17, మే 2017, బుధవారం

సమస్య - 2362 (గాడిదపై నెక్కి హరుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్"
(లేదా...)
"గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

76 కామెంట్‌లు:

  1. నాడే మెక్కెను జీససు?
    మాడగ నెవ్వరు దహించె మారున్నిలలో?
    నాడేమి జేసె కృష్ణుడు?
    గాడిదపై నెక్కి, హరుఁడు, కంసునిఁ జంపెన్


    "As they came near Jerusalem, Jesus told two of His disciples to go into a nearby village and bring a donkey that would be waiting there. Jesus rode into Jerusalem on the donkey"

    http://www.christianbiblereference.org/story_PalmSunday.htm

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      క్రమాలంకారంలో చక్కని పూరణతో శుభారంభం చేశారు. సంతోషం! అభినందనలు.

      తొలగించండి
  2. వేడుక దేవకీసతికి పెండ్లి శుభంబుగ జేసి యామెపై
    దాడిని చేసి చారమున తాఁ పసి పాపల చెండనెంచ కా
    పాడుమటంచు వేడుకొను భామిని పుత్రుల జంపినట్టియా
    గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై

    శంకరుడు = శుభము కలిగించువాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      కంసుని గాడిదతో పోల్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  3. దాడినిఁజేయువారలు నధర్ములు నెట్టుల లొంగి పోదురో?
    వాడి తపస్సుఁజేయు హిమవంతుని పుత్రిక జేరెనెవ్వడో?
    కూడగ శాంతి కృష్ణుడనుకూలముగా నెటు చేసి చూపెనో?
    గాడిదనెక్కి;శంకరుడు;కంసునఁజంపె దయావిహీనుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. చూడము మిడతం భొట్లును,
    వాడగ నిచ్చెన ర్జునునకు పాశుప తంబున్,
    చూడగ జనులకొఱకు హరి,
    గాడిదపైనెక్కి,హరుడు, కంసుని జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "వాడగ నిడె నర్జునునకు..." అనండి.

      తొలగించండి
  5. కోడే కాల్చెను లంకను,
    గాడిదపై నెక్కి హరుడు కంసుని చంపెన్,
    ఓడెను శ్రీహరి అనుచూ
    పాడెన్ యొక వెంగళప్ప పదుగురి ఎదుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      వెంగళప్ప పాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అనుచున్" అనండి. 'పాడెన్+ఒక' అన్నపుడు యడాగమం రాదు. "పాడెను తా వెంగళప్ప..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు తప్పు సవరించుకుంటాను

      తొలగించండి


  6. బూడిదలో పోసిన ప
    న్నీరాయెను భాగవతము నీవు చదువనౌ
    వీడమ్మ డంబు! యెక్కడ
    గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగుంది మీ పూరణ. కాని డ-ర ప్రాస?

      తొలగించండి


    2. డ, ర లకు ప్రాస కుదరదన్న మాట

      ఛందస్సు సాఫ్టు వారి దయ తో ప్యాసై పోయా ననుకుంటా :)

      నెనర్లు

      జిలేబి

      తొలగించండి
  7. బోడిగ త్రిప్పుచుందు రభిభూతి సలుంపగ నేమృగంబునన్?
    వీడక భక్తులందరికి వేల వరమ్ముల నిచ్చు నెవ్వడున్ ?
    లౌడి శరమ్ములేక మథురాపురి కృష్ణు డదేమి చేసెనో?
    గాడిద నెక్కి, శంకరుఁడు, కంసునిఁ జంపె దయావిహీనుఁడై
    (అభిభూతి = అవమానము; లౌడి = గద)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని వారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సలుంపగ'....?

      తొలగించండి
    2. ఆర్యా, సమస్తే. సరవణ సూచనకు ధన్యవాదములు.
      "రభిభూతి సలుంపగ" బదులు "రభిభూతిని సల్పగ" గా సవరిద్దాం.

