12, జూన్ 2017, సోమవారం

శ్రద్ధాంజలి!

డా. సి. నారాయణ రెడ్డి గారికి శ్రద్ధాంజలి!

11 కామెంట్‌లు:

  1. ఆంధ్ర కవన సాహిత్యపు టద్రి యగుచు
    ఆధునిక కవిసామ్రాజ్య మందు చెలగి
    “సినిమ” జగతికిని “సినారె” సీమ వదలి
    పంచ పదులట వినిపించ పయన మగుచు
    అరిగె నాకలోకమునకు అమరులగుచు.
    ……….శ్రీనారాయణ రెడ్డి గారి స్మృత్యర్థ శ్రద్ధాంజలి.

    రిప్లయితొలగించండి
  2. కావ్యములను వ్రాసి కైతల వెలయించి
    చలనచిత్రజగతి దళుకులద్ది
    జ్ఞానపీఠమునకు తాను కీర్తినిబెంచి
    మన సినారె చనె నమరపురికిని.

    ఉన్నాడు తెలుగు నుడులం
    దున్నా డాధునికకవుల యూపిరితానై
    యున్నాడు చెంత నెటపో
    నున్నాడని మనసినారె యుద్విగ్నమ్ముల్?

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. సింగిరెడ్డి ఘనుడు, చిత్రగేయ రచయి
    త సినారె వెడలెను , తల్లి తెలుగు
    నేల నుంచి కవులనెల్ల కన్నీట సా
    గరమున ముంచుచూ గరిమ తోడ,
    తెలుగువాడుగ పుట్టి సులువుగ తనదైన
    జ్ఞానపు పటిమతో జ్ఞాన పీఠ
    పు అవార్డు ను గెలిచి పుణ్యలోకమునకు
    వెడలినాడు వసుధ విడిచి నేడు

    ఏమి తొందరాయెను మీకు, ఎల్ల జనుల
    నేల విడచి వెడలినారు, నేర మేమి
    చేసినాము ,ఏ రీతిన చిత్ర సీమ
    వదలి పరుగున సాగిరి వసుధ విడిచి,


    కవివరా
    తెలుగు ఖ్యాతిని స్వర్గాన తెలియ పరచి,
    తెలుగు వెలుగులు స్వర్గాన దీప్తి నిడగ,
    తెలుగు కలముతో స్వర్గాన తిరుగు లేక,
    గణపతికి పోటి నిచ్చుచు కావ్య ములను
    మెండుగా వ్రాయు చుండుము మిసిమి తోడ ,

    సి నారాయణ రెడ్డి గారికి ఉడుతా భక్తిగా అంజలి ఘటించుతూ


    రిప్లయితొలగించండి
  5. డా. సి.నా.రె. గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.

    పాటలెన్నియొ చక్కగా వ్రాసినారె
    వేల సాహిత్యముల దారి వేసినారె
    చేరి తెలుగును వెలుగగా జేసినారె
    వాణి పుత్రుడవీవుగా వాహ్! సినారె.

    రిప్లయితొలగించండి


  6. డా.సి.నా .రె గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ

     ఆ.వె:జగతి జనులు మెచ్చు సాహితీ వేత్తవు

           పగలె వెన్నలనుచు పరవశింప

             చేసి తీవు గాదె చిత్తముల నిలను

           మరువ శక్యమౌనె మాన్యచరిత.


    ఆ.వె:తెలుగుభాషలోని తీయందనమునెల్ల

         పాటలందె గూర్చి వాసిగాను

         తెలుగు వారి మదిని దేదీప్యమైవెల్గు

         జ్ఞాని వయ్య నీవు ఘన చరిత్ర.


    ఆ.వె:బుర్రకథలెన్నొ భువిలోన రచియించి

          ఖ్యాతి నందినట్టి ఘనుడితండు

         పద్యనాటికలను గద్య నాటికలను

          బాల్యమందె వ్రాసి వాసి గాంచె.


    సీ:విశ్వంభరను వ్రాసి విశ్వము నందున

       జ్ఞానపీఠ ప్రశస్తి ఘనము గాను

    నందిన మాన్యుడీ నారాయణుండని

        మెత్తురయ్య జనులు మేదినందు

    భక్తి పాటలనైన రక్తిపాటలనైన

     నవలీలగావ్రాసి యవని జనుల

    చిత్తములనలర చేసిన సుకవీంద్ర

     పదవులెన్నో నిన్ను వలచి వచ్చె


    ఆ.వె:లాలి లాలి యనుచు జోలపాటలు వ్రాసె

          నాన్న మనసు చూడ వెన్న యనుచు

           నవని యందు గాంచ నమ్మను మించిన

           దైవమెక్కడన్న ధీయుతుండు.



