9, మే 2017, మంగళవారం

నిషిద్ధాక్షరి - 36

కవిమిత్రులారా,
అంశం - వానరుల సహాయముతో రాముడు వారధిని నిర్మించుట.
నిషిద్ధాక్షరములు - ఓష్ఠ్యములు (ప-ఫ-బ-భ-మ)
ఛందస్సు - మీ ఇష్టము.

94 కామెంట్‌లు:

  1. సీత జాడ నెరింగి సచేతన గుణ
    శీలురగు ధీర వానర జాల సహితు
    డగుచు లంక జేరంగగన్ సుగతి నొసగ
    వారధిని గట్టి శరధిపై దారియవగ
    దాశరథి జేరె రావణు దాయగాను!

    దాయు=సమీపించు

    రిప్లయితొలగించండి
  2. కడలి దరిచేరి సేతువు కట్టదలచి
    వానరులు నిలుచుండెను వరుస లోన,
    గట్టి రాళ్ళ నందుకొని సాగరుని నీటి
    లోన వేయుచుండగ, నీటి లోకి జార
    కుండ తేలియాడెనుగదా దండ వోలె
    గండ శిలలన్ని జలనిధి కరుణ వలన

    రిప్లయితొలగించండి
  3. ఆ రాఘవకులతిలకుడు
    దారాన్వేషణను వాతతనయుడు చేయన్
    వారధి కట్టిరి లంకకు
    చేరి దశానను వధించి సీతను గొనియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కర్తృపదం 'రాముడు' కదా! అందువల్ల క్రియాపదాన్ని 'కట్టెను' అనండి.

      తొలగించండి
    2. ఆర్యా! మీ సవరణకు ధన్యవాదములు.
      నేను ఈ బ్లాగ్ లో పాతవి చూస్తున్నప్పుడు, మా చిన్నాన్నగారి (పండిత రామజోగి సన్యాసిరావు గారి) పూరణలు చూసి సంతోషించాను.

      తొలగించండి
  4. లంకఁజేరుట,సీత కళ్ళార గనుట
    సేతువునుఁగట్టి తేలిక జేసినారు
    ఉడుతఁగూడయు తోడయెనొడలు వంచి-
    రావణునిఁగూల్చ వానరుల్ రండురండు.
    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కళ్ళార' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
    2. లంకఁజని భూమిజను కనులారఁగనుట
      అంటే బాగుంటుందేమో దయచేసి తెలుపప్రార్ధన

      తొలగించండి
    3. 'భూమిజను' అంటే నిషిద్ధాక్షరం 'భ' ఉంది కదా!

      తొలగించండి
    4. "లంకఁ జని యవనిజఁ గనులార గనుట" అనండి.

      తొలగించండి
    5. మీసూచనశిరోధార్యం నమస్తే

      తొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    తే.గీ.
    వానరుల ఘన సాయాన వార్ధిఁగట్టి
    లంకఁ జేరియు వేగాన రావణు నని
    లోన వధియించి జానకితో నయోధ్యఁ
    జనెను దాశరథియు సంతసానఁ దేలి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. చిన్న సవరణతో...

      తే.గీ.
      వానరుల ఘన సాయాన వార్ధిఁగట్టి
      లంకఁ జేరియు వేగాన రావణు నని
      లోన వధియించి జానకితో నయోధ్యఁ
      జనియు దాశరథియె సంతసానఁ దేలె!

      తొలగించండి
    3. కవి పుంగవులు మధుసూదన్ గారు ఘన సాయాన సమాసము నొక్క సారి పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
  6. డా.పిట్టా
    సాగరుని లొంగదీయు నసాధనీయ
    వాసి గనుగొన్న వానర వ్రాత నరసి
    శిలు దేలగ వారధి యలలదన్నె
    దాశరథి దండు ఔత్సుక దారి దెరచె
    ఉడుత యైనను సేవల నోలలాడ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అసాధనీయ వాసి' అన్నది దుష్ట సమాసం. "...నసాధ్యులైన। వాసి..."* అందామా?

      తొలగించండి
  7. డా.పిట్టా
    ఆర్యా, సరే,కృతజ్ఞతలు.రాముని మాటలు సాగరునితో,తన్నియమ వర్తినై యల్లినాను:
    చెరనొరుగంగ జూచితివి సీతను ,దుష్టుని నడ్డగించ నే
    తెరవది లేదటన్న గతి ,దేలవొ నా యెదుటన్ సగర్వియై
    సరగున"నైదు శక్తుల"(పంచ భూతముల) దె సాక్షి యటందురు, వార్ధి జీల్చగన్
    శరణమటన్ననే సరియ సాగర రాగదె జేయ సత్కృతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా
      ఆర్యా, correction
      "శరణు యటన్ననే సరియ"గా మార్చి మ ను తప్పించితిని.