      తొలగించండి


  8. ఓ మిట్టపల్లె సాంబ
    య్యా! మీరు సమస్యలన్ సయాటగ బేర్చే
    సామర్థ్యవంతులు సుమీ !
    సామగ్ర్యము చేర్పు కంది శంకరులవలెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు




    1. వారే వీరు వీరే వారున్నా :)

      లేక వారు వారే వీరు వీరే నా ?



      జిలేబి

      తొలగించండి
    2. మీ ప్రశ్న అర్థం కాలేదు.
      మిట్టపెల్లి సాంబయ్య గారు మా బావగారు. (మేనబావ అందులోను మా చెల్లిని ఇచ్చాం). తెలుగు పండితుడుగా పని చేసి రిటైర్ అయ్యారు. అప్పుడప్పుడు ఇలా సమస్యలు (జాత్యుపజాతుల్లో) సిద్ధం చేసి ఇస్తుంటారు. (వృత్తీకరణ నాది). మాత్రాఛందస్సులో గేయాలు అప్పుడప్పుడు వ్రాస్తారు కాని ఇప్పటి వరకు ఒక్క పద్యాన్ని కూడా వ్రాయలేదు.

      తొలగించండి


    3. ధన్య వాదాలండి కంది వారు; యిద్దరి శైలి (మీది ,వారిది) ఒకేలా ఉండటం తో అడిగా ఒకరే నా అని;

      కృష్ణార్జనులలా సామ్య మన్న మాట


      జిలేబి

      తొలగించండి
  9. వాడొక ఛాత్రుడు మందుడు
    నేడీ ప్రశ్నకును బదులు నేనిత్తు ననెన్
    చూడగ నాతడు పలికెను
    గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్.

    వాడొక బుద్ధిహీనుడగు పండితపుత్రుడు వాని కింతయున్
    పోడిమి లేదు విద్యలను పూర్తిగ శుంఠ యతండు గావునన్
    చూడక యుక్తమా యనుచు చోద్యము గల్గగ పల్కె నిట్టులన్
    గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మందబుద్ధి ఛాత్రుని మాటలుగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "యుక్తమౌ ననుచు..." అనండి.

      తొలగించండి

  10. ప్రోడ!జిలేబి ! శీతల తపోనిధి బ్రోచెను లోక మెట్లు సూ ?
    గూడెను పార్వతిన్నెవరు కూర్మిని జేర్చన లోక మెల్లెడన్ ?
    వాడని పువ్వులన్ తొడుగు వాడిమి కృష్ణుడు చంపె నెవ్వరిన్ ?
    గాడిద నెక్కి; శంకరుఁడు; కంసునిఁ జంపె దయావిహీనుఁడై.

    జిలేబి

    *శీతల తపోనిధి -> శీతలాదేవి - Goddess of small pox;

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. వాఁ డుత్త తెలివితక్కువ
    వాఁడు శకారుం డతండు, వాగె నిటుల నా
    నాఁడే మృచ్ఛకటికమున
    "గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    ఓడిరి పురాణ కథకులు
    పాడియె యై.టీ.(I.T.)ల చదువు బ్రతుకు కొరకిదో
    చూడగ ముందరి తరమను
    "గాడిద పై నెక్కి హరుడు కంసుని జంపెన్"

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    పాడియె బోడి తలం గన
    నాడెను లింగం బటన్న నవ రూపకమున్
    వాడెడు వచన కవిత యను
    "గాడిద పై నెక్కి హరుడు కంసుని జంపెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. డా.పిట్టా
    పాడియె వాహనంబుకని బట్ట ఖరంబును హూణ భాషలన్
    పోడిమి వీరగాథలను బొక్కె(ప్రచారంలో నున్నవి)బరీక్షల నొక్క"నిర్దయన్"
    వాడుడు సొంత వాక్యమున"వాడొక శుంఠయె వ్రాసె నీగతిన్
    "గాడిదనెక్కి శంకరుడు కంసుని జంపె దయావిహీనుడై"
    నాడట సమ్మతించనయె నమ్మక పేర్లను పంతులయ్యయై!
    (He eats mountains.సరియైన వాక్యమే."eats"..Grammatical.But it is inappropriate.Gr.లోమార్క యివ్వాల్సిందే.)

