11, జూన్ 2017, ఆదివారం

సమస్య – 2382 (వాఙ్మయమున నున్నదెల్ల...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ"
(లేదా...)
"వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్"

76 కామెంట్‌లు:

  1. ఋఙ్ముక్తోద్ధృత నిరతా
    సృఙ్మేదుర కదన భయ విశేషావహ దు
    ర్దృఙ్మాత్ర ఘన విపత్కర
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పిచ్చుక మీద ఇది బ్రహ్మాస్త్రము సార్!!!

      తొలగించండి
    2. (ఇంటర్‍నెట్, ఫేసుబుక్కుల్లో ఇష్టం వచ్చినట్లు ఏవేవో వ్రాసి పెట్టే పోస్టుల వాఙ్మయాన్ని గురించి....)

      దృఙ్మయ జాలమిద్ది ప్రకృతిం గల వైకృత భావవీచికల్
      దిఙ్ముఖులున్ బరాఙ్ముఖులు ధీనిధులై ప్రచురించుచుంద్రు, స
      మ్యఙ్ముఖపుస్తకమ్మున ననంతముగాఁ గనిపించునట్టి యా
      వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్.

      తొలగించండి
    3. అద్భుతము గురువర్యా! నమశ్శతములు!

      తొలగించండి
    4. మీ రెండు పూరణలూ అద్భుతంగా, మాబోంట్లకు మార్గదర్శకంగా ఉన్నాయి. అభినందనలు!

      తొలగించండి
    5. కవిమిత్రు లందరికీ ధన్యవాదాలు.

      తొలగించండి
    6. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణలు రెండు నాణిముత్యములై మాకు బోధనాత్మకములైనవి.

      తొలగించండి
  2. వాఙ్మయము నందులేక య
    వాఙ్మానస గోచరమ్ము పరమాత్మన్నే
    వాఙ్మయము తెలుప గలదొకొ?
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!


    ....కిట్టింపు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      'కిట్టింపు' కాదండీ... మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పరమాత్మను నే..." అనండి.

      తొలగించండి
  3. వాజ్మయమును పరికింపగ
    వాజ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ
    వాజ్మయమే లేకున్నను
    వాజ్మయమును తెలుసు కోను భర్గుని తరమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా!
      కొంత గందరగోళం ఉన్నా పద్యం బాగున్నది. అభినందనలు.
      "తెలుసుకొనగ" అనండి.

      తొలగించండి
  4. వాఙ్మానస గోచరమగు
    వాఙ్మయ మన వేదశాస్త్ర వాక్య పఠనమే
    వాఙ్మిగ జేయున్ శుష్కపు
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాగ్మి' అన్న శబ్దం ఉంది. కాని 'వాఙ్మి' లేనట్టుంది.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు. ఆంధ్రవాచస్పత్యం నందు “వాఙ్మి= తానుపలుక నిశ్చయించిన యర్థమును లెస్సగా నిర్వహించువాఁడు అని యున్నది. ఇదే విషయము ఆంధ్రభారతినందును గలదు. కావున గ్రహించితిని. ఇంతకు మించి సాధు అసాధు రూపములు నాకు తెలియవని మనవి చేసికొనుచున్నాను.

      తొలగించండి
  5. వాజ్ఞ్మయముమానవీయము
    వాజ్ఞ్మయమౌ సమరసమగు వాక్కుల తోడన్
    వాజ్ఞ్మయమటుకాదేనీ
    వాజ్ఞ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఙ్మ' టైపు చేయడంలో ఇబ్బంది పడ్డట్టున్నారు.
      రెండవ పాదంలో 'ఔ, అగు' అని రెండు క్రియాపదాలున్నవి. "వాఙ్మయమే సమరసమగు..." అనండి. అలాగే "కాదేనియు" అనండి.

      తొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ఋఙ్మథనముచే,దొరకని
    దృఙ్మాత్రము కానలేనిదే,తత్తంబౌ -
    ప్రాఙ్మౌనుల హృది గొప్పది !
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ

    (ప్రాఙ్మౌనుల హృది గొప్పది = ప్రాచీన ఋషి హృద్దర్శనము)