      తొలగించండి
    2. పిట్టా వారూ,
      బాగుంది మీ పూరణ. కాని 'శరణమటన్న' అన్నచోట మకారాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
    3. డా.పిట్టా
      ఆర్యా, correction
      "శరణు యటన్ననే సరియ"గా మార్చి మ ను తప్పించితిని.

      తొలగించండి
    4. ఆర్యా},
      నాసవరణను చూడకపోయితిరి.పైకి వెళ్ళింది.Please be rest assured.

      తొలగించండి
  8. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    నీలుడు రాళ్ళను వేసెను
    వాలాలనుజుట్టి తేగ వానర యోధుల్
    తేలెనవియన్ని జలధిని
    వీలుగ వారథిని గట్టి వెలసిరి ఘనులై

    రిప్లయితొలగించండి
  9. సీత చోరుని జాడను సేకరించి
    వానరుల తోడ గట్టగ వారథచట
    చేరి రాక్షసలంకను చింతదీర
    రావణు వధించె లంకారి రాచఠీవి

    రిప్లయితొలగించండి
  10. చిట్టి యుడుతలు చిన్నారి చేయి వేయ
    తగ్గి సంద్రుడు తోడుగా దారినొసగ
    గట్టి వంతెన కోతులు గట్టె నంత
    రావణుని ద్రుంచ సీతకై రాఘవుండు

    రిప్లయితొలగించండి
  11. నలనీలాదులు నిలువగ
    నలఘులు వానరులు చేరి యతి హర్షముతో
    జలనిధిని రాలు దేల్చగ
    వలసినగతి రాము డచట వారధి గట్టెన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      బాగుంది. కాని 'హర్షము, రాముడు' అన్నపుడు మకార ప్రయోగం?

      తొలగించండి
  12. నలనీలాదులు నిలువగ
    నలఘులు వానరులు రాల నతి హర్షానన్
    జలనిధిని దేల్చ రాఘవు
    డలరుచు వారధిని గట్టె నవ్వేళ నటన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    ఆర్యా!
    పొరపాటు జరిగినది. ఈ పద్యమును పరిశీలింప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ సవరించిన పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి


  13. క గ శా వి

    కౌసల్యాయని వీరుడున్ననుజుడున్ కాకుత్స్థ వంశస్థుల
    గ్గో!సాసుళ్ళట యూతగాన సరసన్ క్రోతుల్లటన్రాళ్ళ నె
    ల్లా శంఖిన్నురుకన్ సరాతి వలెనౌ లాగించె లంకేశ! రా
    జా! సాసేతును గట్టి నారు ఝకటా సాగున్నికన్గానురా !

    ---

    కౌసల్యాయని వీరుడు
    సాసుండట యూతగాన సరసన్ క్రోతు
    ల్లా శంఖిన్నురుకన్ సర
    సా!సేతువు గట్టి నారు ఝకటా సాగున్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      కంద గర్భ వృత్తాన్ని బాగానే వ్రాశారు. కాని చదువుతుంటే ఇది తెలుగు కాక మరేదో భాష అనిపిస్తున్నది. పద్యం అర్థమయితే ఒట్టు!

      తొలగించండి
  14. వారధి కట్టినట్టిదగు వానరసేనయె దోడు నుండగా
    నీరధిదాటె దాశరధి,నేరమనస్కుడు,కాంత చోరునిన్
    క్రూరుని,రావణాసురుని,క్రోధిని తీరును తీర్చగాననిన్
    దారుణ శిక్షవేసి జనె,దారనుగూడి నయోధ్య చేరగా

    రిప్లయితొలగించండి
  15. ☹☹నేర*మ*నస్కుడు☹ క్షమించండి(మ వచ్చింది)
    నేర విచారుడు అంటాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ,క్రుద్ధుని" అంటే పుం లిం.ఔతుందనుకుంటాను,ఆర్యా,

      తొలగించండి
  16. రావణాసురుడెగ్గు లొల్కగ రాజి యన్నది డొల్లయై
    చేవగల్గిన వానరాదులు చేర్చ రాళ్లను వార్ధినిన్
    సేవఁ జేయఁగ వృక్షశాయిక సేతువొక్కటి తీరగన్
    త్రోవఁ జేరుచు రాఘవాఖ్యుఁడు దూసె వైరుల సీతకై

    రిప్లయితొలగించండి
  17. కలసి సేతువు కోతులు కట్ట నచట
    కనగ నుడుతయు వారిని కలసి తనదు
    శక్తి రాఘవ సేవయు చక్క జేసె
    సేవ జేసెడి వాడెగ శ్రేష్ఠుడగును.

