దుష్టుడైన విజయాదిత్యుండు లోకంబునం
    "దదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై"
    యిదిగో! "యంచు ప్రచారమున్ సలుప రాజేంద్రుండు జంపించి, తా
    నిదె దేహమ్మును కొండపై విసర శాసించెన్ ! మహాదేవద..
    త్త దయాలబ్ధుడునై జనించెను పునర్ధన్యాత్ముడై నేటికిన్
    పదిలంబీగిరి రాణ్మహేంద్రవర ప్రాంతమ్మందు వీక్షింపరే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      సారంగధర మిట్ట ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  14. కోరి ప్రచారము జేసిరి
    "సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్
    నేరిచి" యని చంపించె వి
    చారింపక రాణ్ణరేంద్ర జనపాలుడటన్ !!

    రిప్లయితొలగించండి
  15. ధీరోదాత్తుడు హీరో
    చేరువగాగ సినిమాల సీమను లేమన్
    మారుని మహిమకు లోబడి
    సారంగధరుడు వలచె సతి చిత్రాంగిన్

    రిప్లయితొలగించండి
  16. ఓ రంగుల చిత్రమ్మే
    పారంగను కవి లిఖించె ప్రాజ్ఞత లేకన్
    చేరంగ మదనుడంతట
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  17. నేరము మోపిరసూయను
    "సార౦గ ధరుండు వలచె సతి చిత్రాంగిన్"
    ఆ రాజుని యానతి పరి
    హారము పాదముల నరకి రారణ్యమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఆ రాజు నానతిని పరి..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
      నేరము మోపిరసూయను
      "సార౦గ ధరుండు వలచె సతి చిత్రాంగిన్"
      ఆ రాజునానతిని పరి
      హారము పాదముల నరకి రారణ్యమునన్

      తొలగించండి
  18. మదికోరంగను పిన్నతల్లి అకటా మాతృత్వ మాధుర్యముల్
    మదివీడంగను పుత్రుకోరి పతినే మార్చంగ పల్కించె తా
    నదె దాసీజనమెల్ల నొక్కటిగ విన్నాణమ్ముతో నిట్లనెన్
    అదె సారంగధరుండు దా వలచె జిత్రాంగిన్ మనోజార్తుడై
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. తీరుగ భృంగములుకురుల
    దీరగ చిత్రాంగి రాజుదేహము పైనన్
    నోరగ నొరుగగ లలనా
    సారంగధరుడు వలచె సతి చిత్రాంగిన్

    కురులవిరులలో సారంగములతోకూడిన చిత్రాంగిని ధరించినరాజు ఆమెను వివాహ మాడెనన్నది నా భావన.అన్వయం కుదిరిందా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      చక్కని భావం. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  20. క్రూరుడు విజయాదిత్యుడు
    వేరిమి తో గొండెములను వేయగ బ్రీతి
    న్నారాజుకు దెల్పెనిటుల
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్!!!

    రిప్లయితొలగించండి
  21. పూరించగ నవధానికి
    సారసుడగు పృచ్ఛకుండు సరగున నిడెనీ
    తీరు తికమక సమస్యను
    " సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      క్లిష్టమైన సమస్య నిచ్చినప్పుడు ఇదొక తప్పించుకొని వెక్కిరించే విధానం. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  22. ఒౌరా యేమని యంటిరి
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్
    సారంగధరుని జనకుడు
    పేరిమి జిత్రాంగిసతిని బెండిలి యాడెన్

    రిప్లయితొలగించండి
  23. నీరజ నేత్రాబ్ధిజ ముఖి
    నారామ విహారిణి విమలాదిత్య కులాం
    భోరాశి శశి నిభుం డా
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్

    [సతి = పతివ్రత; చిత్రాంగి = చిత్రమైన శరీరము గలది, స్త్రీ ]


    విదితం బిద్ధర వేగిరంపుఁ బనులన్వీడంగ మే లయ్యెడిం
    గదలంగన్ నిజ సేన ఖడ్గమునకుం గళ్యాణ వైభోగమున్
    హృది హర్షంబున వే తలంచి యిటు ధాత్రీశుండు దాఁ జేసెఁ ద
    ప్పదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *"అదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై"*
    *హృదినమ్మెన్ మనుజేంద్రుడీకథనుగర్హింపన్విమర్శింపగాన్*
    *చదువన్ జాలినవారలెల్లచరితన్ ఛాయంచుచిత్రాంగినిన్ చిదిమేసెన్* *ఘనమౌమహేంద్రిపురవైశిష్ట్యంబునవ్వాహినిన్*

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    😃😄😇🤣😍😜🤡👩🏻🌾🎋🌸

    *దారుణము జరిగిపోయెను*
    *నేరంబనినమ్మెనృపుడునిందన్ వినిత*
    *ద్ఙోరంబెఱుంగుమియ్యది*
    *"సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"*

    రిప్లయితొలగించండి
  27. ఆరోపించగ ననుజుడు
    “సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్”
    మీఱిన కోపముతోఁ బతి
    దూరుచు కరములును కాళ్ళు తునుమగ జేసెన్

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నారీమణి కనకాంగిని
    సారంగధరుడు వలచె; సతి చిత్రాంగిన్
    ప్రేరితుడై నతని పితర
    దారక్రియనాడి నలరె ధాత్రి ధృతికినై

    రిప్లయితొలగించండి
  29. కోరిక లడరగ మది మితి
    మీరిన సౌందర్యరాశి మీన నిభాక్షిన్
    భూరిగ మణిమయ మరకత
    సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్
    సారంగముః చిత్రవర్ణములు కలది, బంగారము

    రిప్లయితొలగించండి
  30. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి
    హేరంబా వినుమిట యా
    సారంగధరుండు;వలచె సతి చిత్రాంగిన్
    నేరుపుతో నని జనులన
    ఘోరంబైన యపవాదు కూడెను గనుమా !

    సారంగ మెక్కి వచ్చెన
    సారంగధరుండు వలచె సతిచిత్రాంగి
    న్నారాజసుతుండనవిని
    యారాజే దయను మాలి యవమానించెన్.

    రిప్లయితొలగించండి
  31. నేరము సేయకనె వగచె
    సారంగధరుండు; వలచె సతి చిత్రాంగిన్
    రారాజు నరేంద్రుండిల,
    నౌరా! పరుషంపు ఘటన నాపగ లేమా?!

    రిప్లయితొలగించండి