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఋజ్ఞ్మయమౌ ప్రతి ఉక్తియు
    దిజ్ఞ్మాత్రము చేత లేక దిక్కేలేదీ
    దృజ్ఞ్మయ జీవికకున్ బొడి
    వాజ్ఞ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    దృజ్ఞ్మయ పాత్ర దేహమగు దృక్కు మరొక్కటి తత్త్వవేత్తకున్
    ఋజ్ఞ్మయ యాగ పుంజములు ఋక్కులకే సరి ధ్యాన వీచికల్
    దిజ్ఞ్మయముల్ అనంతములు(యనంతములు) దీప్తిని యా "రమణున్"1 గణింపగా
    వాజ్ఞ్మయ మందునున్నయది వ్యర్థము సుమ్ము పఠింప పీడగున్
    1.రమణమహర్షి
    "జ"తో కూడిన"ఞ" మాత్రమే అక్షర పేటిక పై యున్నది.దీనిని ప్రాసగా మన్నించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'ప్రత్యుక్తియు' అనండి. అక్కడ యడాగమం రాదు.
      రెండవ పూరణలో 'దిఙ్మయముల్+అనంతములు' అన్నచోట విసంధిగా కాని, యడాగమంతో కాని వ్రాయరాదు. అక్కడ "దిఙ్మయమౌ ననంతములు..." అనండి.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా
      వాక్*మయము॥ కదా.వా లోనే వాక్కుఅనే అర్థం ఉందా.వాగ్దేవి లోవలె వాక్ ఉండదా

      తొలగించండి
    3. డా.పిట్టానుండి
      ఆర్యా,ధన్యవాదాలు.

      తొలగించండి
  10. డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
    వాఙ్ముఖ శ్రేష్టుండు దెలిపె
    వాఙ్మయమా దైవ పాద పద చింతన మే!
    వాఙ్మయ మదియే! యితరపు
    వాఙ్మయముననున్న దెల్ల వ్యర్థము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  11. ప్రాఙ్మౌనీ విరచితమై
    పాఙ్మయ మైనను చదువఁగ భావమ్మందున్
    దృఙ్మయ గోచరమవ్వక
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రాఙ్మౌని విరచితమ్మై" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
      ప్రాఙ్మౌని విరచితమ్మై
      పాఙ్మయ మైనను చదువఁగ భావమ్మందున్
      దృఙ్మయ గోచరమవ్వక
      వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ

      తొలగించండి
  12. శంకరయ్య గారు వేసిన అస్త్రానికి నేను మూర్చ నొందాను. మూర్చ నుంచి మేల్కొని రేపు సమస్య కదనములో కలుస్తాను. శంకరయ్య గారూ ఈ శలభము అగ్ని హుతము గాక ముందే ...... ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  13. వాఙ్మయమొసగెకద శివుడ
    వాఙ్మానసుడట ఋషులకు బాగిడు రీతిన్
    వాఙ్మయమశివమవగనిక
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  14. దృఙ్మాత్రానందము వలె
    వాఙ్మానస కాయ లగ్న వర్జిత ధిషణా
    త్వఙ్మాత్ర లబ్ధ జడునకు
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ !!


    ప్రహ్లాదుడు... చండామార్కుల వారితో....


    దృఙ్మయమౌ ప్రపంచము సృజించియు బెంచియు ద్రుంచువాడు , స..
    మ్యఙ్మధురానుభూతినిడు మంగళరూపుడు విష్ణువొక్కడే
    వాఙ్మయుడట్టి శ్రీహరిని వర్ణన జేయని శుష్కమైన మీ
    వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... ధన్యవాదాలండీ..... మురళీకృష్ణ

      తొలగించండి
  15. వాఙ్మయమొసగెకద శివుడ
    వాఙ్మానసుడట ఋషులకు బాగిడు రీతిన్
    వాఙ్మయమశివమవగనిక
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  16. వాఙ్ఞనుతనువు సాక్షిగ
    వాఙ్ముఖికృప లబ్దినొంద వాఙ్మయ మదియే
    దృఙ్మణముల కీడునిడు న
    వాఙ్మయముననున్న దెల్ల వ్యర్థము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  17. అవాఙ్ఞయము=దిగజారిన సాహిత్యం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ప్రాస స్థానంలోని పద్యాలు సందిగ్ధంగా ఉన్నవి.

      తొలగించండి
  18. వాగ్మి పరాత్పరుడొక్కఁ డ
    వాఙ్మానస గోచరుండు వానిఁ దెలుపమిన్
    వాఙ్మయ నిర్మితి ప్రబలదు.
    "వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చింతా వారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాస విషయంలో సందేహం...?!

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    ప్రాఙ్ముఖ దర్శన పశ్చిమ
    దిఙ్ముఖ దర్శన విరహిత, తేజోఽభా, వాఽ
    దృఙ్మోక్ష, దురిత, ఖల, కటు
    వాఙ్మయమున నున్న దెల్ల వ్యర్థము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  20. వాఙ్మయము చదువలేదుగ
    వాఙ్మయమను పదముగూడ వ్రాయుట రాదే
    ప్రాఙ్ముఖుడగుచును నేర్వక
    వాఙ్మయమున నున్నదెల్ల, వ్యర్థము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  21. వాఙ్మాధుర్యమునిండిన
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ,
    వాఙ్మయమున గల మధురిమ
    దృఙ్మాత్రమ్మెరుగలేని ధీమంతునికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  22. నా పూరణకు పూజ్యులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాఖ్యానం....