    రిప్లయితొలగించండి
  18. పరగ కపీంద్రులా శిలల పంక్తుల పేర్చి సుదీర్ఘమైన యా
    తరణినిదాట వారధిముదమ్మున గట్టగ రామభద్రుడా
    భరణము భార్య గుర్తుగను వల్మరుగాంచుచు బాష్పధారలన్
    మరి మరి నొత్తుకొంచు జనె మానవు వానరాళితో
    వీటూరి భాస్కరమ్మ


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వదలి నిషిద్ధాక్షరులన్
      కదలగ గురువర్యులిటను కాంక్షింింతురుగా

      తొలగించండి
    2. భాస్కరమ్మ గారూ,
      పద్యం బాగుంది. కానీ పద్యాన్ని నిరోష్ఠ్యంగా వ్రాయలని కదా నియమం. మీ పద్యంలో అవి పుష్కలంగా ఉన్నాయి.

      తొలగించండి
  19. ☹☹నేర*మ*నస్కుడు☹ క్షమించండి(మ వచ్చింది)
    నేర విచారుడు అంటాను

    రిప్లయితొలగించండి
  20. వృత్తము........ ధృవకోకిల / తరలము

    అలర వానరవీరులందరు నక్కడక్కడనేరుచున్
    శిలల దెచ్చియు వార్ధియందున జేర్చి రాఘవునెంచగా
    నలల యందున దేలగా నవి యయ్యె వారధిగానటన్!
    నలుని నీలుని చిత్రకౌశల నవ్యశక్తికి గుర్తుగా!!

    రిప్లయితొలగించండి
  21. సాగరుఁడు నుడువ సత్తువ నలునిది రతిఁ గొని నలుఁ డిక రాఘ వాజ్ఞ
    వానర సత్కృతి వఱలంగ సాలాశ్వ కర్ణ కుటజ వంశ కర్ణికార
    తాలార్జు నాశోక ధవ చూత తిలకాది వృక్ష షండ సహిత వివిధ ఘన శి
    లా కాష్ఠ తతులు వేర్చగ జలధి నతిశయించి యైదు దివశా లెంచి యంతఁ

    గట్టి రట వారధి తొలి వగటిని నేడు
    నేడు యోజనా లనువుగ నింక నిరువ
    దియు నిరువది యొక్క టిరువదియును రెండు
    నిరువదియు రెండు నొక్కటి యెల్ల వరుస
    [వారధిని ఐదు రోజులలో వరుసగా 14, 20, 21, 22 & 23 యోజనాల దూరము కట్టిరి ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు కామేశ్వర రావు గారు:

      వారధి కట్టిన సమయమును చిన్న తేటగీలో కూర్చిన మీ ప్రతిభకు జోహార్లు!!!

      __/\__

      తొలగించండి
    2. హమ్మయ్య! రెండవ మారు చదివితే అది సీసపద్య భాగమని తెలిసినది :)

      తొలగించండి
    3. స్వామీ! మీకు మీరే సాటి! ఎన్ని వృక్షాలను చేర్చితిరి నిషిద్ధాక్షరిలో!!!

      తొలగించండి
    4. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
      వారధిబంధనం దృగ్గోచరమైందండీ... నిషిద్ధాక్షరిని ప్రసిద్ధాక్షరిగా మార్చి సీసంలో బంధించిన తీరు నిరుపమానం... మీకు అభివందనములు... నమోऽస్తు......... మురళీకృష్ణ

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      అద్భుతమైన పద్యరాజంతో కవిమిత్రుల ప్రశంసలందుకొన్నారు. నమస్సుమాలు!

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      శాస్త్రిగారికి మురళీకృష్ణగారికి మిస్సన్న గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. లంక జేర వరుణుని కోరంగ దారి
    నలుడు నిర్వహించగను వానరులు దాశ
    రథియు కట్టె తొందరగ వారధిని నైదు
    వేళల దశ యోజనలును వెడలె దాటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యోజనముల'ను 'యోజనలు' అన్నారు.

      తొలగించండి


  23. దాశరథియండ వానరు
    లౌ శరణాగతి సవతుగ లంఘించగనౌ
    నా శంఖిని వారధిగా
    యా శిఖరిల తునియులాడె యావచ్చక్తిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      కొంత అన్వయక్లేశమున్నా మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  24. ఏటిరేడు సహకరించ దీటు గాను
    వానరుల తోడునీడతో వార్ధి నెలవు
    కట్టి వారధి లంకారి గట్టిగాను
    చేరె లంకకు సేనతో శీఘ్రగతిని

    రిప్లయితొలగించండి
  25. వానర సేనను గొనుచున్
    తానేగి వధించలంక దైత్యునియచట
    న్నూనెను వారధి గట్టగ,
    నానాడే రాఘవునిగ నచ్యుతుడయ్యెన్

    రిప్లయితొలగించండి
  26. సేతువు కట్టగ దశరధ
    సూతుడు వెసలంగ జేరి శోకాకులయౌ
    సీతను గొనుచును సోదరు
    డేతెంచనయోధ్య చేరెనెల్లరు చెలగన్
    వీటూరి భాస్కరమ్మ
    పద్యాన్ని సవరించి వ్రాశాను చిత్తగించండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. కడలిరేడు సహకరించ కార్యసిద్ధి
    గిరులు నీటను దేలగా తరులతోడ
    నధిక యుత్సుకతను సేతు వలల గట్టి
    హరుల తోడుత జలనిధి హరియెదాటె!