    రిప్లయితొలగించండి
  15. _వీడితివి చదువు సంధ్యలు_
    _కూడితివో దుష్ట చెలిమి,క్రూరత్వమునన్_
    _తోడకు కట్టుకథలెటుల_
    _గాడిదపైనెక్కి హరుడు కంసుని జంపెన్_?

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా
    పాడియె వాహనంబుకని బట్ట ఖరంబును హూణ భాషలన్
    పోడిమి వీర గాథలలును బొక్కె బరీక్షల నొక్క "నిర్దయన్"
    వాడుడు సొంత వాక్యమన"వాడొక శుంఠయె వ్రాసె నీగతిన్
    "గాడిదనెక్కి శంకరుడు కంసుని జంపె దయావిహీనుడై"
    నాడట సమ్మతించనయె నమ్మక పేర్లను పంతులయ్యయై

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా}
    ఆడిరి జంతుజాలముల యారడి గొన్న సువీక్షణా తెరన్
    పాడిరి వెన్క గొంతునిడి భాసుర గాథల ఫోను వాణినిన్
    పాడి ఖరంబునెక్కి హరు వాటపు దేహుడు " కంజు"(పక్షి)జంపె "హా!"
    గాడిదనెక్కి శంకరుడు కంసుని జంపె దయావిహీనుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, మీ యోపికను పరీక్షించే నాకుతూహలాన్ని పొల్లుబోకుండా గమనించి అభినందించినందులకు అనేకానేక కృతజ్ఞతలు.

      తొలగించండి
  18. ఓడక 'హరించి' వెన్నల
    కోడలి కత్తకు జగడము కూర్చెడు వటుడిన్
    చూడర! చిత్తరువందున్
    గాడిద! పైనెక్కి 'హరుడు' కంసుని జంపెన్

    రిప్లయితొలగించండి
  19. నేడొక టీవీ షోలో
    ఆడుమనిరబద్ధ మొకటి అబ్బురమొందన్
    ఓడనివాడిటు పలికెను
    గాడిదపై కెక్కి హరుడు కంసునిజంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      అబద్ధాల పోటీతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. వేడుక సుదూరవాణుల
    వాడియయినవార్తలువినఁ బలువురమాటల్
    తోడై విన్పడె వింతగ
    గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్


    తాడితు లైన శీర్షమున దద్దరిలం దల జ్ఞప్తి హీనులై
    తోడుత మేధ యందు సమతుల్యము జారగఁ బ్రశ్నవేయ మా
    రాడెద రిట్లు భ్రష్ట మతు లందరు నుష్ణము ప్రజ్వరిల్లగన్
    గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అత్యుత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. వాడితి బుద్ధిని,యుక్తిని
    వేడితి హరిహరులనకట వేదన తోనే
    నోడితిదెలియక.నెటులది?
    గాడిద పైనెక్కి హరుడు కంసుని జంపెన్
    శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  22. నాడెట్లు దిరిగె జీసెసు?
    కాడున దిరుగాడు నెవడు? కన్నడు గూల్చెన్
    పీడింప దల్లి నెవడిని
    గాడిదపై నెక్కి, హరుడు, కంసుని జంపెన్

    వాడిన మైలవస్త్రములు వాసిగ రేవుకు చేరునేతరిన్
    కోడెను వాహనమ్ముగను కోరిన దెవ్వరు చెప్పమంటి తా
    దోడుగనన్నతో గదలి ధూర్తుడనేవిధి గూల్చెగృష్ణుడే
    గాడిదనెక్కి, శంకరుడు, కంసుని జంపె, దయావిహీనుడై

    రిప్లయితొలగించండి
  23. గాడిదలారా! వ్రాయుడు
    *గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్*
    జూడుడు ! *చేయుడు* మఱి మా..
    ట్లాడక *గణవిభజనమ్ము* నని గురువనియెన్!!