    ఆ.వె:వీధిబడిని చదివి విశ్వ వ్యాపకుడైన

          విజ్ఞుడితడె గనుడు విశ్వ మందు

          జ్ఞానపీఠమంది జ్ఞానియై వెలిగిన

         సూరివర్య గొనుమ జోతలివిగొ.

    రిప్లయితొలగించండి
  7. కనబోయెనొ స్వర్గమ్మును
    'సినారె'! యక్కడి కవిత్వ స్థితిగతులెరుఁగన్
    పునరంకిత మౌచు తెనుఁగు
    ఘనకీర్తిని బెంచ నెంచి కైవల్యమునన్

    రిప్లయితొలగించండి

  8. రమ్యమో చిత్ర గీతాలు రాసినారె
    వేల కవితలన్ అచ్చులో వేసినారె
    సొచ్చి సాహితీ లోతులన్ చూసినారె
    మా "సినారె" మమ్మేల బాసినారె

    రాసి గా కొత్త ప్రక్రియల్ పోసినారె
    వాసి కవితా విమర్శలన్ దూసినారె
    చేరి శిలలను శిల్పాలు జేసినారె
    మా "సినారె" మమ్మేల బాసినారె





    రిప్లయితొలగించండి
  9. హనుమాజి పేటలో జననమొందిన వాడు,
    ఆకాశశిఖరమ్ము తాకినాడు,

    నవ్వని పూవ్వుతో నడకను సాగించి
    విశ్వంభరుండుగావెలిగినాడు,

    జ్ఞానపీఠమ్మును గ్రహియించి సాహితీ
    మేరువై ధరలోన మెరిసి నాడు,

    వైవిధ్య భరితమౌ ప్రక్రియల్ చేపట్టి
    తెలుగు భాషకు వన్నె దెచ్చినాడు,

    దివ్వలోకమ్మునకు నేటిదినమునాడు
    మన"సినారె"మహాకవి మహిని వీడి
    తిరిగిరానిలోకాలకుతరలిపోయె,
    వారి ఆత్మకు శాంతి చేకూరు గాక ....

    రిప్లయితొలగించండి
  10. సి నారాయణ రెడ్డి గారికి వారు వ్రాసిన పాటలతోనే చిరు అంజలి

    ఆ మబ్బు తెరలలో, ,అభినవ తారవో, అగు జరా జరా , అణువు అణువు,
    బంగారు గువ్వను, బతుకమ్మ బతుకమ్మ, చామంతి ఏమిటే, చంద్రుడు నిను,
    చిన్నారి మరదల్కి ,చిన్నారి కృష్ణయ్య, చిరునవ్వు లోహాయి, చిలిపి కనుల,
    చిత్రం భళారే విచిత్రం, కనుల ముందు నీవుంటే కవితయే, నీలి కనుల,


    నన్ను దోచు కొందువటె ఓ వన్నెల దొర,
    మాయ దారి సిన్నోడు నా మనసె దోచి ,
    నీలి కను ల నీడలలోన, నీవు నాకు
    రాజ, రావోయి రావోయి రాలు గాయి,



    వస్తాడు నారాజు , వస్తావు పోతావు, వగల రాణివి నీవు, వంగ తోట
    కాడ, యే తల్లినిన్ కన్నదో ,వూ అను, విరిసిన మరుమల్లి , విను విను నిను
    వదలను, వద్దన్నా వదలదు, విధి ఒక, గోరంత దీపము, గుమ్మ గుమ్మ
    గోగులు పూచెగో గులు పూచె ఓలమ్మ గుమ్మాడి, గోడకు, గుండు మల్లె,


    పలకరించి తేనె ఉలికి ఉలికి, గున్న
    మామిడీ కొమ్మ, ఇద్దరి మనసులు ఒక,
    మధుర భావాల సుమమాల, మనసు పలికె
    మౌన గీతి, మానవ జాతి ,మల్లె తీగ

    రిప్లయితొలగించండి