    రిప్లయితొలగించండి



  28. అసురవరుని దునిమి యవనిజన్ కావంగ
    వానరములెల్ల వాసిగాను
    సాయమొనర చేయ చక్కగా వారిధిన్
    కట్టి రాఘవుండు ఘనత నందె


    రావణుండు దాచె రహినిజానకినట
    వనధి దాటి గాంచె వసుధ సుతను
    యాంజనేయుడచట, యానకట్ట నుగట్టి
    రాఘవుండు దెచ్చె రమణిమణిని.

    వనచరులను గూడి వననిధి యందున
    వార్ధికట్ట నెంచె వసుధ నేలి
    నట్టి రాఘవుండుఆంజనీ సుతుడాది
    కీశములును యచట కేలు మోడ్చ.

    నలనీలాదులు తోడ్పడ
    జలనిధియందున శిలలను జతనము తోడన్
    నిలిపెను వారిధినచ్చో
    కలదది నేటికి జనులకు కనువిందౌచున్.

    వానరంబులెల్ల వననిధియందున
    రాళ్ళు దెచ్చివేసి రహిని వార్ధి
    కట్ట సంతసాన కాకుత్సుడసురుని
    సంహరించి దెచ్చె జనక సుతను.

    దశశిరుండు దాచె తరుణిసీతనచట
    జలధి దాటి గాంచె జాయతోడ
    నాంజనేయు డంత యానకట్టనుకట్ట
    దైత్యు గూల్చి దెచ్చె ధరణిజనట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలన్నీ బాగున్నవి.
      కొన్ని పద్యాలలో నిషిద్ధమైన మకారాన్ని ప్రయోగించారు.

      తొలగించండి

  29. పిన్నక నాగేశ్వరరావు.

    వారధిని గట్టి లంకకు చేర శిలల

    దెచ్చి వేయగ నీటిలో తేలియాడ

    దాశరథియును సేనతో తరలి వెళ్లి

    రావణు దునిమి సీతను రక్ష చేసె.

    ****************************

    రిప్లయితొలగించండి
  30. నరునిగా హరి కదలె, వానరులు కట్టి
    నట్టి వారధి దాటి, యా యసురు ద్రుంచి,
    సీతఁ జేకొని తిరిగి తా చేరె, తండ్రి
    ఏలినట్టి తావ నుజుడు వెంట రాగ.


    రిప్లయితొలగించండి
  31. తోకతో చుట్టిన తూలరాశి యనంగ
    నొకరాయి తెచ్చినదొక్కకోతి !
    తెచ్చిన రాతిని తీరికగా జూచి
    నూగి గంతులు వేసెనొక్కకోతి !
    చెట్లు తోకకు జుట్టి జెండాలరీతిగా
    నొద్దిక జేర్చినదొక్కకోతి !
    నేలను దాకుచు నింగిలో గెంతుచు
    నొక్కశిలనుద్రోసెనొక్కకోతి !

    యింత యల్లరి జేయుచు నింతలోనె
    వారధిని గట్టె గట్టిగా వార్ధి దాట !
    రావణుని ద్రుంచి వీరుడు రాఘవుండు
    సీతతో గూడి ధాత్రి విఖ్యాతుడయ్యె !!

    రిప్లయితొలగించండి
  32. nishiddhaakshari

    vanaruhaakshi seeta vaayu sutudu joochi

    rayamu neruga jese raaghavuniki;

    vaanarulanu jerchi- vaaradhi gatti,yaa

    raavanu vadhi yinche raakshasaari.

    రిప్లయితొలగించండి

  33. నిషిద్ధాక్షరి 09-05-2017 నిషిద్దాక్షరములు;ప,ఫ,బ,భ,మ.

    వనరుహాక్షి సీత వాయుసుతుడు జూచి

    రయము నెరుగ జేసె రాఘవునికి;

    వానరులను జేర్చి వారధి గట్టి,యా

    రావణువధి యించె- రావణారి.

    విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.7396564549.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామముని రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని 'రయము' అని మకారాన్ని ప్రయోగించారు.

      తొలగించండి