    ఈరోజు సుప్రభాత వేళ విద్వత్కవివరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారి ఈ పద్యాన్ని అందుకొని ఎంతో సంతోషం కలిగింది.

    ఋఙ్ముక్తోద్ధృతనిరతా
    సృఙ్మేదుర కదనభయవిశేషావహ దు
    ర్దృఙ్మాత్ర ఘన విపత్కర
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!

    ఋఙ్ముక్తోద్ధృతనిరత - ఋఙ్ముక్త (ఋక్+ముక్త) = స్తుతివిముఖులైనవారిచే (అప్రగల్భులు, ధీరశాంతులు అయినందువల్ల తమను తాము స్తుతించికొనుట యందు వైముఖ్యమును వహించినవారు, సహృదయతాలోపము వలన ఇతరులలోని మంచిని గుర్తించి సత్ప్రశంస చేయలేనివారు – అని ఋఙ్ముక్తులు రెండు విధాలు. అసహృదయులైన ఆ రెండవవారి ప్రసక్తి ఇక్కడ చేయబడుతున్నది) అనగా కేవల నిందాపరులచే; ఉద్ధృత – ఉత్+ధృత = పైకి లేవనెత్తబడిన (వాదవివాదముల యందు); నిరత = ఆసక్తిని కలవారిచే; అసృఙ్మేదుర – అసృక్+మేదుర = రక్తముచే సాంద్రస్నిగ్ధమైన (దట్టమైన నిగ్గు కలిగియున్న); కదన = యుద్ధమునందు వలె; భయవిశేష+ఆవహ = గగ్గోలు పుట్టించుటను కలిగిన; దుర్దృఙ్మాత్ర – దుర్దృక్+మాత్ర = చెడుచూపును మాత్రమే కలిగినవారి (సహృదయులు కానివారి); ఘనవిపత్కర – ఘన = విశేషముగా ఆపదను కూర్చు (అనగా పాఠకులకు అహితమును కలిగించు); వాఙ్మయమునన్ = రచనావళి యందు; ఉన్నది+ఎల్ల = నిక్షిప్తమైనది అంతయును; వ్యర్థము సుమ్మీ = నిష్ప్రయోజనమైనది సుమా!

    రసజ్ఞత లోపించినందువల్ల ఇతరుల రచనలోని మంచిని గుర్తింపలేక నిష్కారణముగా వాదవివాదములకు పూనుకొని, సాహిత్యరంగమును ఆనంద పర్యవసాయిగా రూపొందింపక రక్తసిక్తమై భయావహమైన యుద్ధరంగములో వలె పరస్పరబాధావహముగా పరిణమింపజేయు దురాలోచనపరుల వాఙ్మయమంతయును నిరర్థకము కదా!

    అని తాత్పర్యం.

    దుష్కరమైన ప్రాసను నిర్వహిస్తూనే ఇంత సందేశాత్మకమైన మనోజ్ఞపద్యాన్ని చెప్పిన మాన్యులు శ్రీ శంకరయ్య గారికి సాధువాదం! అభినందన!!

    రిప్లయితొలగించండి
  23. దిఙ్మండలమున హరి పద
    యుగ్మము పూజింప నరుల కున్నతి కలుగుం
    దిగ్మము కలిగించు నధమ
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ


    వాఙ్ముఖ మేల నీయఁగ నపార కృపాన్విత చిత్త శౌరి పై
    వాఙ్మయ ముండ మేలుగ సుభద్రము లీయ జనాళి కిద్ధరన్
    దిఙ్మణి భూషి తామర విధేయ జనౌఘ విసర్జితమ్ము నా
    వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 8) వికల్ప ప్రాస -
      కకారం మొదలైన పొల్లు హల్లులకు (క, చ, ట, త, ప లకు) అనునాసికాలు పరమైనప్పుడు అవి ఆయా వర్గపంచమాక్షరాలు (ఙ, ఞ, ణ, న, మ) గానో, వర్గ తృతీయాక్షరాలు (గ, జ, డ, ద, బ) గానో మారుతాయి. ఈ ఆదేశం వైకల్పికం. ప్రాక్+నగ=ప్రాఙ్నగ, ప్రాగ్నగ అని రెండు రూపా లేర్పడుతాయి. ఈ కారణం చేత వర్గ పంచమాక్షరాలు అయా వర్గ తృతీయాక్షరాలతో ప్రాసమైత్రి పొందుతాయి.
      ఉదా.
      ప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
      స్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
      వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
      దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)