    పాడుచునుండె నొక్కరుడు పద్యము , మద్యము ద్రావి , "యల్లదే!
    "గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై"
    జూడుమటంచు , లోకమున చోద్యము ! మాటలు కొంపఁదీసి నే
    నాడితినంచు నెంచితిరొ ! అద్ది యబద్ధము! నన్ను నమ్ముడీ !!


    పాడును తల్లి బాహుబలి పాటను బిడ్డకు జోలపాట,నే....
    నాడు పురాణగాథల ఘనమ్ముగ నేర్పదు తీర్చిదిద్ద, నీ...
    నాడిది ముద్దు , రేపటి దినమ్మున నిట్లను వాడు పెద్దయై
    గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై!!

    రిప్లయితొలగించండి
  24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

    వేడుకపలికెన్ చాకలి
    గాడిదపైనెక్కిహరుడు!కంసుని జంపెన్
    తోడుగనుండగనన్నటు
    నేడటులన్ జంపగలనునేనున్ మామన్
    🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
    తన అన్నను తోడుగా తీసుకొని బయటికి వెళుతున్న భర్తను ఎక్కడికి వెళుతున్నావని భార్య అడుగగా
    హరుడు అనే పేరుగల చాకలి...
    భార్యను తమాషాగా భయపెట్టాలనుకొని పలికిన పలుకులు

    రిప్లయితొలగించండి
  25. బోడి తలపైన వెండ్రుక
    లాడెనురా జూడుమనుచు నాతండనగన్
    వాడిని జూచుచు వీడనె
    గాడిదపై వెక్కి హరుడు కంసుని జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. (Tit for tat?)

      తొలగించండి
  26. వీడని మూఢత మూర్ఖుడు
    తాడిగ పెరిగెను మరియును దారుణ రీతిన్
    వాడెగ విబుధుగ పలికెను
    గాడిదపై నెక్కి హరుడు కంసునిజంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వాడె విబుధుడుగ పలికెను" అనండి.

      తొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చూడాలమునకు తగిలిన
    తాడముతో నా రజకుని తలపు చెదరగా
    పాడుచు వదరుచు వాడనె
    గాడిద పైనెక్కి హరుడు కంసుని జంపెన్

    రిప్లయితొలగించండి
  28. మూఢుడు తావచ్చె సభకు
    గాడిదపై నెక్కి హరుడు, కంసుని జంపెన్
    జూడుము మేనల్లుడనుచు
    నేడుపు లంకించు కొనియె నేమని చెప్పన్

    రిప్లయితొలగించండి
  29. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    మూడుటచేతనాయువది మూల్గుచుజచ్చెనుసత్యమద్ది నీ
    యేడుపదేలజంపెననిహేయముజూడగనల్లుడంచువెం
    టాడెయముండునాజ్ఞలనిడన్ గనుమంచువచించె చాకితల్
    గాడిద నెక్కి !శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై!!

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  30. శివునిఆజ్ఞలేనిదేచీమైనాకుట్టదు
    మేనల్లునిచేతిలో మేనమామెట్లుఛస్తాడూ అని చాకితలవాదన🙏🙏🌹👀🙏

    రిప్లయితొలగించండి
  31. చూడగ నితడిటు వ్రాసెన్
    "గాడిద పైనెక్కి హరుడు కంసుని జంపెన్!"
    వీడికి నరువది శాతము
    వేడుకగా దొరికెను కనువిందగు మార్కుల్!
    [వీడు పరీక్షలో"గాడిద పైనెక్కి హరుడు కంసుని జంపెన్!" అని వ్రాయగా అందులో 'గాడిద ' 'హరుడు ' అనే రెండు పదాలు తప్పులని భావించి అయిదు పదాలున్న వాక్యంలో మిగిలిన మూడు సరి యనుచు వానికి అరువది శాతం (అయిదు మార్కులకు మూడు) యివ్వడం జరిగిందని,(అతని పైనెక్కి కృష్ణుడు కంసుని చంపెను అని వ్రాసి వుంటే ఆ విద్యార్థికి అయిదుకు ఐదు మార్కులు వచ్చి వుండేవి తెలుగు, ఆంగ్లము, సంసృతం వంటి భాషా పరీక్షల్లో కూడా వంద శాతానికి అతి చేరువగా మార్కులను ప్రసాదిస్తున్న నేటి మూల్యాంకన వ్యవస్థను, నేటి విద్యార్థులకు భాషా విషయాల్లో వారికి లభిస్తున్న మార్కులకు సరితూగే విధంగా వారికున్న ప్రమాణాలను బేరీజు వేసుకున్నప్పుడిలా వ్రాయాలనిపించింది.]

    రిప్లయితొలగించండి
  32. మాడలు రేవున కెటు జను
    బూడిద నిరతము ధరించి బోవు నెవండో
    నా డేమి జేసె కృష్ణుడు
    గాడిదపై నెక్కి, హరుఁడు ,కంసునిఁ జంపెన్

    నాడెట నటించె శివరావ్?
    జోడుగ తన పత్నితోడ జూతు మెవరినిన్ ?
    చూడగ జని హరి మరలెన?
    గాడిదపై నెక్కి ,హరుఁడు ,కంసునిఁ జంపెన్

    (1940 - 1945 సం|| ల ప్రాంతంలో కస్తూరి శివరావు అనే చిత్రసీమ నటుడు సినిమా కొఱకు గాడిదపై నెక్కి నటించాడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణరావు గారూ,
      క్రమాలంకారంలో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కస్తూరి శివరావు గారిని ప్రస్తావించడం సంతోషాన్ని కలిగించింది. 1964లో నేను తొమ్మిదో తరగతిలో ఉండగా మా స్కూల్లోనే పనిచేసే నేరెళ్ళ వేణుమాధవ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయనను చూసే అదృష్టం దక్కింది.

      తొలగించండి

  33. వాడుకగాబట్టలుతుకు
    వాడెటనెక్కున్ త్రిశూలపాణియు నిలనె
    వ్వాడా శ్రీహరి మామౌ
    గాడిద పైనెక్కి హరుడు కంసుని జంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. వేడుక బడిలో గురువొక
    నాడో శిష్యునికి ప్రశ్న నవ్వుచు వేయన్
    వాడొక శుంఠగ తాననె
    గాడిద పైనెక్కి హరుడు కంసుని జంపేన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  35. ఆడగనాటకమ్మొకటి అందలి పాత్రలు జ్ఞాన మింతయున్
    కూడక నంది వాహనముకూర్మితొ శంకరుదంచు నేర్పుతో
    చూడ ఖరమ్మునెక్కెనొక శుంఠ కరమ్మున కత్తిబూని తా
    గాడిద నెక్కి శంకరుడు కంసుని జంపె దయావహీనుడై
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అనరాదు. "నాడొక శిష్యునికి..." అనండి. 'కూర్మితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. "కూర్మిని" అనండి.

      తొలగించండి
  36. మూఢుఁడు గమించెనెటులన్?
    కాడున వసియించు నెవరు కబళముఁ గొని?చెం
    డాడె నెవరిని హరికసిన్?
    గాడిద పైనెక్కి, హరుడు, కంసుని జంపెన్

    రిప్లయితొలగించండి
  37. బూడిద బూసి మేనునకు భూరిగ గ్రోలుచు భంగు పాలనున్
    వాడుక లేకయే హరుడు వాదన జేయగ హోళిరాత్రినిన్
    పోడిమి మీరగా గిరిజ ముద్దుగ నవ్వుచు ప్రేలెనిట్టులన్:👇
    "గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై"

    రిప్లయితొలగించండి