      తొలగించండి
    2. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీను చెప్పిన వికల్ప ప్రాసకు కందములో క్షేమేంద్రుని ప్రయోగము (లక్షణశిరోమణి నుండి)
      కం. పద్మాసనమగు ఘన
      పద్మావతి జూచి ధరణిపాల సుతుండు
      *ద్యన్మో*దంబున దనముఖ
      పద్మము నలరించె ననుచు బరిజనులలరన్.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా, అత్యుత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      శర్మ గారు నమస్సులు. చక్కటి యుదాహరణను దెలియ పరిచినారు. ధన్యవాదములు.
      గురువు గారు పైన యనుమానము వ్యక్త పరచుట జూచి నేనీ ప్రాస భేదమును ప్రస్తావించితిని.

      తొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:
    వాఙ్ముఖమును చదివినపుడు
    వాఙ్మయ మందుండెడి హితవచనము లన్నిన్
    దృఙ్మయ మవ్వని వడి నా
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...వచనము లెల్లన్ దృఙ్మయము కాని వడి..." అనండి.

      తొలగించండి
  25. వాఙ్మయ మెరుగని కుకవి య
    వాఙ్మయపండితు డొకండు వాగ్ధాటి ననెన్
    వాజ్ముఖ మందున నొకచో
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  26. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *11, జూన్ 2017, ఆదివారం*

    *సమస్య*



    *"వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ"*

    (లేదా...)

    *"వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్"*

    *దిఙ్మూలములంటుచుస*
    *మ్యఙ్మేథఃప్రజ్ఞనందిమదినహముండన్*
    *ప్రాఙ్మోక్షమబ్బదననీ*
    *"వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ"*

    *శ్రీమతి జి సందితబెంగుళూరు*

    *దీవించండి*
    🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  27. వాఙ్మనకాంతుని సతి, సు
    వాఙ్మయము సుకవుల కిచ్చె వాక్కున, నేడీ
    దిఙ్మండలమందుoడిన
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!

    రిప్లయితొలగించండి

  28. వాఙ్మయ మన్ని భాషలకు వన్నెల స్వర్ణకిరీటమౌ ప్రజా
    వాఙ్మయ మందు జానపదపాత్రత గొప్పది దాని పట్ల ప్ర
    త్యఙ్ముఖ మెన్న కూడనిది యట్టిది కాదను దుష్ట బోధ లే
    వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్

    రిప్లయితొలగించండి
  29. వాఙ్మయమున గనగలరు ప
    రాఙ్ముఖతయె గోచరించు వ్రాతలు కీడౌ
    దృఙ్మాత్రమె ధ్యేయమయిన
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ

    ఆంగ్లంలో atrocity literature అని పశ్చిమ దేశాల్లో ఎక్కువగా చలామణిలో ఉన్న విషయాన్ని ఇక్కడ పద్యంలో ప్రస్తావించాలని నా ప్రయత్నం. హైందవ సంస్కృతి, సనాతన ధర్మం గురించి తప్పుగా ప్రసిగారం చేసి మన బలమైన ధర్మాన్ని తుడిచెయ్యటమే ఈ atrocity literature ధ్యేయం.

    దృక్ + మాత్రమె = దృఙ్మాత్రమె అని వాడాను. తప్పైతే చెప్పండి, సరిదిద్దుకుంటాను.

    రిప్లయితొలగించండి


  30. వాఙ్మయమునుమించిన నిధి
    దిఙ్మండలమందునెటవెదికినగనమిలన్
    వాఙ్మయ మెరుగక యందురు
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  31. పాఙ్మయ మైన భావనల వ్రాతలె యేమత గ్రంథమందునన్
    రుగ్మత లెట్లు బుట్టెనొ? ప్రలోభ ప్రబోధక చిత్తవృత్తులన్
    చిఙ్ముఖ పృష్ట భాగమున చిత్రము లాడిన యట్లు వారిదౌ
    వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్!

    రిప్లయితొలగించండి
  32. వాఙ్మయమే శృత పేయము
    వాఙ్మయమే శృతి సమమగు వరముని కృతమౌ
    వాఙ్మయము గలుగ నెవ్విది
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  33. వాఙ్మయమే శృత పేయము
    వాఙ్మయమే శృతి సమమగు వరముని కృతమౌ
    వాఙ్మయము గలుగ నెవ్విది
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్ధము సుమ్మీ

    రిప్లయితొలగించండి